Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: తెల్లవారితే గురువారం


బ్యానర్: వారాహి చలనచిత్రం, లౌక్య క్రియేషన్స్

Advertisement
CJ Advs

నటీనటులు: సింహా కోడూరి, మిశ్రా నారంగ్, చిత్రా శుక్లా, సత్య, రాజీవ్ కనకాల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: కాలభైరవ

సినిమాటోగ్రఫీ: సురేష్ రగతు

నిర్మాతలు: రజిని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణికాంత్ గెల్లి

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా, మరో కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. సింహ కోడూరి హీరోగా మత్తువదలరా సినిమా మంచి సినిమా అనిపించుకోగా.. సింహ తదుపరి నటించిన చిత్రం తెల్లవారితే గురువారం ఈ శనివారం విడుదలైంది. మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తారక్ సపోర్ట్ ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మత్తు వదలరా తర్వాత సింహ - కాల భైరవ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తో సింహ హిట్ కొట్టాడో? లేదో? సమీక్షలో చూసేద్దాం.

కథ:

ఒక్క రాత్రిలో జరిగే కథ ఇది. 

వీరేంద్ర (సింహా) కన్ష్ట్రక్షన్ ఇంజనీర్. వీరేంద్ర, మధు (మిషా నారంగ్) లకు పెద్దలు నిశ్చయించిన పెళ్లి జరుగుతుంటుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలన్నది వీరేంద్ర ప్రయత్నం. అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే సమయంలో బ్యాగ్ పట్టుకుని మధు కూడా బయటికి వస్తుంది. వీరేంద్ర - మధు బయట కలుసుకుంటారు. వీరేంద్ర మరో అమ్మాయి కృష్ణవేణి (చిత్రా శుక్లా) కోసం పెళ్లి వద్దనుకుంటాడు. ఆమె ప్రేమ కోసమే పెళ్లి నుంచి పారిపోతున్నట్లు మధుకి చెప్తాడు. జరుగుతున్నపెళ్లిని క్యాన్సిల్ చేయించడం కోసం వీరేంద్ర ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ప్రేమ వ్యవహారం ఉన్నప్పుడు వీరేంద్ర పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు? అసలు మధు ఎందుకు పెళ్లి వద్దనుకుని పారిపోవాలనుకుంటుంది? అసలు వీరేంద్ర, కృష్ణ కథ ఏమైంది.. మధు పరిస్థితేంటి? అనేది మిగతా కథ.

పెరఫార్మెన్స్:

సింహా కోడూరి వీరేంద్ర పాత్రకి తగినట్టుగా అమాయకంగా, ఆవేశంగా బాగా నటించాడు. స్క్రీన్ పై బాగున్నాడు కూడా. మత్తు వదలరాతో పోలిస్తే ఇందులో చాలా బెటర్‌గా కనిపించాడు. మిషా నంగర్ పక్కింటి అమ్మాయిలా మెప్పించింది. క్లయిమాక్స్ సన్నివేశాల్లో మంచి పెరఫార్మెన్స్ ఇచ్చింది. ఇక మరో హీరోయిన్ చిత్రా శుక్లా కన్ఫ్యూజన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాగానే నటించింది. సత్య కామెడీ బావుంది. వైవా హర్ష, రాజీవ్ కనకాల మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

రాజమౌళి ఫ్యామిలీ నుండి హీరో అనగానే ఆటోమాటిక్ గా ప్రేక్షకుల చూపు అతని మీదే ఉంటుంది. అలానే కీరవాణి తనయుడు సింహ కోడూరి మొదటి సినిమానే లో బడ్జెట్ లో, కామెడీ ఎంటర్టైనర్ గా మత్తు వదలరా సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఇలా ఇప్పుడు ఒక్క రాత్రిలో జరిగే కథ అంటూ మణికాంత్ గెల్లి దర్శకుడిగా తెల్లవారితే గురువారం మూవీ చేసాడు. పెళ్లి అనగానే భయపడిపోయే హీరోయిన్, పెళ్లి పీటలెక్కే టైం లోనూ ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేసే హీరో, తనకేం కావాలో కూడా తెలుసుకోలేని కన్ఫ్యూజన్ లో ఉండే మరో హీరోయిన్ కథే ఈ సినిమా. ప్రేమలో ఉండే ప్రాబ్లమ్స్.. పెళ్లిలో ఉండే కన్ఫ్యూజన్స్ కలిపి చూపించాడు దర్శకుడు మణికాంత్.. అయితే అది ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అక్కడక్కడా పర్లేదు అనిపించే సన్నివేశాలే కానీ కలిపి చూస్తే తెల్లవారితే గురువారం ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ ఓ కథ.. సెకండాఫ్ మరో కథ అంటూ డివైడ్ చేసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఇంటర్వెల్ వరకు పర్లేదు అనిపించే కథ.. ఆ తర్వాత మరింత నెమ్మదించింది. సెకండ్ హాఫ్ లో వచ్చే కథ ప్రేక్షకుడు ఊహకి తగ్గట్టుగా మారిపోవడం పెద్ద మైనస్. ఇంటర్వెల్ వరకు అదే కథ ఉన్నపుడు మరింత బలమైన లవ్ సీన్స్ రాసుకుని ఉంటే బావుండేది. కానీ వాళ్ల మధ్య అంత ప్రేమ ఉన్న సన్నివేశాలు లేకపోవడంతో విడిపోయినపుడు కూడా అంత ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు. రెండో హీరోయిన్‌తో వచ్చే ట్రాక్ కూడా ఆసక్తికరంగా అనిపించలేదు. మధుకు పెళ్లి ఎందుకు ఇష్టంలేదో దర్శకుడు కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. ఎలాంటి కథనైనా ఆసక్తిగా మలచగలగాలి. అది లోపించడం వల్లే సినిమా గాడి తప్పింది.

సాంకేతికంగా:

కాలభైరవ అందించిన సంగీతం ఓకె ఓకె గా అనిపిస్తుంది. పాటలు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ అక్కడక్కడా వీక్ అనిపించడమే కాదు.. సెకండాఫ్ ని ఎడిట్ చెయ్యాల్సిన సన్నివేశాలు బోలెడన్ని ఉన్నాయి. వారాహి చలనచిత్ర నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

పంచ్ లైన్: కన్ఫ్యూజన్ డ్రామ

రేటింగ్: 2.25

Thellavarithe Guruvaram Review:

Thellavarithe Guruvaram Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs