Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: ధర్మయోగి


విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్‌ పిక్చర్స్‌ 

Advertisement
CJ Advs

ధర్మయోగి 

తారాగణం: ధనుష్‌(ద్విపాత్రాభినయం), త్రిష, అనుపమ పరమేశ్వరన్‌, 

శరణ్య, ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌, కరుణాస్‌, సింగముత్తు, కాళి వెంకట్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌. 

సంగీతం: సంతోష్‌ నారాయణన్‌ 

ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

సమర్పణ: శ్రీమతి జగన్‌మోహిని 

నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ 

రచన, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ 

విడుదల తేదీ: 29.10.2016 

విభిన్నమైన చిత్రాలు చేస్తూ విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని, ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న ధనుష్‌.. రఘువరన్‌ బి.టెక్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకున్నాడు. మాస్‌ ప్రేక్షకులకే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. అయితే ఆ తర్వాత విడుదలైన చిత్రాలు తెలుగులో అతని ఇమేజ్‌ని పెంచలేకపోయాయి. తాజాగా ధనుష్‌ ద్విపాత్రాభినయంతో ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో కొడి పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో ధర్మయోగి పేరుతో విడుదల చేశారు నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పూర్తి పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించింది? ఫస్ట్‌టైమ్‌ ధనుష్‌ డూయల్‌ రోల్‌లో ఆకట్టుకోగలిగాడా? ఈ సినిమా ధనుష్‌కి ఎలాంటి పేరుని తెచ్చింది? ధర్మయోగి ధనుష్‌కి మరో సూపర్‌హిట్‌ని అందించిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఈ చిత్రంలో ధర్మగా, యోగిగా రెండు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ని చేశాడు ధనుష్‌. ఓ సీనియర్‌ రాజకీయ నేతకు అత్యంత ఆప్తుడైన ధర్మ, యోగి తండ్రి అతని కోసం ప్రాణ త్యాగం చేస్తాడు. చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల మక్కువ పెంచుకున్న యోగి రాజకీయాన్నే తన మార్గంగా ఎంచుకుంటాడు. ధర్మ మాత్రం పాలిటిక్స్‌ జోలికి వెళ్ళకుండా ఓ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. యోగి అపొజిషన్‌ పార్టీలో అగ్నిపూల రుద్ర(త్రిష) చురుకైన కార్యకర్తగా అందరితో శభాష్‌ అనిపించుకుంటుంది. పార్టీలో మంచి పదవులు చేపడుతుంది. వేర్వేరు పార్టీలకు చెందిన యోగి, రుద్ర అందరి దృష్టిలో శత్రువులే అయినా ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ తమ తమ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతారు. దీంతో వారి మధ్య కొన్ని మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. పదవి కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడే రుద్ర ఓ దారుణానికి పూనుకుంటుంది. దాంతో ధర్మ... యోగిగా మారతాడు. పదవీ కాంక్షతో రుద్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ధర్మకు యోగిగా మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది? యోగి, రుద్రల మధ్య చిచ్చు పెట్టిన అంశం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఈమధ్యకాలంలో పూర్తి పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. యాక్షన్‌, మాస్‌, లవ్‌ ఎంటర్‌టైనర్స్‌ చేస్తూ వస్తున్న ధనుష్‌ ఫస్ట్‌ టైమ్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో చేసిన సినిమా ఇది. ధర్మగా, యోగిగా అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు ధనుష్‌. రెండు గెటప్స్‌లో వున్న వ్యక్తి ఒకరేనా అనిపించే రేంజ్‌లో అతని క్యారెక్టర్స్‌ని డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌. రఫ్‌గా వుండే యోగిగా, సాఫ్ట్‌గా వుండే ధర్మగా రెండు వేరియషన్స్‌ వున్న క్యారెక్టర్‌ని అద్భుతంగా చేశాడు. ధనుష్‌ తర్వాత చెప్పుకోవాల్సింది త్రిష గురించి. పదవి కోసం ఎవరినైనా అడ్డు తొలగించుకోవడానికి సిద్ధపడే రుద్ర క్యారెక్టర్‌ని త్రిష చాలా సెటిల్డ్‌గా చేసింది. ఓ పక్క గ్లామర్‌గా కనిపిస్తూనే మరో పక్క తన పెర్‌ఫార్మెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. మరో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ధర్మకు పెయిర్‌గా ఓ క్యూట్‌ లవర్‌గా అందర్నీ మెప్పించింది. సీనియర్‌ రాజకీయ నేతగా హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ నటన కూడా బాగుంది. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాల్సి వస్తే పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి వెంకటేష్‌ ఫోటోగ్రఫీ కొంతవరకు ప్లస్‌ అయింది. ప్రతి సీన్‌ని విజువల్‌గా అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకి మరో ప్లస్‌ సంతోష్‌ నారాయణన్‌ సంగీతం. మూడు పాటలు ఆడియో పరంగా, విజువల్‌గా ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా సిట్యుయేషన్‌కి తగ్గట్టు అద్భుతంగా చేశాడు. శశాంక్‌ వెన్నెలకంటి రాసిన మాటలు పవర్‌ఫుల్‌గా వున్నాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన పాటలు ఓ డబ్బింగ్‌ సినిమా పాటల్లా కాకుండా అందరికీ అర్థమయ్యేలా వున్నాయి. ఇక డైరెక్టర్‌ సెంథిల్‌కుమార్‌ గురించి చెప్పాలంటే పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో గ్రిప్పింగ్‌గా కథ రాసుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు. ఒక ఫ్లోలో కథని తీసుకెళ్ళి అక్కడక్కడ మెరుపులు మెరిపించాడు. బలమైన కథ, కథనాలు ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పొచ్చు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఫ్లాట్‌గా వెళ్ళే కథలో అక్కడక్కడ వచ్చే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కి కొత్తగా అనిపిస్తాయి. ఆద్యంతం సీరియస్‌గా నడిచే కథ, కథనాలు ప్రేక్షకుల్ని సీట్లకు కట్టి పడేసినా అక్కడక్కడా రిలీఫ్‌ నిచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌, లవ్‌ ట్రాక్‌ లేకపోవడం, తెలుగు నేటివిటీ ఎక్కడా కనిపించకపోవడం, ప్రధాన తారాగణం తప్ప తెలుగు ప్రేక్షకులకు పరిచయం వున్న ఆర్టిస్టులు లేకపోవడం సినిమాలోని మైనస్‌ పాయింట్స్‌. మొదటి నుంచి యోగి, రుద్ర క్యారెక్టర్లకు ఇచ్చిన బిల్డప్‌కి క్లైమాక్స్‌ చాలా పెద్ద రేంజ్‌లో వుంటుందని ఊహించిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. ఓ సాదా సీదా క్లైమాక్స్‌తో సినిమాని ముగించారా? అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే మాస్‌ ఎలిమెంట్స్‌, యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, ఊహించని ట్విస్ట్‌లు, ధనుష్‌, త్రిషల పెర్‌పార్మెన్స్‌, కథ, కథనాలు, డైరెక్షన్‌తో ధర్మయోగి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ధనుష్‌ డబుల్‌ ధమాకా 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs