Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ధృవ


గీతా ఆర్ట్స్‌ 

Advertisement
CJ Advs

ధృవ 

తారాగణం: రామ్‌చరణ్‌, రకుల్‌ ప్రీత్‌, అరవింద్‌ స్వామి, 

పోసాని, షాయాజీ షిండే, నవదీప్‌, నాజర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌ 

సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ 

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి 

కథ: మోహన్‌రాజా 

మాటలు: వేమారెడ్డి 

నిర్మాతలు: ఎన్‌.వి.ప్రసాద్‌, అల్లు అరవింద్‌ 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి 

విడుదల తేదీ: 09.12.2016 

తమిళ్‌లో సూపర్‌ డూపర్‌హిట్‌ అయిన తని ఒరువన్‌ చిత్రాన్ని తెలుగులో ధృవ పేరుతో రీమేక్‌ చేస్తున్నారని, రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్నాడని ఎనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డి ఫస్ట్‌ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఎన్‌.వి.ప్రసాద్‌, అల్లు అరవింద్‌ నిర్మించారు. ఒరిజినల్‌లో విలన్‌గా నటించిన అరవింద్‌స్వామి తెలుగులోనూ నటించాడు. ఈరోజు విడుదలైన ధృవ ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యిందా? తమిళ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన తని ఒరువన్‌ని రీమేక్‌ చెయ్యడం ద్వారా సురేరందర్‌రెడ్డి ఈ చిత్రానికి ఎంతవరకు న్యాయం చేశాడు? రామ్‌చరణ్‌కి ధృవ ఎలాంటి సినిమా అయ్యింది? వంటి విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథగా చెప్పుకోవాలంటే ఇది గొప్ప కథేమీ కాదు, కథనంలో కూడా కొత్తదనమేమీ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక పోలీస్‌ ఆఫీసర్‌కి, ఒక వైట్‌ కాలర్‌ నేరస్థుడికి మధ్య జరిగే పోరాటమే ధృవ. ఐపిఎస్‌ అధికారిగా ట్రైనింగ్‌ తీసుకుంటున్న సమయంలోనే తన ఫ్రెండ్స్‌తో కలిసి పోలీసులకు అంతు చిక్కని ఎన్నో కేసులను సాల్వ్‌ చేసి ప్రొఫెషన్‌పై తమకున్న గౌరవాన్ని చాటుకుంటాడు ధృవ(రామ్‌చరణ్‌). సమాజంలో జరుగుతున్న నేరాలపై చిన్నప్పటి నుంచే ఒక అవగాహన వున్న ధృవ డైలీ పేపర్స్‌లో వచ్చే న్యూస్‌లకు రిలేటెడ్‌గా అదే పేపర్‌లో మరో వార్త కూడా అతన్ని ఆకర్షించేది. అందరిలా కాకుండా ప్రతి నేరాన్ని కొత్తకోణంలో చూస్తుంటాడు. ఎవర్ని కొడితే వందమంది క్రిమినల్స్‌ అంతమవుతారో ఆ క్రిమినల్‌నే అంతం చెయ్యాలి అనేది అతని లక్ష్యం. ప్రజల తలరాతల్ని నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడైతే, ఆ రాజకీయ నాయకుడి తలరాతని నిర్ణయించేది ఒక బిజినెస్‌మేన్‌. ఎన్నో కాలిక్యులేషన్స్‌ తర్వాత సిద్థార్థ అభిమన్యు(అరవింద్‌ స్వామి)ని తన టార్గెట్‌గా డిసైడ్‌ చేసుకుంటాడు ధృవ. అలా ధృవ, సిద్ధార్థ మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఎన్ని ట్విస్టులు వున్నాయి? ఒకరిపై ఒకరు ఎలాంటి ఎత్తులు వేసుకున్నారు? ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుంది కాబట్టి ఈ కథలో కూడా అదే జరిగింది. ఆ విజయం ధృవకి అంత ఈజీగా దక్కిందా? తన శత్రువుని అతను ఎలా అంతం చేశాడు? అనేది మిగతా కథ. 

ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా, లవర్‌కి కూడా ప్రాధాన్యమివ్వని డ్యూటీ మైండెడ్‌ ఆఫీసర్‌గా, శత్రువుని ఎత్తుకు పై ఎత్తు వేసి అతనితో ఆడుకునే హీరోగా రామ్‌చరణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఎమోషనల్‌ సీన్స్‌లో, ఫైట్స్‌లో చాలా స్పీడ్‌ కనిపించింది. అతను చేసిన సిక్స్‌ ప్యాక్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ అయింది. డాన్సులకు ఎక్కువ ప్రాధాన్యం లేని కథ కావడంతో దాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌లో ఇంతకుముందు వున్న గ్లో కానీ, యాక్టివ్‌నెస్‌గానీ ఈ సినిమాలో కనిపించలేదు. కొన్ని సీన్స్‌లో క్లోజప్‌లో చూడలేని విధంగా వుంది. ఇక ఆమె చేసిన క్యారెక్టర్‌కి కూడా అంత ప్రాధాన్యం కనిపించలేదు. కేవలం పాటలకే పరిమితమైందా అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్స్‌లో పోసాని అమాయకమైన తండ్రిగా ఓ మంచి క్యారెక్టర్‌ చేశాడు. ధృవ ఫ్రెండ్‌ గౌతమ్‌గా నవదీప్‌కి ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్‌ దక్కింది. తన క్యారెక్టర్‌కి వున్న పరిధి మేరకు బాగానే చేశాడు. ఇక ఈ సినిమాలో హీరో తర్వాత చెప్పుకోవాల్సింది విలన్‌ సిద్ధార్థగా నటించిన అరవింద్‌ స్వామి గురించి. అతని పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి పెద్ద హైలైట్‌గా నిలిచింది. తని ఒరువన్‌లో విలన్‌గా అక్కడి ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన అరవింద్‌స్వామి తెలుగులోనూ తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. హీరోకి ఈక్వల్‌గా వుండే విలన్‌ క్యారెక్టర్‌కి అతనే పెర్‌ఫెక్ట్‌ అనేంతగా ఇన్‌వాల్వ్‌ అయి చేశాడు. 

ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అయిన అంశాలు సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, టేకింగ్‌, ఫైట్స్‌. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు రిచ్‌నెస్‌ ఎక్కడా తగ్గకుండా సినిమాటోగ్రాఫర్‌ పి.ఎస్‌.వినోద్‌ మంచి కేర్‌ తీసుకున్నాడు. సినిమాలోని ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. పాటల పిక్చరైజేషన్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం అద్భుతం అనిపించేలా చేశాడు హిప్‌ హాప్‌ తమిళ. అతని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అన్ని సీన్స్‌ని బాగా ఎలివేట్‌ చేసింది. ఫైట్స్‌ కూడా రెగ్యులర్‌ సినిమాల్లోని ఫైట్స్‌కి భిన్నంగా వున్నాయి. ఫైట్స్‌లో చరణ్‌ పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. వేమారెడ్డి రాసిన మాటలు కొన్ని చోట్ల బాగున్నాయి అనిపిస్తాయి, కొన్నిచోట్ల విసిగిస్తాయి. డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి గురించి చెప్పాలంటే ఒరిజినల్‌ కథని ఎక్కడా చెడగొట్టకుండా రిచ్‌గా తియ్యడంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతి షాట్‌ని స్టైలిష్‌గా చూపించడంలో తన మార్క్‌ని చూపించాడు. అయితే ఫస్ట్‌హాఫ్‌ కంటే సెకండాఫ్‌ బాగుంది అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో చాలా అనవసరమైన సీన్స్‌ ఆడియన్స్‌ని విసిగిస్తాయి. అసలు కథలోకి వచ్చిన తర్వాత స్లోగా పికప్‌ అయి సెకండాఫ్‌ అంతా స్పీడ్‌గా వెళ్ళిపోతుంది. రెండున్నర గంటల సినిమాలో కామెడీ అనేది లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పుకోవచ్చు. కామెడీని ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా రుచించదు. హీరో, విలన్‌ మధ్య జరిగే పోరాటం ఆద్యంతం సీరియస్‌గా వుండడం, ఆడియన్స్‌కి ఎక్కడా రిలీఫ్‌ లేకపోవడం, మధ్యలో వచ్చే పాటలు ఆడియన్స్‌కి మరింత నీరసం తెప్పించేలా వుండడం ఈ సినిమాకి డ్రాబ్యాక్స్‌. కొన్ని సీన్స్‌లో హీరోతో లెంగ్తీ డైలాగులు చెప్పించడం కూడా ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ ఓకే, సెకండాఫ్‌ ఎక్స్‌ట్రార్డినరీ అనిపించేలా రూపొందిన ఈ చిత్రం కథ, కథనాలు అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా? అంటే డౌటే అని చెప్పాలి. సినిమాలోని కొన్ని సిట్యుయేషన్స్‌, డైలాగ్స్‌ సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా లేకపోవడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే రామ్‌చరణ్‌ ఎన్నో హోప్స్‌ పెట్టుకొని ఎంతో రిస్క్‌తో చేసిన ధృవ ఒక స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అని చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 3.25/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs