Advertisement
Google Ads BL

ఓటిటి రివ్యూ: కీర్తిసురేష్ ‘పెంగ్విన్’


 

Advertisement
CJ Advs

ఓటిటి రివ్యూ: ‘పెంగ్విన్’ మూవీ 

బ్యానర్ - స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, ఫ్యాషన్ స్టూడియోస్

నటీనటులు: కీర్తి సురేష్, లింగ, మధంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, నవ్య కృప, ఉమర్, తేజంక్ తదితరులు

సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఫలాని

మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్

ఎడిటర్: అనిల్ క్రిష్

నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్

దర్శకత్వం: ఈశ్వర్ కార్తిక్

 

ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌తో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఓటిటి ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఫ్యూచర్ లో చాలా సినిమాలు ఓటిటినే దిక్కు అయ్యేలా అంది. కానీ ప్రస్తుతం ఓటిటి అంటే హీరో హీరోయిన్స్ కి కానీ, దర్శకులకు కానీ రుచించడం లేదు. కానీ కరోనా లాక్‌డౌన్ లో థియేటర్స్ ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు కాబట్టి.. నిర్మాతల బాధలను అర్ధం చేసుకున్నవారు తమ సినిమాలను ఓటిటిలో విడుదల చెయ్యడానికి ఒప్పుకుంటున్నారు. మహానటితో టాప్ పొజిషన్ కి చేరిన కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ మూవీని ఓటిటిలో విడుదల చేస్తున్నాం అన్నప్పటి నుండి అందరిలో ఆ సినిమాపై ఆసక్తి కలిగింది. కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ మూవీ ఓటిటిలో విడుదలవుతుంది అంటే.. ఆ సినిమాపై అందరిలో ఇంట్రెస్ట్ కలగడం సహజమే. అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉన్న పెంగ్విన్ ట్రయిల్ అందరిలో సినిమాపై అంచనాలు పెంచింది. మరి మొదటిసారి ఓ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా ఓటిటిలో విడుదలవుతున్నప్పటికీ.. ఈ సినిమాని కీర్తి సురేష్ ఇంటర్వూస్ అవి ఇస్తూ ప్రమోషన్స్ కూడా చేసింది. మరి కీర్తి పెంగ్విన్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

 

కథ:

ఒక తల్లి మరియు తన తప్పిపోయిన బిడ్డ చుట్టూ ‘పెంగ్విన్’ కథ తిరుగుతుంది. రితు అలియాస్ రిథమ్ (కీర్తి సురేష్) - రఘు (లింగ).. వీరు అల్లారు ముద్దుగా పెంచుకునే అజయ్(మాస్టర్ అద్వైత్) స్కూల్ కి వెళ్లి అక్కడ కిడ్నాప్ అవుతాడు. అయితే అజయ్ బట్టలు అడవిలో అక్కడక్కడా కనిపించడంతో.. అజయ్ చనిపోయాడనుకుని.. రిథమ్ వల్లనే అజయ్ చనిపోయాడని రఘు ఆమెపై నిందవేసి రిథమ్ తో విడాకులు తీసుకుంటాడు. అజయ్ కిడ్నాప్ మాత్రమే చేయబడ్డాడు.. కానీ చనిపోలేదని రిథమ్ భావిస్తుంది. తర్వాత కొన్నాళ్ళకు గౌతమ్(రంగరాజ్) ని రెండో పెళ్లి చేసుకుంటుంది. అయినా అజయ్ జ్ఞాపకాలతో రిథమ్.. అజయ్‌ని వెతుకుతూనే ఉంటుంది. అసలు అజయ్ నిజంగానే బ్రతికున్నాడా? అజయ్ ని ఎవరు కిడ్నాప్ చేసారు? అజయ్ కిడ్నాపర్ చెర నుండి తప్పించుకుంటాడా? చివరికి కన్నతల్లిని అజయ్ కలుసుకుంటాడా? లేదా? అనేది పెంగ్విన్ కథ.

 

నటీనటుల నటన:

ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. కథ మొత్తం కీర్తి సురేష్ చుట్టూనే తిరుగుతుంది. మహానటిగా వంద మెట్లెక్కిన కీర్తి సురేష్ ఈ సినిమాలో గర్భిణీ తల్లిగా ఈ చిత్రాన్ని భుజాలపై మోసింది. అయితే కీర్తి సురేష్ కోసం రాసిన కొన్ని సన్నివేశాలు వాస్తవికతకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె నటనతో దాన్ని మరిపించింది. ఎప్పటిలాగే కీర్తి సురేష్ ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. కనబడకుండా పోయిన బిడ్డని వెతికే క్రమంలో కీర్తి సురేష్ ఎక్సప్రెషన్స్ హైలెట్ గా నిలుస్తాయి. అజయ్ పాత్రలో మాస్టర్ అద్వైత్ మంచి నటన కనబర్చాడు. ఇతర నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

 

విశ్లేషణ:

దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ పెంగ్విన్ కథను పిల్లాడి కిడ్నాప్, ఓ తల్లిపడే సంఘర్షణని.. మిస్టరీ థిల్లర్‌గా కథను రాసుకున్నాడు. ఇలాంటి కథలకు కథ, కథనాలే బలం. సినిమా ఆరంభంలోనే ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసాడు. సినిమా ఆరంభంలోనే పిల్లాడి కిడ్నాప్ అంటూ కథను మొదలు పెట్టడంతో, ప్రేక్షకుడు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ని చూడబోతున్నామని ఫీలయ్యేలా ఉంది. తర్వాత కథ ఆ కిడ్నాప్ తోనే రెండు గంటలు ప్రయాణించాలి. అందులో ఫస్ట్ హాఫ్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. కొడుకు కిడ్నాప్ అవడం, అతను చనిపోయాడని చెప్పినా.. కాదు బ్రతికే ఉన్నాడని రిథమ్ నమ్మడం, అజయ్ కోసం వెతకడం వంటి విషయాలతో ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ మొత్తం కుర్చీలకతుక్కుపోయేలా చేసాడు. కానీ సెకండ్ హాఫ్‌లో దర్శకుడు దారితప్పాడు. కీ రివీల్ మరియు సెకండ్ హాఫ్ ట్విస్ట్ విషయానికి వస్తే, ఈ కథ చాలా నిస్సారంగా అనిపిస్తుంది. బిల్డప్ మొత్తం వృధా అయింది. బోరింగ్ ప్రొసీడింగ్స్‌తో పాటు, ముఖ్య నటుల పెరఫార్మెన్స్ మరొక సమస్య. సెకండ్ హాఫ్ లో వీక్ స్క్రీన్ ప్లే సినిమాని దెబ్బతీశాయి. పోలీస్ స్టేషన్ లో జరిగే సన్నివేశాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఇక్కడ హీరోయిన్ ని హైలెట్ అయ్యేలా చూపించే క్రమంలో దర్శకుడు దెబ్బతిన్నాడు. అజయ్ కిడ్నాప్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తే బాగుండేది అని అనిపించేలా ఉంటుంది.

 

ప్లస్ పాయింట్స్: కీర్తి సురేష్ నటన, ఫస్ట్ హాఫ్, సాంకేతిక పరిజ్ఞానం

మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, క్లైమాక్స్

రేటింగ్: 2.25/5

Keerthi Suresh Penguin Movie Review:

Penguin Movie Review and report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs