Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: డైనమైట్‌


24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ 

Advertisement
CJ Advs

డైనమైట్‌ 

తారాగణం: మంచు విష్ణు, ప్రణీత, జె.డి.చక్రవర్తి, 

నాగినీడు, యోగ్‌ జేపి, ప్రవీణ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల 

ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌ 

సంగీతం: అచ్చు 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: చిన్నా 

కథ: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ 

మాటలు: బి.వి.ఎస్‌.రవి 

సమర్పణ: ఆరియానా వివియానా 

నిర్మాత: మంచు విష్ణు 

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దేవా కట్టా 

విడుదల తేదీ: 04.09.2015 

డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి హీరోగా, నిర్మాతగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాలని మంచు విష్ణు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైనమైట్‌ చిత్రం కూడా అందులో భాగంగానే చెప్పొచ్చు. తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయి బాక్సాఫీస్‌ దగ్గర కూడా సక్సెస్‌ అయిన అరిమ నంబి చిత్రానికి రీమేక్‌గా దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రం డైనమైట్‌. మరి విష్ణు చేసిన ఈ డిఫరెంట్‌ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్‌ అయింది? తమిళ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన అరిమ నంబి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్‌ చెయ్యగలిగారు? ఆడియన్స్‌ ఈ సినిమాని ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: శివాజీ(మంచు విష్ణు) డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తూ జాలీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేసే కుర్రాడు. అతను ఓ సందర్భంలో హీరో అనిపించుకోవడంతో అక్కడ అనామిక(ప్రణీత) పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా ఫస్ట్‌ డేట్‌కి దారి తీస్తుంది. ఇద్దరూ కలిసి ఫుల్‌గా మందేస్తారు. ఆ తర్వాత అనామిక ఫ్లాట్‌కి వస్తారు. అప్పుడు సెంట్రల్‌ మినిస్టర్‌ రిషిదేవ్‌(జె.డి.చక్రవర్తి)కి చెందిన రౌడీలు అనామికను కిడ్నాప్‌ చేస్తారు. శివాజీ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు నమ్మరు. ఫ్లాట్‌లో కిడ్నాప్‌ అయిన దాఖలాలు కనిపించవు. అనామిక తండ్రికి ఫోన్‌ చేస్తే ఆమె హైదరాబాద్‌లో లేదని, గోవాలో వుందని చెప్తాడు. అప్పటి వరకు శివాజీతో వుండి ఎంక్వయిరీ చేసిన ఎస్‌.ఐ. స్వామి(నాగినీడు) అతన్ని ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ కిడ్నాప్‌ వెనుక ఏదో మిస్టరీ వుందని శివాజీ, స్వామి గ్రహిస్తారు. అది తెలుసుకునే ప్రయత్నంలో కిడ్నాపర్ల చేతిలో చనిపోతాడు స్వామి. కిడ్నాపైన అనామిక ఛానల్‌ 24 ఎం.డి. దాసరి రంగనాథ్‌(పరుచూరి వెంకటేశ్వరరావు) కూతురని, ఒక మెమరి చిప్‌ కోసం ఆమెను కిడ్నాప్‌ చేశారని తెలుసుకుంటాడు శివాజీ. ఆ మెమరీ చిప్‌లో ఏముంది? దానికి అనామికకు వున్న సంబంధం ఏమిటి? శివాజీ కిడ్నాప్‌ మిస్టరీని ఛేదించగలిగాడా? సెంట్రల్‌ మినిస్టర్‌కి, ఈ కిడ్నాప్‌కి వున్న సంబంధం ఏమిటి? కిడ్నాప్‌ అయిన అనామికను శివాజీ కాపాడగలిగాడా? ఆ చిప్‌లో వున్న రహస్యం ఏమిటో తెలుసుకోగలిగాడా? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: డిఫరెంట్‌ లుక్‌తో, డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో వున్న శివాజీ క్యారెక్టర్‌ని మంచు విష్ణు పర్‌ఫెక్ట్‌గా చేశాడు. డైలాగ్స్‌లో, ఫైట్స్‌లో హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఇప్పటివరకు మంచు విష్ణు చేసిన క్యారెక్టర్స్‌లో ఇది ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ అని చెప్పొచ్చు. అనామికగా ప్రణీత గ్లామర్‌గా వుంటూనే పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగానే చేసింది. విలన్‌గా జె.డి.చక్రవర్తి కొత్తగా కనిపించాడు. చాలా సీన్స్‌లో ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. తమిళ్‌లో చేసిన క్యారెక్టర్‌నే తెలుగులోనూ చేశాడు. అలాగే యోగ్‌ జేపి కూడా తమిళ్‌లో చేసిన క్యారెక్టర్‌నే తెలుగులోనూ చేశాడు. వున్నంతలో బాగానే పెర్‌ఫార్మ్‌ చేశాడు. విష్ణు ఫ్రెండ్‌గా ప్రవీణ్‌, ఒకే ఒక్క సీన్‌లో కనిపించిన వైవా హర్ష, ప్రభాస్‌ శ్రీనులు కూడా ఫర్వాలేదనిపించారు. 

టెక్నీషియన్స్‌: టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది ఫైట్‌మాస్టర్‌ విజయన్‌ గురించి. కథ పరంగా ఎక్కువ ఫైట్స్‌, ఛేజింగ్‌లు వుండడంతో వాటిని చాలా బాగా డిజైన్‌ చేసుకున్నాడు విజయ్‌. దానికి తగ్గట్టుగానే విష్ణు కూడా బాగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. ముత్యాల సతీష్‌ ఫోటోగ్రఫీ కూడా బాగా చేశాడు. సీన్స్‌లోగానీ, ఫైట్స్‌లోగానీ ఫ్రేమింగ్‌ బాగుంది. పాటలు కూడా విజువల్‌గా బాగా తీశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అచ్చు విషయానికి వస్తే పాటలు ఫర్వాలేదు అనిపించాడు. చిన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. సినిమా స్టార్ట్‌ అయిన పది నిముషాల నుంచి సినిమా స్పీడ్‌ అందుకుంటుంది. దానికి తగ్గట్టుగానే చిన్నా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని పరిగెత్తించాడు. ఎస్‌.ఆర్‌. శేఖర్‌ ఎడిటింగ్‌ కూడా స్పీడ్‌గానే వుంది. కాకపోతే సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్‌ ఎక్కడ వున్నారో వెతికే ప్రాసెస్‌ చాలా ఎక్కువైంది. దానివల్ల సినిమా లెంగ్త్‌ కూడా బాగా పెరిగింది. అది కాస్త ట్రిమ్‌ చేసి వుంటే సినిమా ఇంకా స్పీడ్‌గా వుండేది. బి.వి.ఎస్‌.రవి మాటలు సందర్భానుసారం బాగానే వున్నాయి. ఇక డైరెక్టర్‌ దేవా కట్టా గురించి చెప్పాలంటే ఇంతకుముందు అతను చేసిన సినిమాలకీ, ఈ సినిమాకీ కథ పరంగా, బ్యాక్‌డ్రాప్‌ పరంగా చాలా డిఫరెన్స్‌ వుంది. తమిళ్‌లో ప్రూవ్‌ చేసుకున్న సబ్జెక్ట్‌ని తెలుగులో చాలా మార్పులు చేసింది 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ యూనిట్‌. దానికి మంచి స్క్రీన్‌ప్లే రాసుకొని టేకింగ్‌ పరంగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దేవా. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమా చాలా రిచ్‌గా నిర్మించారు. 

విశ్లేషణ: గతంలో ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఏదో ఒక మర్డర్‌ కేసులో పొలిటికల్‌ లీడర్స్‌ ఇన్‌వాల్వ్‌ అయి వుండడం, దానికి సంబంధించిన ఏదో ఒక ఆధారం హీరో దగ్గర వుండడం, దాని కోసం విలన్‌ మర్డర్స్‌ చేస్తూ వెళ్ళడం చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమా విషయానికి వస్తే కథ, కథనాల్లో కొత్తదనం వుండడం, టెక్నికల్‌గా స్టాండర్డ్స్‌ పెరగడం వల్ల డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్‌ అయిన పది నిముషాల్లో ఆడియన్స్‌ని స్టోరీలో ఇన్వ్‌వాల్వ్‌ చెయ్యడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ హాఫ్‌ వరకు ఆ స్పీడ్‌లోనే వెళ్తుంది. అయితే ఇంటర్వెల్‌ మాత్రం ఎలాంటి ట్విస్ట్‌ లేకుండా చాలా సాదా సీదాగా అయిందనిపించారు. ఇక సెకండాఫ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత సెంట్రల్‌ మినిష్టర్‌ రిషిదేవ్‌ హైదరాబాద్‌ వచ్చి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకొని హీరో, హీరోయిన్‌ కోసం ఆన్‌లైన్‌లోనే వెతికే సీన్స్‌ ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌ కలిగించకపోగా తెగ బోర్‌ కొట్టించాయి. దాదాపు అరగంట సేపు సాగే ఈ సెర్చింగ్‌ వల్ల అప్పటి వరకు వున్న స్పీడ్‌ కాస్తా తగ్గిపోతుంది. మళ్ళీ కథలోకి వచ్చి ఒక ప్లాన్‌ ప్రకారం అన్నీ ప్రూవ్‌ చేసి రిషిదేవ్‌ని పోలీసులకు పట్టించడంతో కథ ముగుస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో వున్న స్పీడ్‌ సెకండాఫ్‌లో లేకపోవడం, మధ్య మధ్య వచ్చే పాటలు ఫ్లోని దెబ్బ తియ్యడం వల్ల కథ పక్కదారి పట్టింది. దానికి తగ్గట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం కూడా ఆడియన్స్‌ రిలీఫ్‌ లేకుండా చేసింది. రెగ్యులర్‌గా కామెడీని, డాన్సుల్ని కోరుకునే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రం కాదు. కొత్త తరహా సినిమాలు చూడాలనుకేవారికి మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: డైనమైట్‌ బాగానే పేలింది 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs