Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: అర్ధశతాబ్దం


బ్యానర్‌: ఆర్‌ఎస్‌ క్రియేషన్స్‌

Advertisement
CJ Advs

నటీనటులు: కార్తీక్‌ రత్నం, నవీన్‌ చంద్ర, సాయికుమర్‌, కృష్ణప్రియ, శుభలేఖ సుధాకర్‌, ఆమని తదితరులు

సంగీతం: నఫల్‌ రాజా

సినిమాటోగ్రఫీ: అఖేర్‌, వెంకట్‌ ఆర్‌ శాఖమూరి, ఈజే వేణు

ఎడిటింగ్‌: జె.ప్రతాప్‌ కుమార్‌

నిర్మాత: చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ

దర్శకత్వం: రవీంద్ర పుల్లె

     కరోనా సెకండ్ వెవ్ థియేటర్స్ క్లోజ్.. దానితో కొంతమంది దర్శకనిర్మాతలు ఓటిటి బాట పడుతున్నారు. భారీ ప్రాజెక్ట్స్, మిడియం ప్రాజెక్ట్స్ థియేటర్స్ కోసం వేచి ఉన్నా చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం తమ సినిమాలని ఓటిటికి అమ్మేస్తున్నారు. ఏప్రిల్ లో థియేటర్స్ మూతపడగా.. అనసూయ థాంక్యూ బ్రదర్, సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ లాంటి చిన్న సినిమాలన్ని ఓటిటి నుండే రిలీజ్ అయ్యాయి. తాజాగా ఆ లిస్ట్ లోకి అర్ధశతాబ్దం చేరింది. కార్తీక్ రత్నం - నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లే డైరెక్ట్ చేసాడు. మరి ఆహా ఓటిటి నుండి నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అర్ధశతాబ్దం ఎలా ఉందొ సమీక్షలో చూసేద్దాం.

కథ:

తన ఊరు సిరిసిల్ల‌ లోనే ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే కృష్ణ(కార్తీక్‌ రత్నం) ఎప్పటికైనా దుబాయ్‌ వెళ్లి బాగా సంపాదించాలనుకుంటాడు. చిన్నప్పటి కృష్ణ పుష్ప(కృష్ణ ప్రియ)అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ తన ప్రేమని పుష్ప కి చెప్పడానికి భయపడుతుంటాడు. మరోవైపు ఊళ్లో చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఊరి పెద్దలు కులం, రాజకీయ రంగుపులుముతుంటారు. అదే ఊర్లో బాబాయ్ (గౌత‌మ్ రాజు) కొట్టు ద‌గ్గ‌ర‌ ఓ పూల మొక్క ఉంటుంది. ఆ మొక్క‌కి పూచిన పువ్వంటే పుష్ష‌కి ఇష్టం. అందుకోసం ఆమె రోజు అక్కడికి వస్తుంటుంది. అయితే పుష్ప కి ఇష్టమైన పువ్వు కోసి.. అది పుష్ప చేతిలో పెట్టి, త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాల‌ని కృష్ణ ప్లాన్ చేస్తాడు. అయితే ఈలోగా.. ఆ పువ్వు ఎవ‌రో కోసుకెళ్లిపోతారు. అది కాస్తా ఊళ్లో గొడవలకు దారి తీస్తుంది. అసలు ఆ పువ్వు కోసింది ఎవరు? దాని వల్ల ఆ ఊళ్లో ఎందుకని గొడవలయ్యాయి? చివరకు కృష్ణ పుష్పకు తన ప్రేమను తెలియజేశాడా? అనేది తెలియాలంటే సినిమాని ఆహా ఓటిటిలో చూసెయ్యాల్సిందే.

పెరఫార్మెన్స్:

కార్తీక్‌ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. కృష్ణ‌ పాత్రలో జీవించాడు. త‌న న‌ట‌న స‌హ‌జంగా ఉన్నా.. ఆ పాత్ర‌ని బ‌లంగా తీర్చిదిద్ద‌లేదు ద‌ర్శ‌కుడు. ప‌ల్లెటూరి అమ్మాయిగా కృష్ణ‌ప్రియ ప‌ద్ధ‌తిగా, సంప్ర‌దాయంగా, అందంగా కనిపించింది. నవీన్‌చంద్ర, సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, అజయ్‌ వంటి పేరున్న నటులున్నా దర్శకుడు వాళ్ళని పెద్దగా వాడుకోలేదు. 

విశ్లేషణ:

కొత్త దర్శకుడు అర్ధశతాబ్దం సినిమా కోసం ఎంచుకున్న కథ, పాయింట్‌ బాగానే ఉన్నా, దాన్ని బలంగా చూపించడంలో తడబడ్డాడు. ప్రేమ ద‌గ్గ‌ర్నుంచి-రాజ్యాంగం వ‌ర‌కూ.. పల్లెటూర్లలో జరిగే కుల పోరాటాలు ఇవన్నీ దర్శకుడు తీసుకున్న మంచి పాయింట్స్. కానీ వాటిని చూపించడంలో దర్శకుడికి అనుభవం సరిపోలేదు. ఓ పువ్వు కోసం ఊరు ఊరంతా కొట్టేసుకోవడం చూడడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది. ఆ చిన్న పాయింట్ తో కథని ఎన్నో మలుపులు తిప్పొచ్చు. కానీ ఈ సినిమాలో అదేం కనిపించదు. అర్ధశతాబ్దం 

ఫస్ట్ హాఫ్ మొత్తం కృష్ణ పుష్పను ఇష్టపడటం, అది కూడా వన్ సైడ్ లవ్ తోనే. ఇవన్నీ చాలా రొటీన్‌గా చాలా సినిమాల్లో చూసేసాం అనే ఫీలింగ్ కలగకమానదు. ఇందులోనూ అవే సన్నివేశాలు, అదే కథనం. ఉన్న ఐదు సాంగ్స్ ని ఫస్ట్ హాఫ్ లోనే చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో అయినా ఏవైనా ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయా అంటే అది లేదు. కృష్ణ చేసిన పని కులం రంగు పులుముకుని ఊళ్లో గొడవలు, అల్లర్లు మొదలవుతాయి. నిజం చెప్పే అతృతతో కృష్ణ పుష్ప ఇంటికి వెళ్లడం, పుష్ప కూడా కృష్ణతో కలిసి బయటకు రావడంతో ఊళ్లో జరిగే గొడవల నుంచి వీళ్లు తప్పించుకుని ఎలా బయటపడతారన్న ఉత్కంఠ కలిగించినా.. ఆ  సన్నివేశాలు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. అసలు ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యే సందర్భం అర్ధశతాబ్దంలో ఒక్కటీ కనిపించదు, వినిపించదు. దానితో ప్రేక్షకుడి ఈ సినిమా ఎందుకు చూసాము అనవసరం గా రెండున్నర గంటలు టైం వేస్ట్ అనిపించేలా ఉంది ఈ అర్ధశతాబ్దం.

సాంకేతికంగా:

నఫల్‌ రాజా సంగీతం పర్వాలేదు . ఒకటి రెండు పాటలు వినడానికి, తెరపైనా చూడడానికి బాగున్నాయి. ముఖ్యంగా శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ పాడిన పాట బావుంటుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. అస్కర్‌, వెంకట్‌, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతాప్‌ కుమార్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సిందే. ఫస్ట్ హాఫ్ లో నిడివి బాగా పెరిగిపోయింది. నిర్మాణం విలువలు కథానుసారం ఉన్నాయి.

పంచ్ లైన్: అర్ధం కాని అర్ధశతాబ్దం  

Ardha Shatabhdam Review:

Ardha Shatabhdam Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs