Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: రాజ రాజ చోర


నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్‌, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు

Advertisement
CJ Advs

మ్యూజిక్ డైరెక్టర్: వివేక్‌ సాగర్‌

సినిమాటోగ్రఫీ: వేద రమణ్‌ శంకరన్‌

ఎడిటింగ్‌: విప్లవ్‌

నిర్మాతలు: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌

దర్శకత్వం: హసిత్‌ గోలి

  నారా రోహిత్ ఫ్రెండ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ విష్ణు.. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా పేరుతెచ్చుకుని ఇప్పుడు హీరోగా మారాడు. శ్రీ విష్ణు హీరోగా సినిమా వస్తుంది అంటే.. అందులో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యేలా శ్రీ విష్ణు కథల ఎంపిక ఉంటుంది. శ్రీ విష్ణు పెరఫార్మెన్స్, ఆయన భాషలోని యాస, ఫేస్ ఎక్సప్రెషన్స్ అన్ని సినిమా మీద హైప్ ని క్రియేట్ చేస్తాయి. తాజాగా కామెడీ ఎంటర్టైనర్ గా శ్రీ విష్ణు హసిత్‌ గోలి దర్శకత్వంలో రాజా రాజా చోర అనే మూవీలో నటించాడు. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యి, ప్రేక్షకుల సందడి పెరిగాక.. శ్రీ విష్ణు రాజా రాజా చోర ని రిలీజ్ చేసారు మేకర్స్. మంచి ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజా రాజా చోర ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకుందో సమీక్షలో చూసేద్దాం. 

కథ:

స్టేష‌న‌రీ షాప్‌లో పనిచేసుకునే భాస్కర్( శ్రీ విష్ణు) అందరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అదే అబద్దం తో సాఫ్ట్ వెర్ ఇంజినీర్ సంజ‌న (మేఘ ఆకాష్‌)తో  ప్రేమాయ‌ణం నడుపుతాడు. ఇక తనకి స్టేషనరీ షాప్ లో వచ్చే డబ్బు సరిపోక అవ‌స‌రాలు అత‌న్ని ఓ దొంగలా మార్చేస్తాయి. త‌న ద‌గ్గ‌రున్న పురాత‌న‌మైన రాజు కిరీటం, వ‌స్త్రాలు ధ‌రించి దొంగ‌త‌నాలు చేస్తే మ‌ళ్లీ ఆ అవ‌స‌రం రాకుండా జీవితంలో స్థిర‌ప‌డిపోతావ‌ని అంజు (బిగ్ బాస్ ఫేమ్ గంగ‌వ్వ‌) చెబుతుంది. ఆ తర్వాత సంజనకు భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌ని.. అత‌నికి ఇంతకుముందే మ‌రో అమ్మాయితో పెళ్ల‌య్యింద‌ని.. వాళ్లిద్ద‌రికీ ఓ అబ్బాయి కూడా ఉన్నాడ‌నే విష‌యం తెలుస్తుంది. అసలు నిజంగానే భాస్క‌ర్‌కి పెళ్ల‌యిందా? భాస్కర్ జీవితంలో ఉన్న సునయన ఎవరు? సంజనకు భాస్కర్ కి పెళ్లి జరుగుతుందా? దొంగగా ప‌ట్టుబ‌డి పోలీసులకి చిక్కిన భాస్క‌ర్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అనేది మిగతా కథ.

పెరఫార్మెన్స్:

శ్రీవిష్ణు దొంగ‌గా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎప్పటిలాగే అదరగొట్టేసాడు. కామెడీ పరంగాను, ఎమోషనల్ సీన్స్ లోను శ్రీ విష్ణు పెరఫార్మెన్స్ అద్భుతమే. ఫ్యామిలీకి ఇంపోర్టన్స్ ఇచ్చే వ్యక్తిగా, లవర్ బాయ్ గాను ఆకట్టుకున్నాడు. హీరోయిన్స్ మేఘ ఆకాష్, సునయన పాత్ర‌లు కూడా క‌థ‌లో కీల‌కం. మేఘ ఆకాష్ అందంగా క‌నిపించ‌డమే కాదు, ఆమె పెరఫార్మెన్స్ పరంగాను అదరగొట్టేసింది. గృహిణి పాత్ర‌లో సునయన నటన కూడా ఆకట్టుకుంది. పోలీస్ అధికారిగా ర‌విబాబు ఒదిగిపోయిన తీరు బాగుంది. బిగ్ బాస్ ఫేమ్ గంగ‌వ్వ, శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌ మిగతా నటినటులు తమ తమ పరిధిమేర ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ: 

కామెడీ జోనర్ లో ఎలాంటి సినిమా వచ్చినా ప్రేక్షకులు లైక్ చేస్తారు అనే విషయం చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు కూడా కొత్త దర్శకుడు హసిత్‌ గోలి విలక్షణ హీరోగా పేరున్న శ్రీ విష్ణు తో కలిసి రాజా రాజా చోర అనే కామెడీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాడు. ఎప్పుడో పురాణాల్లో చదువుకున్న ఓ కథ.. ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారని అర్ధమవుతుంది. చరిత్రలో దొంగ‌త‌నాలు చేసే వాల్మీకి.. తనని తాను మార్చుకుని రామాయ‌ణం లాంటి మహా కావ్యకాన్ని రాసే స్థాయికి ఎలా చేరాడ‌నే కథ ఆధారంగానే ఈ రాజా రాజా చోర తెరకెక్కింది. కథలోని వెళ్ళడానికి బాగా సమయం తీసుకున్న దర్శకుడు ఇంటర్వెల్ బాంగ్ కి ముందు భాస్క‌ర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాద‌నే విష‌యం తెలిసిన‌ప్పుడూ, రాజు దొంగ‌గా శ్రీవిష్ణు ప‌ట్టుబ‌డిన‌ప్పుడు వ‌చ్చే సీన్స్ ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ఆ ట్విస్ట్ లు క‌థ‌ని కూడా మ‌రింతగా ర‌క్తిక‌ట్టిస్తాయి. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ గా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం అక్కడక్కడ నెమ్మదిగా సాగుతుంది. తొలి స‌గంలో అస‌లు క‌థే క‌నిపించదు. పాత్ర‌ల ప‌రిచ‌యం, వాటి ప‌రిణామ క్ర‌మం త‌ప్ప‌. కాకపోతే ప్ర‌తీ స‌న్నివేశంలోనూ కామెడీ ట‌చ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో దర్శకుడు రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అయింది. ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఇంట్రెస్ట్ గా అనిపించినా.. స‌న్నివేశాల్లో స్పీడు త‌గ్గ‌డంతోపాటు, సామాన్య ప్రేక్ష‌కుడికి అర్థం కాని రీతిలో కాస్త గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. కాకపోతే కామెడీని ఇష్టపడే ప్రేక్షకుడికి రాజా రాజా చోర కడుపుబ్బా నవ్వించకపోయినా.. హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. 

సాంకేతికంగా:

రాజా రాజా చోర కి మెయిన్ హైలెట్ వివేక్ సాగ‌ర్ మ్యూజిక్, బ్యాగ్ రౌండ్ స్కోర్. వివేక్ సాగర్ మ్యూజిక్ క‌థ‌కి ప్రాణం పోసింది. వేద రామ‌న్ కెమెరా ప‌నిత‌నం, విప్ల‌వ్ ఎడిటింగ్ తో పాటు ఇత‌ర విభాగాలు కూడా పర్ఫెక్ట్ గా పనిచేసాయి. ఇక నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

రేటింగ్: 2.75/5

Raja Raja Chora Movie Review:

Raja Raja Chora Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs