Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: ఈ కథలో పాత్రలు కల్పితం


బ్యానర్ : ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్

Advertisement
CJ Advs

నటీనటులు: పవన్‌ తేజ్‌, మేఘన, ప్రిద్వి, రఘుబాబు, నవీన్, అభయ్, సింగర్ నోయెల్ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌

సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల

ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు

డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌

నిర్మాత: రాజేష్‌ నాయుడు

క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.

కొణిదెల ఫ్యామిలీ కి చెందిన మరో హీరో పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. కొత్త తరహా కథతో తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేసాడు పవన్ తేజ్. కొత్త దర్శకుడు అభిరామ్ తెరకెక్కించిన ఈ కథలో పాత్రలు ఎలా కల్పితం, అసలు ఏమి జరిగింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ : 

హీరో కృష్ణ ( పవన్ తేజ్ కొణిదెల ) హీరోగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అతని ఫ్రెండ్ నవీన్ ప్రముఖ ప్రొడ్యూసర్ రియల్ రత్నం ( రఘుబాబు ) దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. హీరోగా ప్రయత్నాలు చేస్తున్న అతనికి అప్పటికే ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి ( మేఘన కుమార్ ) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తరువాత అతని ప్రేమలో ఆమె కూడా పడిపోతుంది. ఇలా సాఫిగా సాగిపోతున్న క్రమంలో కృష్ణ కు హీరోగా ఛాన్స్ వస్తుంది. ఆ సినిమా కథ ఓ పాపులర్ మోడల్ రియల్ కథతో జరుగుతుంది. ఆ పాపులర్ మోడల్ జీవితం నేరమయం అవ్వడంతో ఏసిపి ( ప్రిద్వి ) అన్వేషణ మొదలు పెడతాడు. అసలు ఆ మోడల్ ఎవరు ? ఆమె వెనకున్న కథేమిది ? ఇంతకీ హీరో అవ్వాలనుకున్న కృష్ణ ఎందుకు ఆ మోడల్ విషయంలో ఓవర్ గా రియాక్ట్ అవుతాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

పెరఫార్మెన్స్:

నటీనటుల విషయానికి వస్తే ముందుగా హీరో పవన్ తేజ్ గురించి చెప్పుకోవాలి. కొణిదెల ఫ్యామిలీ హీరోగా  మెగాస్టార్ చిరంజీవి దగ్గర బంధువు అయిన పవన్ తేజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అతని బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. అయితే కొన్ని కొన్ని సీన్స్ లో అతని పేస్ మరి చిక్కిపోయినట్టు కనిపించడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో పవన్ తేజ్ ఆకట్టుకున్నాడు. డాన్స్, ఫైట్ అన్నింటిలో తనదైనా స్టైల్ చూపించాడు. ఇక హీరోయిన్ మేఘన గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అందం, అభినయం తో మేఘన కుర్రకారును తన ప్రేమలో పడేసింది. ఇక ఏ సిపి గా ప్రిద్వి అదరగొట్టాడు. ముక్యంగా అయన ఒరిజినల్ వాయిస్ పెట్టడం బాగుంది. అలాగే రియల్ రత్నం పాత్రలో రఘుబాబు తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల్లో నవీన్, అభయ్ చక్కగా చేసారు.. ముక్యంగా నెగిటివ్ పాత్రలో సింగర్ నోయల్ నటన బాగుంది. 

విశ్లేషణ:  

ఓ సస్పెన్స్ కథను ఎంటర్ టైనేమేంట్ వే లో చెప్పి ఆ కథలోని ట్విస్ట్ లను ఒక్కొక్కటిగా విప్పుతూ కథను నడపడం బాగుంది. దర్శకుడు తాను ఎంచుకున్న కథను బాగా డీల్ చేసాడు. ముక్యంగా  నేడు సమాజంలో జరుగుతున్నా విమెన్ ట్రాఫికింగ్ ను ఎంచుకుని దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం బాగుంది. ఈ విషయంలో దర్శకుడు అభిరాం సక్సెస్ అయ్యాడు. ఇక హీరోగా పరిచయం అయిన పవన్ తేజ్ నటన, అతని యట్టిట్యూడ్ బాగుంది. నటుడిగా రాణించాలని తపన ప్రతి విషయంలో కనిపించింది. ఇక హీరోయిన్ మేఘన గ్లామర్, నటన మరో ప్రధాన హైలెట్ అని చెప్పాలి.  టెక్నీకల్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఆసక్తికర అంశాలతో మంచి ప్రయత్నం చేసారని చెప్పొచ్చు.

సాంకేతికంగా:

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది సునీల్‌ కుమార్  అందించిన కెమెరా ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి, చాలా సీన్స్ చాలా అందంగా చూపించారు. ఇక సంగీతం అందించిన కార్తీక్‌ కొడకండ్ల సాంగ్స్ తో పాటు ఆర్ ఆర్ తో అదరగొట్టాడు. కార్తీక్ అందించిన ఆర్ ఆర్ ప్రధాన హైలెట్ గా నిల్చింది. సినిమాలో సీన్స్ ఎలివేట్ చేయడంలో ఆర్ ఆర్ సూపర్ అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అందించిన శ్రీకాంత్‌ పట్నాయక్, ఆర్ తీరు ల పనితీరు బాగుంది. ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే సినిమాలో  డైలాగ్స్  ఆకట్టుకున్నాయి. స్క్రీన్‌ప్లే డైలాగ్స్ ఇచ్చిన తాజుద్దీన్‌ సయ్యద్ మంచి ప్రయత్నం చేసాడు. ఇక ఈ చిత్రానికి క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం వహించిన కొత్త దర్శకుడు అభిరామ్ ఎమ్‌ గురించి చెప్పాలంటే .. ఓ ఆసక్తికరమైన కథను ఎంచుకుని దానికి సినిమాటిక్ డ్రామాతో ఓ సస్పెన్సు థ్రిల్లర్ కథని బాగా డీల్ చేసాడు. సినిమాలో వచ్చే ట్విస్టులన్నీ ఆకట్టుకుంటాయి. ముక్యంగా హీరో పాత్రను చివరి వరకు అతను హీరోగా ప్రయత్నాలు కాదు ఇంకేదో ఉందని హైడ్ చేయడం సినిమాకు బాగా హైలెట్ అయింది. ఇక నిర్మాత రాజేష్‌ నాయుడు నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Ee Kathalo Paathralu Kalpitam Movie Review:

Ee Kathalo Paathralu Kalpitam Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs