Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: సప్తగిరి ఎల్‌ఎల్‌బి


సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై. లిమిటెడ్‌ 

Advertisement
CJ Advs

సప్తగిరి ఎల్‌ఎల్‌బి 

తారాగణం: సప్తగిరి, కశిష్‌ ఓరా, సాయికుమార్‌, డా.ఎన్‌.శివప్రసాద్‌, షకలక శంకర్‌, కోట శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, డా.రవికిరణ్‌, రవికాలే, ప్రభాస్‌ శ్రీను తదితరులు 

సినిమాటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌. 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సంగీతం: బుల్గానిన్‌ 

మాటలు: పరుచూరి బ్రదర్స్‌ 

మూలకథ: సుభాష్‌ కపూర్‌ 

నిర్మాత: డా.రవికిరణ్‌ 

కథావిస్తరణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల 

విడుదల తేదీ: 07.12.2017 

కమెడియన్‌ నుంచి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో హీరోగా మారిన సప్తగిరి తను హీరోగా చేసిన రెండో సినిమాకి కూడా అతని పేరే టైటిల్‌గా పెట్టడం అనేది ఒక్క సప్తగిరికే జరిగింది. హిందీలో సూపర్‌హిట్‌ అయిన జాలీ ఎల్‌ఎల్‌బి చిత్రానికి రీమేక్‌గా డా.రవికిరణ్‌ నిర్మించిన సప్తగిరి ఎల్‌ఎల్‌బి చిత్రానికి చరణ్‌ లక్కాకుల దర్శకత్వం వహించారు. పూర్తిగా కోర్టు బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ చిత్రానికి హిందీలో మంచి అప్లాజ్‌ వచ్చింది. కమర్షియల్‌గా బాగా వర్కవుట్‌ అయింది. మరి తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి స్పందన వస్తోంది? సప్తగిరి హీరోగా నటించిన రెండో సినిమా ఏ స్థాయిలో వుంది? ఈ చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పాయింట్‌ ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

అతని పేరు సప్తగిరి. చిత్తూరులోని పుంగనూరులో లాయరుగా ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. చిన్న, చితక కేసులు, జడ్జిలకు చిరాకు పుట్టించే కేసులు తప్ప సప్తగిరికి లాయర్‌గా మంచి పేరు తెచ్చే కేసు ఒక్కటీ రాదు. హైదరాబాద్‌లో అయితే పెద్ద పెద్ద కేసులు తగులుతాయని, పేరు పేరు, డబ్బుకి డబ్బు వస్తుందని ఓ పెద్దాయన సలహా ఇస్తాడు. అదే సమయంలో సప్తగిరినే ప్రేమిస్తున్న మరదల్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడతాడు సప్తగిరి. లాయర్‌ పేరు, డబ్బు లేని కారణంగా ఆమె తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు. అవి సంపాదించడానికి హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిపోతాడు సప్తగిరి. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న ఆరుగురు బిక్షగాళ్ళ మృతికి కారకుడైన రోహిత్‌ అనే ధనవంతుడి కేసు కోర్టులో నడుస్తుంటుంది. ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలు తీసుకు రాకపోవడంతో రోహిత్‌ని నిర్దోషిగా కోర్టు విడుదల చేస్తుంది. అయితే ఆ కేసుని పిల్‌ వేసి రీ ఓపెన్‌ చేయిస్తాడు సప్తగిరి. ఈ కేసును వాదించడానికి దేశంలోనే పేరు మోసిన లాయర్‌ రాజ్‌పాల్‌(సాయికుమార్‌) రంగంలోకి దిగుతాడు. ఎంతో అనుభవం వున్న రాజ్‌పాల్‌ ముందు సప్తగిరి నిలబడలేకపోతాడు. అయినా పట్టు వదలకుండా ఆధారాల కోసం, సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ కారు యాక్సిడెంట్‌లో చనిపోయింది బిక్షగాళ్ళు కాదని, రైతులని తెలుసుకుంటాడు. ఇక ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది? సప్తగిరిని ఓడించడానికి రాజ్‌పాల్‌ ఎలాంటి ఎత్తులు వేశాడు? చివరికి ఈ కేసుని సప్తగిరి గెలిచాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోగా సప్తగిరి ఈ సినిమాలో కూడా డాన్సులు, ఫైట్స్‌ చేశాడు. డాన్స్‌ బాగానే చేశాడు. కానీ, ఫైట్స్‌ విషయంలో అంతగా ఆకట్టులేకపోయాడు. నటన విషయానికి వస్తే కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లా అతని నటన పీక్స్‌కి వెళ్ళిందని చెప్చొచ్చు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో ఎమోషనల్‌గా అతను చెప్పిన డైలాగ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటాయి. హీరోయిన్‌ కశిష్‌ ఓరా కేవలం గ్లామర్‌ కోసం కనిపిస్తుంది తప్ప ఆమె క్యారెక్టర్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఈ సినిమాలో సప్తగిరి తర్వాత ముఖ్యంగా చెప్పువాల్సిన ఆర్టిస్టులు ఇద్దరు. ఒకరు సాయికుమార్‌, రెండోవారు డా.ఎన్‌.శివప్రసాద్‌. చాలా కాలం తర్వాత సాయికుమార్‌ ప్రతిభకు తగ్గ క్యారెక్టర్‌ దొరికింది. లాయర్‌ రాజ్‌పాల్‌గా సాయికుమార్‌ తప్ప మరెవ్వరూ సూట్‌ అవ్వరు అనేంతగా తన పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేశారు. శివప్రసాద్‌కి ఈమధ్యకాలంలో ఇంత లెంగ్తీ క్యారెక్టర్‌ లభించలేదని చెప్పాలి. జడ్జిగా ఎంతో సహజమైన నటన ప్రదర్శించారు. గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావులకు కూడా మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చి తెలుగు వారి గౌరవాన్ని కాపాడాడు డైరెక్టర్‌ చరణ్‌. 

సాంకేతిక విభాగాల గురించి చెప్పాల్సి వస్తే సారంగం కెమెరా వర్క్‌ సూపర్బ్‌ అని చెప్పాలి. ప్రతి సీన్‌, ప్రతి షాట్‌ ఎంతో రిచ్‌గా, ఎంతో బ్రైట్‌గా అనిపిస్తుంది. స్విట్జర్లాండ్‌లో చేసిన పాటలు ఎంతో అందంగా వున్నాయి. గౌతంరాజు ఎడిటింగ్‌ కూడా బాగుంది. బుల్గానిన్‌ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదనిపించాడు. పరుచూరి బ్రదర్స్‌ రాసిన మాటలు అర్థవంతంగా, ఆలోచింపజేసేవిగా వున్నాయి. నిర్మాత రవికిరణ్‌ ఖర్చుకి వెనకాడకుండా ప్రతి సీన్‌ని రిచ్‌గా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దర్శకుడు చరణ్‌ గురించి చెప్పాలంటే మూలకథలో తెలుగుకి అనుగుణంగా కొన్ని మార్చులు చేర్పులు చేశాడు. దాని వల్ల ఒరిజినాలిటీ దెబ్బతిందన్న ఫీలింగ్‌ కలుగుతుంది. మధ్య మధ్యలో వచ్చే హీరో, హీరోయిన్‌ పాటలు కథనాన్ని దెబ్బతీశాయి. డైలాగ్స్‌ బాగున్నా, సాయికుమార్‌, శివప్రసాద్‌, సప్తగిరిలాంటి నటులు ఈసినిమాలో మంచి పాత్రలు పోషించినా కథలోని ఎమోషన్‌ని, సెంటిమెంట్‌ని పూర్తి స్థాయిలో హ్యాండిల్‌ చెయ్యలేకపోయాడనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ అంతా పనికిరాని సీన్లతో నింపేశాడు దర్శకుడు. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసినా అది వర్కవుట్‌ అవ్వలేదు. కథలో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్‌ చేసినా అవి ఎంతో సేపు నిలవలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే సప్తగిరి ఎల్‌ఎల్‌బి టీమ్‌ ఓ కొత్త ప్రయత్నం చేసినప్పటికీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం, ఫస్ట్‌హాఫ్‌ ఆకట్టుకునేలా లేకపోవడం వల్ల ఇది ఓ సాధారణ చిత్రంగా నిలుస్తుందని చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: కొన్ని సీన్స్‌ హైలైట్‌గా..

saptagiri movie review:

telugu movie saptagiri llb
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs