Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: కృష్ణగాడి వీర ప్రేమగాథ


14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ 

Advertisement
CJ Advs

కృష్ణగాడి వీర ప్రేమగాథ 

తారాగణం: నాని, మెహరీన్‌, సంపత్‌రాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌, 

సత్యం రాజేష్‌, రామరాజు, సమ్మెట గాంధీ తదితరులు 

సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్‌ 

సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట 

అనీల్‌ సుంకర 

రచన, దర్శకత్వం: హను రాఘవపూడి 

విడుదల తేదీ: 12.02.2016 

అందాల రాక్షసి వంటి సెన్సిబుల్‌ లవ్‌స్టోరీని రూపొందించిన హను రాఘవపూడి, భలే భలే మగాడివోయ్‌తో బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ కొట్టిన నాని.. వీరిద్దరి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన డిఫరెంట్‌ మూవీ కృష్ణగాడి వీరప్రేమగాథ. నాని, హను రాఘవపూడి ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ఎవరిని టార్గెట్‌ చేస్తూ నిర్మించారు? కొత్తదనం కోరుకునే ఈ ఇద్దరూ కలిసి చేసిన కృష్ణగాడి వీరప్రేమగాథ ఆడియన్స్‌ని ఎంతవరకు రీచ్‌ అయింది? ఈ సినిమాని చూసి ప్రేక్షకులకు ఏమేర ఎంటర్‌టైన్‌ అవుతున్నారు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

సినిమాలో ఏదో ఒక డిఫరెంట్‌ పాయింట్‌ వుంటే చాలు తెలుగు ఆడియన్స్‌ ఆ సినిమాని ఆదరిస్తున్నారు. కథ పాతదే అయినా ట్రీట్‌మెంట్‌లో కొత్తదనం వున్నా ఓకే అంటున్నారు. మరి ఈ సినిమాలో వున్న కొత్తదనం ఏమిటంటే ప్రేమకథని రెగ్యులర్‌ ఫార్మాట్‌లో చూపించకుండా కొంత కొత్తదనాన్ని జోడించడమే. అయితే సినిమా అంతా ప్రేమకథే వున్నా తట్టుకోలేని ఆడియన్స్‌ కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని కూడా ఆశిస్తారు కాబట్టి ఈ ప్రేమకథకి ఓ ఫ్యాక్షన్‌ కథ, ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కథ, అభిమానుల చేత విజిల్స్‌ వేయించడం కోసం అన్నట్టు ఇందులో హీరో నందమూరి బాలకృష్ణ ఫాన్‌ అయి వుండడం.. ఇలా లవ్‌, సిట్యుయేషనల్‌ కామెడీ, యాక్షన్‌ వంటివి కూడా యాడ్‌ చేసి ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీ చెయ్యాలని ట్రై చేశాడు హను. 

మన హీరో కృష్ణ(నాని).. నందమూరి బాలకృష్ణ అభిమాని. ఎంత పెద్ద అభిమాని అంటే జై బాలయ్య అని పచ్చబొట్టు పొడిపించుకునేంత. స్వతహాగా భయస్తుడైన కృష్ణ తన చిన్నతనం నుంచి మహాలక్ష్మీ(మెహరీన్‌) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. 24 గంటలూ కత్తులు పట్టుకొని తిరుగుతూ శత్రువుల్ని హతమారుస్తూ బిజీగా వుండే రామరాజు చెల్లెలు మహాలక్ష్మి. తను ఆమెను ప్రేమిస్తున్నప్పటికీ ఆ విషయం పెద్ద వాళ్ళకు చెప్పలేకపోతాడు కృష్ణ. ఎప్పుడు ఎదురు పడినా తిట్టుకునే కృష్ణ, మహాలక్ష్మిలను చూస్తే వాళ్ళిద్దరూ లవర్స్‌ అని ఎవరూ అనుకోరు. కానీ, వాళ్ళిద్దరూ గాఢ ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఈ విషయం మహాలక్ష్మీ అన్నయ్యకి తెలుస్తుందేమోనని ఎప్పుడూ టెన్షన్‌ పడే కృష్ణకి ఒక షాక్‌ ఇస్తాడు రామరాజు. చావు బ్రతుకుల మధ్య వున్న రామరాజు తన అన్నయ్య ఎసిపి శ్రీకాంత్‌(సంపత్‌రాజ్‌) ముగ్గురు పిల్లలను సేఫ్‌గా హైదరాబాద్‌లో డ్రాప్‌ చేసి వస్తే తన చెల్లెలు మహాలక్ష్మీని ఇచ్చి పెళ్ళి చేస్తానంటాడు. అనుకోకుండా తను కోరుకుందే జరుగుతుండడంతో దానికి ఒప్పుకొని పిల్లలను తీసుకొని హైదరాబాద్‌ బయల్దేరతాడు కృష్ణ. భయస్తుడని తెలిసినా పిల్లలను కాపాడే బాధ్యతను కృష్ణకు అప్పగించడం వెనుక రీజన్‌ ఏమిటి? శత్రువుల్ని వేటాడి చంపే రామరాజుకు వచ్చిన కష్టమేమిటి? హైదరాబాద్‌లో ఎసిపిగా పనిచేస్తున్న శ్రీకాంత్‌ పిల్లలను చంపాలని ప్రయత్నిస్తున్నదెవరు? పిల్లలను తీసుకెళ్తున్న కృష్ణకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? పిల్లలని హైదరాబాద్‌లో డ్రాప్‌ చేసి మహాలక్ష్మీని కృష్ణ పెళ్ళి చేసుకున్నాడా? అనేది మిగతా కథ. 

బాలకృష్ణ వీరాభిమానిగా, ప్రతి చిన్నదానికీ భయపడి కంగారు పడిపోయే వాడిగా, ఒక వీర ప్రేమికుడిగా.. ఇలా రకరకాల వేరియేషన్స్‌ వున్న కృష్ణ క్యారెక్టర్‌లో నాని బాగా ఇమిడిపోయాడు. సత్యం రాజేష్‌తో వచ్చే సిట్యుయేషనల్‌ కామెడీ సీన్స్‌లో నాని అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. మహాలక్ష్మీగా నటించిన మెహరీన్‌ తన అందాలతో అందర్నీ అలరించింది. అయితే ఆమె క్యారెక్టర్‌కు ఫస్ట్‌హాఫ్‌లో వున్న ఇంపార్టెన్స్‌ సెకండాఫ్‌లో కనిపించలేదు. మెహరీన్‌ గ్లామరస్‌గానే కనిపించినప్పటికీ సినిమా మొత్తంలో ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపించింది. హీరో ఫ్రెండ్‌గా సత్యం రాజేష్‌ మంచి కామెడీని పండించాడు. చాలా సీన్స్‌లో ఆడియన్స్‌ నవ్వించాడు. ఇక ఎసిపి శ్రీకాంత్‌గా సంపత్‌రాజ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా డిగ్నిఫైడ్‌గా అనిపిస్తుంది. 

ఈ సినిమాకి మేజర్‌ హైలైట్స్‌గా చెప్పుకోదగ్గవి సినిమాటోగ్రఫీ, టేకింగ్‌, మ్యూజిక్‌. సినిమా స్టార్టింగ్‌ నుంచే యువరాజ్‌ అందించిన ఫోటోగ్రఫీ ఓ రేంజ్‌లో వుందనిపిస్తుంది. అయితే అది ఫస్ట్‌ హాఫ్‌కే పరిమితమైపోయింది. సెకండాఫ్‌లో సినిమాటోగ్రఫీ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసేంతగా లేదు. విశాల్‌ చంద్రశేఖర్‌ చేసిన పాటల్లో రెండు పాటలు ఫర్వాలేదు అనిపించాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని సినిమాలోని మూడ్స్‌కి తగ్గట్టు ఇవ్వడంలో విశాల్‌ సక్సెస్‌ అయ్యాడు. గౌతంరాజు ఎడిటింగ్‌ బాగానే వున్నప్పటికీ అక్కడక్కడ 5, 10 సెకండ్ల సీన్స్‌ కొన్ని అనవసరంగా పెట్టారనిపిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో కొన్ని అనవసరమైన సీన్స్‌ వున్నాయి. వాటిని కట్‌ చేసినా కథకు ఎలాంటి ఇబ్బంది వుండదు. వాటిని నెగ్లెట్‌ చెయ్యడం వల్ల సినిమా లెంగ్త్‌ కాస్త ఎక్కువ అనిపిస్తుంది. డైరెక్టర్‌ హను గురించి చెప్పాలంటే ఒక ప్రేమకథను రాసుకొని దాని చుట్టూ ఫ్యాక్షన్‌ కథ, ఓ ఎసిపి కథ.. ఇలా అన్నీ యాడ్‌ చేసుకొని టేకింగ్‌ పరంగా కొత్తగా చూపించాలని ట్రై చేశాడు. అయితే ఈ కథలో ఫస్ట్‌హాఫ్‌లో వున్న గ్రిప్‌ సెకండాఫ్‌లో లేదు. ఫస్ట్‌హాఫ్‌లోనే కథని ఎన్ని యాంగిల్స్‌లో స్టార్ట్‌ చేశాడో అవన్నీ ఓపెన్‌ చేసెయ్యడంవల్ల క్లైమాక్స్‌కి వెళ్ళడం తప్ప వేరే దారి లేకపోవడంతో సెకండాఫ్‌ని అనవసరమైన సీన్స్‌, రిపీటెడ్‌ సీన్స్‌, పృథ్వి, మురళీశర్మ, ప్రభాస్‌ శ్రీనుల కామెడీ ట్రాక్‌ పెట్టడం, పిల్లలతో కారులో హైదరాబాద్‌ బయల్దేరిన హీరోకి ట్రావెలింగ్‌ కంటే హాల్టింగ్సే ఎక్కువ వుండడంతో ఆడియన్స్‌ క్లైమాక్స్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హీరో క్యారెక్టరైజేషన్‌ విషయానికి వస్తే అతి భయస్తుడుగా కనిపించే కృష్ణ తన లవ్‌ సక్సెస్‌ చేసుకోవడానికి విలన్స్‌ని, పోలీసుల్ని ప్రాధేయ పడతాడు తప్ప ఏ సందర్భంలోనూ వీరత్వాన్ని చూపించే ప్రయత్నం చెయ్యడు. సినిమా ప్రారంభంలో బాలకృష్ణ అభిమానిగా నానిని ఎస్టాబ్లిష్‌ చేశారు. కానీ, అది హీరోకి ఎంత మాత్రం ఉపయోగపడలేదు. తప్పని పరిస్థితుల్లో క్లైమాక్స్‌లో కాస్త ఆవేశం తెచ్చుకొని విలన్‌ని మట్టి కరిపిస్తాడు కృష్ణ. కృష్ణగాడి వీరప్రేమగాథ అనే టైటిల్‌కి, హీరో క్యారెక్టరైజేషన్‌కి, కథకి, కథనానికి ఎక్కడా పొంతన కుదరదు. 

భలే భలే మగాడివోయ్‌ చిత్రంలో తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌కి వినోదాన్ని పంచిన నాని ఈ చిత్రంలో కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాడని ఆశ పడి థియేటర్‌కి వెళ్ళే ఆడియన్స్‌కి ఆ విషయంలో బాగానే వర్కవుట్‌ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా, టేకింగ్‌ పరంగా, విజువల్‌గా ఫస్ట్‌ హాఫ్‌ని ఆడియన్స్‌ బాగానే ఎంజాయ్‌ చేస్తారు. కాకపోతే స్లో నేరేషన్‌తో స్టార్ట్‌ అయ్యే ఈ సినిమాలో అక్కడక్కడ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే అంశాలు వున్నాయి. అలాగే బోర్‌ కొట్టించే సన్నివేశాలు కూడా బాగానే వున్నాయి. కామెడీ పరంగా నాని పెర్‌ఫార్మెన్స్‌లో చాలా చోట్ల భలే భలే మగాడివోయ్‌ ఫ్లేవర్‌ కనిపిస్తుంది. అలాగే హను రాఘవపూడి లవ్‌స్టోరీని నడిపించిన తీరు అందాల రాక్షసిని గుర్తు చేస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కథ, కథనం, ఫోటోగ్రఫీ, టేకింగ్‌, కామెడీ.. ఇలా అన్ని విషయాల్లో ఫస్ట్‌ హాఫ్‌ ది బెస్ట్‌ అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లోనే స్టోరీ అంతా ఓపెన్‌ అయిపోవడంతో సెకండాఫ్‌ నుంచి కథని క్లైమాక్స్‌కి తీసుకెళ్ళడానికి డైరెక్టర్‌ పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. ఈ ప్రాసెస్‌లో చాలా చోట్ల లాజిక్స్‌ మిస్‌ అయిన ఈ కృష్ణగాడి వీర ప్రేమగాథలో కృష్ణగాడి వీరత్వం కూడా మిస్‌ అయ్యిందనిపిస్తుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: వీరత్వంలేని ప్రేమగాథ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs