Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: కాటమరాయుడు


నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ 

Advertisement
CJ Advs

కాటమరాయుడు 

తారాగణం: పవన్‌కళ్యాణ్‌, శృతి హాసన్‌, రావు రమేష్‌, ఆలీ, అజయ్‌, నాజర్‌, తరుణ్‌ అరోరా, శివబాలాజీ, కమల్‌ కామరాజు, చైతన్యకృష్ణ, పృథ్వీ, ప్రదీప్‌ రావత్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మురెళ్ళ 

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

కథ: శివ, భూపతిరాజా 

స్క్రీన్‌ప్లే: వాసువర్మ, దీపక్‌రాజ్‌ 

నిర్మాత: శరత్‌ మరార్‌ 

దర్శకత్వం: కిశోర్‌కుమార్‌ పార్థసాని 

విడుదల తేదీ: 24.03.2017 

గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత పవన్‌కళ్యాణ్‌ చేసే ఎలా వుండాలి? ఎలా వుండాలని ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు కోరుకుంటున్నారు? పవన్‌కళ్యాణ్‌ని ఎలా చూస్తే శాటిస్‌ఫై అవుతారు అనే విషయంలో పవన్‌కళ్యాణ్‌కి ఒక క్లారిటీ వున్నట్టుంది. అందుకే కేవలం ఫ్యాన్స్‌ కోసం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ చిత్రాన్ని ఎంతో ఇష్టంగా చేశాడు. కానీ, ఊహించని విధంగా జనం దాన్ని తిప్పి కొట్టారు. మరి తను ఎలాంటి సినిమా చెయ్యాలి? ఎలాంటి కొత్త కథతో చెయ్యాలి? అని పదే పదే ఆలోచించిన తర్వాత పవన్‌కళ్యాణ్‌కి తట్టిన ఒక కొత్త ఆలోచన రీమేక్‌ చెయ్యాలని. తమిళ్‌లో చేసిన సినిమా, తెలుగులో కూడా డబ్‌ అయిన సినిమా కథతో తన పంథాలో సినిమా చెయ్యాలి. జనానికి తెలిసిన కథతోనే సినిమా చేసి వాళ్ళని మెప్పించాలని మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. దాని పర్యవసానమే ఈరోజు విడుదలైన కాటమరాయుడు. అత్తారింటికి దారేది చిత్రంతో పాపులరైన కాటమరాయుడా.. కదిరి నరసింహుడాలోని కాటమరాయుడుని తీసుకొని అదే టైటిల్‌తో చేసిన ఈ సినిమా తమిళంలో రూపొందిన వీరం చిత్రానికి రీమేక్‌. జనం చూసిన సినిమానే మళ్ళీ చేసే సాహసానికి పూనుకున్న పవన్‌కళ్యాణ్‌ కాటమరాయుడుతో తను అనుకున్నది సాధించగలిగాడా? సర్దార్‌ గబ్బర్‌సింగ్‌తో నీరస పడిపోయిన అభిమానుల్ని ఈ సినిమాతో ఉత్సాహపరచగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కాటమరాయుడు(పవన్‌కళ్యాణ్‌) ఆ గ్రామంలో అందరిచేతా మంచివాడని, గొప్పవాడని పేరున్నవాడు. ఎక్కడ అన్యాయం జరిగినా సహించనివాడు. అన్యాయం చేసేవారిని అవసరమైతే చంపడానికి కూడా వెనుకాడనివాడు. అతనికి నలుగురు తమ్ముళ్ళు. వాళ్ళ కోసం తను పెళ్ళి చేసుకోకుండా వుండిపోయాడు. అంతేకాదు అతనికి ఆడవాసనంటేనే పడదు. తన తమ్ముళ్ళు కూడా అలాగే వుండాలనుకుంటాడు. కానీ, అన్నయ్యకి తెలీకుండా తమ్ముళ్ళు ప్రేమాయణం నడిపిస్తుంటారు. అన్నయ్యకి చెప్పాలంటే ధైర్యం లేదు. అయితే అన్నయ్యలో ప్రేమ పుట్టించి, అతన్ని పెళ్ళి దాకా తీసుకెళ్తే తమకు రూట్‌ క్లియర్‌ అవుతుందని భావించి పక్కింట్లోనే వుండే అవంతి(శృతిహాసన్‌)తో లవ్‌లో పడేలా ప్లాన్‌ చేస్తారు. కాటమరాయుడు చాలా సున్నిత మనస్కుడని అతని తమ్ముళ్ళు ఇచ్చిన బిల్డప్‌తో ఈజీగా లవ్‌లో పడిపోతుంది అవంతి. ఓ సందర్భంలో అతని హింసను కళ్ళారా చూసి భయంతో వణికిపోతుంది. తను లవ్‌ చేసింది హింసకు ప్రతిరూపమైన నిన్ను కాదని రాయుడితో చెప్పి వెళ్ళిపోతుంది. అవంతి ప్రేమ కోసం హింసను పక్కన పెట్టి మామూలుగా మారాలని ట్రై చేస్తాడు రాయుడు. అనుకోకుండా అవంతి ఇంట్లోనే స్థానం సంపాదిస్తాడు. అవంతి ఫ్యామిలీని చంపాలని ఎవరో టార్గెట్‌ చేస్తున్నారని తెలుసుకుంటాడు రాయుడు. ఆ ఫ్యామిలీని వాళ్ళకి తెలీకుండానే అడుగడుగునా రక్షిస్తుంటాడు. మరి రాయుడు... అవంతి ప్రేమను పొందగలిగాడా? ఆమెను ఆకట్టుకోవడానికి రాయుడు కత్తిని వదిలిపెట్టాడా? అసలు అవంతి ఫ్యామిలీని టార్గెట్‌ చేసిందెవరు? కత్తి పట్టకుండా అవంతి ఫ్యామిలీని శత్రువుల బారి నుండి కాపాడగలిగాడా? తమని రక్షిస్తోంది రాయుడేనని ఆ ఫ్యామిలీ తెలుసుకుందా? అనేది మిగతా కథ. 

కాటమరాయుడు అనే పేరు వినగానే ఆ వ్యక్తి ఎంతో పవర్‌ఫుల్‌ అనీ, అతని పేరు వింటే శత్రువులు వణికిపోతారని, పేదవారికి, ఆపదలో వున్నవారికి దేవుడులాంటి వాడని.. ఇలా సినిమా గురించి రకరకాల ఊహలు అందరిలోనూ కలుగుతాయి. అయితే మనం ఊహించినట్టుగానే కాటమరాయుడు క్యారెక్టర్‌ వుందా? అంటే లేదనే చెప్పాలి. ఓపెనింగ్‌ సీన్‌లో కాటమరాయుడు ఎంత పవర్‌ఫుల్‌ అనేది చూపించారు బాగానే వుంది. కానీ, ఆ తర్వాత అలాంటి సీన్‌ ఒక్కటి కూడా సినిమాలో కనిపించదు. కేవలం ఫైట్‌లో జనాన్ని గాల్లోకి ఎగరేయడమే తప్ప క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌ అనేది చూపించలేకపోయారు. పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే పవన్‌కళ్యాణ్‌ ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టు మంచి పెర్‌ఫార్మెన్సే ఇచ్చినా ఫ్యాన్స్‌కి ఆ డోస్‌ సరిపోదనిపిస్తుంది. పైగా అందర్నీ వణికించే రాయుడు ఒక అమ్మాయి విషయంలో రాజీ పడిపోవడం, తమ్ముళ్ళలాగే తనూ బిహేవ్‌ చెయ్యడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు స్క్రీన్‌ మీద ఎక్కువ కనిపించేది పవన్‌కళ్యాణే. ఫ్యాన్స్‌కి అది చాలు కాబట్టి క్యారెక్టర్‌ విషయంగానీ, పెర్‌ఫార్మెన్స్‌ విషయంగానీ అంతగా పట్టించుకోరు. ఇక హీరోయిన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ రాంగ్‌ సెలెక్షన్‌ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. స్క్రీన్‌ ప్రజెన్స్‌, గ్లామర్‌, పెర్‌ఫార్మెన్స్‌.. ఇలా ఏ విషయంలోనూ ఆకట్టుకోలేకపోయింది శృతి. పైగా సెకండాఫ్‌ కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఒక విధంగా శృతిహాసన్‌ సినిమాకి పెద్ద మైనస్‌ అని చెప్పొచ్చు. మిగతా క్యారెక్టర్స్‌లో రావు రమేష్‌ ఒక కొత్త గెటప్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తన డైలాగ్స్‌తో కాసేపు నవ్వించాడు. ఆలీ, కాటమరాయుడు తమ్ముళ్ళుగా నటించిన అజయ్‌, శివబాలాజీ, చైతన్యకృష్ణ, కమల్‌ కామరాజు అప్పుడప్పుడు కామెడీ చెయ్యాలని ట్రై చేశారు. కొన్నిసార్లు మాత్రమే సక్సెస్‌ అయ్యారు. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. 

తెలుగులో వీరుడొక్కడేగా విడుదలైన ఈ సినిమాలో కథ పరంగా కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ, ఏ ధైర్యంతో ఈ సినిమాని రీమేక్‌ చెయ్యాలనుకున్నారో అర్థం కాదు. పాత రాయలసీమ కత్తుల కథకి పాత ప్రేమ కథని జోడించి చేసిన ఈ కథను తెలుగులో చాలామంది రైటర్స్‌తో చెక్కించి ఒక రూపం తెచ్చేందుకు ట్రై చేశారు. టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాలంటే ప్రసాద్‌ మురెళ్ళ కెమెరా వర్క్‌ బాగుంది. అనూప్‌ రూబెన్స్‌ చేసిన పాటల్లో టైటిల్‌ సాంగ్‌, లాగే లాగే పాటలు తప్ప మిగతావి బాగాలేవు. అనూప్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అక్కడక్కడ మాత్రమే బాగుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో కేవలం రణగొణ ధ్వనులు తప్ప సంగీతం అనేది వినిపించలేదు. డైరెక్టర్‌ కిశోర్‌కుమార్‌ గురించి చెప్పాలంటే తమిళ్‌లో ఆల్రెడీ హిట్‌ అయిన కథని పవన్‌కళ్యాణ్‌కి అనుగుణంగా, తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చేసేందుకు చాలా ట్రై చేశాడు. అయితే కథ పరంగా, కథనం పరంగా ఏ దశలోనూ మనకు కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య, హీరో, హీరోయిన్‌ మధ్య, హీరో, హీరోయిన్‌ ఫ్యామిలీ మధ్య కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ వున్నా అవి ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేంత స్ట్రాంగ్‌గా అనిపించవు. కేవలం పవన్‌కళ్యాణ్‌ని దృష్టిలో వుంచుకొని చేసిన కథ కావడం వల్ల మిగతా విషయాల్లో అంతగా కేర్‌ తీసుకోలేదనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా కేవలం పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి మాత్రమే నచ్చే సినిమా. స్టార్ట్‌ అయినప్పటి నుంచి రిలీజ్‌ అయ్యే వరకు ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగా పెరిగాయి. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ విషయంలో కూడా ఇదే జరిగింది. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కంటే కాటమరాయుడు కొంచెం బెటర్‌ సినిమా అని మాత్రం చెప్పొచ్చు. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా వుండడం వల్ల కాటమరాయుడు ఒక ఏవరేజ్‌ మూవీగా నిలుస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: సర్దార్‌ కంటే కొంచెం బెటర్ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs