Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: గరం


శ్రీనివాసాయి స్క్రీన్స్‌ 

Advertisement
CJ Advs

గరం 

తారాగణం: ఆది, అదా శర్మ, నరేష్‌, తనికెళ్ళ భరణి, 

షకలక శంకర్‌, మధునందన్‌, కబీర్‌ సింగ్‌, నాజర్‌ 

తదితరులు 

సినిమాటోగ్రఫీ: టి.సురేంద్రరెడ్డి 

సంగీతం: అగస్త్య 

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌ 

కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి 

నిర్మాత: సురేఖ పి. 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఆర్‌.మదన్‌ 

విడుదల తేదీ: 12.02.2016 

ప్రేమకావాలితో హీరోగా పరిచయమైన ఆది ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసినప్పటికీ ప్రేమకావాలి, లవ్‌లీ తప్ప అతనికి హిట్స్‌ లేవు. లేటెస్ట్‌గా సాయికుమార్‌ సొంత బేనర్‌లో మదన్‌ కాంబినేషన్‌లో ఆదితో గరం చిత్రాన్ని నిర్మించాడు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో మాస్‌ మసాలా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆది చేసిన ఈ ఏడో సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటున్నారు? ఫస్ట్‌ టైమ్‌ ఇలాంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ని రూపొందించిన మదన్‌ డైరెక్టర్‌గా ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? అనేది తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

ఈమధ్యకాలంలో వస్తున్న సినిమాల కథలు హీరో చిన్నతనం నుంచే స్టార్ట్‌ అవుతున్నాయి. అలాగే ఈ సినిమా కూడా మన హీరో వరహాలబాబు(ఆది) చిన్నతనం నుంచే స్టార్ట్‌ అవుతుంది. చదువంటే ఇష్టపడని వరాలు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ, సినిమాలు చూస్తూ టైమ్‌ పాస్‌ చేస్తుంటాడు. అన్ని కథల్లోలాగే ఈ కథలో కూడా తండ్రితో చివాట్లు తింటూ వుంటాడు. బుద్ధిగా చదువుకునే పక్కింటి రవి(చైతన్యకృష్ణ)ని చూసి బుద్ధి తెచ్చుకోమంటాడు. వరాలు లాంటి కుర్రాడితో స్నేహం చెయ్యొద్దని రవి తండ్రి(నరేష్‌) అతనికి చిన్నప్పటి నుంచే నూరి పోస్తాడు. ఆ విధంగా వరాలుకి, రవికి ఒకరంటే ఒకరికి ద్వేషం పెరిగిపోతుంది. రవికి ఉద్యోగం రావడంతో సిటీకి బయల్దేరతాడు. ఎప్పుడూ అందరితో గొడవలు పడే వరాలు ఓరోజు ఓ పెద్ద రౌడీని కొడతాడు. ఈ విషయంలో తండ్రితో గొడవ పడి ఎప్పటికైనా గొప్పవాణ్ణయి తిరిగి వస్తానని శపథం చేసి సిటీకి బయల్దేరతాడు వరాలు. సిటీకి వచ్చిన వరాలు బుర్ఖాలో వున్న ఓ ముస్లిం అమ్మాయి(అదాశర్మ)ని చూసి లవ్‌లో పడతాడు. ఓ పక్క జాబ్‌ కోసం ట్రై చేస్తూనే మరో పక్క లవ్‌ కోసం కూడా ట్రై చేస్తుంటాడు. అయితే తను వచ్చిన ఉద్యోగం కోసం కాదు, లవ్‌ చెయ్యడానికి కాదు అని తన ఫ్రెండ్స్‌కి షాక్‌ ఇస్తాడు. తను వచ్చింది రవి కోసం అని చెప్తాడు. చిన్నప్పటి నుంచి రవి అంటే ద్వేషం పెంచుకున్న వరాలు అతని కోసం సిటీకి ఎందుకొచ్చాడు? అసలు రవి ఫ్లాష్‌ బ్యాక్‌ ఏమిటి? రవి కోసం వచ్చినవాడు ముస్లిం అమ్మాయి వెంట ఎందుకు పడ్డాడు? రవికి, ఆ అమ్మాయికి వున్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ. 

ప్రేమకావాలి, లవ్‌లీ వంటి సినిమాల్లో లవర్‌బోయ్‌గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్న ఆది ఆ తర్వాత డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌తో చేసిన సినిమాలతో, మాస్‌ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాడు. ఇప్పుడు గరం చిత్రంతో మరోసారి ఆ ప్రయత్నం చేశాడు ఆది. అయితే తనకి ఇచ్చిన క్యారెక్టర్‌ పరంగా కొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌లో, లవ్‌ సీన్స్‌లో, కామెడీ సీన్స్‌లో పెర్‌ఫార్మెన్స్‌ సైడ్‌ ఓకే అనిపించుకున్నా, క్యారెక్టరైజేషన్‌ పరంగా పక్కా మాస్‌ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ ఆదికి ఈ సినిమాలో సెట్‌ అవ్వలేదు అనిపిస్తుంది. కొన్నిచోట్ల రఫ్‌ అండ్‌ టఫ్‌గా చెప్పాల్సిన డైలాగ్స్‌ కూడా చాలా నార్మల్‌గా చెప్పినట్టు అనిపిస్తుంది. డాన్సులు, ఫైట్స్‌ మాత్రం ఆది ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడని చెప్పాలి. ఆది ఫ్రెండ్స్‌గా షకలక శంకర్‌, మధునందన్‌ తమకి వున్న పరిధిలో నవ్వించే ప్రయత్నం చేశారు. హీరో తండ్రిగా తనికెళ్ళ భరణి పెర్‌ఫార్మెన్స్‌ షరా మామూలే. చైతన్యకృష్ణ తండ్రిగా నటించిన నరేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ కొన్ని చోట్ల హార్ట్‌ టచ్చింగ్‌గా అనిపిస్తుంది. హీరోయిన్‌ అదా శర్మ నటనపరంగా, గ్లామర్‌ పరంగా ఓకే అనిపించింది. 

టెక్నికల్‌గా ఈ సినిమాలో మేజర్‌గా చెప్పుకోదగ్గ హైలైట్స్‌ ఏమీ లేవు. సురేందర్‌రెడ్డి ఫోటోగ్రఫీ ఫర్వాలేదు అనిపిస్తుంది. చాలా చోట్ల సరైన లైటింగ్‌ లేక సీన్‌ వెలవెలబోయినట్టు వుంటుంది. అయితే ఫారిన్‌లో తీసిన పాటలు విజువల్‌గా చాలా బాగున్నాయి. అగస్త్య చేసిన పాటల్లో రెండు పాటలు ఫర్వాలేదు అనిపించేలా వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓకే అనిపించాడు. ఇక కథ, మాటలు గురించి చెప్పాల్సి వస్తే శ్రీనివాస్‌ గవిరెడ్డి ఇచ్చిన కథలోగానీ, రాసిన మాటల్లోగానీ ఎక్కడా కొత్తదనం అనేది కనిపించదు. గాలికి తిరిగే హీరో ఎంట్రీ, ఒక ఫైట్‌, వెంటనే పాట.. కథలో చిన్న ట్విస్ట్‌.. దాని కోసం హీరో చేసే సాహసాలు. ఇలాంటి కథలతో ఇప్పటికి చాలా సినిమాలు వచ్చేసాయి. కథ పాతదే తీసుకున్న మదన్‌ కథనం విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒక పాత సినిమాని చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్ప కొత్త సినిమాలా అనిపించదు. 

చాలా సినిమాల్లోలాగే స్టార్ట్‌ అయ్యే ఈ సినిమాలో ఆ తర్వాత వచ్చే సీన్స్‌ కూడా ఆల్రెడీ మనం చూసేసిన ఫీలింగ్‌నే కలిగిస్తాయి. ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో.. హీరోయిన్‌ వెంట పడడం, ఆమెను లవ్‌ చెయ్యమని వేధించడం వంటి సీన్స్‌తోనే నడుస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ ఎండ్‌ అయ్యే వరకూ డైరెక్టర్‌ ఏం చెప్పదలుచుకున్నాడనే విషయం ఆడియన్స్‌కి అర్థం కాదు. హీరో సిటీకి వచ్చింది లవ్‌ చెయ్యడానికి కాదు, ఉద్యోగం కోసం కాదు అని చెప్పడంతో సెకండాఫ్‌లో ఇంకా ఏదో మహత్కార్యం చెయ్యబోతున్నాడని, సెకండాఫ్‌ పరుగులు పెడుతుంది అనుకున్న ఆడియన్స్‌ మళ్ళీ నిరాశ పడతారు. ఫస్ట్‌ హాఫ్‌లో చూసిన రొటీన్‌ సీన్స్‌తోనే సెకండాఫ్‌ కూడా రన్‌ అవుతూ వుంటుంది. సినిమా తప్పకుండా క్లైమాక్స్‌కి రావాలి కాబట్టి అప్పుడు అసలు ఏం జరిగింది అనేది ఫ్లాష్‌బ్యాక్‌ ద్వారా ఆడియన్స్‌కి చెప్పారు. పక్కింటి కుర్రాడ్ని తను ద్వేషించినా అతను ఆపదలో వున్నాడని తెలుసుకొని ఆదుకోవడం ద్వారా తను ఏమిటో అందరికీ ప్రూవ్‌ చేస్తాడు. ఫైనల్‌గా చెప్పాలంటే కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చే అవకాశం లేదు. రొటీన్‌ సినిమానైనా ఎంజాయ్‌ చేస్తూ చూసేవారికి మాత్రం ఫర్వాలేదు అనిపిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: భరించడం కాదు మన తరం 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs