Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: చిత్రమ్‌ కాదు నిజమ్‌


గుడ్‌ సినిమా, శైలేంద్ర ప్రొడక్షన్స్‌

Advertisement
CJ Advs

చిత్రమ్‌ కాదు నిజమ్‌ 

నటీనటులు: దర్శన్‌ అపూర్వ, కృష్ణ ప్రకాష్‌,

విజయ్‌ చెందూర్‌, పల్లవి, తనూజ, మృత్యుంజయ

సినిమాటోగ్రఫీ: కీర్తి బి.ఎల్‌.శంకర్‌, ఆరాధ్య శంకర్‌

దర్శకత్వం: కె.ఎస్‌.అశోక

విడుదల తేదీ: 03.04.2015

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హార్రర్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. మన డైరెక్టర్లు ఎవరికి తోచిన విధంగా వారు ఆడియన్స్‌ని భయపెట్టాలని తెగ ట్రై చేస్తున్నారు. అలా వచ్చిన సినిమాల్లో కొన్ని ఆడియన్స్‌ భయపెడుతూ థ్రిల్‌ చేస్తున్నాయి. కానీ, ఈరోజు రిలీజ్‌ అయిన ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’ మాత్రం ఒక యదార్థ సంఘటనని బేస్‌ చేసుకుని తీసిన సినిమా. 2010లో మంగుళూరుకి 90 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ అడవిలోకి నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వెళ్ళారు. అసలు ఈ ఆరుగురు అడవిలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎదురైన వారికి ఎదురైన అనుభవాలు ఏమిటి? వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: రమేష్‌(దర్శన్‌ అపూర్వ)కి సినిమా కెమెరామెన్‌ కావాలన్నది కల. అడవిలోకి ట్రెక్కింగ్‌ వెళ్ళి ఒక డాక్యుమెంటరీ తియ్యాలన్న ఉద్దేశంతో అతని స్నేహితులు నవీన్‌(కృష్ణప్రకాష్‌), కుమార్‌(విజయ్‌ చెందూర్‌), సౌమ్య(పల్లవి), దీప(తనూజ), ప్రకాష్‌(మృత్యుంజయ)లతో కలిసి అడవిలోని ఒక ఎత్తయిన శిఖరాన్ని చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంటారు. అలా బయలుదేరిన వారికి అడుగడుగునా ఏదో ఒక అవాంతరం, భయపెట్టే సంఘటనలు ఎదురవుతుంటాయి. వారు టార్గెట్‌ చేసుకున్న శిఖరాన్ని చేరుకున్నారా? క్షేమంగా తిరిగి వచ్చారా? అనేది మిగతా కథ.

ప్లస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి మెయిన్‌ ప్లస్‌ పాయింట్‌గా చెప్పాల్సి వస్తే అది కాన్సెప్ట్‌. హార్రర్‌ మూవీ కోసం ఒక కథని రాసుకోవడం కాకుండా నిజంగా జరిగిన సంఘటనని సినిమాగా తియ్యాలనుకోవడం సినిమాకి ప్లస్‌ అయింది. కెమెరా వర్క్‌ బాగుంది. పాటలు, రీరికార్డింగ్‌ అనేది లేకుండా ఈ చిత్రాన్ని చెయ్యడం వల్ల నేచురల్‌గా వుంటుంది. ఆర్టిస్టులు వారి వారి క్యారెక్టర్స్‌కి పూర్తి న్యాయం చేశారు. ఈ సబ్జెక్ట్‌ని డైరెక్టర్‌ బాగానే హ్యాండిల్‌ చేశాడు. చాలా చోట్ల నిజంగానే భయపెట్టాడు. 

మైనస్‌ పాయింట్స్‌: అడవిలో ఒక డాక్యుమెంటరీ తియ్యాలని రమేష్‌ బయలుదేరాడు. మనకు ఈ సినిమా చూస్తున్నంత సేపు అదే ఫీలింగ్‌ కలుగుతుంది తప్ప సినిమా చూస్తున్న ఫీల్‌ రాదు. అడవిలో వాళ్ళు తీసిన ఫుటేజ్‌నే చూపిస్తున్నామని నమ్మించడం కోసం సినిమాలో చాలా టైమ్‌ వేస్ట్‌ చేశారు. కొన్ని సీన్ల కోసం ఎక్కువ టైమ్‌ తీసుకోవడం కూడా బోర్‌ కొట్టిస్తుంది. ఇది యదార్థ సంఘటనలతో తీసిన సినిమా అని చెప్తూనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూపించడంతో నిజంగా జరిగిన సంఘటనగా కాకుండా ఒక సినిమా చూస్తున్న ఫీలింగే ఆడియన్స్‌కి కలిగిస్తుంది. కొన్ని ఎబ్బెట్టు కలిగించే సీన్స్‌ కూడా చూసే ఆడియన్స్‌కి ఇబ్బంది కలిగిస్తాయి. 

విశ్లేషణ: 2010లో కర్ణాటకలో జరిగిన సంఘటన ఇది. అంతవరకు బాగానే వుంది. అప్పుడు దొరికిన కెమెరాలోని ఫుటేజ్‌ని తీసుకొని దాన్ని యధాతథంగా ఆడియన్స్‌కి చూపిస్తున్నామని ఆడియన్స్‌ని మోసం చెయ్యడం సమంజసం కాదు. నిజంగా జరిగిన సంఘటనని సినిమాగా తీశామని చెప్తే ఆడియన్స్‌ ఒప్పుకోరా? సినిమా బాగుంటే చూడరా? అడవిలోకి వెళ్ళిన ఆరుగురిలో ఒకరు వెనక్కి తిరిగి వచ్చారు, ముగ్గురు చనిపోయారు, ఇద్దరి ఆచూకి తెలియలేదు. వాస్తవానికి ఈ సంఘటన జరిగిన 9 రోజులకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వారికి రమేష్‌ షూట్‌ చేసిన కెమెరా దొరికింది. సినిమాలో మాత్రం రెండు సంవత్సరాల తర్వాత కెమెరా దొరికిందని చెప్తున్నారు. వాయిస్‌ ఓవర్‌లో సినిమాలో చెప్పే విషయాలకి యదార్థంగా జరిగిన సంఘటనలకి పొంతన లేదు. కన్నడలో 2013లో 6`5R2గా రూపొందిన ఈ సినిమాని హిందీలో అదే పేరుతో 2014లో రీమేక్‌ చేశారు. హిందీలో భరత్‌ జైన్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. కన్నడలో 30 లక్షల్లో నిర్మించిన ఈ చిత్రం 5 కోట్లు కలెక్ట్‌ చేసింది. తెలుగులో కూడా అదే రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టడం కోసం ఆడియన్స్‌ని మభ్యపెట్టే పనిలో వున్నారు నిర్మాతలు. ఇది ఒరిజినల్‌ ఫుటేజ్‌ కాదు, ఆర్టిస్టులతో మళ్ళీ తీశారు అనేది కామన్‌ ఆడియన్‌కి కూడా ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి ఈ సినిమాని ఒరిజినల్‌ ఫుటేజిలా కాకుండా సినిమాగా ప్రమోట్‌ చేస్తే ఆడియన్స్‌ కూడా కన్విన్స్‌ అయి సినిమా చూస్తారు. సినిమాలో ఫస్ట్‌ హాఫ్‌ కొంత ఇంట్రెస్టింగ్‌గా, కొంత బోర్‌గా, కొంత డల్‌గా అనిపించినప్పటికీ సెకండాఫ్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా తీశారు. ప్రతి సీన్‌ ఆడియన్స్‌ని భయపెట్టే విధంగా చక్కగా డిజైన్‌ చేసుకున్నాడు డైరెక్టర్‌. దానికి తగ్గట్టుగా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ కూడా బాగుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, అందరికీ అర్థమయ్యేలా డైలాగ్స్‌ రాశారు. ఈమధ్య వచ్చిన సినిమాల్లో కాస్త ఎక్కువగానే భయపెట్టిన సినిమా ‘చిత్రమ్‌ కాదు నిజమ్‌’. 

ఫినిషింగ్‌ టచ్‌: నిజమ్‌ కాదు చిత్రమే.

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs