Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ:: క్రాక్


క్రాక్ మూవీ రివ్యూ

Advertisement
CJ Advs

బ్యానర్‍: సరస్వతి ఫిలిం డివిజన్‍

నటీనటులు: రవితేజ, శ్రుతిహాసన్‍, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‍కుమార్‍, సుధాకర్‍, వంశీ, రవి శంకర్‍, సప్తగిరి

మాటలు: సాయి మాధవ్‍ బుర్రా

సంగీతం: తమన్‍

ఎడిటింగ్: నవీన్‍ నూలి

సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు

నిర్మాత: బి. మధు

కథ, కథనం, దర్శకత్వం: గోపిచంద్‍ మలినేని

కరోనా క్రైసిస్ అందరి ఆశల మీద నీళ్లు చల్లింది. జనజీవనం యాధస్థితికి వచ్చినా.. థియేటర్స్ పరిస్థితి మాత్రం 50 శాతం అక్యుపెన్సీ దగ్గరే ఉండిపోయింది. అయినా సంక్రాంతి సీజన్ ప్రేక్షకులకు సినిమాలు కావాలి, ఫాన్స్ కి కిక్ ఉండాలి అని హీరోలు సంక్రాంతి బరిని ఖాయం చేసుకుని నువ్వా - నేనా అని పోటాపోటీగా థియేటర్స్ లో సినిమాలు దించడానికి రెడీ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందుగా మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ తో ప్రేక్షకులముందు సందడి చేసాడు. థియేటర్స్ దగ్గర ఫాన్స్ హడావిడి, బాక్సాఫీసువద్ద టికెట్స్ కోలాహలం, గోడల మీద పోస్టర్స్, సిటీస్ లో హోర్డింగ్స్ తో ప్రచార హడావిడి అన్ని చూసాక మళ్ళీ థియేటర్స్ కి పూర్వ వైభవం వచ్చింది అనిపించింది. అయితే కొన్ని డైలమాల మధ్యన క్రాక్ బొమ్మ థియేటర్స్ లో పడడం లేట్ అయినా ఫాన్స్ మాత్రం తగ్గలేదు. మరి ఈ ఏడాది ముందుగా లక్కు పరిక్షించుకోవడానికి రెడీ అయిన గోపీచంద్ - రవితేజ ల కాంబోలో తెరకెక్కిన క్రాక్ సినిమాని మాస్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేసింది టీం. ఈ సంక్రాంతికి కిక్ ఇచ్చే మాస్ మసాలా క్రాక్ అంటూ రవితేజ టీం చేసిన ప్రమోషన్స్ కి తగ్గట్టుగా క్రాక్ ప్రేక్షకులను మెప్పించ్చిందా? లేదా.. అనేది సమీక్షలో చూసేద్దాం.

కథ: 

ఒంగోలు నేపథ్యంలో సాగే కథ ఇది. పోతరాజు వీరశంకర్ (రవితేజ) క్రాక్ ఉన్న పోలీస్ ఆఫీసర్. ఏ ఏరియా లో పనిచేసినా తన మార్క్ కనబడేలా ఉండే ఈ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. కుటుంబంతోను అంతే ప్రేమగా ఉంటాడు. భార్య కళ్యాణి(శృతి హాసన్) కొడుకుతో హాయిగా ఉంటాడు పోతురాజు. ఉద్యోగంలో భాగంగా ముగ్గురు నేరగాళ్లతో తలపడతాడు. వీరిలో ఒంగోలులో.. క‌ఠారి కృష్ణ (స‌ముద్ర‌ఖ‌ని) చేయ‌ని అకృత్యం ఉండ‌దు. అతను చాలా దుర్మార్గుడు. త‌న‌కు ఎవ‌రు ఎదురెళ్లినా.. చావునే బ‌హుమ‌తిగా ఇచ్చే కిరాత‌కుడు. ఎవరినైనా చంపడానికి ఎంతకైనా తెగించే తత్వం. క‌ఠారి కృష్ణని వీర శంక‌ర్ త‌న క్రాక్‌.. ఎలా చూపించాడు?  అన్నదే ఈ కథలో కీలక అంశం. 

నటీనటుల నటన:

వీర శంకర్ గా రవితేజ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. రవితేజలోని మాస్ అప్పీల్ మనకు తెలియంది కాదు. ఎప్పటిలాగే ఎనర్జీగా రవితేజ పెరఫార్మెన్స్ ఉంది. రవితేజ టైమింగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక హీరోయిన్ గా శ్రుతిహాసన్ లాంటి హీరోయిన్ ని పెట్టాం కాబట్టి ఆమె కోసం కొన్ని సీన్లు రాసుకున్నట్టుంది. ఆ సన్నివేశాలు విసిగించే వరకూ వెళ్లాయి. పాటలకు తప్ప శృతి ఎందుకు పనికిరాలేదన్నట్టుగా ఉంది. ఇక  కటారి పాత్రలో సముద్ర ఖని తనదైన శైలిలో మెప్పించాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర కూడా ఊహించినంత ప్రత్యేకత లేదు. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

మాస్ ప్రేక్షకులే లక్ష్యంగా దర్శకుడు గోపీచంద్ ఈ సినిమాని తెరకెక్కించాడు. కానీ కథని మొదలు పెట్టే విధానంలోనే దర్శకుడు కొంచెం తడబడ్డాడు. హీరోని క్రాక్ పోలీస్ ఆఫీసర్ గా ఎలివేట్ చేయడానికి అడుగడుగునా ప్రయత్నం చేసాడనిపిస్తుంది. కొత్తదనం కోసం గోపీచంద్ మలినేని ప్రయత్నం చేశాడు. జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు అంటూ ట్రైలర్ లో చెప్పినట్టుగా.. ముగ్గురు విలన్స్ లైఫ్ లోకి హీరో ఎలా ప్రవేశించి, వాళ్ళ ఆట ఎలా కట్టించాడనేదాని మీదే సినిమా కథ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ హీరో వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నట్టుగా సో సో గా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ మిస్సయ్యింది. కాకపోతే రెండు మూడు యాక్షన్ సన్నివేశాలు విపరీతంగా కట్టుకునేలా ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తి కలిగేలా దర్శకుడు క్రియేట్ చేయగలిగాడు. క్లైమాక్స్ ను కూడా వైవిధ్యంగా చూపగలిగారు. రవితేజ ఫాన్స్ కోరుకునే మాస్ అంశాలు క్రాక్ లో పుష్కలంగా ఉన్నాయి. రవితేజని ఎలా అయితే చూడాలనుకుంటారో.. దర్శకుడు రవితేజని అలానే పీవర్ ఫుల్ ఎనర్జిటిక్ పర్సన్ గా ప్రెజెంట్ చేసాడు. ఫాన్స్ కి మెచ్చే మసాలా అంశాలు క్రాక్ లో పుష్కలంగా ఉన్నాయి.

సాంకేతికంగా..

టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. థమన్ నేపధ్య సంగీతం హీరోని ఎలివేట్ చెయ్యడంతో.. తన మార్క్ చూపించాడు. విజువల్స్ బాగున్నాయి. పాటలు కూడా పర్వాలేదు. జీజే విష్ణు కెమెరా మ్యాజిక్ చేసింది. మాస్ సినేమానికి కొత్తరంగులు అద్దింది. కొన్నిసన్నివేశాలు విష్ణు సినెమాటోగ్రఫీతోనే హైలెట్ అయ్యేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి.

రవితేజ మార్క్ నటన, రెండు యాక్షన్ సన్నివేశాలు, విలన్ సముద్ర ఖని పాత్ర, థమన్ నేపధ్య సంగీతం, జిష్ణు సినిమాటోగ్రఫీ హైలెట్ అనేలా ఉంటే.. ఫస్ట్ హాఫ్, కథలోకి వెళ్ళేంముందు కన్ఫ్యూషన్ , యాక్షన్ మోతాదు, రొటీన్ స్టోరీ, శృతి హాసన్ పాత్ర సినిమాకి మైనస్ అనేలా ఉన్నాయి.

రేటింగ్: 2 .75/5

Krack Movie review:

Ravi Teja Krack Movie Telugu Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs