Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ : నారప్ప


బ్యానర్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వి.క్రియేషన్స్‌

Advertisement
CJ Advs

నటీనటులు: వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌ తదితరులు

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌

నిర్మాత: కలైపులి ఎస్‌.థాను, డి.సురేశ్‌బాబు

స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల 

ఓటిటి విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

పర భాషలో హిట్ అయిన సినిమాల వంక అందరికన్నా ముందు వెంకీ కన్ను పడుతుంది. సీనియర్ హీరోలందరిలో రీమేక్ కి ఇంపార్టన్స్ ఇచ్చే హీరో వెంకటేష్. తన వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ.. తన కెరీర్ ని మలుచుకుంటున్నారు. కరోనా లాక్ డౌన్ అన్ని ముగిసి థియేటర్స్ ఓపెన్ అయినా.. తాను నటించిన తమిళ అసురన్ రీమేక్ నారప్ప ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసి షాకిచ్చారు. కరోనా క్రైసిస్ లో నారప్ప అమెజాన్ ప్రైమ్ వీడియోస్ నుండి నేరుగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. తమిళంలో యంగ్ హీరో ధనుష్ నటించిన అసురన్ మూవీ ని వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప గా రీమేక్ చేసారు. మరి అసురన్ మూవీ తో నేషనల్ అవార్డు గెలుచుకున్న ధనుష్.. ముందు వెంకీ నారప్ప కి ఎంతవరకు న్యాయం చేసారో అనేది సమీక్షలో చూసేద్దాం. 

కథ:

అగ్రకులం - అధమ కులం, ధనికుడు - పేదవాడు.. అనే కాన్సెప్ట్ తో నారప్ప కథ నడిచింది.

అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో నారప్ప(వెంకటేశ్‌) అనే రైతుకి ముగ్గురు పిల్లలు. మునికన్నా(కార్తీక్‌ రత్నం), సిన్నబ్బ(రాఖీ) బుజ్జమ్మ(చిత్ర). నారప్ప తాగి ఎక్కడపడితే అక్కడ పడిపోతుంటాడు. నారప్ప తన పిల్లలతో కలిసి పొలంలోకి పందులు రాకుండా రాత్రిపూట పొలంలో కాపు కాస్తుంటారు. ఆ ఊరి పెద్ద పండు స్వామి(నరేన్‌) ఊళ్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. ఆతర్వాత నారప్ప మూడెకరాల భూమిని లాక్కోవాలని తరుచు తగాదా పడుతుంటారు. నారప్ప భార్య సుందరమ్మ(ప్రియమణి) తన పిల్లలతో కలిసి పొలం పని చేస్తున్న టైం లో పండు స్వామి కొడుకు సుందరమ్మ పై చెయ్యి చేసుకుంటాడు. తల్లిని కొట్టాడన్న కోపంతో నారప్ప పెద్దకొడుకు మునికన్నా వాళ్లతో గొడవ పడతాడు. ఆ తర్వాత ఆ ఊరి పెద్ద మునికన్నాని హత్య చేయిస్తాడు. ఆ కోపంలో నారప్ప చిన్న కొడుకు సిన్నబ్బ ఆ ఊరి పెద్దని చంపేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. పెద్దకొడుకు చనిపోయిన నారప్ప ఏం చేశాడు? ఊరి పెద్ద కుటుంబం నుండి తన చిన్న బిడ్డని ఎలా కాపాడుకున్నాడు? అసలు నారప్ప ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? నారప్ప కుటుంబం కోసం ఏం చేసాడు అన్నది తెలియాలంటే నారప్ప చూడాల్సిందే. 

పెరఫార్మెన్స్:

నారప్ప గా వెంకటేశ్‌.. ధనుష్ ని మరపించారు. అసలు ధనుష్ కన్నా వెంకీనే నారప్పగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. నారప్పగా వెంకీ వన్‌మెన్‌ షో చేసారు. రెండు వైవిధ్యమైన పాత్రల్లో వెంకటేష్ నటన అబ్బురపరుస్తుంది. నారప్ప గా వెంకీ లుక్స్, ఆయన పెరఫార్మెన్స్ అన్ని సూపర్బ్ అనేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తుంది. ఇక యాక్షన్‌ సన్నివేశాల్లో వెంకటేష్ ఎక్కడా తగ్గలేదు.. అదరగొట్టాడనే చెప్పాలి. ప్రియమణి సుందరమ్మగా ఆకట్టుకుంది. డైలాగ్ డెలివరీలో కాస్త పాష్ నెస్ కనిపించింది. నారప్ప పెద్ద కొడుకుగా కార్తీక్‌రత్నం కనిపించింది కొద్దిసేపే అయినా కథను మలుపు తిప్పే పాత్ర అది, నారప్ప చిన్న కొడుకు పాత్ర లో చేసిన కుర్రాడు అదరగొట్టేసాడు. నారప్ప బావగా రాజీవ్‌ కనకాల, లాయర్ గా రావు రమేశ్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

విశ్లేషణ:

అగ్రకులం - అధమ కులం, ధనిక - పేద నేపథ్యంలో బోలెడన్ని కథలు సినిమాల రూపంలో అన్ని భషాల్లో తెరకెక్కాయి. లేని వారి దగ్గరనుండి భూములు లాక్కోవడం, కులాల కట్టుబాట్లు, పంచాయితీ గొడవలు, బలవంతుడిపై బలహీనుడు తిరగబడితే ఎంతటి బలవంతుడైనా మట్టి కరవాల్సిందే.. ఇదే నారప్ప కాన్సెప్ట్. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ ని తెలుగులో కుటుంబ కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలా రీమేక్ చేసారు. రీమేక్ అంటే మాతృక కథలో చిన్న చిన్న మార్పులు చేస్తూ నేటివిటీకి తగ్గట్టుగా.. రీమేక్ చెయ్యడమే. కానీ ఇక్కడ అసురన్ ని ఉన్నది ఉన్నట్టుగా తెలుగులో కాపీ పేస్ట్ చేసారు శ్రీకాంత్ అడ్డాలా. ఓ పేద కుటుంబం.. ధనిక కుటుంబం ముందు తలవంచినా.. అది లెక్క చెయ్యని ధనిక ధనిక కుటుంబం నారప్ప కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది, ఓ పేద రైతు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏం చేసాడో నారప్పలొ చూపించారు. తన అన్నని చంపేశారని కోపంతో నారప్ప చిన్న కొడుకు ఊరి పెద్దని చంపేస్తే.. పెద్ద కొడుకు పోయినా చిన్న కొడుకుని కాపాడుకోవాలి అని నారప్ప చేసే ప్రతి ప్రయత్నం ఆకట్టుకునేలా ఫస్ట్ హాఫ్ లో చూపించారు దర్శకుడు. తండ్రి తాగుబోతు అంటూ అతన్ని అస్సహించుకుంటున్న సమయంలో తన కోపం వల్ల తనేం కోల్పోయాడో తన చిన్న కొడుక్కు తన ఫ్లాష్ బ్యాక్ ని చెబుతాడు నారప్ప. నారప్ప ఫ్లాష్ బ్యాక్ లోనూ అగ్ర కులం, అధమకులం చుట్టూనే కథ నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో కుటుంబాన్ని కోల్పోయిన నారప్ప.. తనకి దేవుడిచ్చిన కుటుంబాన్ని ఇంకెప్పుడు వదులుకోకూడదు అని డిసైడ్ అవవడం, కొడుకు ప్రాణం మీదకి వచ్చేటప్పటికీ ఊరి పెద్దలని  చంపెయ్యడం అన్ని చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా కొడుకు హత్య, చిన్న కొడుకుని కాపాడుకునే క్రమంలో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే మునికన్నా హత్యకు గురవుతాడో కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఆ క్రమంలో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఊహించగులుతున్నా నారప్ప తన చిన్న కొడుకుని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌. ఇక ఫ్లాష్‌ బ్యాక్‌ అంతా నెమ్మదిగా సాగినట్టుగా అనిపిస్తుంది. అలాగే చాలాసార్లు చూసేసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు కూడా నారప్ప కి హైలెట్ అనేలా ఉన్నాయి. నారప్ప చివరిలో భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు.. అంటూ వెంకీ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. కాకపోతే వెంకీ నారప్పని రీమేక్ చేస్తున్నారు అనగానే చాలామంది తెలుగు ప్రేక్షకులు అసురన్ ని వీక్షించెయ్యడంతో.. యాజిటీజ్ గా పేస్ట్ చేసిన నారప్ప అంతగా ఇంట్రెస్ట్ గా అనిపించదు. అదే నారప్పకి మైనస్. అసురన్ చూడకుండా వున్నవారికి నారప్ప ఓ అద్భుతమే. 

సాంకేతికంగా:

నారప్ప సినిమాకి మెయిన్ హైలెట్ మణిశర్మ సంగీతం. పాటలు ఓకే. కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. ఇక యాక్షన్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. రా రా నరకరా.. నరకరా థీమ్‌ థియేటర్‌లో చూస్తే ఒళ్లుగగురు పొడవాల్సిందే. యాక్షన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అనిపిస్తుంది. శ్యామ్‌ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అసురన్ ని యాజిటీజ్ గా దింపేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాలి. మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్: వెంకటేష్ పెరఫార్మెన్స్, ఆయన లుక్స్, ప్రియమణి, మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు, ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్: అసురన్ కాపీ పేస్ట్, నిడివి, సాగదీత సన్నివేశాలు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ

పంచ్ లైన్: వెంకీ వన్ మ్యాన్ షో 

రేటింగ్: 2.75/5

Narappa Movie Telugu review :

Venkatesh Narappa Movie review 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs