Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: ఎఫ్2


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Advertisement
CJ Advs

ఎఫ్2

తారాగణం: వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, రఘుబాబు, నాజర్, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, శ్రీనివాసరెడ్డి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అనసూయ, ఝాన్సీ, పృథ్వీ, ప్రదీప్, వై.విజయ, అన్నపూర్ణ తదితరులు

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

ఎడిటింగ్: తమ్మిరాజు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

కథా సహకారం: ఎస్.కృష్ణ

సమర్పణ: దిల్‌రాజు

నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి

విడుదల తేదీ: 12.01.2019

నవరసాల్లో ప్రధానంగా అందర్నీ ఆకట్టుకునేది హాస్యరసం. దాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. హాస్యరసాన్ని పండించడం, అందర్నీ నవ్వించడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. యాక్షన్, సెంటిమెంట్, లవ్... ఇలాంటి సినిమాలు కాస్త విషయం ఉన్న దర్శకుడు ఎవరైనా తియ్యగలరు. కానీ, కామెడీ ప్రదానంగా సినిమాలను తీసి మెప్పించడం అనేది కొందరికే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న డైరెక్టర్లలో అలాంటి విషయం ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. కథ ఏదైనా అందులో సరైన పాళ్ళలో కామెడీని కూడా మిక్స్ చేసి నవ్వించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్.. ఇలా తను చేసిన సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేసిన అనిల్ సంక్రాంతి పండగ సందర్భంగా శనివారం విడుదలైన ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రంలోనూ అదే ఫార్ములాను ఉపయోగించాడు. మొదటిసారి భార్యాభర్తలకు సంబంధించిన ఒక సున్నితమైన పాయింట్‌ని తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకున్నాడు. ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉంది? ఒకరి మీద మరొకరి డామినేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది ప్రస్తావిస్తూనే దానికి సొల్యూషన్ కూడా చెప్పాడు. 

ఇది రెండు జంటల కథ. వెంకీ(వెంకటేష్), హారిక(తమన్నా) పెళ్ళి చేసుకుంటారు. ఆరు నెలలు సజావుగా సాగిపోయిన వారి సంసారంలో సహజంగానే చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. దాంతో నువ్వు మారిపోయావు అంటే నువ్వు మారిపోయావు అంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ నలిగిపోయేది భర్తే కాబట్టి వెంకీ కూడా ఫ్రస్ట్రేషన్‌లోనే ఉంటాడు. దాని నుంచి బయటపడేందుకు వెంకీ ఆసన్ అంటూ ఓ కొత్త ఆసనాన్ని కనిపెడతాడు. ఇదిలా ఉండగా హారిక చెల్లెలు హనీ(మెహరీన్) వరుణ్(వరుణ్‌తేజ్)ని ప్రేమిస్తుంది. పెద్దల అంగీకారంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది. అయితే పెళ్ళి కాకుండానే హనీ వల్ల టార్చర్‌కి గురవుతుంటాడు వరుణ్. ఒకరు భార్యతో, ఒకరు కాబోయే భార్యతో నానా ఇబ్బందులు పడుతున్న వెంకీ, వరుణ్ ఒకచోట చేరతారు. వారికి సపోర్ట్‌గా ఎదురింట్లో ఉండే రాజేంద్రపసాద్ ఉంటాడు. వరుణ్, హనీల పెళ్ళి జరగబోతుండగా ఈ ముగ్గురూ యూరప్ చెక్కేస్తారు. అప్పుడు హారిక, హనీ రియాక్షన్ ఏమిటి? యూరప్ వెళ్ళిన వెంకీ, వరుణ్ తమ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికి ఏం చేశారు? వెంకీ, హారిక కలుసుకున్నారా? వరుణ్, హనీ పెళ్ళి జరిగిందా? అనేది మిగతా కథ. 

హీరోల్లో సీనియర్ హీరోల్లో వెంకటేష్‌కి ఉన్న కామెడీ టైమింగ్ మరే హీరోకీ లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కామెడీకి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వాలేగానీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. వెంకీ క్యారెక్టర్‌కి వెంకటేష్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాల్లో అల్టిమేట్ కామెడీ చేసిన వెంకటేష్‌కి మళ్ళీ ఓ మంచి క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. దాన్ని నూటికి నూరుపాళ్ళు వాడుకున్నాడు వెంకటేష్. ఆడియన్స్‌ని కడుపుబ్బ నవ్వించాడు. వరుణ్ పాత్రలో వరుణ్‌తేజ్ కొత్తగా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్లు తమన్నా, మెహరీన్ క్యారెక్టర్స్‌కి కూడా సినిమాలో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇద్దరూ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. పృథ్వీ, ఝాన్సీ, ప్రియదర్శి, రఘుబాబు, ప్రదీప్, వై.విజయ, అన్నపూర్ణ తమదైన టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. 

సాంకేతిక విభాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ గురించి చెప్పాలి. ప్రతి సీన్‌నీ ఎంతో రిచ్‌గా,బ్రైట్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అనిల్ రావిపూడి చేసిన గత మూడు సినిమాలకు సాయికార్తీక్ సంగీతం అందించగా ఈ నాలుగో సినిమాకి మాత్రం దేవిశ్రీప్రసాద్ సంగీత సమకూర్చాడు. అయితే సినిమాలో ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా లేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్‌హాఫ్ అంతా నాన్ స్టాప్ కామెడీతో రన్ అవుతుంది. సెకంఫ్‌కి వచ్చే సరికి ల్యాగ్ ఎక్కువైంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసేసి ఉంటే కొంత బోర్ పార్ట్ తగ్గేది. వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి గురించి చెప్పాలంటే.. వరస సక్సెస్‌లను అందిస్తున్న అనిల్‌కి ఇది మరో విజయంగా చెప్పవచ్చు. భార్యాభర్తల్లో ఎవరూ తక్కువ కాదని, భార్య వల్ల భర్త సంతోషంగా ఉంటే అతను సారీ చెప్పాలని, భర్త వల్ల భార్య బాధపడినపుడు భర్తే సారీ చెప్పాలని... ఇలా చేస్తే సంసారం సుఖమయం అవుతుందనేది ఈ సినిమాలో చెప్పాడు. తన సినిమాల్లో టన్నుల కొద్దీ కామెడీని నింపేసే అనిల్ ఎఫ్2 విషయంలోనూ అదే చేశాడు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఫస్ట్‌హాఫ్ కంప్లీట్ అయ్యే వరకు నాన్‌స్టాప్‌గా నవ్విస్తూనే ఉన్నాడు. ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో మేనరిజం పెట్టి వీలైనంత ఎక్కువగా నవ్వించే ప్రయత్నం చేశాడు. నటుడు ప్రదీప్ చెప్పే అంతేగా అంతేగా అనే డైలాగ్ బాగా పాపులర్ అవుతుంది. ఫస్ట్‌హాఫ్‌లో విపరీతంగా నవ్వించిన అనిల్ సెకండాఫ్‌కి వచ్చేసరికి ఆ కామెడీ అంతా మిస్ అయింది. కొన్ని అనవసరమైన సీన్స్‌తో సెకండాఫ్ కాస్త బోర్ ఫీలవుతారు ఆడియన్స్. సెకండాఫ్‌లో భార్యలను, భర్తలను కన్విన్స్ చేసేందుకు రాసుకున్న సీన్స్ వల్ల అప్పటివరకు నవ్వుకున్న ఆడియన్స్‌కి ఒక్కసారిగా ఏదో వెలితి ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈ పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్ రప్పించే సినిమా ఇది. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేసే సినిమా. 

ఫినిషింగ్ టచ్: ఇదే పండగ సినిమా.. అంతేగా!

telugu movie f2 review:

venkatesh and varun tej movie f2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs