Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: డోర


సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 

Advertisement
CJ Advs

డోర 

తారాగణం: నయనతార, తంబి రామయ్య, హరీష్‌ ఉత్తమన్‌, సునీల్‌కుమార్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: దినేష్‌ కృష్ణన్‌ 

సంగీతం: వివేక్‌ మెర్విన్‌ 

ఎడిటింగ్‌: గోపికృష్ణ 

మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి 

సమర్పణ: నేమిచంద్ జబక్, బేబీ త్రిష 

నిర్మాత: మల్కాపురం శివకుమార్‌ 

రచన, దర్శకత్వం: దాస్‌ రామసామి 

విడుదల తేదీ: 31.03.2017 

తెలుగు కానీ, తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్‌ అయినవిగానీ అన్నిరకాల హార్రర్‌ మూవీస్‌ ఆడియన్స్‌ చూసేశారు. ప్రేక్షకుల్ని భయపెట్టాలన్నా, థ్రిల్‌ చెయ్యాలన్నా ఓ కొత్త అంశం కావాలి. అదే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డోర చిత్రం. కారులో దెయ్యం అనేది ఈ సినిమా పబ్లిసిటీలో ఎక్కువ వాడుతుండడంతో ఇదేదో కొత్త తరహా రాబోతోందని ఆడియన్స్‌ ఎదురు చూశారు. మయూరి సినిమాలో నయనతార లీడ్‌ రోల్‌ చెయ్యడం, డోర చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషించడం సినిమాకి బాగా ప్లస్‌ అయింది. తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు విడుదలైన డోర ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలిగింది? నయనతారకి ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుంది? డోర భయపెట్టిందా? థ్రిల్‌ చేసిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

తమ కుటుంబం చేసిన సాయం వల్ల లెక్కకు మించిన కార్లతో కాల్‌ టాక్సీ నడుపుతున్న అత్తయ్య మీద కోపంతో తను కూడా కాల్‌ టాక్సీ స్టార్ట్‌ చెయ్యాలనుకుంటుంది పారిజాతం(నయనతార). అందరిలా కాకుండా కార్లలో యాంటిక్‌ పీస్‌ని తీసుకొని కాల్‌టాక్సీ స్టార్ట్‌ చేసి అన్నీ యాంటిక్‌ పీస్‌లనే కొనాలని ప్లాన్‌ చేస్తుంది. అందులో భాగంగానే ఓ పాత కారు కొంటుంది. కొన్నాళ్ళకు ఆ కారులో ఏదో వుందని డ్రైవర్‌ చెప్పడంతో తనే స్వయంగా చెక్‌ చేస్తుంది. తను కారులో వుండగానే తన ప్రమేయం లేకుండా ఓ వ్యక్తిని గుద్ది చంపేస్తుందా కారు. కారులో దెయ్యం వుందని తెలుసుకున్న పారిజాతం అది నిర్థారణ చేసుకునేందుకు ఓ వృద్ధురాలిని కలుస్తుంది. ఆ కారులో ఓ కుక్క ఆత్మ వుందని చెప్తుందా వృద్ధురాలు. కట్‌ చేస్తే సినిమా స్టార్టింగ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో కొత్తగా పెళ్ళయిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు రేప్‌ చంపెయ్యడమే కాకుండా, ఇంట్లోని డబ్బు, నగలు ఎత్తుకెళ్ళిపోతారు. ఈ కేసు విచారణ జరుగుతూ వుంటుంది. అంతలోనే గుర్తు తెలియని కారుతో ఢీ కొట్టి ఓ వ్యక్తి హత్య.. అనే కొత్త కేసు నమోదవుతుంది. అపార్ట్‌మెంట్‌లో మహిళను హత్య చేసిన ముగ్గురిలో హత్య చేయబడ్డవాడు ఒకడు. అలా ఒక్కొక్కరిని చంపుతూ వస్తుంది కారులో వున్న కుక్క ఆత్మ. మహిళ హత్యకు, కుక్కకు వున్న సంబంధం ఏమిటి? కుక్క ఆత్మ పారిజాతం దగ్గరికే ఎందుకు వచ్చింది? ఆమె సమక్షంలోనే ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు డోర ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఒకే ఒక ఆర్టిస్టు నయనతార. కథంతా ఆమె చుట్టూనే తిరుగుతూ వుంటుంది. పారిజాతం క్యారెక్టర్‌తో నయనతార అందర్నీ ఆకట్టుకుంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు దాదాపు ప్రతి సీన్‌లో నయనతార కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో రివీల్‌ అయ్యే సీక్రెట్‌ వల్ల హత్యలు చేయడంలో తనూ భాగస్వామి అవుతుంది. ఆయా సీన్స్‌లో నయనతార నటన బాగుంది. ఈ చిత్రానికి దినేష్‌ కృష్ణన్‌ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. చాలా నేచురల్‌ లైటింగ్స్‌తో సినిమా అంతా నీట్‌గా కనిపిస్తుంది. వివేక్‌, మెర్విన్‌ చేసిన పాటల్లో ఎల్లమాకే.. ఎల్లమాకే డోర పాట తప్ప మిగతా పాటలేవీ ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా కొన్నిచోట్ల రణగొణ ధ్వనిలా, కొన్నిచోట్ల సాఫ్ట్‌గా అనిపించింది. రాజేష్‌ ఎ. మూర్తి రాసిన మాటలు ఫర్వాలేదు అనిపిస్తాయి. డైరెక్టర్‌ దాస్‌ రామసామి గురించి చెప్పాల్సి వస్తే కథ కొత్తది కాకపోయినా, కుక్క ఆత్మ కారులో వుంది అనేది కొత్త పాయింట్‌. అయితే దాని చుట్టూ అల్లుకున్న కథ చాలా సాదా సీదాగా అనిపిస్తుంది. అసలు కథలోకి రావడానికి ఎక్కువ టైమ్‌ తీసుకోవడం వల్ల స్టార్టింగ్‌లో తమిళ్‌ ఫ్లేవర్‌ ఎక్కువై బోర్‌ కొడుతుంది. దాదాపుగా ఫస్ట్‌హాఫ్‌ అంతా అలాగే నడుస్తుంది. సెకండాఫ్‌లో రివీల్‌ అయ్యే ఓ ఎలిమెంట్‌ వల్ల సినిమా మీద ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చెయ్యగలిగాడు డైరెక్టర్‌. నయనతార పెర్‌ఫార్మెన్స్‌, సెకండాఫ్‌లో ఇంట్రెస్టింగ్‌గా వుండే కథనం సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, నవ్వురాని కామెడీ, తమిళ్‌ ఫ్లేవర్‌ ఎక్కువగా కనిపించడం, కొన్ని అనవసరమైన సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ కాలయాపన చెయ్యడం మైనస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. ఫైనల్‌గా చెప్పాలంటే హార్రర్‌ సినిమాల్లో ఓ కొత్త పాయింట్‌తో తెరకెక్కిన డోర ఫస్ట్‌ హాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుంది అనిపించుకుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: పాత కథ.. కొత్త ఆత్మ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs