Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: జెంటిల్‌మన్‌


శ్రీదేవి మూవీస్‌ 

Advertisement
CJ Advs

జెంటిల్‌మన్‌ 

తారాగణం: నాని, సురభి, నివేదా థామస్‌, అవసరాల శ్రీనివాస్‌, 

తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్‌, ఆనంద్‌, రోహిణి, 

సత్యం రాజేష్‌, శ్రీముఖి తదితరులు 

సినిమాటోగ్రఫీ: పి.జి.విందా 

ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ 

సంగీతం: మణిశర్మ 

కథ: డేవిడ్‌ నాథన్‌ 

నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌ 

రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి 

విడుదల తేదీ: 17.06.2016 

యూత్‌, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇష్టపడే హీరోల్లో నాని ఒకడు. నేచురల్‌ స్టార్‌గా ఆడియన్స్‌లో మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న నాని తను చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక నావెల్టీ వుండాలని తపన పడతాడు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి అతను చేసిన సినిమాలను చూస్తే అది అర్థమవుతుంది. అష్టాచమ్మా చిత్రంతో తనని హీరోని చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రూపొందిన జెంటిల్‌మన్‌ నాని లేటెస్ట్‌ మూవీ. చాలా గ్యాప్‌ తర్వాత శ్రీదేవి మూవీస్‌ బేనర్‌లో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్‌గా మోహనకృష్ణకి ఇదో డిఫరెంట్‌ జోనర్‌ అనే చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీలో నాని హీరోనా? విలనా? అనే క్వశ్చన్‌ మార్క్‌ వాడుతున్నారు. మరి ఈ జెంటిల్‌మన్‌ హీరోనా? విలనా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ళ గ్యాప్‌ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో చేసిన ఈ సినిమా హీరోగా నాని ఇమేజ్‌ని ఏమేరకు పెంచింది? కథల విషయంలో, దర్శకుల విషయంలో ఆచి తూచి అడుగేస్తున్న నానికి అతని మొదటి దర్శకుడు ఎలాంటి సినిమాని ఇచ్చాడు? అనేది తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

మన హీరోలు ఏది చేసినా అది లోక కళ్యాణానికే అనేది తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ప్రూవ్‌ అవుతూనే వుంది. మన సినిమాల్లో హీరోకి నెగెటివ్‌ షేడ్స్‌ వున్నా, అతన్ని విలన్‌లా చూపించాలని తాపత్రయపడినా ఆ భ్రమలో ప్రేక్షకులు మాత్రం పడరు. ఓపెన్‌ చేస్తే ఇండియా వచ్చే ఫ్లైట్‌లో మన సినిమాలోని ఇద్దరు హీరోయిన్లూ కలిసి ప్రయాణం చేస్తుంటారు. ఒకరి పేరు ఐశ్వర్య(సురభి), మరొకరి పేరు కేథరిన్‌(నివేదా థామస్‌). టైమ్‌ పాస్‌ కోసం ఇద్దరూ తమ తమ ప్రేమకథలు చెప్పుకుంటారు. ఐశ్వర్య ప్రేమకథలో హీరో జయరామ్‌(నాని) అయితే, కేథరిన్‌ ప్రేమకథలో హీరో గౌతమ్‌(నాని). ఇండియాకి రాగానే ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్యను రిసీవ్‌ చేసుకునేందుకు జయరామ్‌ వస్తాడు. గౌతమ్‌ పోలికల్లో వున్న జయరామ్‌ని చూసి కేథరిన్‌ షాక్‌ అవుతుంది. వెంటనే గౌతమ్‌ ఇంటికి వెళ్తుంది. గౌతమ్‌ ఓ యాక్సిడెంట్‌లో చనిపోయాడని అతని తల్లి చెప్పడంతో మరింత షాక్‌కి గురవుతుంది. ఆమె షాక్‌లో వుండగానే నిత్య(శ్రీముఖి) అనే రిపోర్టర్‌ గౌతమ్‌ యాక్సిడెంట్‌ కేసులో ఏదో మిస్టరీ వుందని కేథరిన్‌కి చెప్తుంది. ఏమిటా మిస్టరీ? గౌతమ్‌ నిజంగానే యాక్సిడెంట్‌లో చనిపోయాడా? లేక మర్డరా? గౌతమ్‌ పోలికల్లో వున్న జయరామ్‌ కథేమిటి? ఈ మిస్టరీని కేథరిన్‌, నిత్య ఛేదించగలిగారా? అనేది మిగతా కథ. 

జయరామ్‌, గౌతమ్‌ క్యారెక్టర్స్‌లో ఎప్పటిలాగే నాని పెర్‌ఫార్మెన్స్‌ నేచురల్‌గానే వుంది. కథలో ఐశ్వర్య పాత్రకి అంతగా ప్రాముఖ్యత లేకపోయినా సురభి ఆ క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది. సినిమాలో కీలకమైన పాత్రలో కేథరిన్‌ అందర్నీ ఆకట్టుకుంది. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వుండే క్యారెక్టర్స్‌ చేయగల మరో హీరోయిన్‌ తెలుగులో పరిచయమైందని చెప్పొచ్చు. ఇప్పటివరకు చేయని నెగెటివ్‌ క్యారెక్టర్‌లో శ్రీనివాస్‌ అవసరాల మెప్పించాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఐదారు క్యారెక్టర్సే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి మిగతా క్యారెక్టర్స్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

టెక్నికల్‌ ఎస్సెట్స్‌ గురించి చెప్పాలంటే పి.జి. విందా ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎన్నో మ్యూజికల్‌ హిట్స్‌ అందించిన మణిశర్మ ఈ సినిమాలో పాటల పరంగా ఆకట్టుకోకపోయినా అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని మాత్రం అందరూ గుర్తు పెట్టుకుంటారు. 2 గంటల 24 నిముషాల సినిమాలో కత్తిరించడానికి చాలా సీన్లే వున్నా ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేష్‌కి అవకాశం ఇవ్వలేదు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మేకింగ్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదని ఔట్‌పుట్‌ చూస్తే అర్థమవుతుంది. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాల్సి వస్తే గతంలో అందరూ చూసేసిన కథని, అందరూ ఊహించగలిగే కథని తీసుకొని తన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్‌ చెయ్యాలనుకున్నాడు. కానీ, స్లో నేరేషన్‌, గ్రిప్‌ లేని సీన్స్‌, క్యూరియాసిటీ కలిగించని సీన్స్‌, బోర్‌ కొట్టించే లవ్‌ ట్రాక్స్‌, కథని ముందుకు నడిపించలేని కథనంతో ఒక సాధారణ చిత్రంగా జెంటిల్‌మన్‌ని రూపొందించగలిగాడు. ఇద్దరు హీరోల ప్రేమకథల్లో ఏ ఒక్కటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోగా తెగ బోర్‌ కొట్టిస్తాయి. దానికి తగ్గట్టుగానే డైలాగ్స్‌ కూడా ఆకట్టుకునేలా వుండవు. అడపా దడపా కొన్ని కామెడీ సీన్స్‌ నవ్వించినా అవి పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వలేకపోయాయి. సెకండాఫ్‌లో హీరోని విలన్‌లా చూపించడానికి మోహనకృష్ణ విశ్వ ప్రయత్నం చేసినా అతని ప్రవర్తన వెనుక ఏదో బలమైన కారణమే వుండి వుంటుందని ఆడియన్స్‌ దాన్ని కొట్టి పారేస్తారు. కాబట్టి అప్పటివరకు నడిచిన సస్పెన్స్‌ని హీరో తన ఫ్లాష్‌ బ్యాక్‌తో రివీల్‌ చేసినా ఆడియన్స్‌ ఏ విధంగానూ థ్రిల్‌ ఫీల్‌ అవరు. 

టి.వి. ట్రైలర్స్‌గానీ, పబ్లిసిటీ డిజైన్స్‌గానీ జెంటిల్‌మన్‌ అనే సినిమా ఓ డిఫరెంట్‌ జోనర్‌లో వుంటుందనే ఎక్స్‌పెక్టేషన్స్‌ని కలిగించాయి. అయితే ఆ స్థాయిలో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఈ సినిమా రీచ్‌ అవ్వలేదనే చెప్పాలి. నాని నేచురల్‌ పెర్‌ఫార్మెన్స్‌, సురభి, నివేదా థామస్‌ల గ్లామర్‌, పి.జి. విందా ఫోటోగ్రఫీ, మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ అయితే స్లో నేరేషన్‌, బోర్‌ కొట్టించే ఫస్ట్‌ హాఫ్‌, క్లైమాక్స్‌ వరకు సినిమాని నడిపించడానికి సెకండాఫ్‌లో నవ్వు తెప్పించని కామెడీ, సస్పెన్స్‌ని రివీల్‌ చేసినా థ్రిల్‌ ఇవ్వని క్లైమాక్స్‌ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌గా మారాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఈమధ్యకాలంలో వచ్చిన నాని సినిమాల్లో ఏదో ఒక పాయింట్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయింది. కానీ, ఈ సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అయినప్పటికీ ఇందులో సస్పెన్స్‌ని క్రియేట్‌ చేసే అంశాలు, ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎలిమెంట్స్‌ లోపించడంతో జెంటిల్‌మన్‌ ఒక సాదా సీదా చిత్రం అనిపించుకుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: రొటీన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs