Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: చిత్రాంగద


శ్రీవిఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా, క్రియేటివ్‌ ద్రవిడన్స్‌ 

Advertisement
CJ Advs

చిత్రాంగద 

తారాగణం: అంజలి, దీపక్‌, సాక్షి గులాటి, సింధు తులాని, జయప్రకాష్‌, 

రాజా రవీంద్ర, సప్తగిరి, సుడిగాలి సుధీర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి 

సంగీతం: సెల్వ-స్వామి 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

సమర్పణ: టి.సి.ఎస్‌.రెడ్డి, వెంకట్‌ వాడపల్లి 

నిర్మాతలు: రెహమాన్‌, శ్రీధర్‌ గంగపట్నం 

రచన, దర్శకత్వం: అశోక్‌ జి. 

విడుదల తేదీ: 10.03.2017 

హార్రర్‌ కామెడీ చిత్రాల హవా వేగంగా కొనసాగుతున్న రోజుల్లో అప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఓ డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో స్టార్ట్‌ అయిన చిత్రం ఇది. అంజలి ప్రధాన పాత్రలో అశోక్‌ జి. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతాంజలి తర్వాత మళ్ళీ అంజలి ప్రధాన పాత్ర పోషించిన చిత్రాంగద ఏమేర ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగింది? దర్శకుడు అశోక్‌ తన టేకింగ్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చెయ్యగలిగాడా? కొంత ఆలస్యంగా రిలీజ్‌ అయిన ఈ చిత్రాన్ని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

దెయ్యాలు, భూతాల కథాంశాలతో కామెడీని మిక్స్‌ చేసి సినిమాలు చేస్తున్న టైమ్‌లో దర్శకుడు అశోక్‌ ట్రెండ్‌కి భిన్నంగా వున్న సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని స్టార్ట్‌ చేశాడు. జన్మ, పునర్జన్మ అంటూ గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒక జన్మలో చంప బడ్డ వ్యక్తి మరో జన్మెత్తి తనని చంపిన వారిపై పగ సాధించడం చాలా సినిమాల్లో చూశాం. అయితే సైకలాజికల్‌ డిజార్డర్‌తో బాధపడే చిత్ర(అంజలి)లో మగ లక్షణాలు వున్నాయని, అందుకే ఆడవారితో మగవాడిలా బిహేవ్‌ చేస్తుంటుందని ఆమె అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కాలేజీలోని స్టూడెంట్స్‌ నుంచి కంప్లయింట్స్‌ వస్తాయి. దానికి తగ్గట్టుగానే అప్పటికప్పుడు చిత్ర... చిత్ర విచిత్రంగా ప్రవరిస్తూ అమ్మాయిల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటుంది. మరో పక్క ఆమెకు తెలియకుండానే ఓ సైకియాట్రిస్ట్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తుంటాడు. ఒక అమ్మాయి.. ఒక వ్యక్తిని చంపుతున్నట్టు, అది తను చూస్తున్నట్టు చిత్రకి రోజూ కల వస్తుంటుంది. కలలో తను ఎక్కడ వున్నానో ఆ ప్లేస్‌కి తను వెళ్ళాలని పట్టుబట్టి అమెరికా బయల్దేరుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల తర్వాత కొందరు స్వామీజీలు, డాక్టర్లు అది పునర్జన్మగా తేలుస్తారు. తనను చంపిన భార్యపై పగ సాధించేందుకే చనిపోయిన రవివర్మ(దీపక్‌).. చిత్రగా మళ్ళీ పుట్టాడని నిర్థారణ అవుతుంది. రవివర్మని చంపాల్సిన అవసరం అతని భార్యకు ఎందుకొచ్చింది? రవివర్మ భార్య కోసం వెతుక్కుంటూ వెళ్ళిన చిత్ర ఆమె ఎక్కడుందో తెలుసుకోగలిగిందా? చిత్ర రూపంలో వున్న రవివర్మ తన భార్యపై ఎలా పగ తీర్చుకున్నాడు? చిత్ర మానసిక స్థితిలో మార్పు వచ్చిందా? అనేది మిగతా కథ. 

చిత్రగా నటించిన అంజలి తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చెయ్యలేకపోయింది. కేవలం గ్లామర్‌గా కనిపించడానికి తప్ప అలాంటి క్యారెక్టర్లు చెయ్యడానికి సూట్‌ అవ్వదని ప్రూవ్‌ చేసుకుంది. దానికి తగ్గట్టు ఆమెను గ్లామర్‌గా చూపించడానికి, పొట్టి డ్రెస్‌లు వేసి ఎక్స్‌పోజ్‌ చెయ్యడానికే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చినట్టుగా కనిపించింది. గత జన్మలోని రవివర్మగా ఏ దశలోనూ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకోలేకపోయింది అంజలి. డాన్సుల్లో కూడా తన మార్క్‌ చూపించలేకపోయింది. రవివర్మగా దీపక్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మిగిలిన పాత్రల్లో జయప్రకాష్‌, రాజా రవీంద్ర, సాక్షి గులాటి, సింధు తులాని ఓకే అనిపించారు. మధ్య మధ్యలో కామెడీతో రకరకాల విన్యాసాలు చేసిన సప్తగిరి అప్పుడప్పుడు మాత్రమే నవ్వించగలిగాడు. ఎక్కువ శాతం విసిగించాడు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే బాల్‌రెడ్డి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా అమెరికాలో తీసిన సీన్స్‌ అన్నీ చాలా రిచ్‌గా వచ్చాయి. అంజలిని మరింత గ్లామర్‌గా చూపించడంలో బాల్‌రెడ్డి సక్సెస్‌ అయ్యాడు. సెల్వ, స్వామి చేసిన పాటలు ఆకట్టుకునేలా లేవు. కథకు తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదనిపించారు. డైరెక్టర్‌ అశోక్‌ విషయానికి వస్తే పునర్జన్మ అనే కాన్సెప్ట్‌ తీసుకొని దానికి కొంత సైకలాజికల్‌ డిజార్డర్‌ని కూడా జోడించి ఒక కొత్త తరహా చిత్రాన్ని చెయ్యాలని ట్రై చేశాడు. అయితే అనుకున్న రిజల్డ్‌ రాబట్టుకోలేకపోయాడు. కథను సీరియస్‌గా రన్‌ అవుతోందనుకుంటున్న టైమ్‌లో అవసరం లేని కామెడీ, డిస్ట్రబ్‌ చేసే పాటలు ఆడియన్స్‌ని విసిగించాయి. కొన్ని సందర్భాల్లో లాజిక్స్‌ కూడా మిస్‌ అవ్వడంతో టోటల్‌గా కాన్సెప్టే మిస్‌ఫైర్‌ అయింది. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఏ దశలోనూ నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కనిపించదు. అయితే ప్రీ క్లైమాక్స్‌ నుంచి కథ సీరియస్‌గా నడుస్తూ కొంతలో కొంత ఫర్వాలేదు అనిపిస్తుంది. చిత్ర రూపంలో వున్న రవివర్మని ఎందుకు చంపాల్సి వచ్చిందో సింధు తులాని చెప్పిన ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా ఆసక్తికరంగా లేదు. రవివర్మే చిత్రగా పుట్టినట్టయితే గత జన్మలో తను ఎక్కడ వుండేవాడు అనే విషయం తెలుస్తుంది కదా. కానీ, కలలో తనకు కనిపించిన ప్లేస్‌ కోసం అమెరికా అంతా కలియ తిరగడం విచిత్రంగా అనిపిస్తుంది. ఈ ప్రాసెస్‌ అంతా చాలా బోర్‌ కొట్టిస్తుంది. 2 గంటల 24 నిముషాల నిడివి వున్న సినిమాలో ఓ 20 నిముషాలు అనవసరమైన సీన్లు, కామెడీ కట్‌ చేస్తే సినిమా స్పీడ్‌ అయ్యే అవకాశం వుంది. ఎ సెంటర్స్‌లో ఎలా వున్నా, బి, సి సెంటర్స్‌లో కమర్షియల్‌గా వర్కవుట్‌ అవ్వొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేక్షకుల్ని భయపెడుతూ, కామెడీ చేస్తూ, థ్రిల్‌ చెయ్యాలని చూసిన చిత్రాంగద ఏ విధంగానూ ఆకట్టుకోలేకపోయింది. 

ఫినిషింగ్‌ టచ్‌: ప్రేక్షకులపై పగ తీర్చుకున్న చిత్రాంగద 

సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs