Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: 24


స్టూడియో గ్రీన్‌ 

Advertisement
CJ Advs

2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ 

24 

తారాగణం: సూర్య, సమంత, నిత్య మీనన్‌, అజయ్‌, 

శరణ్య, గిరీష్‌ కర్నాడ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: తిరునవుక్కరసు 

సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి 

మాటలు: శశాంక్ వెన్నెలకంటి

నిర్మాత: సూర్య 

రచన, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌ 

విడుదల తేదీ: 06.05.2016 

విభిన్నమైన కథాంశాలను ఎన్నుకోవడంలో, కొత్త తరహా పాత్రలు చేయడంలో తనకు తనే సాటి అనిపించుకుంటున్న హీరో సూర్య. టిపికల్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడంలో తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరుచుకున్న డైరెక్టర్‌ విక్రమ్‌ కె. కుమార్‌. వీరిద్దరి ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 24. స్టూడియో గ్రీన్‌తో కలిసి 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌పై హీరో సూర్య తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రెండు భాషల్లోనూ ఈరోజు విడుదలైంది. కొత్త పాయింట్స్‌తో విక్రమ్‌ తీసిిన 13బి, ఇష్క్‌, మనం వంటి సినిమాలు డైరెక్టర్‌గా అతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇప్పుడు ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా 24 చిత్రాన్ని రూపొందించాడు. మరి ఈ చిత్రం ఆడియన్స్‌కి ఎంతవరకు రీచ్‌ అయింది? ఈ డిఫరెంట్‌ మూవీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులను 24 ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చేసింది? అనేది తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

సినిమా అంటేనే ఫిక్షన్‌. సినిమాలో మనం చూసే ప్రతి సంఘటన నిజజీవితంలో జరగాలని లేదు. కొన్ని సంఘటనలు మాత్రం నిజ జీవితంలో జరిగే అవకాశం వుంది. కానీ, సైన్స్‌ ఫిక్షన్‌ అంటే రియల్‌ లైఫ్‌లో జరగడానికి అవకాశమే లేని సబ్జెక్ట్‌తో చేసే సినిమాలు. చేసిన తప్పును సరిదిద్దుకోలేం. మళ్ళీ జరగకుండా మాత్రం జాగ్రత్త పడగలం. ఒకసారి చేసిన తప్పును మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిచేసుకోగలమా? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. టైమ్‌ మెషీన్‌కి సంబంధించిన కథాంశంతో ఇంగ్లీష్‌లో బ్యాక్‌ టు ది ఫ్యూచర్‌ వచ్చింది. బాలకృష్ణ హీరోగా తెలుగులో ఆదిత్య 369 చిత్రాన్ని చూశాం. మళ్ళీ అలాంటి ఓ టైమ్‌ మెషీన్‌ కథాంశంతో వచ్చిన సినిమాయే 24. కథగా చెప్పాలంటే డా. శివకుమార్‌(సూర్య) ఒక సైంటిస్ట్‌. గడిచిన 24 గంటల్లో జరిగిన సంఘటనల్లోకి మనిషి వెళ్ళి రావడం కోసం ఓ వాచ్‌ని తయారు చేయడానికి కృషి చేస్తుంటాడు. మొత్తానికి అనుకున్నది సాధిస్తాడు. ఆ టైమ్‌ మెషీన్‌ కోసమే కాచుకొని వున్న అతని అన్నయ్య ఆత్రేయ(సూర్య) తమ్ముడ్ని, అతని భార్యను, బాబును చంపేసి వాచ్‌ని తీసుకెళ్ళడానికి శివకుమార్‌ దగ్గరికి వస్తాడు. శివకుమార్‌ భార్యను చంపేస్తాడు ఆత్రేయ. బాబును తీసుకొని పారిపోతున్న శివకుమార్‌ను వెంబడిస్తాడు. ఆత్రేయ నుంచి తెలివిగా కొడుకుని తప్పించి ఆత్రేయ చేతిలో చనిపోతాడు శివకుమార్‌. అప్పుడు జరిగిన యాక్సిడెంట్‌తో కోమాలోకి వెళ్ళిపోతాడు ఆత్రేయ. చనిపోవడానికి ముందు తను తయారు చేసిన వాచ్‌ని ఓ బాక్స్‌లో పెట్టి లాక్‌ చేస్తాడు శివకుమార్‌. ప్రజెంట్‌కి వస్తే ఆ బాక్స్‌ వాచ్‌ షాప్‌ ఓనర్‌ అయిన మణి(సూర్య) దగ్గర వుంటుంది. ఆ తర్వాత అక్కడ అక్కడ తిరిగి దాని కీ కూడా మణి దగ్గరకు చేరుతుంది. దానితో ఆ బాక్స్‌ని ఓపెన్‌ చేసిన మణికి అది ఓ టైమ్‌ మెషీన్‌ అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత తను శివకుమార్‌ కొడుకునని తెలుసుకుంటాడు మణి. కోమాలోకి వెళ్ళిన ఆత్రేయ 26 సంవత్సరాల తర్వాత స్పృహలోకి వస్తాడు. తనకు కావాల్సిన వాచ్‌ మణి దగ్గర వుందని తెలుసుకొని దాన్ని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఓ ప్లాన్‌ వేస్తాడు. ఆత్రేయ వేసిన ప్లాన్‌ ఏమిటి? తన తల్లిదండ్రుల్ని చంపింది ఆత్రేయేనన్న విషయం మణికి తెలిసిందా? చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మణి వారితో తన అనుభూతుల్ని పంచుకోవడానికి ఏం చేశాడు? అనేది మిగతా కథ. 

సైంటిస్ట్‌ శివకుమార్‌గా, విలన్‌ ఆత్రేయగా, శివకుమార్‌ కొడుకు మణిగా మూడు విభిన్నమైన క్యారెక్టర్స్‌ని సూర్య అద్భుతంగా పోషించాడు. ముఖ్యంగా ఆత్రేయ క్యారెక్టరైజేషన్‌గానీ, ఆ క్యారెక్టర్‌ని సూర్య పెర్‌ఫార్మ్‌ చేసిన విధానంగానీ సింప్లీ సూపర్బ్‌ అని చెప్పాలి. ఒక దుష్టశక్తికి వుండే క్రూరత్వాన్ని తన కళ్ళల్లో, బాడీ లాంగ్వేజ్‌లో అద్భుతంగా చూపించాడు సూర్య. సైంటిస్ట్‌గా, ఈ జనరేషన్‌ కుర్రాడిగా డిఫరెంట్‌ వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్స్‌లో అందర్నీ మెప్పించాడు. మణికి పెయిర్‌గా సమంత, శివకుమార్‌కి జంటగా నిత్యమీనన్‌ తమకి వున్న లిమిట్స్‌ మేరకు ఫర్వాలేదు అనిపించారు. ఆత్రేయకు రైట్‌ హ్యాండ్‌గా అజయ్‌ చాలా ఇంపార్టెన్స్‌ వున్న క్యారెక్టర్‌ను చేశాడు. మణిని పెంచిన తల్లిగా శరణ్య ఎప్పటిలాగే మంచి తల్లి అనిపించుకుంది. గిరీష్‌ కర్నాడ్‌ చేసిన కుటుంబ పెద్ద క్యారెక్టర్‌ కథకి పెద్దగా ఉపయోగపడకపోయినా ఓకే అనిపించాడు. 

ఈ సినిమాకి టెక్నికల్‌ ఎస్సెట్స్‌ చాలా వున్నాయి. అందులో మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. తిరునవుక్కరసు తీసిన అద్భుతమైన విజువల్స్‌ కళ్ళకి ఇంపుగా అనిపించాయి. ప్రతి సీన్‌ని రిచ్‌గా, బ్రైట్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ పనితనం కనిపించింది. సినిమాలో పాటలు తక్కువైనా రెండు పాటలు మాత్రం ఆడియోపరంగా, విజువల్‌గా బాగున్నాయి. ప్రేమ పరిచయమే.. అనే పాటను ఇప్పటివరకు చూడని అందమైన లొకేషన్స్‌లో చాలా గ్రాండియర్‌గా చిత్రీకరించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ తనదైన శైలిలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని కూడా అద్భుతంగా చేశాడు. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఇక డైరెక్టర్‌ గురించి చెప్పాల్సి వస్తే టైమ్‌ మెషీన్‌ సబ్జెక్ట్‌ని సెలెక్ట్‌ చేసుకొని ఒక థ్రిల్లర్‌గా తియ్యాలన్న ఆలోచన చేసిన విక్రమ్‌ని అభినందించాలి. పాయింట్‌ కొత్తదే అయినా, ఆలోచనలో వైవిధ్యం వున్నా, దాన్ని తెరకెక్కించడంలో విక్రమ్‌ అనుకున్నంత సక్సెస్‌ అవ్వలేదనిపిస్తుంది. సినిమా స్టార్ట్‌ అవ్వడమే స్లోగా స్టార్ట్‌ అయి ఎక్కడా వేగం పుంజుకోకుండా అదే స్పీడ్‌ని మెయిన్‌టెయిన్‌ చేస్తుంది. టైమ్‌ మెషీన్‌కి సంబంధించిన కథను కాసేపు పక్కన పెట్టి సూర్య, సమంతల మధ్య నడిచే లవ్‌ ట్రాక్‌ మీద ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేశాడు. పాయింట్‌ ఎంత కొత్తదైనా దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో చెప్తే ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అవుతుంది. అయితే ఇందులో అలా చెప్పే అవకాశం లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయింది. ఆడియన్స్‌కి సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర్నుండి అక్కడక్కడా తప్ప మధ్యలో రిలీఫ్‌ అనేది వుండదు. సినిమా అంతా మనం సీరియస్‌గానే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లో, సెకండ్‌ హాఫ్‌లో హీరో, హీరోయిన్‌ల లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులకు తెగ బోర్‌ కొట్టిస్తుంది. విజువల్‌గా చూస్తే టైమ్‌ మెషీన్‌ని ఉపయోగించడంలో ఫ్రీజ్‌ ఆప్షన్‌ని కూడా చూపించడం కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా వర్షం స్టార్ట్‌ అవ్వగానే చినుకుల్ని గాల్లోనే ఆపేయడం ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుంది. ఇలాంటి కొన్ని చమక్కులు తప్ప డైరెక్టర్‌ విక్రమ్‌ కథ, కథనాల పరంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ సినిమా సాధ్యాసాధ్యాలను పక్కన పెట్టి చూస్తే ఓ విజువల్‌ వండర్‌ అనిపిస్తుంది. కథ, కథనాల గురించి ఆలోచించకుండా ఓ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ అనుకొని చూస్తే అద్భుతమే అనిపిస్తుంది. విక్రమ్‌ కుమార్‌ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కథలోనూ, కథనంలోనూ నావెల్టీ అనేది కనిపిస్తుంది. మనం వంటి సినిమా అన్ని విధాలుగా పకడ్బందీగా చేశారనిపిస్తుంది. 24 విషయానికి వస్తే ఓవరాల్‌గా మనకు పాయింట్‌ మాత్రమే కొత్తగా కనిపిస్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం మాత్రం బ్యాడ్‌ అనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే 24 మూవీ కొంతమందిని మాత్రమే ఆకట్టుకునే సినిమా. ఈ సినిమా మల్టీప్లెక్స్‌లకే పరిమితమా? బి, సి సెంటర్స్‌లో రన్‌ అవడం కష్టమా? అనే విషయాలను చర్చించడం కంటే ఇండియన్‌ సినిమాలో 24 మూవీ అనేది అందరూ అప్రిషయేట్‌ చేయదగ్గ అటెంప్ట్‌ అని మాత్రం చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: అప్రిషియేట్‌ చేయదగ్గ గుడ్‌ అటెంప్ట్‌! 

సినీజోష్‌ రేటింగ్‌: 3.25/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs