Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: కాష్మోరా


పివిపి సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ 

Advertisement
CJ Advs

కాష్మోరా 

తారాగణం: కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్‌, మధుసూదన్‌రావు తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఓంప్రకాష్‌ 

సంగీతం: సంతోష్‌ నారాయణన్‌ 

ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు 

రచన, దర్శకత్వం: గోకుల్‌ 

విడుదల తేదీ: 28.10.2016 

ఈమధ్యకాలంలో హార్రర్‌కి రకరకాల ఎలిమెంట్స్‌ మిక్స్‌ చేసి సినిమాలు చేస్తున్నారు. వాటిలో హార్రర్‌ కామెడీకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దెయ్యాలు, భూతాల వల్ల క్యారెక్టర్స్‌ భయపడుతూనే ఆడియన్స్‌ని నవ్వించడం మనం చూస్తున్నాం. తాజాగా కార్తీ హీరోగా గోకుల్‌ దర్శకత్వంలో వచ్చిన కాష్మోరా కూడా ఆ తరహా సినిమానే. కాకపోతే ఇందులో బ్లాక్‌ మ్యాజిక్‌ని కూడా యాడ్‌ చేసి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశారు. దానికితోడు రాచరికానికి సంబంధించిన ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా పెట్టి మగధీర చిత్రాన్ని గుర్తు తెచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంతవరకు భయపెట్టింది? ఏమేర ఎంటర్‌టైన్‌ చేసింది? రెండు క్యారెక్టర్లు చేసిన కార్తీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడంలో ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? డైరెక్టర్‌ గోకుల్‌ ఎంచుకున్న కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని కన్విన్స్‌ చెయ్యగలిగాడా? ఊపిరి తర్వాత పివిపి సినిమా బేనర్‌లో కార్తీ చేసిన ఈ సినిమాలో అతని పెర్‌ఫార్మెన్స్‌ ఏ రేంజ్‌లో వుంది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

అతని పేరు కాష్మోరా(కార్తీ). తనకు కొన్ని అతీంద్రియ శక్తులు వున్నాయని తన తండ్రి ఆ పేరు పెట్టాడని కాష్మోరా చెప్పుకుంటాడు. ఆత్మలతో మాట్లాడడం, అవి తమ ఇంట్లో వున్నాయని ఎవరైనా చెప్తే వాటిని అక్కడి నుంచి తరిమెయ్యడం అతని జాబ్‌. సమస్యను తనే క్రియేట్‌ చేసి తనే సాల్వ్‌ చేస్తుంటాడు. ఆ విద్యలతో ఎంతో పేరు తెచ్చుకుంటాడు కాష్మోరా. టీవీల్లో ప్రోగ్రామ్స్‌ చెయ్యడం ద్వారా కోట్లాది మందికి అతను సుపరిచితుడు. మరో పక్క యామిని(శ్రీదివ్య) దెయ్యాలపై థీసిస్‌ చేస్తున్నానంటూ కాష్మోరా అసిస్టెంట్‌గా చేరుతుంది. ప్రజల మూఢ నమ్మకాలపై సొమ్ము చేసుకుంటున్న కాష్మోరా, అతని కుటుంబం గుట్టు బయట పెట్టడానికే అతని దగ్గరకు వస్తుంది యామిని. తమ ఊళ్ళోని ఓ పాడు పడిన ప్యాలెస్‌లో దెయ్యాలు వున్నాయని, వాటిని వెలుగులోకి పంపించాలని, దానికి ఎంత డబ్బయినా ఇస్తానని ఓ వ్యక్తి కాష్మోరాకు చెప్తాడు. అక్కడికి వెళ్లిన కాష్మోరా ఆ ప్యాలెస్‌లోనే బంధింపబడతాడు. ఆ తర్వాత అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరతారు. వారి తర్వాత యామిని కూడా అక్కడికి వస్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన రాజనాయక్‌(కార్తీ) ఆ ప్యాలెస్‌లో కొన్ని ప్రేతాత్మలతో కలిసి వుంటూ వుంటాడు. రత్నమహాదేవి(నయనతార) ఇచ్చిన శాపం ఫలితంగా అతని ఆత్మకు శాంతి లేకుండా అక్కడే తిరుగుతూ వుంటుంది. నవకాళిక పౌర్ణమిరోజు రోహిణి నక్షత్రంలో పుట్టిన ఒకే కుటుంబంలోని వ్యక్తులను బలి ఇస్తే అతనికి శాప విమోచనం కలుగుతుంది. ఆగ్నేయ ఆసియాలోని దేవికుమారి ఆలయంలో వున్న ఓ అమ్మాయి అప్పుడప్పుడు కాష్మోరా కల్లోకి వస్తుంటుంది. తపోశక్తి వల్ల ఎన్నో శక్తులు పొందిన రాజనాయక్‌ ఆత్మను అంతం చెయ్యాలంటే అది కాష్మోరా వల్లే సాధ్యమవుతుందని దేవికుమారి ఆలయంలోని అమ్మాయి, చనిపోయిన రత్న మహాదేవి ఆత్మ భావిస్తారు. తనని, తన కుటుంబాన్ని చంపడానికి రాజనాయక్‌ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న కాష్మోరా ఏం చేశాడు? తన కుటుంబాన్ని రాజనాయక్‌ నుంచి ఎలా రక్షించుకున్నాడు? అనేది మిగతా కథ. 

కాష్మోరాగా, రాజనాయక్‌గా రెండు విభిన్న పాత్రల్లో, మరో పక్క రాజనాయక్‌ ఆత్మగా మరో గెటప్‌లో కార్తీ నటన ఎక్స్‌లెంట్‌ అని చెప్పాలి. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా కార్తీకి ఈ సినిమా ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. శ్రీదివ్య చేసిన క్యారెక్టర్‌కి సినిమాలో అంత ప్రాధాన్యత లేదు. ఆమె లేకపోయినా సినిమా బాగానే వుంటుంది అనిపించేలా ఆమె క్యారెక్టర్‌ వుంటుంది. ఇక రత్న మహాదేవిగా నటించిన నయనతార కనిపించేది కాసేపే అయిన తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత వివేక్‌ మళ్ళీ తన పంచ్‌ డైలాగ్స్‌తో ఆడియన్స్‌ని నవ్వించాడు. మిగతా క్యారెక్టర్స్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

సాంకేతికంగా చూస్తే ఫోటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. ప్రతి సీన్‌ని విజువల్‌గా గ్రాండ్‌గా చూపించడంలో ఓంప్రకాష్‌ సక్సెస్‌ అయ్యాడు. సెకండాఫ్‌లోని ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా బాగున్నాయి. అయితే బాహుబలిలాంటి విజువల్‌ వండర్‌ చూసిన తర్వాత ఈ సినిమాలోని ఎఫెక్ట్స్‌ ఆడియన్స్‌కి చాలా సాధారణంగా అనిపించొచ్చు. సంతోష్‌ నారాయణన్‌ మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో పాటలు తక్కువే అయినా అవి కూడా చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. మ్యూజిక్‌పరంగా, లిరిక్‌ పరంగా ఎక్కడా ఆకట్టుకోవు. అయితే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఫర్వాలేదు అనిపించాడు. మేకింగ్‌ పరంగా సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. డైరెక్టర్‌ గోకుల్‌ విషయానికి వస్తే గోకుల్‌ రాసుకున్న కథలో చాలా లొసుగులు, కామన్‌ ఆడియన్‌కి అర్థంకాని విషయాలు, కొన్ని లాజిక్‌లేని ఎపిసోడ్స్‌ వున్నాయి. వెయ్యి ఆత్మలని ఒకేసారి వెలుగులోకి పంపించే ప్రక్రియతో గిన్నిస్‌ రికార్డు సృష్టించడానికి కాష్మోరా రెడీ అవడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. బ్లాక్‌ మేజిక్‌, దెయ్యాలు, భూతాలు వంటి సబ్జెక్ట్‌ని సెలెక్ట్‌ చేసుకొని దానికి ఎక్కువ భాగం కామెడీని జోడించి నడిపించాలని చూశాడు. అయితే అది ఫస్ట్‌ హాఫ్‌లో బాగానే వర్కవుట్‌ అయ్యింది కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమా లెంగ్తీగా అనిపించడం, ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కూడా అంత కన్విన్స్‌గా లేకపోవడం, రాజనాయక్‌ని రత్నమహాదేవి చంపాలనుకోవడం వెనుక ప్రేక్షకుల్ని కదిలించేంత ఎమోషన్‌ లేకపోవడంతో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ విజువల్‌గా బాగానే అనిపించినా కంటెంట్‌ పరంగా ఆకట్టుకోదు. ఫస్ట్‌ హాఫ్‌ని కామెడీతో నడిపించి సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమాని క్లైమాక్స్‌కి తెచ్చే ప్రాసెస్‌లో చాలా అనవసరమైన సీన్స్‌, కొన్ని రిపీటెడ్‌ సీన్స్‌ పెట్టడం వల్ల లెంగ్తీగా అనిపించడంతో ఆడియన్స్‌ బోర్‌ ఫీల్‌ అవుతారు. క్లైమాక్స్‌ కూడా చాలా సాదాసీదాగా అనిపిస్తుంది తప్ప అద్భుతం అనే రేంజ్‌లో వుండదు. కాష్మోరా అనే డిఫరెంట్‌ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని కామెడీ ఎపిసోడ్స్‌ ఆడియన్స్‌ని విపరీతంగా నవ్విస్తాయి, సెకండ్‌ హాఫ్‌కి వచ్చే సరికి కాస్త కామెడీ, మరి కాస్త బోర్‌ తర్వాత ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఒక సాధారణమైన క్లైమాక్స్‌తో సినిమా ఎండ్‌ అవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కామెడీని ఎంజాయ్‌ చేసేవారికి కొన్ని ఎపిసోడ్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ని ఇష్టపడేవారికి ఫ్లాష్‌బ్యాక్‌ నచ్చే అవకాశం వుంది. ఓవరాల్‌గా కాష్మోరా ఓ ఏవరేజ్‌ సినిమా అనిపించుకుంటుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ఇది కామెడీ కాష్మోరా 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs