Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: మిస్టర్‌ మజ్ను


శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర 

Advertisement
CJ Advs

మిస్టర్‌ మజ్ను 

తారాగణం: అఖిల్‌ అక్కినేని, నిధి అగర్వాల్‌, నాగబాబు, రావు రమేష్‌, ప్రియదర్శి, సుబ్బరాజు, ఆది, పవిత్ర లోకేష్‌, సితార, విద్యులేఖా రామన్‌, సత్యకృష్ణన్‌, రాజా తదితరులు 

సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌ 

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి 

సంగీతం: థమన్‌ ఎస్‌. 

నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ 

రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి 

విడుదల తేదీ: 25.01.2019 

అఖిల్‌ అక్కినేని హీరోగా నటించిన అఖిల్‌, హలో చిత్రాలు ప్రేక్షకుల్ని, అఖిల్‌ని కూడా నిరాశపరిచాయి. రెండు పరాజయాల తర్వాత తన మూడో సినిమాకి తొలిప్రేమ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన వెంకీ అట్లూరిని దర్శకుడుగా ఎంచుకున్నాడు అఖిల్‌. మిస్టర్‌ మజ్ను పేరుతో రూపొందిన ఈ సినిమా అఖిల్‌కి ఎలాంటి ఫలితాన్ని అందించింది? తొలిప్రేమ వంటి సెన్సిబుల్‌ లవ్‌స్టోరీని చేసిన వెంకీ అట్లూరి... అఖిల్‌కి సరైన విజయాన్ని అందించగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మన సినిమాలో హీరోయిన్‌ పేరు నిక్కీ(నిధి అగర్వాల్‌). తన పెళ్లి విషయంలో చాలా క్లారిటీతో ఉంటుంది. తనకు కాబోయే భర్తకు చాలా మంచి క్వాలిటీస్‌ ఉండాలనుకుంటుంది. అలాంటి వాడు దొరికితేనే పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్‌ అవుతుంది. మరో పక్క మన హీరో విక్కీ(అఖిల్‌ అక్కినేని) ఒక లవర్‌ బోయ్‌. అతని ప్రమేయం లేకుండానే ప్రతి అమ్మాయి అతనికి పడిపోతూ ఉంటుంది. స్టడీ పర్పస్‌ వీళ్లిద్దరూ లండన్‌లో ఉంటారు. అనుకోకుండా ఒకరినొకరు తారస పడతారు. విక్కీ అమ్మాయిలను ఫ్లర్ట్‌ చేయడం కళ్లారా చూస్తుంది. దాంతో విక్కీ అంటే ఒక దురభిప్రాయం ఆమెలో ఏర్పడిపోతుంది. ఆ తర్వాత అనుకోకుండానే వీళ్లిద్దరూ తమ కజిన్‌ పెళ్లిలో కలుసుకోవాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఇద్దరూ కలిసి వర్క్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలోనే అతనిలోని మరో కోణాన్ని గమనిస్తుంది నిక్కీ. అతని మంచితనం, పెద్దల పట్ల అతనికి ఉన్న గౌరవం ఆమెలో ప్రేమను చిగురింపజేస్తుంది. రెండు నెలల ట్రావెల్‌ తర్వాత ఒన్‌ ఫైన్‌ ఈవెనింగ్‌ అతనికి ఐ లవ్‌ యు చెప్పేస్తుంది. వివాహబంధంపై సరైన అవగాహన లేని అతను ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. దానికి హర్ట్‌ అయిన నిక్కీ లండన్‌ వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత గానీ నిక్కీకి తనపై ఉన్న ప్రేమ గురించి అర్థం కాదు. తను నిజంగానే నిక్కీని ప్రేమిస్తున్నానని గ్రహించిన విక్కీ ఆమె ప్రేమను పొందేందుకు లండన్‌ బయల్దేరతాడు. విక్కీని చూడగానే నిక్కీ ఏం చేసింది? ఆమెను గెలుచుకునేందుకు విక్కీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా? అనేది మిగతా కథ. 

లవర్‌ బోయ్‌గా, బాధ్యతగల కొడుకుగా, ప్రేమికుడిగా వివిధ వేరియేషన్స్‌ ఉన్న విక్కీ క్యారెక్టర్‌ని అఖిల్‌ అక్కినేని సమర్థవంతంగానే పోషించాడు. అన్నిరకాల ఎమోషన్స్‌ని పండించడంతోపాటు చక్కని వాయిస్‌ కూడా అతనికి ప్లస్‌ అయింది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా, లుక్‌ పరంగా అఖిల్‌ గత సినిమాలకంటే మెరుగ్గానే కనిపించాడు. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ చేసిన నిక్కీ క్యారెక్టర్‌ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ఆమధ్య వచ్చిన గీత గోవిందం సినిమాలో రష్మిక క్యారెక్టర్‌ని పోలి ఉంటుంది. లుక్‌ పరంగా, గ్లామర్‌ పరంగా ఆకట్టుకునే అంశాలు నిధిలో లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. నటనపరంగా ఓకే అనిపించుకున్నా మిగతా విషయాల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మిగతా క్యారెక్టర్లలో నాగబాబు, రావు రమేష్‌, సితార, పవిత్ర లోకేష్‌, సుబ్బరాజు తదితరుల క్యారెక్టర్లు చాలా సాదా సీదాగా అనిపిస్తాయి. అలాంటి క్యారెక్టర్స్‌ గతంలో ఎన్నో సినిమాల్లో వాళ్ళు చేసేశారు కాబట్టి మనకు కొత్తగా అనిపించవు. ఇక కామెడీ గురించి చెప్పాలంటే ప్రియదర్శితో నవ్వించాలా వద్దా అనే డౌట్‌తో కొన్ని కామెడీ సీన్స్‌ చేయించినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే హైపర్‌ ఆది తన శక్తి మేరకు నవ్వించే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఎక్కువ సార్లు సక్సెస్‌ అవ్వలేకపోయాడు. 

సాంకేతికంగా చూస్తే సినిమాకి ప్లస్‌ అని చెప్పుకోదగ్గది ఫోటోగ్రఫీ. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ రిచ్‌గా కనిపించిందంటే అది సినిమాటోగ్రాఫర్‌ జార్జ్‌ సి. విలియమ్స్‌ పనితనమే కారణం. పాటల పిక్చరైజేషన్‌ విషయంలోనూ జార్జ్‌ చాలా కేర్‌ తీసుకున్నాడు. వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో థమన్‌ చేసిన తొలిప్రేమ మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించింది. థమన్‌లోని కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆ సినిమాలో కనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో మంచి మార్కులు స్కోర్‌ చేశాడు. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే ఒకటి, రెండు పాటలు మినహా చెప్పుకోదగ్గ మ్యూజిక్‌ అందించలేకపోయాడు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఎడిటింగ్‌ చేసిన నవీన్‌ నూలి కూడా సాదా సీదా ఎడిటింగ్‌తో పని కానిచ్చేశాడు. సినిమాలోని కొన్ని సీన్స్‌ మధ్యలో అనవసరంగా అతికించినట్టు అనిపించడం వల్ల ఫ్లో మిస్‌ అవుతాం. వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా విదేశాల్లో ఎక్కువ సీన్స్‌ చేశారు. ఇక డైరెక్టర్‌ వెంకీ అట్లూరి గురించి చెప్పాలంటే ఏమాత్రం కొత్తదనం లేని కథతో ఒక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ని తీసేద్దామనుకున్నాడు. అమ్మాయిల్ని ఫ్లర్ట్‌ చేయడంలో ఎక్స్‌పర్ట్‌ అయిన హీరో ఉన్నట్టుండి మంచి ప్రేమికుడిగా మారిపోవడం అతని క్యారెక్టరైజేషన్‌కి విరుద్ధంగా కనిపిస్తుంది. రోజుకో అమ్మాయితో ఎంజాయ్‌ చేసే వ్యక్తిలోని మంచి తనాన్ని చూసి హీరోయిన్‌ అతని ప్రేమించడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అఖిల్‌ వంటి యంగ్‌ హీరో కోసం ఒక బలమైన కథను రాసుకోవడంలో వెంకీ సక్సెస్‌ కాలేకపోయాడు. స్లో నేరేషన్‌తో ప్రారంభమైన సినిమా.. ఎండింగ్‌ వరకు అదే ఫ్లోలో వెళ్తుంది తప్ప ఏ దశలోనూ వేగం పుంజుకోదు. ఎక్కువ శాతం సీన్స్‌ హీరో ఇంట్లోనో, హీరోయిన్‌ ఇంట్లోనో ఉంటాయి. లేదా వాళ్ళిద్దరూ కలుసుకునే లొకేషన్‌లో ఉంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే టి.వి. సీరియల్స్‌లో ఇంటిలోనే నడిచే కథలా ఈ సినిమా కథ కూడా రన్‌ అవుతుంది. సినిమా అంటే పాటలు ఉండాలి, నాలుగైదు ఫైట్స్‌ ఉండాలి అన్నట్టుగా అక్కడక్కడా అవి కనిపిస్తాయి. హీరో, హీరోయిన్‌ మధ్య ఒక బలమైన కాన్‌ఫ్లిక్ట్‌ లేకపోయినా దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశాడు వెంకీ. ఫస్ట్‌హాఫ్‌ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలోనే వెళ్లినా సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరోయిన్‌ని తన ప్రేమతో కన్విన్స్‌ చేసే పనిలో చాలా బోర్‌ కొట్టించాడు. హీరో ఎన్నివిధాలుగా ప్రయత్నించినా క్లైమాక్స్‌కి వచ్చేవరకు హీరోయిన్‌ ఏ విషయం తేల్చదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాతగానీ హీరోలోని నిజమైన ప్రేమను గుర్తించదు హీరోయిన్‌. ఇలాంటి లవ్‌స్టోరీకి మాటలు అదనపు బలాన్ని చేకూరుస్తాయి. కానీ, ఈ సినిమాకి ఆ బలం లేదు. చాలా సాదా సీదా మాటలు తప్ప అద్భుతం అనిపించే మాటలు ఏ సీన్‌లోనూ కనిపించవు. వెంకీ అట్లూరి తొలి సినిమా తొలిప్రేమకు మంచి కథ, కథనం, మాటలు, పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సినిమాటోగ్రఫీ, ఎంటర్‌టైన్‌మెంట్‌... ఇలా అన్ని ప్లస్‌ పాయింట్స్‌ ఉన్నాయి. మిస్టర్‌ మజ్ను విషయానికి వచ్చేసరికి ఆ ప్లస్‌ పాయింట్స్‌లో కొన్ని మాత్రమే ఈ సినిమాకి సమకూర్చుకోగలిగాడు. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే అఖిల్‌ అక్కినేని పెర్‌ఫార్మెన్స్‌, సినిమాటోగ్రఫీ, కొన్ని కామెడీ సీన్స్‌ తప్ప సినిమాలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు తక్కువగా ఉండడం వల్ల అఖిల్‌ని ఈ సినిమా కూడా నిరాశ పరిచే అవకాశం ఉంది. ఇక వెంకీ అట్లూరికి ద్వితీయ విఘ్నం తప్పేట్టు కనిపించడం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: రొటీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 

telugu movie mr.majnu:

akhil new movie mr.majnu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs