Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: యూత్‌ఫుల్‌ లవ్‌


నవీన్‌ క్రియేషన్స్‌

Advertisement
CJ Advs

యూత్‌ఫుల్‌ లవ్‌

నటీనటులు: మనోజ్‌ నందం, ప్రియదర్శిని, అజిత్‌,

థ్రిల్లర్‌ మంజు, ముక్తార్‌ ఖాన్‌, మైథిలి, నవీన్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: సి.శ్రావణ్‌కుమార్‌

సంగీతం: శ్రీకాంత్‌ దేవా

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సునీల్‌ కశ్యప్‌

ఎడిటింగ్‌: నందమూరి హరి

నిర్మాత: రాధారం రాజలింగం

రచన, దర్శకత్వం: వేముగంటి

విడుదల తేదీ: 03.07.2015

ప్రస్తుతం యూత్‌ ఎలా వుంది, వారి ఆలోచనా ధోరణి ఎలా వుంది, ప్రేమ విషయంలో వారికి వున్న క్లారిటీని తెలియజేసే సినిమాలు ఈమధ్యకాలంలో చాలా వచ్చాయి. అలాంటి మరో యూత్‌ఫుల్‌ మూవీ ‘యూత్‌ఫుల్‌ లవ్‌’. మనోజ్‌ నందం హీరోగా నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో రాధారం రాజలింగం నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంలో ప్రజెంట్‌ యూత్‌ని ఎలా ప్రజెంట్‌ చేశారు? ఈ చిత్రం ద్వారా యూత్‌కి ఎలాంటి మెసేజ్‌ ఇచ్చారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

కథ: మన హీరో వెంకట్‌(మనోజ్‌ నందం) ఓ మధ్య తరగతికి చెందిన కుర్రాడు. తండ్రిలేని వెంకట్‌ తల్లితో కలిసి వుంటూ చదువుకునే కుర్రాడు. అతనికి కరాటే అంటే ప్రాణం. ఆ విద్యను నేర్చుకోవడమే కాకుండా దాన్ని పదిమందికీ నేర్పించాలన్న సదుద్దేశం వున్నవాడు. ఇక హీరోయిన్‌ మేఘన(ప్రియ) ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. సాఫ్ట్‌వేర్‌ కల్చర్‌, పార్టీలు అంటే ఇష్టంలేని మేఘన తమ ఆఫీస్‌ స్టాఫ్‌ ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీలో సహోద్యోగులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతారు. అది టాక్‌ ఆఫ్‌ స్టేట్‌ అవుతుంది. అయినా వారిపై ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేయమని పోలీసులను రిక్వెస్ట్‌ చేస్తుంది. ఇలా వుండగా ఓ ప్రమాదం నుంచి ప్రియను రక్షిస్తాడు వెంకట్‌. అప్పటి నుంచి అతనంటే ప్రియకు అభిమానం, ప్రేమ ఏర్పడతాయి. కట్‌ చేస్తే కరాటేలో ఛాంపియన్‌ అయిన ముక్తార్‌ ఖాన్‌కు విదేశీయుల నుంచి ఓ భారీ ఆఫర్‌ వస్తుంది. హైదరాబాద్‌ సిటీలోని గూండాలను, రౌడీలను తప్పించి వారి స్థానంలో మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్న మనుషులను ఏర్పాటు చేసి ఆయా ఏరియాల్లో వారిని నిలబెట్టాలని విదేశీయులు పెద్ద మొత్తంలో ముక్తార్‌కు డబ్బు ఇస్తారు. ముక్తార్‌ అనుచరుల్లో మొదటివాడైన విజయ్‌(అజిత్‌) మేఘనపై మనసు పడతాడు. తనను ప్రేమించమని, లేదంటే వెంకట్‌ని చంపేస్తానని బెదిరిస్తూ వుంటాడు. మరోపక్క థ్రిల్లర్‌ మంజు మార్షల్‌ ఆర్ట్స్‌లో కుర్రాళ్ళకు శిక్షణ ఇస్తుంటాడు. వెంకట్‌ కూడా అక్కడే శిక్షణ పొందుతుంటాడు. ముక్తార్‌ గ్యాంగ్‌ వల్ల సిటీ అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ థ్రిల్లర్‌ మంజు సహాయం కోరుతుంది. విజయ్‌ బారి నుంచి మేఘన రక్షింపబడిరదా? వెంకట్‌, మేఘనల ప్రేమ ఎన్ని మలుపులు తిరిగింది? అల్లకల్లోలం అయిన సిటీని థ్రిల్లర్‌ మంజు, అతని స్టూడెంట్స్‌ ఏవిధంగా రక్షించారు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: వెంకట్‌గా మనోజ్‌ నందం తనకి వున్న పరిధిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మార్షల్‌ ఆర్ట్స్‌లో తన ప్రావీణ్యాన్ని చూపించాడు. ప్రేమ సన్నివేశాల్లో కూడా ఫర్వాలేదు అనిపించాడు. మేఘనగా ప్రియదర్శిని మంచి నటనను ప్రదర్శించింది. ఒక విధంగా సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా థ్రిల్లర్‌ మంజు చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేశాడు. తన ఫైట్స్‌తో ఆకట్టుకున్నాడు. విలన్‌గా నటించిన అజిత్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. కొత్త కుర్రాడు నవీన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ని అద్భుతంగా ప్రదర్శించాడు. 

టెక్నీషియన్స్‌: టెక్నికల్‌గా ఈ సినిమాకి వున్న ప్రత్యేకతలు చాలా తక్కువ. శ్రావణ్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద మైనస్‌. సినిమాలో ఫోటోగ్రఫీపరంగా ఎక్కడా రిచ్‌నెస్‌ కనిపించదు. ఒక్కో షాట్‌ ఒక్కో రకమైన లైటింగ్‌తో అస్తవ్యస్తంగా వుంటుంది. ఆడియోపరంగా పాటలు బాగున్నప్పటికీ వాటిని పిక్చరైజ్‌ చెయ్యడంలో సినిమాటోగ్రాఫర్‌, కొరియోగ్రాఫర్స్‌ సక్సెస్‌ కాలేకపోయారు. దానికి తగ్గట్టుగానే ఎడిటింగ్‌ కూడా వుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు ముక్కలు ముక్కలుగా వుంటుందే తప్ప ఒక ఫ్లో అనేది లేదు. రాజేష్‌ సాయి అందించిన మాటలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. ఎంతో డెప్త్‌ వున్న సీన్స్‌లో కూడా మాటలు తేలిపోయాయి. టెక్నీషియన్స్‌లో కాస్తో కూస్తో చెప్పుకోదగినవి పాటలు మాత్రమే. కుమారి శ్రేష్ఠ పాటలకు అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. సినిమాలో వున్న నాలుగు పాటలు, నాలుగు వేరియేషన్స్‌లో వీనుల విందుగా అనిపిస్తాయి. పాటలోని ప్రతి మాట అర్థమయ్యేలా వుంటుంది. శ్రీకాంత్‌ దేవా పాటలకి మంచి ట్యూన్స్‌ అందించారు. ఇక సునీల్‌ కశ్యప్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపిస్తుంది. ఇంతకుముందు అతను చేసిన సినిమాలతో పోలిస్తే నాశిరకం మ్యూజిక్‌ ఇచ్చాడనే చెప్పాలి. అమ్మాయిలు తమని తాము కాపాడుకోవడానికి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం అవసరం అనే పాయింట్‌ బాగున్నప్పటికీ దాన్ని చెప్పిన తీరు గందరగోళంగా మారింది. ప్రేమ గురించి చెప్పాలనుకున్నాడో, మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాధాన్యం గురించి చెప్పాలనుకున్నాడో ఆడియన్‌కి అర్థం కాని పరిస్థితిలో సినిమా వుంటుంది. కథ, కథనాల్లో డైరెక్టర్‌కి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల సీన్స్‌ అన్నీ ముక్కలు ముక్కలుగా అనిపిస్తాయి. సీన్‌, సీన్‌కి లింక్‌ లేకపోవడం వల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తుంది. ఇక ప్రొడక్షన్‌ వేల్యూస్‌ గురించి చెప్పాలంటే ఎంచుకున్న పాయింట్‌ మంచిదే అయినప్పటికీ మేకింగ్‌ పరంగా ఎక్కడా రిచ్‌నెస్‌ కనిపించదు. 

విశ్లేషణ: లవ్‌తో స్టార్ట్‌ అయిన కథ మధ్య మధ్య మార్షల్‌ ఆర్ట్స్‌ వైపు వెళ్ళి, ఆ తర్వాత ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ టర్న్‌ తీసుకుంటుంది. లవ్‌ స్టోరీ చూస్తున్నామా, మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ చూస్తున్నామా అనే సందేహం ప్రేక్షకులకు కలుగుతుంది. అనవసరమైన సీన్స్‌, నవ్వు తెప్పించని కామెడీ సీన్స్‌, మధ్య మధ్య హీరోయిన్‌ని విసిగించే విలన్‌ సీన్స్‌తో ఫస్ట్‌ హాఫ్‌ అయిందనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి మళ్ళీ అలాంటి సీన్సే రిపీట్‌ అవుతూ చివరికి దుష్ట శిక్షణ చేసేందుకు థ్రిల్లర్‌మంజు టీమ్‌ రంగంలోకి దిగడంతో సినిమా క్లైమాక్స్‌కి చేరుతుంది. సిటీని గడగడలాడిరచిన రౌడీలందర్నీ చాలా సులువుగా అంత మొందిస్తారు. హీరో, విలన్‌ మధ్య జరిగే ఫైట్‌తో సినిమా ఎండ్‌ అవుతుంది. సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాకి ‘యూత్‌ఫుల్‌ లవ్‌’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారనే డౌట్‌ ఆడియన్‌కి వస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమాలో అనేక అంశాల గురించి డిస్కస్‌ చేసినప్పటికీ ‘యూత్‌ఫుల్‌ లవ్‌’ అనే ఈ సినిమాలో యూత్‌ని ఆకట్టుకునే మంచి కామెడీ లేకపోవడం పెద్ద మైనస్‌గా చెప్పుకోవచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: విషయంలేని ‘యూత్‌ఫుల్‌ లవ్‌’

సినీజోష్‌ రేటింగ్‌: 1.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs