Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: టాక్సీవాలా


జి.ఎ.2 పిక్చర్స్, యు.వి. క్రియేషన్స్

Advertisement
CJ Advs

టాక్సీవాలా

తారాగణం: విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్, కళ్యాణి,  మధునందన్, ఉత్తేజ్, రవివర్మ, వినోద్, సిజ్జు తదితరులు

సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్

ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్

సంగీతం: జేక్స్ బిజోయ్

మాటలు: సాయికుమార్‌రెడ్డి

నిర్మాత: ఎస్.కె.ఎన్.

రచన, దర్శకత్వం: రాహుల్ సంక్రిత్యాన్

విడుదల తేదీ: 17.11.2018

ఈమధ్య హారర్ కామెడీ సినిమాల్లో ఆత్మ సినిమాలోని ప్రధాన తారాగణంతో చిత్ర విచిత్రం ప్రవర్తించడం, రకరకాల రూపాల్లో వారిని భయభ్రాంతుల్ని చేయడం ద్వారా ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ అందించాయి. అలా కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేసేందుకు వచ్చింది టాక్సీవాలా. నోటా చిత్రంతో ప్రేక్షకుల్ని నిరాశ పరిచిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో దర్శకుడు రాహుల్ ఎంచుకున్న కథాంశం ఏమిటి? టాక్సీవాలాగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? అనేది సమీక్షలో తెలుసుకుందాం. 

డిగ్రీ చదివిన శివ(విజయ్ దేవరకొండ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. బాబాయ్ కార్ వర్క్ షాపు నడుపుతున్న మధునందన్‌ని ఏదైనా జాబ్ ఇప్పించమని అడుగుతాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా, సెక్యూరిటీ గార్డ్‌గా రకరకాల జాబ్స్ చేసి విసిగిపోయిన శివ ఒక పాత కారు కొనుక్కొని టాక్సీ డ్రైవర్‌గా అవతారమెత్తుతాడు. తన కారులో ప్రయాణం చేసిన జూనియర్ డాక్టర్ అను(ప్రియాంక జవాల్కర్)తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతుంటారు. టాక్సీ డ్రైవర్‌గా బాగా సంపాదిస్తూ తన అనయ్యకు సాయపడుతుంటాడు. ఇలా గడిచిపోతున్న శివ జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. తన ప్రమేయం లేకుండానే అతని కారు రకరకాలుగా ప్రవర్తిస్తుంటుంది. ఆ కారుని ఏదో ఒక శక్తి నడిపిస్తున్న భావన కలుగుతుంది. ఆ కారులో ఒక ఆత్మ ఉందని గుర్తిస్తాడు. దానివల్ల తనకు జరిగిన నష్టానికి దాన్ని తిడతాడు. ఒకరోజు తన కారులో ప్రయాణిస్తున్న డాక్టరును శివ ప్రమేయం లేకుండానే చంపేస్తుంది. దీంతో ఆ కారు మిస్టరీ ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు శివ. అది సిసిర(మాళవిక నాయర్) అనే అమ్మాయి ఆత్మ అని తెలుసుకుంటాడు. ఒక ప్రొఫెసర్ సిసిర ఆత్మగా ఎలా మారిందనేది శివకు వివరిస్తాడు. దాంతో సిసిర మీద శివకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆమెకు సహాయం చేసేందుకు సిద్ధపడతాడు. సిసిర ఆత్మగా ఎందుకు మారింది? సిసిర చనిపోయిందా? ఆమె ఆత్మ ఆ కారులోనే ఎందుకు ఉంది? సిసిర ఆత్మ ఏం కోరుకుంటోంది? ఆమె ఆత్మ శాంతించేందుకు శివ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది మిగతా కథ. 

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాల్లో తన పెర్‌ఫార్మెన్స్‌తో వేరియేషన్స్ చూపించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒక ఇన్నోసెంట్ టాక్సీ డ్రైవర్ మంచి నటనను ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ప్రియాంక జవాల్కర్ తన గ్లామర్‌తో, నటనతో ఆకట్టుకుంది. సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిన మాళవిక నాయర్ కనిపించే సన్నివేశాలు తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమాలో హారర్‌తో సమానంగా కామెడీని కూడా అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మధునందన్, వినోద్, చమ్మక్ చంద్ర తమ శక్తి మేరకు నవ్వించారు. హీరో అన్నయ్య, వదిన పాత్రల్లో రవిప్రకాష్, కళ్యాణి కొన్ని సెంటిమెంటల్ సీన్స్‌కి పరిమితమయ్యారు. చాలా రోజుల తర్వాత యమున ఈ సినిమాలో నటించింది. మిగతా పాత్రల్లో రవివర్మ, సిజ్జు, ఉత్తేజ్ తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ గురించి చెప్పాలంటే సుజిత్ సారంగ్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. మూడ్‌ని బట్టి తన లైటింగ్‌తో ప్రతి సీన్ బాగా రావడంలో తోడ్పడ్డాడు. జేక్స్ బిజోయ్ చేసిన పాటలు వినసొంపుగా లేకపోయినప్పటికీ కథతో పాటే వెళ్తుండడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీలవ్వరు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్‌హాఫ్ కాస్త ఎంటర్‌టైనింగ్‌గా, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో స్పీడ్‌గానే అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చే సరికి కొన్ని లెంగ్తీ సీన్స్ వల్ల సినిమా పెద్దదిగా ఉందేమో అనే సందేహం వస్తుంది. కానీ, సినిమా నిడివి 2 గంటల 12 నిమిషాలు మాత్రమే. ఎడిటర్ శ్రీజిత్ సారంగ్ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమైన ఎస్.కె.ఎన్. సినిమాని అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆత్మ కథాంశంతో ఒక కొత్త కాన్సెప్ట్‌ని ఇందులో జోడించారు. కామెడీ మిస్ అవకుండా సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు జాగ్రత్త పడ్డారు. కారులో ఒక ఆత్మ ఉంది అనే విషయాన్ని రివీల్ చేసిన తర్వాత నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరగబోతోందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించారు. బ్రతికి ఉన్నవారి ఆత్మను బయటికి తెచ్చి మళ్ళీ వారిలోకి ప్రవేశ పెట్టవచ్చు అనే థాట్ మంచిదే అయినా దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడంలో, సన్నివేశాల్లో దాన్ని ప్రొజెక్ట్ చెయ్యడంలో సక్సెస్ కాలేకపోయాడు. ఫస్ట్‌హాఫ్‌లో ప్రేక్షకుల అటెన్షన్‌ని డ్రా చెయ్యడంలో సఫలీకృతుడైన రాహుల్ సెకండాఫ్‌లో ఆడియన్స్ ఉత్సాహం సన్నగిల్లేందుకు దోహదపడ్డాడు. ఏది ఏమైనా అతను చేసిన ప్రయత్నం మెచ్చుకోదగింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో కారు, ట్రైన్ ఛేజ్, డాక్టర్ మర్డర్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి ఎంచుకున్న కాన్సెప్ట్, విజయ్ దేవరకొండ, ప్రియాంక, మాళవిక, కమెడియన్స్ పెర్‌ఫార్మెన్స్, ఫోటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్ అయితే, తను అనుకున్న కాన్సెప్ట్‌ని కన్విన్సింగ్‌గా చెప్పలేకపోవడం, సెకండాఫ్‌ని సాగదీయడం వంటి విషయాలు మైనస్ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే హారర్‌తోపాటు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ని కూడా జోడించి చేసిన టాక్సీవాలా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవచ్చు. విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ కలెక్షన్లపరంగా సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. 

ఫినిషింగ్ టచ్: కాన్సెప్ట్ కొత్తదే.. కానీ,

telugu movie taxiwala review :

vijay devara konda new movie taxiwala
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs