Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: యుద్ధం శరణం


వారాహి చలన చిత్రం 

Advertisement
CJ Advs

యుద్ధం శరణం 

తారాగణం: నాగచైతన్య, లావణ్య త్రిపాఠి, రేవతి, రావు రమేష్‌, శ్రీకాంత్‌, మురళీశర్మ, వినోద్‌కుమార్‌, ప్రియదర్శి, రవివర్మ, మధుసూదన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మిరెడ్డి 

ఎడిటింగ్‌: కృపాకరన్‌ 

సంగీతం: వివేక్‌ సాగర్‌ 

కథ: డేవిడ్‌ ఆర్‌. నాథన్‌ 

మాటలు: అబ్బూరి రవి 

నిర్మాత: రజనీ కొర్రపాటి 

దర్శకత్వం: కృష్ణ ఆర్‌.వి. మారిముత్తు 

విడుదల తేదీ: 08.09.2017 

యుద్ధం శరణం అనే టైటిల్‌లోనే సినిమా కాన్సెప్ట్‌ ఏమిటో అర్థమైపోతుంది. హీరోకి, అతని కుటుంబానికి జరిగిన అన్యాయానికి విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది కథ. ఇలాంటి కథతో తెలుగులో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరో విలన్‌ని చంపడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు, తన తెలివి తేటలతో విలన్‌ని మానసికంగా ఎలా దెబ్బతీశాడు అనేది కొత్తగా చూపించాలనే ప్రయత్నం చేశాడు దర్శకుడు. నాగచైతన్య హీరోగా వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ పరమ పాత కథని కొత్తగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడా? నాగచైతన్యకి ఇది కొత్త క్యారెక్టర్‌ అని చెప్పొచ్చా? అతని కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఫైనల్‌గా ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పదలుచుకున్నది ఏమిటి? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మినిస్టర్‌ పదవిలో వున్న వినోద్‌కుమార్‌ ఒక కుంభకోణం కేసులో ఇరుక్కుంటాడు. దానివల్ల అతని రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. దీని నుంచి అందరి దృష్టిని మరల్చేందుకు సిటీలో మూడు చోట్ల బాంబ్‌ బ్లాస్ట్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తాడు మినిస్టర్‌. నేర ప్రపంచంలో రారాజు అనిపించుకుంటున్న నాయక్‌(శ్రీకాంత్‌)కి ఈ పని అప్పగిస్తారు. మినిస్టర్‌ అనుకున్నట్టుగానే బ్లాస్ట్‌ జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతారు. బ్లాస్ట్‌ జరిగిన మూడు రోజుల తర్వాత హీరో అర్జున్‌(నాగచైతన్య) తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. వారిని వెతుక్కుంటూ సిటీ అంతా తిరుగుతుంటాడు అర్జున్‌. అతని తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారని తెలుస్తుంది. అయితే అది యాక్సిడెంట్‌ కాదని, వాళ్ళని నాయక్‌ చంపాడని తెలుసుకుంటాడు అర్జున్‌. బ్లాస్ట్‌ జరిగిన తర్వాత అర్జున్‌ తల్లిదండ్రులు హత్యకు గురి కావడం వెనుక రీజన్‌ ఏమిటి? ఆ బ్లాస్ట్‌కి, వారికి ఏదైనా సంబంధం వుందా? నాయక్‌ వాళ్ళని ఎందుకు చంపాడు? తన తల్లిదండ్రుల్ని చంపిన నాయక్‌పై అర్జున్‌ ఎలా పగ తీర్చుకున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే. 

హీరో క్యారెక్టరైజేషన్‌లో ఇది కొత్తగా వుంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంతకుముందు అతను చేసిన కొన్ని సినిమాల్లో వున్నట్టే ఈ సినిమాలో కూడా అతని క్యారెక్టర్‌ వుంది. ఇటీవల వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో తరహాలోనే ఈ సినిమా కూడా వుంటుంది. తల్లిదండ్రుల్ని విలన్‌ చంపాడని తెలిసిన తర్వాత హీరోలో వుండే హై ఎమోషన్స్‌ అర్జున్‌ క్యారెక్టర్‌లో లేవు. దానికి తగ్గట్టుగానే నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్‌ కూడా చెప్పుకోదగ్గదిగా లేదు. హీరోని కొత్తగా చూపించాలని ఏ దశలోనూ దర్శకుడు అనుకోలేదు. కాబట్టి నాగచైతన్య పాత సినిమా ఏదో చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి క్యారెక్టర్‌కి సినిమాలో ప్రాధాన్యం తక్కువ. హీరో, హీరోయిన్‌ మధ్య వుండాల్సిన కెమిస్ట్రీ కూడా వర్కవుట్‌ అవ్వలేదు. హీరో తల్లిదండ్రులుగా నటించిన రేవతి, రావు రమేష్‌ ప్రతి విషయానికి ఓవర్‌గా రియాక్ట్‌ అవుతూ వుంటారు. నాగచైతన్య కాంబినేషన్‌లో వాళ్ళు చేసిన సీన్స్‌ అన్నీ చాలా అసహజంగా వున్నాయి. విలన్‌ నుంచి హీరోగా టర్న్‌ అయిన తర్వాత ఫస్ట్‌టైమ్‌ విలన్‌గా నటించిన శ్రీకాంత్‌ ఈ క్యారెక్టర్‌ని ఎంచుకోవడంలో చాలా తప్పు చేశాడు. అతని క్యారెక్టరైజేషన్‌ ఎలా వుంటుందంటే ఏ దశలోనూ అతన్ని విలన్‌గా చూడలేం. తనకి భారీ నెట్‌వర్క్‌ వుందని చెప్తూ వుంటాడు కానీ, దాన్ని పర్‌ఫెక్ట్‌గా ఎస్టాబ్లిష్‌ చెయ్యలేకపోయాడు డైరెక్టర్‌. విలన్‌గా శ్రీకాంత్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా సోసోగానే వుంది. మిగతా క్యారెక్టర్స్‌లో వినోద్‌కుమార్‌, మురళీశర్మ, రవివర్మ ఓకే అనిపించారు. 

టెక్నికల్‌గా ఈ సినిమాకి ప్లస్‌ అయ్యే అంశాలు ఏమీ లేవనే చెప్పాలి. డైరెక్టర్‌ సినిమాని చాలా స్టైలిష్‌గా తియ్యాలనుకుని వుంటాడు. అయితే స్టైలిష్‌గా చూపించేంత కంటెంట్‌ సినిమాలో లేకపోవడంతో ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌, ఎడిటింగ్‌ అన్నీ వెలవెలబోతున్నట్టుగానే వున్నాయి. కెమెరా వర్క్‌ కళ్ళకి ఇబ్బంది కలిగించేదిగా వుంది తప్ప ఏ సీన్‌నీ ఎంజాయ్‌ చేసేలా లేదు. వివేక్‌ సాగర్‌ అందించిన మ్యూజిక్‌ కూడా అలాగే వుంది. పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా వుంది. ఎడిటింగ్‌ కూడా ఆ స్థాయిలోనే వుంది. అబ్బూరి రవి రాసిన మాటలు చాలా సాదా సీదాగా వున్నాయి. కొన్ని రిపీటెడ్‌ డైలాగ్స్‌ ఆడియన్స్‌కి చిరాకు తెప్పిస్తాయి. మరికొన్ని డైలాగ్స్‌ అర్థం కాకుండా వుంటాయి. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ గురించి చెప్పుకోవాల్సి వస్తే సినిమాలో రిచ్‌గా వుండే సన్నివేశం ఒక్కటి కూడా లేదు. నిర్మాణ విలువలు సాధారణంగా వున్నాయి. దర్శకుడు కృష్ణ మారిముత్తు గురించి చెప్పాల్సి వస్తే ఏమాత్రం కొత్తదనం లేని కథతో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. సినిమా ప్రారంభంలోనే బాంబ్‌ బ్లాస్ట్‌ అనగానే దాన్ని చాలా ఆషామాషీగా చూపించేశాడు. హీరో తన తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ తిరిగే టైమ్‌లో మధ్య మధ్య ఫ్లాష్‌బ్యాక్‌లో వారితో హీరో గడిపిన సీన్స్‌, హీరోయిన్‌తో లవ్‌లో పడే సీన్స్‌ చూపించేశాడు. ఆ సీన్స్‌ అన్నీ చాలా సాదారణంగా వున్నాయి. ఫ్లాష్‌ బ్యాక్‌ వచ్చిందంటే నీరసం ఆవహిస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు స్లో నేరేషన్‌తో సినిమా నడుస్తుంది. దీంతో రెండుంపావు గంటల సినిమా మూడు గంటలు చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది అస్సలు లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకి ప్లస్‌ అయ్యే అంశాలు ఏమీ లేవు. ఇందులో డ్రోన్‌ అనే పరికరాన్ని చూపించారు. అది కథకి ఏమాత్రం ఉపయోగ పడలేదు. ఒకటి రెండు సన్నివేశాల్లో దాన్ని చూపించినా పెద్దగా రిజిస్టర్‌ అవ్వదు. ఫైనల్‌గా చెప్పాలంటే యుద్ధం శరణం చిత్రం నాగచైతన్యకు పెద్ద షాక్‌ ఇచ్చింది. 

ఫినిషింగ్‌ టచ్‌: యుద్ధం శరణం చచ్చామే!!

Yuddham Sharanam Movie Review:

Naga Chaitanya and Lavanya Tripathi Starring Yuddham Sharanam Movie Review and Rating 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs