Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: సుల్తాన్


బ్యానర్: డ్రీం వారియర్స్ పిక్చర్స్  

Advertisement
CJ Advs

నటీనటులు: కార్తి, రష్మిక మందన్నా, యోగి బాబు, రామచంద్రరాజు, నెపోలియన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: వివేక్ మెర్విన్

బ్యాగ్రౌండ్ మ్యూజిక్: యువన్ శంకర్ రాజా

ఎడిటింగ్: రూబెన్ 

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు

దర్శకత్వం: భాగ్యరాజ్ 

కోలీవుడ్ హీరో కార్తీ అంటే తెలుగులో తెలియని వారుండరు. సూర్య తమ్ముడు కార్తీ గా కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు. ఖైదీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కార్తీ టాప్ హీరోయిన్ రష్మిక తో కలిసి నటించిన సుల్తాన్ సినిమాని నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే కౌరవుల పక్షాన నిలిచే కృష్ణుడి కథ అంటూ సుల్తాన్ కథని రివీల్ చేసేసిన కార్తీ సినిమాపై అంచనాలు పెంచేసేసాడు. కొత్త తరహా కథలను, పాత్రలను ఎంచుకునే కార్తీ సుల్తాన్ తో కమర్షియల్ యాంగిల్ లో కనిపించాడు. సక్సెఫుల్ హీరోయిన్ తో కలిసి సుల్తాన్ తో కార్తీ హిట్ కొట్టాడో? లేదో? సమీక్షలో చూసేద్దాం.

కథ:

సేతుప‌తి (నెపోలియ‌న్‌) కొడుకు సుల్తాన్ (కార్తీ) . సుల్తాన్ చిన్నతనంలో సేతుపతి దగ్గర ఉండే కౌరవుల్లాంటి 100 మంది రౌడీలా చేతుల్లో పెరుగుతాడు. సుల్తాన్ ఇంజినీరింగ్ చదివి ముంబై లోని ఓ కంపెనీలో రోబోటిక్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తుంటాడు. తన తండ్రి చేసే రౌడీయిజం, ఆయన దగ్గర ఉండే 100 మంది రౌడీలు చేసే గ్యాంగ్ వార్‌లూ, గొడ‌వలూ అంటే న‌చ్చ‌వు. అదే విషయంలో తండ్రి సేతుపతి - సుల్తాన్ కి మధ్యన ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే ఒకసారి సుల్తాన్ సొంతూరికి వచ్చినప్పుడు అనుకోకుండా తండ్రి వారసత్వం తీసుకోవాల్సి వచ్చి ఆ 100 మంది రౌడీల బాధ్యతలను నెత్తినెత్తుకోవాల్సి వస్తుంది. మరి రౌడీయిజం, గొడవలు అంటే నచ్చని సుల్తాన్ తండ్రి వారసత్వాన్ని అంగీకరిస్తాడా? అసలు సుల్తాన్ ఆ కౌరవుల్లాంటి రౌడీలని ఏం చేస్తాడు? సుల్తాన్ ప్రేమ కథ ఏమిటి? సుల్తాన్ వ్యవసాయం ఎందుకు చెయ్యాల్సి వస్తుంది? మరి ఇన్ని తెలుసుకోవాలంటే సినిమా చూసెయ్యాల్సిందే.

పెరఫార్మెన్స్:

కార్తీ సుల్తాన్ పాత్రలో ఒదిగిపోయాడు. కార్తీ నటన, అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాల్లో కార్తీ అద్భుతమైన పెరఫార్మెన్స్ ఇచ్చాడు. తన పాత్రని చాలా ఈజీగా చేసేసాడు కార్తీ. ఇప్పటివరకు గ్లామర్ డాల్ గా ఆకట్టుకున్న ర‌ష్మిక ఈ సినిమాలో ఏదోలా అంటే డీ గ్లామర్ గా క‌నిపించింది. ఇప్పటివరకు క్లాస్ గా చూసిన ర‌ష్మిక‌ని అలా డీ గ్లామర్ గాను, పల్లెటూరి అమ్మయిగా, త‌మిళ నేటివిటీలో చూడ‌డం కాస్త ఇబ్బంది పెట్టింది అనే చెప్పాలి. అందంలోనూ, అభినయంలోనూ రష్మిక తేలిపోయింది. తమిళ ప్రేక్షకులను అయితే రుక్మిణిగా రష్మిక బాగానే ఆకట్టుకుంటుంది. లాల్ బాగానే ఆకట్టుకున్నాడు. యోగిబాబు ఓకె ఓకె గా నవ్వించాడు. విలన్ పాత్రల్లో చేసిన ఇద్దరూ బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అనిపించారు. మిగతావారు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

మహాభారతంలో కౌరవులు మంచివారు కాదు. కానీ ఇక్కడ కౌరవులని మంచివారిగా మార్చి కౌరవుల పక్షాన పోరాడే కృష్ణుడు సుల్తాన్ అంటూ కథని రాసుకున్నాడు దర్శకుడు భాగ్యరాజ్. వినడానికి కొత్తగానే ఉంది. చెప్పడానికి చాలానే ఉంది. 100 మంది గొడవలకు, గ్యాంగ్ వార్ లకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉండేవారిని హీరో వచ్చి వారిని గొడవలకు వెళ్లనివ్వకుండా కాపు కాస్తూ, ఒకవైపు వాళ్ళని దుర్మార్గుల నుండి కాపాడుతూ.. మధ్యలో ప్రేమ కోసం కష్టపడే హీరో కథే ఈ సుల్తాన్ కథ. దర్శకుడు తీసుకున్న నేపథ్యం కొత్తదే. దాన్ని హ్యాండిల్ చెయ్యడంలో ఎంత కష్టపడాలో సుల్తాన్ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆస‌క్తిక‌రంగా.. యోగిబాబు బ్యాచ్ చేసే కామెడీ న‌వ్విస్తుంది. అయితే మ‌ధ్య‌మ‌ధ్య‌లో హీరో-హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంటుంది. అది అంతగా ఆకట్టుకునేలా అనిపించదు. కార్తీ - రశ్మికల మధ్యన కెమిస్ట్రీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంటర్వెల్ దగ్గర హీరో వీరత్వం చూపించే సన్నివేశం ఒకటి ఫస్ట్ హాఫ్ లోనే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది. ఇక వీకెండ్ వ్య‌వసాయం, సేంద్రియ వ్య‌వ‌సాయం లాంటి కాన్సెప్టులు చూసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ రౌడీల వ్య‌వ‌సాయం అనే లైన్ ఏమంత కొత్త‌గా అనిపించ‌దు. విలన్ల వ్యవహారం అయితే పూర్తిగా తేలిపోయింది. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకకులకి ఆసక్తిని కలిగించే సన్నివేశాలు ఒక్కటి లేకపోయాయి. దర్శకుడు అనేక రకాల సమస్యలపై దృష్టి పెట్టి అసలు విషయాన్నీ పక్కదారి పట్టించేసాడనిపిస్తుంది. కాసేపు సైన్యాన్ని కత్తి పట్టకుండా కాపాడడం, కాసేపు ప్రేమ కోసం ఆరాటపడడం, కాసేపు దుర్మార్గులతో తలపడడం చూస్తే అంతా గందరగోళంగా.. సినిమా అంతా భారంగా అనిపిస్తుంది.. తప్ప ఎక్కడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అడుగడుగునా తమిళ ఫ్లేవర్ తో తెలుగు ప్రేక్షకులకు విసెగెత్తిపోతారు..

సాంకేతికంగా:

వివేక్ - మెర్విన్ పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. కాకపోతే యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్లలో యువన్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మంచి క్వాలిటీతో తెరకెక్కింది. రూబెన్ ఎడిటింగ్ పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

పంచ్ లైన్: టైటిల్ లో ఉన్న పవర్ సుల్తాన్ లో లేదు 

రేటింగ్:2.25/5

Sulthan Movie Review :

Sulthan Movie Telugu Review 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs