Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: అమీర్‌పేటలో..


పద్మశ్రీ క్రియేషన్స్‌ 
అమీర్‌పేటలో.. 
తారాగణం: శ్రీ, అశ్విని, ఈషా, సాయి, మోనిక తదితరులు 
సినిమాటోగ్రఫీ: కిరణ్‌ గ్యారా 
సంగీతం: మురళి లియోన్‌ 
ఎడిటింగ్‌: క్రాంతి కె. 
నిర్మాత: ఎం.మహేష్‌ 
రచన, దర్శకత్వం: శ్రీ 
విడుదల తేదీ: 16.12.2016 
ప్రొఫెషనల్‌ కోర్సులు చేసే వారికి, చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాలు వెతుక్కునే వారికి హైదరాబాద్‌లోని అమీర్‌పేట సెంటర్‌ పాయింట్‌. తమ కెరీర్‌పై ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చేవారిలో కొంతమంది సక్రమమైన దారిలో వెళ్తే మరికొంత మంది ఇతర వ్యామోహాలతో పక్కదారి పడుతుంటారు. ప్రజెంట్‌ యూత్‌ని టార్గెట్‌ చేస్తూ పద్మశ్రీ క్రియేషన్స్‌ బేనర్‌పై ఎం.మహేష్‌ నిర్మాతగా శ్రీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం అమీర్‌పేటలో.. మరి ఈ సినిమా ద్వారా యూత్‌కి ఎలాంటి మెసేజ్‌ ఇచ్చారు? ప్రస్తుతం యూత్‌ ఆలోచనలు ఏవిధంగా వున్నాయి? వారి విచిత్రమైన బిహేవియర్‌తో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించారు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 
ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో భాగంగా అమీర్‌పేట చేరుకున్న వివేక్‌(శ్రీ) ఉద్యోగం కంటే సినిమాల్లో ట్రై చెయ్యడం బెస్ట్‌ అనుకుంటాడు. దానికోసం కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తాడు. అవి సక్సెస్‌ అవ్వకపోవడంతో ముందు జాబ్‌ సంపాదించుకున్న తర్వాతే సినిమాల విషయం ఆలోచించాలని నిర్ణయించుకుంటాడు. ఆ టైమ్‌లోనే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేసే వెన్నెల(అశ్విని) వివేక్‌ని లవ్‌ చేస్తుంది. వీరి కథ ఇలా వుంటే కొడుకు మీద ఎన్నో ఆశలతో ఓ తండ్రి కొడుకు జాబ్‌ సంపాదించుకొని తమని ఉద్ధరిస్తాడని హైదరాబాద్‌ పంపిస్తాడు. కానీ, ఆ కొడుకు జాబ్‌ సంగతి పక్కన పెట్టి ఓ అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతుంటాడు. ఓ సంఘటన వారి లైఫ్‌ని మార్చేస్తుంది. లైఫ్‌లో అమ్మాయి కంటే కెరీర్‌ ముఖ్యమని గ్రహించిన ఈ ఇద్దరు అబ్బాయిలు తమ వ్యామోహాలని పక్కన పెడతారు. ఇందులోనే మరో కథ ఓ కంపెనీలో జాబ్‌ సంపాదించుకున్న కూతుర్ని అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో చేర్పించి జాగ్రత్తగా వుండమని చెప్పి వెళతాడు ఓ తండ్రి. హాస్టల్‌లో వుండే మిగతా అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ ఎంజాయ్‌ చేస్తూ వుంటారు. ఈ అమ్మాయి మాత్రం అణకువగా వుంటుంది. అయితే అందరిలాగే తనూ ఎంజాయ్‌ చెయ్యాలని డిసైడ్‌ అయిన ఆ అమ్మాయి వేష భాషలు మార్చి వారిలా తయారవుతుంది. ఇలా ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా మలుపు తిరుగుతుంది. వివేక్‌ ప్రేమించిన అశ్వినికి సామాజిక సేవ మీద ఎక్కువ ఇంట్రెస్ట్‌ వుంటుంది. అనాథ పిల్లల కోసం ఏదో ఒకటి చెయ్యాలన్నది ఆమె ధ్యేయం. ఇలా రకరకాల ఆశయాలతో ముందుకెళ్తున్న వీరందరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? చివరికి వీళ్ళంతా ఏం సాధించారు? అనేది మిగతా కథ. 
అమీర్‌పేటకు వచ్చే అబ్బాయిలు, అమ్మాయిల మనస్తత్వాలు ఎలా వుంటాయి? ఎవరు ఎలా బిహేవ్‌ చేస్తారు? రకరకాల వ్యామోహాలకు యూత్‌ ఎలా ఎట్రాక్ట్‌ అవుతోంది అనే విషయాలను చూపించే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్‌ అయ్యాడు డైరెక్టర్‌ శ్రీ. ఈ ప్రాసెస్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌తో ప్రేక్షకులకు బోర్‌ కొట్టించాడు. అమీర్‌పేట నేపథ్యంలో కథను స్టార్ట్‌ చేసి అక్కడ ఎలాంటి కన్‌క్లూజన్‌ ఇవ్వకుండా మరో టాపిక్‌లోకి వెళ్ళిపోవడంతో అనుకున్న టార్గెట్‌ని రీచ్‌ అవ్వలేకపోయాడు. ఈ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌ నిలిచింది ఫోటోగ్రఫీ, కొన్ని పేలవమైన సన్నివేశాలు, అనవసరమైన కామెడీ సీన్స్‌. ప్లస్‌పాయింట్స్‌ చెప్పాల్సి వస్తే హీరో కమ్‌ డైరెక్టర్‌ శ్రీ పెర్‌ఫార్మెన్స్‌, అశ్విని గ్లామర్‌, పెర్‌ఫార్మెన్స్‌, సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నవ్వించిన కొన్ని కామెడీ సీన్స్‌. మురళీ లియోన్‌ మ్యూజిక్‌ కొంతవరకు సినిమాకి ప్లస్‌ అయింది. రెండు పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపిస్తాయి. ఎడిటింగ్‌ ఏ సీన్‌కి, ఆ సీన్‌ అన్నట్టుగా వుంటుంది తప్ప కథలో ఫ్లో అనేది కనిపించదు. డైరెక్టర్‌ సెలక్ట్‌ చేసుకున్న పాయింట్‌ మంచిదే అయినా దాన్ని ఎగ్జిక్యూట్‌ చెయ్యడంలో, సినిమాని ఆసక్తికరంగా నడిపించడంలో, క్యారెక్టర్లను ఎలివేట్‌ చెయ్యడంలో సక్సెస్‌ అవ్వలేకపోయాడు. కెరీర్‌ని వదిలిపెట్టి లవ్వే లోకం అంటూ తిరిగే అబ్బాయి తన తప్పు తెలుసుకొని జాబ్‌ సంపాదించుకొని తండ్రిని సంతోషపెడతాడు. సినిమా చేస్తేనే సెటిల్‌ అవ్వొచ్చు అనుకున్న మరో యువకుడు తప్పు తెలుసుకొని కెరీర్‌పై దృష్టిపెడతాడు. అప్పటివరకు అణకువగా వుంటూ ఎలాంటి వ్యామోహానికి లొంగని ఓ అమ్మాయి వున్నట్టుండి తన రూటు మార్చేసి బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఇలాంటి సీన్స్‌ అన్నీ యూత్‌కి మంచి మెసేజ్‌ ఇచ్చేవే అయినా వాటిని స్క్రీన్‌మీద ప్రజెంట్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ తడబడ్డాడు. 
ఈ సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు వచ్చే సీన్స్‌ అన్నింటికీ యూత్‌ కనెక్ట్‌ అవుతారు. తమను తాము చూసుకుంటున్నట్టుగా ఫీల్‌ అవుతారు. చూపించిన సీన్సే మళ్ళీ మళ్ళీ చూపించడంతో అవి కూడా బోర్‌ కొట్టిస్తాయి. దురలవాట్లకు యూత్‌ ఎలా ఎట్రాక్ట్‌ అవుతున్నారు అనే విషయాన్ని చూపిస్తూనే వాళ్ళు ఎలా వుండాలి, వారి బాధ్యత ఏమిటి అనేది చెప్పే ప్రయత్నం చేసిన డైరెక్టర్‌ శ్రీ, నిర్మాత మహేష్‌ని అభినందించాల్సిందే. అయితే వారు చెప్పాలనుకున్న విషయంలో క్లారిటీ లేకపోవడం, ఒక టాపిక్‌ని తీసుకొని మరో టాపిక్‌లోకి వెళ్ళిపోవడంతో సినిమా దారి తప్పింది. ఫైనల్‌గా చెప్పాలంటే యూత్‌ ఎంజాయ్‌ చేసే కొంత కామెడీ, తమని తాము ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్స్‌ ఈ సినిమాలో వున్నప్పటికీ కథ, కథనాల వల్ల అమీర్‌పేటలో.. సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 
ఫినిషింగ్‌ టచ్‌: అమీర్‌పేటలో.. ఆకట్టుకునే అంశాలు తక్కువ 
సినీజోష్‌ రేటింగ్‌: 2/5

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs