Advertisement
Google Ads BL

సినీజోష్ రివ్యూ: జగన్నాటకం


మూవీ       : జగన్నాటకం 

Advertisement
CJ Advs

బ్యానర్       : చిత్ర సౌధం

నటీనటులు : ప్రదీప్ నందన్, ఖేనీశ చంద్రన్, ఉష శ్రీ, కేదార శంకర్, అభినవ్, శ్రీధర్ వర్మ

సంగీతం     : అజయ్ అరసాడ 

ఎడిటింగ్     : చంద్రశేఖర్ 

నిర్మాత      : ఆదిశేషరెడ్డి 

కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం : ప్రదీప్ నందన్

విడుదల తేదీ : మార్చి 13, 2015

'ప్రయాణం' సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసి తరువాత సొంతంగా తనే ఓ కథను రాసుకొని ఆదిశేషారెడ్డి నిర్మాణంలో ఆ కథను తెరకెక్కించారు హీరో, దర్శకుడు ప్రదీప్ నందన్. మొదటి సినిమాకే స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లను డీల్ చేసి 'జగన్నాటకం' అనే డ్రామాకి, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించిన ఈ సినిమా ద్వారా ప్రదీప్ తెలుగు ఇండస్ట్రీకి దర్శకునిగా, నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా శుక్రవారం(మార్చి 13) న విడుదల అయింది. ఓ కొత్త కాన్సెప్ట్ ను తీసుకొని చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయిందో తెలుసుకుందాం.

కథ : శ్రీను అనే కన్స్ స్ట్రక్షన్ ఆఫీసర్ ను బంటి(అభినవ్) అనే వ్యక్తి పోలీస్ సహాయంతో హత్య చేస్తాడు. అక్కడితో కథ మొదలవుతుంది. సినిమా స్క్రీన్ ప్లే ప్రెజెంట్ పాస్ట్ అంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. పృథ్వి(ప్రదీప్) అనే వ్యక్తి కనిపించకుండా పోయిన తన చెల్లెల్ని వెతుక్కుంటూ రోడ్ మీద లిఫ్ట్ అడిగి ఓ కార్ ఎక్కుతాడు. కారు డ్రైవ్ చేసే అజయ్(శ్రీధర్ వర్మ) పృథ్వితో మాట్లాడుతూ తన ప్రేమ గురించి అడుగుతాడు. పృథ్వి తను మొట్టమొదటిసారి భాను(ఖేనీశ చంద్రన్) ను చూసి ప్రేమలో పడిన విషయం, బ్రేక్ అప్ అయిన విషయం  అజయ్ కు చెప్తాడు. అజయ్ కూడా ఓ అమ్మాయిని ప్రేమించిన విషయం పృథ్వీ కి చెప్తాడు. ఇంతలో భాను అజయ్ కారు ఎక్కుతుంది. మరోపక్క బంటి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికిపోతూ ఉంటాడు. అజయ్, పృథ్వీ, భాను ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో కారు చెట్టుకు డాష్ ఇవ్వడంతో రిపేర్ వచ్చి రోడ్ మీద నడుస్తూ వెళ్ళిన వారికి హోటల్ లాంటి ఓ భవంతి కనిపిస్తుంది. అనుకోకుండా బంటి కి ఆ హోటల్ కనిపిస్తే దొంగతనం చేయడానికి లోపలి వెళ్తాడు. అక్కడ ఒకరితో గొడవ పడి పృథ్వీ వాళ్ళు ఉండే రూం లో బంటి దాక్కుంటాడు. అక్కడకి వెళ్లిన ఆ నలుగురికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ భవంతిలో అమ్మాయిలను రేప్ చేసి చంపే ఓ సైకో బ్యాచ్ దానికి కారణం అని తెలుసుకున్న పృథ్వీ  సి.సి. కెమెరా ద్వారా చావు కోసం ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా మిమ్మల్ని చంపే నేను చస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఇంటర్వెల్ పడుతుంది. బంటి శ్రీను ను చంపటానికి గల కారణాలేంటి? శ్రీనుకు పృథ్వీకి  ఏమైనా సంభందం ఉందా?  అసలు పృథ్వీ చెల్లెలు ఏమవుతుంది? దానికి కారణం ఎవరు?  భానును రేపిస్ట్ ల నుండి పృథ్వీ కాపాడుకోగాలిగాడా? చివరకు పృథ్వీ,భాను ఏమవుతారు? అనే విషయాలు స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే..

చెప్పుకోదగినవి: ఇదొక స్క్రీన్ ప్లే బేస్ మూవీ. పాస్ట్ ను ప్రెజెంట్ ను చక్కగా చూపిస్తూ స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచింది. అజయ్ అరసాడ సమకూర్చిన స్వరాలు అధ్బుతంగా కుదిరాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ప్రతి సన్నివేశానికి తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ప్రదీప్ కి ఇది మొదటి సినిమానే అయిన తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. డైరెక్టర్ గా కూడా ప్రదీప్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చివరి 20-30 నిమిషాలు ఎమోషనల్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇంటర్వెల్ లోనే స్టొరీ అంతా రివీల్ చేసినా  సస్పెన్స్ ను మాత్రం చివరి వరకు కొనసాగేలా జాగ్రత్త పడ్డారు. 

డ్రాబ్యాక్స్: సినిమాను చాలా చోట్ల డ్రాగ్ చేసారు అనే ఫీల్ కలుగుతుంది. అతి తక్కువ మందితో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, అందరు కొత్తవారు కావడం మైనస్ అనే చెప్పాలి. కథ రెండు లేయర్స్ లో రన్ అవుతూ ఉంటుంది. ఆ రెండు లేయర్స్ ని కనెక్ట్ చేయడంలో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. 

వివరణ : సినిమా అంతా సస్పెన్స్ తో నడుస్తున్న బంటి అనే దొంగ పాత్ర ప్రేక్షకులను నవ్విస్తుంది. ప్రతి సినిమాలో పవన్ కళ్యాన్ ఫ్యాన్ అని చెప్పుకోవడం రొటీన్ అయిపోతుంది. ఈ సినిమాలో కూడా హీరో పవన్ ఫ్యాన్ అయినా స్క్రీన్ లో బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ లు చేసిన సినిమా సీన్స్ కనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బావుందనే చెప్పాలి. హీరొయిన్ కన్నా హీరోకే నటనా ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కామెడీ లేకపోయినా ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఉంటారు. ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు సినిమా అంతా సస్పెన్స్ ఉండడం వల్ల అన్ని వర్గాల వారిని మెప్పించలేకపోవచ్చు. పర్వాలేదు అనిపించిన ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.   

ట్యాగ్ లైన్ : నిజంగానే ఇదొక నాటకం

సినీజోష్ రేటింగ్: 2.5/5 

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs