Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌?


శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్‌

Advertisement
CJ Advs

వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌?

నటీనటులు: ప్రిన్స్‌, జ్యోతి సేథి, మధు నందన్‌, రావు రమేష్‌,

జయప్రకాష్‌రెడ్డి, ఆశిష్‌ విద్యార్థి, పంకజ్‌ కేసరి, సంపూర్ణేష్‌బాబు,

సప్తగిరి, తాగుబోతు రమేష్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు

సంగీతం: కమ్రాన్‌

ఎడిటింగ్‌: మధు

సమర్పణ: కృష్ణ బద్రి, శ్రీధర్‌రెడ్డి

నిర్మాతలు: ఎల్‌.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి,

ఆలూరి చిరంజీవి

రచన, దర్శకత్వం: శ్రీనివాస్‌

విడుదల తేదీ: 26.06.2015

‘కథ’, ‘ఒక్కడినే’ వంటి డిఫరెంట్‌ చిత్రాలను రూపొందించిన శ్రీనివాస్‌ రాగ తాజాగా ‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌?’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో చేసిన క్రైమ్‌ కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రిన్స్‌, జ్యోతిసేథి జంటగా ఎల్‌.వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మీనరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన మొదటి రెండు సినిమాలను  విభిన్నమైన కథలతో రూపొందించిన శ్రీనివాస్‌ ‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌?’ చిత్రాన్ని క్రైమ్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కించాడు. మరి ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చేసింది? శ్రీనివాస్‌ ఎంచుకున్న క్రైమ్‌ కామెడీ తను అనుకున్నట్టు ఆడియన్స్‌కి రీచ్‌ అయిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.

కథ: ఓపెన్‌ చేస్తే ఒక హిజ్రాని కారుమంచి రఘు అతని గ్యాంగ్‌ వెంబడిస్తుంటారు. ఆ ఛేజ్‌లో ఆ హిజ్రా యాక్సిడెంట్‌కి గురవుతాడు. కట్‌ చేస్తే ఇందులో హీరో పేరు కిరణ్‌(ప్రిన్స్‌). ఒక పిజ్జా కార్నర్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన జీవితం, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కిరణ్‌ తన జీవితం తన ఇష్టం అంటూ ఇంటి నుంచి బయటికి వచ్చేసి లైఫ్‌ రన్‌ చేస్తున్న కిరణ్‌కి యాక్సిడెంటల్‌గా స్వాతి(జ్యోతి సేథి) అనే డాక్టర్‌ పరిచయమవుతుంది. ఆమెను తొలిచూపులోనే లవ్‌ చేసేస్తాడు. తనను ప్రేమించమంటూ వెంటపడి వేధిస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న స్వాతి బావ వాల్తేరు వాసు(మధునందన్‌) ఒక ప్లాన్‌ ప్రకారం కిరణ్‌ని బుక్‌ చేసి స్వాతి ముందు బ్యాడ్‌ చేస్తాడు. ఇదిలా వుంటే హోం మినిస్టర్‌ పులినాయుడు(జయప్రకాష్‌రెడ్డి) హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకొని హాస్పిటల్‌ నుంచి తిరిగి వస్తాడు. సూర్య ఫౌండేషన్‌లో సర్జన్‌గా పనిచేసే రావు రమేష్‌ అతనికి హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తాడు. అదే హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేసే హర్ష(రవిప్రకాష్‌) హోం మినిస్టర్‌కి ఒక వీడియో పంపిస్తాడు. ఆ వీడియో వున్న ఫోన్‌ కావాలంటే 10 కోట్లు పంపించమని చెప్తాడు. అప్పుడు డాన్‌ ఘంటా(సంపూర్ణేష్‌బాబు)ని రంగంలోకి దింపుతాడు హోం మినిస్టర్‌. తనను బ్లాక్‌మెయిల్‌ చేసే వాడిని వేసేస్తే రెండు కోట్లు ఇస్తానంటాడు. హర్ష చెప్పిన చోటుకి డబ్బుతో వెళ్ళిన ఘంటాకి ఓ షాక్‌ తగులుతుంది. అదే టైమ్‌లో ఆ ఫోన్‌ కోసం ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌(పంకజ్‌ కేసరి) కూడా దిగుతాడు. ఈ ఘర్షణలో హర్ష గాయపడతాడు. అదే టైమ్‌లో అక్కడికి వచ్చిన కిరణ్‌, వాసులను హెల్ప్‌ చేయమని అడుగుతాడు. అతన్ని కారులో ఎక్కించుకొని తీసుకొస్తారు. అయితే అప్పటికే అతను చనిపోతాడు. హర్షని హత్య చేసారంటూ కిరణ్‌, వాసు వార్తల్లోకి ఎక్కుతారు. హర్ష హోం మినిస్టర్‌కి పంపిన వీడియోలో ఏముంది? హర్ష చనిపోయిన తర్వాత ఆ ఫోన్‌ ఏమైంది? అసలు ఈ సినిమాకి ‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌?’ అనే టైటిల్‌ పెట్టడానికి రీజన్‌ ఏమిటి? విద్యాబాలన్‌కి ఆ ఫోన్‌తో ఏం సంబంధం వుంది? ఈ కేసు నుంచి కిరణ్‌, వాసు ఎలా తప్పించుకున్నారు? అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: పిజ్జా డెలివరీ బాయ్‌గా, లవర్‌గా, ఒక మర్డర్‌ కేసులో ఇరుక్కున్న అమాయకుడిగా ప్రిన్స్‌ నటన బాగుంది. అతని లవర్‌గా జ్యోతి సేథి పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. పాటల్లో తన గ్లామర్‌తో అలరించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే బీచ్‌ సాంగ్‌లో మరింత గ్లామర్‌గా కనిపించింది. వాల్తేరు వాసుగా మధునందన్‌ అందర్నీ నవ్వించాడు. హోం మినిస్టర్‌గా, హిజ్రాగా రెండు వేరియేషన్స్‌ వున్న క్యారెక్టర్‌లో జయప్రకాష్‌రెడ్డి బాగానే కామెడీ చేశాడు. సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఆశిష్‌ విద్యార్థి పెర్‌ఫార్మెన్స్‌ సెటిల్డ్‌గా వుంది. రెండు, మూడు సీన్స్‌లో కనిపించిన తాగుబోతు రమేష్‌ క్లైమాక్స్‌కి ముందు కనిపించిన సప్తగిరి చేసిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంటుంది. డాన్‌ ఘంటాగా సంపూర్ణేష్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌ ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటివరకు స్ఫూఫ్‌ కామెడీ చేస్తూ వచ్చిన సంపూకి ఈ సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్‌ ఇచ్చారు. విలన్‌గా రావు రమేష్‌ ఎప్పటిలాగే బాగానే చేశాడు. జబర్దస్త్‌ టీమ్‌ చేసిన కామెడీ కూడా అందర్నీ నవ్వించింది. స్పెషల్‌ సాంగ్‌లో కనిపించిన జెన్నీఫర్‌ తన అందాలతో మాస్‌ ఆడియన్స్‌కి కనువిందు చేసింది. 

టెక్నీషియన్స్‌: క్రైమ్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి టెక్నికల్‌గా హైలైట్స్‌ ఏమీ లేనప్పటికీ కథ, కథనం ప్రకారం చిట్టిబాబు అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు కమ్రాన్‌ పాటల పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయినప్పటికీ సినిమాలో వచ్చే రకరకాల సిట్యుయేషన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు అనిపించాడు. మధు ఎడిటింగ్‌ కూడా ఓకే అనిపించేలా చేశాడు. డైరెక్టర్‌ శ్రీనివాస్‌ గురించి చెప్పాలంటే ఈ సినిమాకి ‘వేర్‌ ఈజ్‌ విద్యాబాలన్‌?’ అనే టైటిల్‌ని సెలెక్ట్‌ చేసుకోవడంలోనే మొదటి సక్సెస్‌ సాధించాడు. విద్యాబాలన్‌కి ఈ సినిమాతో సంబంధం ఏమిటి? అనే ఆలోచనతో థియేటర్‌లోకి వెళ్ళే ఆడియన్స్‌ కన్విన్స్‌ అయ్యేలా ఆ పేరును వాడుకున్నాడు. అయితే అతను అనుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ సినిమాలో చాలా మైనస్‌లు వున్నాయి. సినిమా స్టార్టింగ్‌ గానీ, హీరో, హీరోయిన్‌ పరిచయం గానీ, హీరోయిన్‌ ప్రేమ కోసం హీరో వెంటపడే సీన్స్‌, అక్కడ వచ్చే పాట ఇవన్నీ చాలా రొటీన్‌గా వుండడమే కాకుండా మొదట్లోనే సినిమా మీద నెగెటివ్‌ ఇంప్రెషన్‌ పడిపోతుంది. ఆ తర్వాత వచ్చే సీన్స్‌ కూడా కొత్తగా ఏమీ అనిపించవు. ఎప్పుడైతే మనల్ని అసలు కథలోకి తీసుకెళ్తాడో అప్పటి నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అవుతుంది. ఇక అక్కడి నుంచి నెక్స్‌ట్‌ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌లో కలిగేలా చెయ్యగలిగాడు. ఈ క్రైమ్‌ కథకి కామెడీని కూడా జోడిరచడం వల్ల సీరియస్‌నెస్‌ అనేది లేకుండా సాఫీగా సినిమా చూసేలా వుంది. ఇందులో లాజిక్‌ లేని సీన్స్‌, అనవసరంగా ఇరికించిన సీన్స్‌ చాలా వున్నప్పటికీ మధ్య మధ్య కామెడీ సీన్స్‌ వాటి గురించి ఆలోచించేలా చెయ్యవు. 

ప్లస్‌ పాయింట్స్‌: 

కథ

సినిమా టైటిల్‌

కామెడీ

మైనస్‌ పాయింట్స్‌:

ఫస్ట్‌ హాఫ్‌లో రొటీన్‌ సీన్స్‌

పాటలు

విశ్లేషణ: ఒక సాధారణ కథగా స్టార్ట్‌ చేసి, దానికి కాస్త లవ్‌ ఎలిమెంట్‌ని కూడా చేర్చి ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళడంతో ఫస్ట్‌ హాఫ్‌ కంప్లీట్‌ అయిపోతుంది. అలా ఫస్ట్‌ హాఫ్‌ కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ స్లోగా రన్‌ అయినప్పటికీ సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమా కాస్త స్పీడ్‌ అవుతుంది. మధ్య మధ్య బోరింగ్‌ సీన్స్‌, రిపీటెడ్‌ సీన్స్‌ వచ్చినా కామెడీని ఎంజాయ్‌ చేసే మూడ్‌లో వున్న ఆడియన్స్‌ వాటిని అంతగా పట్టించుకోరు. ఆర్గన్‌ మాఫియాని ముఖ్య కథా వస్తువుగా తీసుకున్న శ్రీనివాస్‌ దాని చుట్టూ ఒక ప్రేమకథని, కొంత కామెడీని జతచేసాడు. సంపూర్ణేష్‌బాబుకి ఒక విచిత్రమైన క్యారెక్టర్‌ ఇచ్చి దానితో కామెడీని పండిరచాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌కిగానీ, హీరోయిన్‌ క్యారెక్టర్‌కిగానీ ఇంపార్టెన్స్‌ ఏమీ వుండదు. హీరోకి హీరోయిజమ్‌ చూపించాల్సిన అవసరం లేకుండా పోయింది. సిట్యుయేషన్‌ డిమాండ్‌ మేరకు సినిమాలోని ఆర్టిస్టులంతా నటించారు. ఫైనల్‌గా చెప్పాలంటే లాజిక్‌లు పక్కన పెట్టేసి నవ్వుకోవడానికి సినిమా చూడొచ్చు. బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌ మాత్రం ఈ సినిమాలోని కామెడీని ఎంజాయ్‌ చేస్తారని చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: నో లాజిక్‌.. ఓన్లీ కామెడీ

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs