Advertisement
Google Ads BL

రివ్యూ: ప్రేమ్ రతన్ ధన్ పాయో


సల్మాన్ ఖాన్- సూరజ్ భరజాత్యలు దాదాపు పదహారేళ్ల తరువాత మరోసారి కలసి చేసిన అద్భుత సినిమానే ప్రేమ్ రతన్ ధన్ పాయో. వెండితెర పై ఇంత సక్సెస్ ఫుల్ జోడీ లేదేమో.! అందుకే సినీ ప్రేమికులేకాక, విమర్షకులు, సినీ ప్రముఖులు కూడా ఎంతగానో కుతుహలాన్ని చూపించారు. సూరజ్, సల్మాన్ ఇద్దరూ దాదాపు మూడు దశాభ్ధాల కిందట మైనే ప్యార్ కియా అనే చిత్రంతో ప్రారంభమయ్యారు. ఆ చిత్ర ఘన విజయంతో సల్మాన్ నూతన సూపర్ స్టార్ గా అవతరించి, ఈరోజు వరకు దేశవాప్తంగా ప్యాన్ ఫాలోయింగ్ సినిమ.. సినిమాకు పెంచుకొంటూ వస్తున్నాడు. ఇక సురజ్ భరజాత్య తన పాతికేళ్ల వయస్సులోనే  నూతన నటీనటులతో తన తాత 1947లో స్థాపించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ పై మైనే ప్యార్ కియా అనే గొప్ప ప్రేమకథా చిత్రానికి రచన, దర్శకత్వం వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే నూతన నటీనటులచే నిర్మంపబడిన ఈ చిత్రంపై ఎవరికి అంచనాలు లేవు.. చడీ చప్పుడు కాకుండా 1989లో రిలీజై యువతీ,యువకులకు విపరీతంగా నచ్చడమేకాక.. కుటుంభ ప్రేక్షకుల మన్ననలు కూడా పొంది, ఎన్నో చిన్న పట్టణాలలో సైతం వందరోజులు దిగ్విజంగా పూర్తి చేసుకుంది. ఇది తెలుగుతో పాటు ఇతర భాషలలోకి డబ్ అయి సూపర్ హిట్ అయ్యింది.  ఆ తరువాత ఈ సూపర్ హిట్ జోడి భారీ అంచనాలతో విడుదలై.. అంచనాలను మించి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రమే హమ్ ఆప్ కే హైకోన్. కుటుంభ కథా చిత్రాలను కూడా ఎంత భారీగా నిర్మించవచ్చో అనే దానికి..ఈ చిత్రమే గొప్ప ఉదాహరణ. ఆ తరువాత 1999లో వచ్చిన ఈ సూపర్ హిట్ జోడీల చివరి చిత్రమే.. హమ్ సాత్ సాత్ హై.. అంచనాలుకు తగ్గ హిట్ అయినా.. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే సల్మాన్ తో పాటు చిత్ర మిగితా స్టార్స్ క్రిష్ణ జింక కేసులో చిక్కుకోవడం.., దర్శకున్ని బాధపెట్టి.. సల్మాన్ తో ఇక చిత్రాలను నిర్మించవద్దు అనే కటిన నిర్ణయం తీసుకోడానికి గురిచేసింది. ఆ తరువాత సూరజ్ తీసిన రెండు చిత్రాలు ఆశించిన విజయాలు దక్కకపోవడంతో 2006 నుండి మరే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించలేదు.

Advertisement
CJ Advs

స్టొరీ; ఇందులో సల్మాన్ డ్యూయల్ రోల్. కథ ప్రేమ్(సల్మాన్) వద్ద మొదలవుతుంది. నటనే వృత్తిగా జీవిస్తున్న ప్రేమ్, తన తొలి చూపులోనే మైథిలీ (సోనమ్ కపూర్) ప్రేమలో పడతాడు. ఆమెను కలవడానికి విజయ్ సింగ్ (సల్మాన్ )పరిపాలనలో ఉన్నకింగ్ డంలోకి అడుగుపెడుతాడు. కానీ అప్పటికే విజయ్ సింగ్ చావు నుండి తప్పుకొని అపస్మారక  స్థితిలో చికిత్స పొందుతూ వుంటాడు. విధేయుడైన దివాన్ (అనుపమ్ ఖేర్).. నాలుగు రోజుల్లో రంగ రంగ వైభవంగా జరుప తలపెట్టిన ఉత్సవానికి మహరాజుని ఏవిధంగా సిధ్దం చేయాలో అర్థంకాని స్థితిలో ఉంటాడు. అప్పుడు ప్రేమ్ ని చూసి నాటకీయ పరిణామాల మధ్య ప్రేమ్ ని విజయ్ సింగ్ స్థానంలో రాజదర్బార్ కి పరిచయం చేస్తాడు. ఇక విజయ్ సింగ్ స్థానంలో వున్న ప్రేమ్ అందరి మన్ననలు ఎలా పొందాడు? కుటుంబంలో వున్న స్పర్థల్ని ఎలా తొలగించి మైథిలీ సొంతం చేసుకున్నాడు అనేదే మిగతా కథ. 

ఇందులో నటీనటుల విషయానికి వస్తే, ముందుగా చెప్పినట్టు మనకు సల్మాన్ ఖానే గుర్తుంటాడు.  నాసి రకమైన కథనాన్ని తన భుజాలపై మోస్తాడు. సోనమ్ యువరాణిగా చక్కగా, అందంగా సల్మాన్ పక్కన కనబడినా.. నటన అంతంత మాత్రమే.. ఇక ఆమె డాన్స్ లో మరీ పూర్. అర్మాన్ కొహ్లి చాలా ఎళ్ల తరువాత వెండి తెరపై.. అదీ నెగెటివ్ రోల్ లో సూపర్ గా చేసాడు. ఇక నీల్ నితిన్,అనుపమ్, దీపక్, స్వర భాస్కర్ అందరూ ఓకే అనిపించారు.

సూరజ్ చిత్రాలలో సంగీతానికే అత్యంత ప్రాధాన్యం. అన్ని చిత్రాలకు రాంలక్ష్మణ్ లే. కానీ లక్ష్మణ్ వయస్సు పైబడటంతో ఈ భాధ్యతను ఈసారి దర్శకుడు...సల్మాన్ కోరికపై హిమేష్ రేషింయాకు అప్పగించాడు. ఖచ్చితంగా వీరి పాత చిత్రాల స్థాయిలో, ఆ స్టాండర్డ్ లో లేకపోయినా పాటలు బానేవున్నాయి. కెమరా మణికన్ణణ్ పనితనం సూపర్. ఇక  ఆర్ట్, కాస్టూమ్స్ ది బెస్ట్ ఇచ్చారు. ఎడిటింగ్ చాలా ట్రిమ్ చేయాల్సింది.  

కథ, కథనం విషయయానికి వస్తే.. చాలా పాత కథ, చాలా బలహీనమైన స్క్రీన్ ప్లే. ఒక రాజు కథ చెబుతూ.. అందులో ప్రజలు, పరిపాలన గురించి మచ్చుకైనా లేకపోయినా మనం దర్శకున్ని తప్పుపట్టలేం.. ఎందుకంటే.. అతనెప్పుడు తానెంచుకొన్న, చెప్పాలనుకొన్న పాయింటు చుట్టునే సన్నివేశాలుంటాయి. కానీ,  ఆ సన్నివేశాలు మాత్రం గత చిత్రాల్లా కొత్తవిగా మాత్రం లేవు. కొన్నిసన్నివేశాలు మాత్రం కంటతడి పెట్టిస్తాయి.. అవి సల్మాన్ అతని సోదరికి సంభందించిన చివరి సన్నివేశాలు. క్లైమాక్స్ మాత్రం అసలు బాగోక అదరాబాదరాగా ముగించి.. ప్రేమ్, మైథిల ప్రేమ కథను  సుఖాంతం చేసేసాడు. సూరజ్ భరజాత్య దర్శకత్వం..అతని గత చిత్రాల దగ్గరే ఆగిపోయినట్లుంది. ఆయన చిత్రాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ ఈ జనరేషన్ కు మాత్రం అస్సలు నచ్చదు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షోలా సల్మాన్ ఖాన్ మాత్రమే కనిపిస్తాడు. కానీ ఇక్కడ బలమైన పాయింట్ అనుకున్న.. విజయ్ సింగ్- మైధిలీల మధ్య ఇది వరకే ఎంగేజ్ మెంట్ అయినా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించదు. అందుకు కారణం ఒకరంటే ఒకరికి చులకన. కానీ విజయ్ స్థానంలో వచ్చిన ప్రేమ్, మైథిలి హృధయాన్ని గెలుచుకొంటాడు. ఇది మనకు కొత్త కథ.. కానే కాదు. ఇలాంటివి చాలా సంవత్సరాలుగా చాలా కథలు వచ్చాయి. భాజరంగి భాయిజన్ తర్వాత సల్మాన్ చేయాల్సిన సినిమా అయితే ఖచ్చితంగా ఇది కాదు. కుటుంబ  కథా చిత్రాలను, సల్మాన్-సూరజ్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందేమో గానీ... సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమా ప్రేమ లో పడలేడు. 

ఫినిషింగ్ టచ్: ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రమే..!

రేటింగ్: 2.5/5 

                                                                               Chiiti

 

Click Here For prem ratan dhan payo English Review

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs