Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: పిఎస్‌వి గరుడవేగ


జ్యోస్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 

Advertisement
CJ Advs

పిఎస్‌వి గరుడవేగ

తారాగణం: డా.రాజశేఖర్‌, పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, నాజర్‌, పోసాని, పృథ్వీ, ఆలీ, రవివర్మ, ఆదిత్‌ అరుణ్‌, కిశోర్‌, చరణ్‌దీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, షాయాజీ షిండే, ఆదర్శ్‌, సన్ని లియోన్‌(స్పెషల్‌ సాంగ్‌) తదితరులు 

సినిమాటోగ్రఫీ: అంజి 

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, భీమ్స్‌ సిసిరిలియో 

ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల 

కథ: ప్రవీణ్‌ సత్తారు, నిరంజన్‌రెడ్డి 

సమర్పణ: శివాని శివాత్మిక మూవీస్‌ 

నిర్మాత: ఎం.కోటేశ్వరరాజు 

రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు 

విడుదల తేదీ: 03.11.2017 

పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అంటే మనకు గుర్తొచ్చేది హీరో రాజశేఖర్‌. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి అంత పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయిన వాళ్ళలో రాజశేఖర్‌నే ముందుగా చెప్పుకోవాలి. యాక్షన్‌ సినిమాలు, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు ఎన్ని చేసినా పోలీస్‌ ఆఫీసర్‌గా అతనికో ప్రత్యేకత వుంది. దానికి భిన్నంగా పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం చిత్రంలో ఎన్‌.ఐ.ఎ. ఆఫీసర్‌గా కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజశేఖర్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో ఓ కొత్త అటెమ్ట్‌ అని చెప్పుకోక తప్పదు. భారీ బడ్జెట్‌తో, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో తెలుగు ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని కొత్త బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అసలు పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం అనే టైటిల్‌ ఈ సినిమాకి ఎందుకు పెట్టారు? డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు ఎంచుకున్న కథాంశం ఏమిటి? ఎన్‌.ఐ.ఎ. ఆఫీసర్‌గా డా. రాజశేఖర్‌ ఎంతవరకు రాణించారు? ఈ కథతో దర్శకుడు ప్రేక్షకుల్ని ఎంగేజ్‌ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మన దేశంలో ఎన్నో స్కాములు జరిగాయి, జరుగుతున్నాయి. ప్రతి స్కామ్‌ వెనుక బడా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల హస్తం ప్రత్యక్షంగా, పరోక్షంగా వుంటూనే వుంటుంది. అలాంటి ఓ స్కామ్‌ని కథాంశంగా తీసుకొని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న విషయాల్లో అణుబాంబు ఒకటి. దేశ రక్షణ కోసం అణుబాంబులు తయారు చేయడం, వాటిని పరీక్షించడం ద్వారా ఇతర దేశాలను భయపెట్టడం సర్వసాధారణమే. అత్యంత ప్రమాదకరమైన అణుబాంబులను తయారు చేయడానికి యురేనియం, ప్లూటోనియం వంటి అణు ధార్మిక పదార్థాలు భూమిలో నిక్షిప్తమై వుంటాయి. వాటిని వెలికి తీసి భద్ర పరచడం కొన్ని దేశాల్లో జరుగుతుంటుంది. అలాంటి ప్రమాదకరమైన యురేనియం, ప్లూటోనియం నిక్షిప్తాలు ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లి మైనింగ్‌లో వున్నాయని కనుగొంటారు ఇండియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు. వాటిని వెలికి తీసి నార్త్‌ కొరియా వంటి దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా లక్షల కోట్లు సంపాదించవచ్చని గ్రహించిన అధికారంలో వున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కవుతారు. అయితే ఇలాంటి నిక్షిప్తాలను వెలికి తీస్తే శాటిలైట్‌ ద్వారా కనిపెట్టే అవకాశం వుండడంతో ఆ శాటిలైట్స్‌ను హ్యాక్‌ చేసేందుకు నిష్ణాతులైన కొందరు యువకులను నియమిస్తారు. దాంతో తుమ్మలపల్లి మైనింగ్‌లో జరుగుతున్న తవ్వకాల విషయం బయటికి రాదు. ఈ రహస్యాలన్నింటినీ ఒక చిప్‌లో భద్రపరుచుకుంటాడు అక్కడ పనిచేస్తున్న ఓ యువకుడు. దాన్ని పెట్టుకొని 10 కోట్లు డిమాండ్‌ చేస్తాడు. దాంతో అతన్ని చంపేస్తారు. ఆ టైమ్‌లో నిరంజన్‌(ఆదిత్‌ అరుణ్‌)కి ఆ చిప్‌ దొరుకుతుంది. నిరంజన్‌ కూడా 10 కోట్లు డిమాండ్‌ చెయ్యడంతో అతన్ని చంపేందుకు వెంబడిస్తుంటారు. ఆ ప్రయత్నంలో అతని తల్లి చనిపోతుంది. వారిని తప్పించుకునే క్రమంలో ఎన్‌.ఐ.ఎ. ఆఫీసర్‌ చంద్రశేఖర్‌(డా.రాజశేఖర్‌) కంట పడతాడు నిరంజన్‌. నిరంజన్‌ తల్లి హత్య కేసు ఇన్వెస్టిగేషన్‌లో చంద్రశేఖర్‌కి యురేనియం, ప్లూటోనియం స్కామ్‌కి సంబంధించిన విషయాలు తెలుస్తాయి. ఆ స్కామ్‌ని చంద్రశేఖర్‌ ఎలా బయటపెట్టాడు? ఈ క్రమంలో ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు? చివరికి స్కామ్‌లో వున్న రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని పట్టుకోగలిగాడా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో తనకి ఇది కమ్‌బ్యాక్‌ మూవీ అవుతుందని రాజశేఖర్‌ చెప్పారు. ఈ సినిమా చూసిన తర్వాత అది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు రాజశేఖర్‌ చేయని ఓ కొత్త క్యారెక్టర్‌ని ఎంతో సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఉద్యోగ ధర్మం కోసం భార్యని, కొడుకుని పట్టించుకోని భర్తగా, తండ్రిగా మంచి నటనను ప్రదర్శించారు. అలాగే ఎన్‌.ఐ.ఎ ఆఫీసర్‌గా పూర్తి స్థాయి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. కీలకమైన నిరంజన్‌ పాత్రలో ఆదిత్‌ అరుణ్‌ బాగా సెట్‌ అయ్యాడు. చంద్రశేఖర్‌ కొలీగ్స్‌గా రవివర్మ, చరణ్‌దీప్‌ మంచి సపోర్ట్‌ని అందించారు. ఎన్‌.ఐ.ఎ. ఆఫీసర్‌గా నాజర్‌ ఓకే అనిపించారు. స్పెషల్‌ పాటతో యూత్‌ని, మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది సన్ని లియోన్‌. ఆలీ, పృథ్వీ కొంత మేర వినోదాన్ని అందించే ప్రయత్నం చేసినా అది వర్కవుట్‌ కాలేదు. 

ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా చెప్పుకోదగ్గవి టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌. రాపిడ్‌ స్పీడ్‌తో రన్‌ అయ్యే కథ, కథనాలకు అంజి ఫోటోగ్రఫీ, శ్రీచరణ్‌ పాకాల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్‌, ఫైట్‌మాస్టర్స్‌ కంపోజ్‌ చేసిన ఛేజ్‌లు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు సినిమాని ఓ లెవల్‌కి తీసుకెళ్ళాయి. సినిమా ప్రారంభంలో వచ్చే బైక్‌ ఛేజ్‌, హైవైలో వ్యాన్‌, కారులను ఛేజ్‌ చేసే బిగ్‌ వెహికిల్‌ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి అంజితోపాటు మరో నలుగురు సినిమాటోగ్రాఫర్లు కూడా వర్క్‌ చేశారు. అయితే ఒకే లెవల్‌ క్వాలిటీని మెయిన్‌టెయిన్‌ చేశారు. భీమ్స్‌ సిసిరిలియో కంపోజ్‌ చేసిన స్పెషల్‌ సాంగ్‌ యూత్‌కి ఓ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కాగా, శ్రీచరణ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని పరిగెత్తించింది. ప్రవీణ్‌ సత్తారు, నిరంజన్‌రెడ్డి రాసుకున్న కథలో ఎంతో వైవిధ్యం వుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాని ఓ ఇంటర్నేషల్‌ స్కామ్‌కి సంబంధించిన కథా వస్తువును ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. నిర్మాత ఎం.కోటేశ్వరరావు బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని సినిమా ఔట్‌పుట్‌ చూస్తే తెలుస్తుంది. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా చూపించారు. ఇక దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు గురించి చెప్పాలంటే ఇలాంటి ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో ఆడియన్స్‌ని కనెక్ట్‌ చేసి స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు సీట్లలో కూర్చోబెట్టడం అనేది మామూలు విషయం కాదు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లోలా ఇందులో పాటలు, కామెడీ లేవు. అయినా తన దర్శకత్వ ప్రతిభతో ప్రవీణ్‌ చేసిన మ్యాజిక్‌ ఆడియన్స్‌కి ఓ కొత్త అనుభూతినిస్తుంది. ఇక సినిమాలో వున్న మైనస్‌ పాయింట్స్‌ గురించి చెప్పాల్సి వస్తే అది పూజా కుమార్‌ క్యారెక్టర్‌, హీరోకి క్యాన్సర్‌ అంటూ కథకు అవసరం లేకపోయినా పదే పదే ప్రస్తావించడం, రాజశేఖర్‌, పూజా, ఆలీల మధ్య సినిమా స్టార్టింగ్‌లో వచ్చే కౌన్సిలింగ్‌ సీన్‌, క్లైమాక్స్‌లో రాజశేఖర్‌, పూజాల మధ్య జరిగే సన్నివేశం. ఇక ఫస్ట్‌ హాఫ్‌ వున్నంత గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సెకండాఫ్‌ని హ్యాండిల్‌ చేయలేకపోవడం, కొన్ని అనవసరమైన సీన్స్‌తో తాత్సారం చేయడం సినిమా గ్రాఫ్‌ని తగ్గించింది. ఫైనల్‌గా చెప్పాలంటే హాలీవుడ్‌ సినిమాల స్థాయికి ఏమాత్రం తక్కువ కాకుండా తెలుగువారు కూడా ఇలాంటి యాక్షన్‌ థ్రిల్లర్స్‌ని తెరకెక్కించగలరని ప్రవీణ్‌ సత్తారు నిరూపించారు. చాలా కాలం తర్వాత రాజశేఖర్‌ ఓ వర్త్‌ఫుల్‌ సినిమా చేశారని ఘంటాపథంగా చెప్పొచ్చు. రొటీన్‌కి భిన్నంగా వున్న సినిమాలు, థ్రిల్‌ చేసే యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ని ఇష్టపడే ప్రేక్షకులకు పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం పూర్తి పైసా వసూల్‌ సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: అప్రిషియేట్‌ చెయ్యదగ్గ గ్రేట్ అటెమ్ట్‌

telugu movie psv garudavega:

dr.rajasekhar new movie psv garudavega 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs