Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: పాగల్‌


బ్యానర్: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా

Advertisement
CJ Advs

నటీనటులు: విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్, సిమ్రన్‌ చౌదరీ, మేఘలేఖ, మురళీశర్మ, రాహుల్‌ రామకృష్ణ, తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: రాధన్‌ 

సినిమాటోగ్రఫీ: మణికందన్‌

ప్రొడ్యూసర్: బెక్కెం వేణుగోపాల్‌ 

దర్శకుడు: నరేశ్‌ కొప్పిలి

కరోనా సెకండ్ వేవ్ తగ్గడం.. సినిమా థియేటర్స్ ఓపెన్ అవడం.. చిన్న చిన్న సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ అవుతున్న టైం లో.. కొవిడ్ సెకండ్ వేవ్ కి ముందే రిలీజ్ కావాల్సిన విశ్వక్ సేన్ పాగల్ కూడా లైన్ లోకొచ్చేసింది. రెండు వారాల క్రితమే రిలీజ్ డేట్ ప్రకటించి.. ఆగస్టు 14 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది పాగల్. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన పాగల్ పై ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాడు. మరి విశ్వక్ సేన్ చెప్పినట్టుగా పాగల్‌ ప్రేక్షకులను అనుకున్న అంచనాలను అందుకున్నదా? లేదా? అనేది సమీక్షలో చూసేద్దాం. 

కథ:

ప్రేమ్(విశ్వక్‌సేన్‌)కి తన తల్లి అంటే ఎంతో ఇష్టం, ప్రేమ ఉన్నా దురదృష్టవశాత్తు ఆమె కాన్సర్ తో చనిపోతుంది. చిన్నప్పటినుండి తన తల్లి చెప్పిన మాట మాత్రం ప్రేమ్ మనసులోనే ఉంటుంది. అమ్మాయిని ప్రేమిస్తే అమ్మప్రేమ లాంటి అనుబంధం దొరుకుతుంద‌ని న‌మ్ముతాడు. ఆ క్రమంలోనే ఎంతో మంది అమ్మాయిలకి ప్రపోజ్ చెయ్యడం రిజక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా 1600 మంది అమ్మాయిల ముందు త‌న మ‌న‌సులో ప్రేమ‌ని బ‌య‌ట పెడ‌తాడు. కానీ అత‌ని ప్రేమకి తిరస్కార‌మే ఎదుర‌వుతుంది. అమ్మాయిలు రిజెక్ట్ చేశారనే బాధ‌లోనే ఆత్మహ‌త్య చేసుకోవాల‌నే నిర్ణయానికొస్తాడు. ఇంతలో తీర (నివేదా పేతురాజ్‌) ప్రేమ్ ప్రేమిస్తున్నాన‌ని చెబుతుంది. ఇంత‌కీ అసలు తీర ఎవ‌రు? నిజంగా ప్రేమ్‌ని ఆమె ప్రేమించిందా? లేదా? చివరికి ప్రేమ్ - తీర కీ పెళ్లయిందా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. 

పెరఫార్మెన్స్:

విశ్వక్‌సేన్ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. లవర్ గా ప్రేమ్ పాత్రలో నటించాడు. ఎమోషనల్ సీన్స్ లోను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ నివేదా పేతురాజ్ తీర పాత్రలో ఒదిగిపోయింది. కాకపోతే సెకండ్ హాఫ్ కె ఆమె పాత్ర పరిమితమయ్యింది. మ‌హేష్‌, రాంప్రసాద్, రాహుల్ రామ‌కృష్ణ, అత‌ని గ్యాంగ్ కామెడీ అంత‌గా మెప్పించ‌వు. ముర‌ళీశ‌ర్మ హీరోయిన్ తండ్రిగా క‌నిపిస్తాడు. భూమిక ఉన్నంతసేపు ఆకట్టుకుంది.

విశ్లేషణ:

అమ్మయిలనే కాదు.. అబ్బాయిలను ప్రేమించే ప్రేమ వ్యసనం ఉన్న ఓ కుర్రాడి కథే.. ఈ పాగల్. పాగల్ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే అమ్మాయిలని ప్రేమలోకి దింపేందుకు నానా రకాల కష్టాలు పడుతుంటాడు. పువ్వుచ్చిన ప్రతి అమ్మాయి ప్రేమ ని రిజెక్ట్ చేస్తుంది. ఆఖరికి మురళీశర్మకి రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యు చెబితే.. మురళీశర్మ ప్రేమలో పడిపోతే.. ఇక ఆ ప్రేమని పిచ్చి కాక ఇంకేం అనాలి. అందుకే పాగల్ అనే టైటిల్ పెట్టారు. పాగల్ అనే కథకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసినా.. ప్రేక్షకులని మాత్రం పిచ్చివాళ్ళని చేసారు. ఫస్ట్ హాఫ్ లో హీరో కి తల్లికి మధ్యన వచ్చే స‌న్నివేశాల్లో కానీ.. అమ్మాయి అబ్బాయి మ‌ధ్య ప్రేమలో కానీ ఏమాత్రం ఎమోషన్ అనిపించదు. సెకండ్ హాఫ్ లో ప్రేమ్ - తీర మ‌ధ్య కొన్ని స‌న్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. స్టోరీ మాత్రం ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టే సాగుతుంది. రెండు పాట‌లు, అక్కడ‌క్కడా కొద్దిగా కామెడీ సీన్స్ తప్ప సినిమాలో ఏమి ఇంట్రెస్ట్ గా అనిపించదు. పాగల్ నిజంగానే పిచ్చి. అనేలా ఉంది.  

సాంకేతికంగా..

ఈ సినిమాకి కాస్తో కూస్తో ప్లస్ అయ్యింది సంగీతం. రెండు పాటలు మెప్పిస్తాయి. ఇక ఈ సినిమాకి మరో హైలెట్ సినిమాటోగ్రఫీ. కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తాయి. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. 

సినీజోష్ ఫంచ్ లైన్: పాగల్‌ మెయిన్ ఎలిమెంట్స్ నిల్ .

రేటింగ్: 2.0/5

Paagal Movie Review:

Paagal Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs