Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: పవర్ ప్లే


నటీనటులు: రాజ్ తరుణ్, హేమల్, పూర్ణ, అజయ్, ప్రిన్స్, కోట శ్రీనివాసరావు, సత్యం రాజేష్, తదితరులు

Advertisement
CJ Advs

మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్రూ

ఎడిటింగ్ల్ ప్రవీణ్ పూడి

నిర్మాతలు: దేవేష్, మహిధర్

దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా

గత ఏడాది కరోనా క్రైసిస్ తో థియేటర్స్ మూగబోవడంతో.. విజయ్ కుమార్  కొండా - రాజ్ తరుణ్ ల కాంబోలో తెరకెక్కిన ఒరేయ్ బుజ్జిగా ఆహా ఓటిటి లో రిలీజ్ అయ్యి కామెడీ హిట్ అయ్యింది. ఒరేయ్ బుజ్జిగా విడుదల కాకుండానే కొండా విజయ్ కుమార్-రాజ్ తరుణ్ కాంబోలో రెండో మూవీ మొదలు కావడం.. థియేటర్స్ ఓపెన్ అయిన రెండు నెలలకే ఆ కాంబోలో తెరకెక్కిన పవర్ ప్లే ప్రేక్షకుల ముందుకు రావడం చకచకా జరిగిపోయింది. తన బాడీ లాంగ్వేజ్ లోనే కామెడీ పండించగల రాజ్ తరుణ్ కి కలిసొచ్చిన జోనర్ కామెడీ జోనర్. అయితే ఈసారి విజయ్ కుమార్ కొండా, రాజ్ తరుణ్ లు పవర్ ప్లే అంటూ కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టు తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి పవర్ ప్లే తో విజయ్ కుమార్, రాజ్ తరుణ్ కి మరోసారి హిట్ ని కట్టబెట్టాడో? లేదో? సమీక్షలో చూసేద్దాం

కథ:

విజయ్ కుమార్ కొండా (రాజ్ తరుణ్) ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఓ మధ్య తరగతి కుర్రాడు. గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విజయ్ కి స్వీటీ అలియాస్ కీర్తి (హేమల్) అంటే చాలా ఇష్టం. స్వీటీకి కూడా విజయ్ అంటే ఇష్టముంటుంది. దానితో ఇరు పెద్దలు పెళ్ళికి ఒప్పుకుని వాళ్ళకి నిశ్చితార్ధం చేస్తారు. తర్వాత స్వీటీ తండ్రి విజయ్ కి ఉద్యోగం లేని కారణంగా పెళ్లి ఆపేస్తాడు. తండ్రి సహాయంతో ఉద్యోగం సంపాదించిన విజయ్ తో పెళ్ళికి స్వీటీ తండ్రి ఒప్పుకుంటాడు. అంతా హ్యాపీ అనుకున్న టైం లో విజయ్ అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుంటాడు. చేయని నేరానికి జైలు పాలవుతాడు. దానితో అతని కుటుంబం రోడ్డున పడుతుంది, ప్రేమించిన అమ్మాయి కూడా దూరమవుతుంది. అసలు విజయ్ చేసిన నేరం ఏమిటి? విజయ్ ఈ నేరం నుండి ఎలా బయట పడ్డాడు.? మళ్ళీ స్వీటీ విజయ్ దగ్గరవుతారా? విజయ్ -స్వీటీ పెళ్లి జరిగిందా? అనేది పవర్ ప్లే చూసి తెలుసుకోవాల్సిందే. 

పెరఫార్మెన్స్:

మధ్యతరగతి యువకుడిగా రాజ్ తరుణ్, విజయ్ పాత్రలో సీరియస్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ అల్లరిగా, కామెడీగా కనిపించే రాజ్ తరుణ్ ఫస్ట్ టైం ఇలాంటి సీరియస్ కేరెక్టర్ చెయ్యడం. హీరోయిన్ గా చేసిన హేమల్ గురించి చెప్పడానికేమీ లేదు. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. నెగెటివ్ రోల్ లో పూర్ణ బాగానే చేసింది. కాకపోతే ఆమె పాత్రని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అజయ్, కోట శ్రీనివాసరావు, ప్రిన్స్, పూజా రామచంద్రన్ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

గత రెండు వారాలుగా రిలీజ్ అవుతున్న సినిమాలను గమనిస్తే.. చెయ్యని నేరానికి ఓ అమాయకుడు బలి అయ్యి జైలుకెళ్లి.. అక్కడ పోరాటం చేసి ఎలా బయటికి వచ్చాడో అనేది అల్లరి నరేష్ నాంది సినిమా, నితిన్ చెక్ సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు విజయ్ కుమార్ కొండా - రాజ్ తరుణ్ పవర్ ప్లే స్టోరీ లైన్ కూడా అల్లరి నాంది, నితిన్ చెక్ సినిమాలకు చాలా పోలికలు ఉంటాయి. అంతేకాదు.. గతంలో వచ్చిన నిఖిల్ అర్జున్ సురవరం కాన్సెప్ట్ కూడా పవర్ ప్లే కాన్సెప్టే. అర్జున్ సురవరం సినిమాలో దొంగ సర్టిఫికెట్స్ కేసులో హీరో ఇరుక్కుంటే.. ఇక్కడ దొంగ నోట్ల కేసులో హీరో ఇరుక్కుంటాడు. అసలు సంబంధం లేని కేసులో సామాన్యుడు ఇరుక్కుని.. తన తెలివితేటలతో కేసుని ఛేదిస్తూ తిరగబడితే అనేది థ్రిల్లింగ్ గానే చూపించడానికి ట్రై చేసాడు విజయ్ కుమార్ కొండా.  కాకపోతే దాని చుటూ అల్లుకున్న కథ కథనాల్లో దర్శకుడు తడబడ్డాడు. కారు యాక్సిడెంట్ తో డ్రగ్స్ మాఫియా బయటికి రావడం వంటి ఆసక్తికర అంశాలతో సినిమా మొదలైంది. మిడిల్ క్లాస్ యువకుడు సిన్సియర్ గా జాబ్ కోసం ట్రై చెయ్యడం, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కోసం కలలు కనడం వంటివి బావున్నా.. హీరో - హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ అంతగా పండలేదు. తర్వాత హీరో జైలుకెళ్లాకే కథ స్పీడు అందుకుంటుంది. ఒక పెద్ద కేసుని తప్పు దోవ పట్టించడానికి హీరో దగ్గర రెండు దొంగ నోట్లు దొరికాయని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మీడియా ముందు నించోబెట్టడం అనేది సిల్లీగా అనిపిస్తుంది. హీరో బెయిల్ పై బయటికి వచ్చి ఆ కేసునుండి బయట పడేందుకు తన కేసుని తానే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం, అందులో భాగంగా హీరోని ఒకరు చంపాలనుకోవడం అన్ని నిఖిల్ అర్జున్ సురవరాన్ని తలపిస్తాయి. సెకండ్ హాఫ్ లో పూర్ణ ఎంట్రీ ఏమైనా సినిమాని మలుపు తిప్పుతుంది అనుకుంటే.. అక్కడా గందర గోళమే. విజయ్ కేసుకి-  పూర్ణ కి ముడిపెట్టి రాసుకున్న సన్నివేసాలు పేలవంగా తేలిపోయాయి. అసలు సినిమా ఎప్పుడెప్పుడు అయ్యిపోతుందా? ఎప్పుడు రిలాక్స్ అవుదామా? అని ప్రేక్షకుడికి బోర్ కొట్టించే అన్ని సన్నివేశాలు పవర్ ప్లే లో ప్లే అవుతుంటాయి. పూర్ణ - ప్రిన్స్ లవ్ ట్రాక్ కాస్త ఇంట్రెస్టింగ్ గా వున్నా.. హీరో విలన్ చేసే కుట్రలు బయట పెట్టే వీక్ సన్నివేశాల కారణంగా ఆ లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకుడికి ఎక్కదు. లాజిక్ లేని కథ, సన్నివేశాలతో పవర్ ప్లే చాలా వీక్ గా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టింది.

సాంకేతికంగా:

సాంకేతికంగా పవర్ ప్లే పర్వాలేదనిపిస్తుంది. ఒక్క సాంగ్ కూడా లేని ఈ సినిమాలో సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ కెమెరా వర్క్. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి.

పంచ్ లైన్: కావాలి ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లే

రేటింగ్: 2.5/5

Power Play Movie Review:

Raj Tarun Power Play Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs