Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: ఎ1 ఎక్స్‌ప్రెస్


నటీనటులు: సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళి శర్మ, రఘు బాబు, ప్రియదర్శి, పోసాని కృష్ణ మురళి తదితరులు

Advertisement
CJ Advs

మ్యూజిక్ డైరెక్టర్: హిప్ హప్ తమీజా 

ఎడిటర్: చోటా కె ప్రసాద్ 

సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజ్ 

నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టి.జి. విశ్వ ప్రసాద్, సందీప్ కిషన్, దయ పన్నెన్

దర్శకత్వం:డేనియస్ జీవన్ 

హీరోగా వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన సందీప్ కిషన్ మరోసారి ఆ ఎక్స్ ప్రెస్ టైటిల్ తోనే క్రీడా నేపథ్యం ఉన్న కథతో ఏ1 ఎక్స్ ప్రెస్ అంటూ సినిమా చేసాడు. నిర్మాతగా, హీరోగా రెండు విభాగాల్లోనూ సత్తా చాటుతున్న సందీప్ కిషన్ హాకీ నేపథ్యం ఉన్న కథతో ఈ సినిమాని డేనియస్ జీవన్ దర్శకత్వంలో చేసాడు. క్రీడా నేపథ్యం ఉన్న కథలతో అప్పుడప్పుడు సినిమాలు వచ్చిపోతున్నా.. హాకీ నేపథ్యంలో మాత్రం సినిమాలు రాలేదు. హాకీ నేపథ్యం అంటూ కొత్తగా ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా చేసిన సందీప్ కిషన్ కి ఈ సినిమా సక్సెస్ ఇచ్చిందో? లేదో? సమీక్షలో చూసేద్దాం.

కథ:

యానాం లోని చిట్టిబాబు హాకీ గ్రౌండ్ కు సంబంధించి కథ మొదలవుతుంది. సముద్రం పక్కనే ఉన్న ఆ హాకీ గ్రౌండ్ పై అక్కడి లోకల్ రాజకీయ నాయకుడు, క్రీడాశాఖ మంత్రి (రావు రమేష్) కన్నేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విదేశీ కంపెనీకి అమ్మెయ్యాలని చూస్తుంటాడు. మరోపక్క మేనమావ ఇంటికి అని వచ్చిన సంజు అలియాస్ సందీప్ నాయుడు(సందీప్ కిషన్) తాను ఇష్టపడిన లావణ్య (లావణ్య త్రిపాఠి)ని కలవడం కోసం చిట్టిబాబు హాకీ గ్రౌండ్ కి వెళ్లడమే కాకుండా లవర్ లావణ్య కోసం హాకీ ప్లేయర్ గా మారిపోతాడు. చిట్టి బాబు గ్రౌండ్ ని విదేశీ కంపెనీ దక్కించుకోకుండా సంజు ఏమైనా చేశాడా? అసలు హాకీ ప్లేయర్ గా సంజు ఎందుకు మారాడు? అసలు సంజు ఎవరు? సంజు గతం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెరఫార్మెన్స్:

సందీప్ కిషన్ నటన ఆకట్టుకునేలా ఉంది. సిక్స్ ప్యాక్ బాడీ తో చాలా స్లిమ్ గా నిజమైన స్పోర్ట్స్ పర్సన్ లా సందీప్ కనిపించాడు. హాకీ లో ట్రైనింగ్ కూడా తీసుకుని.. రియల్ హాకీ ప్లేయర్ లా అదరగొట్టేసాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెరఫార్మెన్స్ కేవలం ఫస్ట్ హాఫ్ కె పరిమితం చేసారు. సెకండ్ హాఫ్ లో లావణ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఫస్ట్ హాఫ్ లో గ్లామర్ గా లావణ్య అందంగా కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది రావు రమేష్ కేరెక్టర్. లోకల్ పొలిటికల్ లీడర్ గా బలమైన కేరెక్టర్ లో విలనిజాన్ని పండించాడు. ఎప్పటిలాగే ఆయన జీవించాడు. మీడియాకి వార్నింగ్ ఇచ్చే సీన్స్ లో రావు రమేష్ నటనకు క్లాప్స్ పడతాయి. ఇక కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పర్వాలేదనిపించారు. మురళి శర్మ, పోసాని తదితర నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

క్రీడా నేపథ్యంలో తెలుగులో సినిమాలు వచ్చినా.. పూర్తిస్థాయి క్రీడా నేపథ్యం ఉన్న కథలు రాలేదు. అందులోనూ రమ్మీ, ఫుడ్ బాల్ లాంటి కథలు ప్రేక్షకులకు కొత్తకాకపోయినా.. హాకీ ఆట నేపధ్యలో సినిమా అంటే కాస్త కొత్తగానే అనిపిస్తుంది. ఆటకి రాజకీయాన్ని ముడిపెట్టిన కథలు కూడా ప్రేక్షకులకు కొత్త కాదు. క్రీడా నేప‌థ్యంలో సాగే సినిమాలంటే ఎక్కువ‌గా ఆట‌ల్లో రాజ‌కీయాల నేప‌థ్యంలోనే సాగుతుంటాయి. ఇప్పుడు సందీప్ కిషన్ A1  ఎక్సప్రెస్ కూడా అలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమానే. త‌మిళంలో సక్సెస్ అయిన న‌ట్పే తునైకి రీమేక్ ఇది. ఈ సినిమా. క‌థ, క‌థ‌నాల ప‌రంగా చూస్తే ఎలాంటి కొత్త‌ద‌నం లేదు. కాకపోతే హీరో హాకీ స్టిక్ ప‌ట్టుకోవ‌డంలో మాత్ర‌మే కొత్త‌ద‌నం వెదుక్కోవాలి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్ర‌తిభ‌ని తొక్కేస్తూ సాగే రాజ‌కీయం, మిగ‌తా క‌థ‌లో రాజ‌కీయ నాయ‌కుల స్వ‌లాభం కోసం మైదానం‌తో వ్యాపారం చేయడం.. ఇలా రెండు కోణాల్లో ఈ క‌థ సాగుతుంది. మామూలుగానే ఆటల్లో ఎత్తులు, పై ఎత్తులు మధ్యలో ట్విస్టులు.. అలాగే కొంత ఎమోషన్ ని కలగలిపి కథని రాసుకుంటే ఓకె.. దాన్ని తెరకెక్కించే విధానానికి ప్రేక్షకుడు కనెక్ట్ కావాలి. అయితే స‌గ‌టు క్రీడా నేప‌థ్యంలో సాగే సినిమాల్లో ఎలాంటి అంశాలుంటాయో A1 ఎక్సప్రెస్ లోను అవే ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు వరకు.. హీరో ప్రేమ వ్యవహారం, ఫ్యామిలీ  సీన్స్ తో టైం పాస్ చేసిన దర్శకుడు హీరోకి హాకీ స్టిక్ ఇచ్చాక కథ మొదలు పెట్టాడు. సెకండ్ హాఫ్ లో హీరో ప్లాష్ బ్యాక్ ఆక‌ట్టుకుంటుంది. కాకపోతే ఎమోషనల్ సీన్స్ అంతగా పండలేదు. ఇక ఆటలో రాజకీయం అనేది అందరికి తెలిసిన విషయం కావడంతో.. కథని కొత్తగా ఫీలవడు ప్రేక్షకుడు. చాలావరకు ప్రేక్షకుడు ఊహించిన సన్నివేశాలే తెరపైకి వస్తుంటాయి .జస్ట్ టైం పాస్ కోసం అయితే ఓ లుక్కేయ్యచ్చు అనేలా ఉంది ఈ ఎక్స్ ప్రెస్ ఉంది.

సాంకేతికంగా:

హిప్ హాప్ తమీజా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. కెవిన్ రాజ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఓకె ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

పంచ్ లైన్: ఎక్స్‌ప్రెస్ అంత స్పీడు లేదు 

రేటింగ్:2.5/5

A1 Express Review:

A1 Express Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs