Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ఆర్‌ఎక్స్‌ 100


 

Advertisement
CJ Advs

కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ 

ఆర్‌ఎక్స్‌ 100 

తారాగణం: కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌, రావు రమేష్‌, రాంకీ తదితరులు 

సినిమాటోగ్రఫీ: రామ్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌. 

సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌ 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సర్మన్‌ 

నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ 

రచన, దర్శకత్వం: అజయ్‌ భూపతి 

విడుదల తేదీ: 12.07.2018 

రొటీన్‌ కథలకు, రొటీన్‌ బ్యాక్‌డ్రాప్‌లకు కాలం చెల్లిపోయిందని చాలా సినిమాలు రుజువు చేశాయి. కథ ఎలాంటిదైనా దాన్ని కొత్తగా ప్రజెంట్‌ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని ఈమధ్య వచ్చిన కొన్ని సినిమాలు ప్రూవ్‌ చేశాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్లు చాలా వరకు కథ, కథనం కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. అలా ఓ పాత కథని కొత్తగా చూపించే ప్రయత్నమే ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం. కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా రూపొందిన ఈ సినిమా ద్వారా అజయ్‌ భూపతి దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఒక పాత కథని కొత్తగా చెప్పడంలో అజయ్‌ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ద్వారా ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నది ఏమిటి? ఈ కొత్త తరహా ప్రేమకథని ఆడియన్స్‌ ఎంతవరకు రిసీవ్‌ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు శివ(కార్తికేయ). చిన్నతనంలోనే ఓ యాక్సిడెంట్‌లో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అతన్ని ఫ్యామిలీ ఫ్రెండ్‌ అయిన డాడీ(రాంకీ) పెంచి పెద్ద చేస్తాడు. ఆత్రేయపురం జడ్‌పిటిసి అయిన విశ్వనాథం(రావు రమేష్‌) దగ్గర రాంకీ, శివ నమ్మకంగా పనిచేస్తుంటారు. శివ జీవితం ఆనందంగా గడిచిపోతున్న సమయంలో బెంగుళూరులో చదువుకుంటున్న విశ్వనాథం కూతురు ఇందు(పాయల్‌ రాజ్‌పుత్‌) ఆ ఊరికి వస్తుంది. ఆరడుగుల కండల వీరుడైన శివపై తొలి చూపులోనే మనసు పడుతుంది. తన అందచందాలతో అతన్ని ఆకర్షిస్తుంది. తనవైపు తిప్పుకుంటుంది. ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరవుతారు. ఇందు ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన శివ ఆమె లేకుండా బ్రతకలేని స్థితికి చేరుకుంటాడు. ఈ విషయం విశ్వనాథంకి తెలుస్తుంది. వెంటనే ఇందుని ఓ ఎన్నారైకి ఇచ్చి పెళ్ళి చేసి అమెరికా పంపించేస్తాడు. ఇది తెలుసుకున్న శివ పిచ్చివాడై పోతాడు. ఆమె వస్తుందని ప్రతిరోజూ ఎదురుచూస్తుంటాడు. మూడు సంవత్సరాల తర్వాత ఇందు ఆత్రేయపురం వస్తుంది. ఇక అప్పటి నుంచి ఆమెను తనతోపాటు తీసుకెళ్ళాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. విశ్వనాథం దానికి అడ్డుకుంటూ ఉంటాడు. శివ తన కూతురి వైపు కన్నెత్తి చూడకుండా చెయ్యమని రౌడీలను పంపిస్తాడు. ఇదిలా ఉంటే శివను చంపెయ్యమని ఆ రౌడీలకు డబ్బులిచ్చి పంపిస్తుంది ఇందు. తనను చంపడానికి వచ్చిన రౌడీలతో ఫైట్‌ చేస్తాడు శివ. అయితే తనను చంపమని పంపించింది విశ్వనాథం కాదనీ, ఇందు అని తెలుసుకొని శివ షాక్‌ అవుతాడు. అప్పుడు శివ ఎలా రియాక్ట్‌ అయ్యాడు? తను ప్రేమించిన శివను ఇందు ఎందుకు చంపాలనుకుంది? చివరికి ఈ కథ ఎలా ముగిసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

శివ క్యారెక్టర్‌లో కార్తికేయ పెర్‌ఫార్మెన్స్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న హీరోలాగే చేశాడు. రెండు షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా ఓకే అనిపించుకుంది. ఫస్ట్‌హాఫ్‌లో గ్లామర్‌ పరంగా ఆకట్టుకోగలిగింది. చాలా కాలం తర్వాత కనిపించిన రాంకీ చేసిన క్యారెక్టర్‌కి అంతగా ప్రాధాన్యం లేదు. కేవలం ఒక గార్డియన్‌గా కనిపిస్తాడే తప్ప అతని క్యారెక్టర్‌ని పవర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చెయ్యలేదు. ఇందు తండ్రిగా రావు రమేష్‌ ఒక రెగ్యులర్‌ క్యారెక్టర్‌నే చేశాడు. ఈ క్యారెక్టర్‌లో చెప్పుకోదగిన ప్రత్యేక అంశాలు ఏమీ లేవు. రెండున్నర గంటల సినిమాలో తెరపై మనకు ఎక్కువగా కనిపించే క్యారెక్టర్లు ఇవే. మిగతా క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

సాంకేతికంగా చూస్తే ఈ సినిమాలో ఎస్సెట్స్‌గా నిలిచేవి ఏమీ లేవని చెప్పుకోవచ్చు. పూర్తిగా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో విజువల్స్‌ని అద్భుతంగా చూపించే అవకాశం ఉన్నప్పటికీ కథ, కథనాలపై పెట్టిన దృష్టి సినిమాటోగ్రఫీపై పెట్టలేకపోయారు. కెమెరా వర్క్‌ చాలా సాదా సీదాగా అనిపిస్తుంది. చైతన్‌ భరద్వాజ్‌ చేసిన పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ పాటలు విజువల్‌గా కూడా ఆకట్టుకోలేకపోయాయి. యాన్‌ ఇన్‌క్రెడిబుల్‌ లవ్‌స్టోరీ అని చెప్పుకొచ్చిన ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌కి ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ సంగీత దర్శకుడు గానీ, దర్శకుడుగానీ దాన్ని గుర్తించినట్టు లేరు. సిట్యుయేషన్‌కి పూర్తి విరుద్ధమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో, రణగొణ ధ్వనులతో విసిగించాడు సర్మన్‌. ఇక ఎడిటింగ్‌ గురించి చెప్పాల్సి వస్తే రెండున్నర గంటల సినిమాలో అరగంట నిర్ధాక్షిణ్యంగా తీసేసినా కథకి గానీ, కథనానికి గానీ వచ్చే నష్టం ఏమీ లేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సీన్‌ లెంగ్తీగానే అనిపిస్తుంది. ఇక డైరెక్టర్‌ అజయ్‌ భూపతి గురించి చెప్పాల్సి వస్తే ఇతనిపై రామ్‌గోపాల్‌వర్మ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అతను రాసుకున్న కథలో హీరో క్యారెక్టర్‌ అంత పవర్‌ఫుల్‌ కాకపోయినా అనవసరమైన బిల్డప్‌ షాట్స్‌తో ఆ క్యారెక్టర్‌కి హైప్‌ తెచ్చేందుకు విశ్వప్రయత్నం చేశాడు. హీరో యమహా ఆర్‌ఎక్స్‌ 100 బైక్‌ని వాడతాడు. దాని కోసం ఆర్‌ఎక్స్‌ 100 అనే టైటిల్‌ పెట్టడం వెను రీజన్‌ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే ఓ పాటలో అవసరం లేకపోయినా యూత్‌ని ఆకట్టుకునేందుకు లిప్‌ లాక్‌ సీన్స్‌ ఎక్కువగా చూపించాడు. ముఖ్యంగా ప్రతి సీన్‌ లెంగ్తీగా వుండడం వల్ల కథ స్పీడ్‌గా ముందుకెళ్తున్న ఫీల్‌ ఆడియన్‌కి కలగదు. రెండున్నర గంటల సినిమాను మూడు గంటల సేపు చూసినట్టుగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్‌ లవ్‌ చేసుకోవడం మధ్యలో హీరోయిన్‌ తండ్రి అడ్డుపడడం అనేది ప్రతీ సినిమాలో కామనే అయినా ఈ సినిమాలో దాన్ని బ్రేక్‌ చేస్తూ మరో కోణంలో ఇద్దరూ దూరం అయినట్టు చూపించడం కాస్త కొత్తగానే అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ చాలా స్లోగా వెళుతూ మధ్యలో కొన్ని లవ్‌ సీన్స్‌తో భారంగా నడుస్తుంది. సెకండాఫ్‌ కూడా దాదాపు అలాగే వెళుతుంది. ఒక ట్విస్ట్‌ తర్వాత చివరి అరగంట సినిమా కాస్త ఫర్వాలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్‌కి ముందు కూతురుని ఉద్దేశించి రావు రమేష్‌ చెప్పే డైలాగులు ఆడియన్స్‌ చేత క్లాప్స్‌ కొట్టిస్తాయి. చివరి అరగంట కోసం రెండు గంటల సేపు నిరీక్షించే ఓపిక ప్రేక్షకులకు ఉండదు. ఫైనల్‌గా చెప్పాలంటే డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వడంలో సక్సెస్‌ అవ్వలేదన్నది వాస్తవం. 

ఫినిషింగ్‌ టచ్‌: ఎ లెంగ్తీ లవ్‌స్టోరీ

telugu movie rx 100 review:

telugu movie rx 100
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs