Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: మగమహారాజు


విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

Advertisement
CJ Advs

మగమహారాజు

నటీనటులు: విశాల్‌, హన్సిక, వైభవ్‌, సంతానం, రమ్యకృష్ణ, 

ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌, ప్రభు, మధురిమ తదితరులు 

కెమెరా: గోపి అమర్‌నాథ్‌

సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ

ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి

నిర్మాత: విశాల్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్‌ సి.

విడుదల తేదీ: 27.2.2015

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పల్నాడు వంటి మాస్‌ కమర్షియల్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్‌ గత సంవత్సరం ‘పూజ’ వంటి కమర్షియల్‌ మూవీతో ఆకట్టుకున్నాడు. తాజాగా సుందర్‌ సి. దర్శకత్వంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై తమిళంలో నిర్మించిన ‘అంబల’ చిత్రాన్ని తెలుగులో ‘మగమహారాజు’ పేరుతో అనువదించారు. ఈ చిత్రంలో విశాల్‌ సరసన హన్సిక హీరోయిన్‌గా నటించింది. విశాల్‌ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఎక్కువగా మాస్‌ యాక్షన్‌ చిత్రాలు చేసిన విశాల్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీస్‌ స్పెషలిస్ట్‌ అయిన సుందర్‌ సి. ఈ చిత్రంతో విశాల్‌కి మరో సూపర్‌హిట్‌ అందించాడా? అనే విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: రాజకీయ నాయకుల మీటింగ్‌లకు, ఇతర అవసరాలకు మనుషుల్ని సప్లై చేస్తూ దానికి వారి నుంచి ఫీజు వసూలు చేస్తుంటాడు. తల్లి తులసితో కలిసి జీవనం సాగించే కృష్ణకి ఓరోజు మాయ(హన్సిక) తారసపడుతుంది. తొలి చూపులోనే మాయని ప్రేమించిన కృష్ణకి సి.ఐ.గా పనిచేసే ఆర్డీఎక్స్‌ రాజశేఖర్‌(సంతానం) స్నేహితుడు. రాజశేఖర్‌ చేసే పొరపాట్ల వల్ల అతను హెడ్‌గా డిమోట్‌ అవుతాడు. రాజశేఖర్‌ చేసే పొరబాట్లన్నీ తెలియకుండా కృష్ణ చేసినవే కావడంతో అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక నాటకం ఆడి మాయని కృష్ణకు దూరం చేస్తాడు రాజశేఖర్‌. ఆ బాధతో ఓరోజు బాగా తాగి వచ్చిన కృష్ణకు అతని తండ్రి కేశవరాజు(ప్రభు) గురించి, తాము ఎలా విడిపోయామన్న విషయాన్ని చెప్తుంది. దాంతో తండ్రిని వెతుక్కుంటూ స్నేహితుడు కుమార్‌(వైభవ్‌)తో కలిసి విజయవాడ బయల్దేరతాడు కృష్ణ. తండ్రిని, తమ్ముడు కిషన్‌(సతీష్‌)ని కలుసుకుంటాడు. ఆ క్రమంలోనే తనతో వచ్చిన కుమార్‌ కూడా తన తమ్ముడే అనే విషయాన్ని తెలుసుకుంటాడు. పెద్ద జమీందారీ కుటుంబం వాడైన కేశవరాజుకి ముగ్గురు చెల్లెళ్ళు. కొన్ని కారణాలవల్ల కేశవరాజుని ఇంటి నుంచి బయటికి పంపేస్తారు. చెల్లెళ్ళ మీద మమకారం చావని కేశవరాజు ఎలాగైనా తన ముగ్గురి చెల్లెళ్ళ కూతుళ్ళని పెళ్ళి చేసుకోవాలని తన ముగ్గురు కొడుకుల్ని కోరతాడు. ముగ్గురు అత్త కూతుళ్ళని పెళ్ళి చేసుకోవాలన్న లక్ష్యంతో బయల్దేరతారు కేశవరాజు కొడుకులు. అలా వెళ్ళిన ముగ్గురికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? చెల్లెళ్ళని ఎంతో ప్రేమించే కేశవరాజుని ఇంటి నుంచి ఎందుకు పంపించేశారు? కృష్ణకి మాయ దూరమవ్వడానికి కారణాలు ఏమిటి? కేశవరాజు కోరిక మేరకు అతని ముగ్గురు కొడుకులు అత్త కూతుళ్ళని పెళ్ళి చేసుకున్నారా? అనేది మిగతా కథ.

ప్లస్‌ పాయింట్స్‌: మాస్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయిన విశాల్‌ ఒక కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చేయడం ఈ సినిమాకి ప్లస్‌ అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు ఎక్కడా ల్యాగ్‌ అనేది లేకుండా స్పీడ్‌గా వెళ్తుంది. సంతానం చెప్పే వెరైటీ డైలాగ్స్‌, అతను చేసే అమాయకమైన పనుల వల్ల జరిగే అనర్థాలు కామెడీగా వుంటాయి. విశాల్‌ చేసిన క్యారెక్టర్‌లో ప్రత్యేకత ఏమీ లేకపోయినా పెర్‌ఫార్మెన్స్‌ వైజ్‌ ఓకే అనిపించాడు. హన్సిక గ్లామర్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయిందని చెప్పాలి. పాటల్లో, కొన్ని కొన్ని సీన్స్‌లో హన్సిక అందాల్ని ఆరబోసింది. మధురిమ, మధులత గ్లామర్‌ కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. మ్యూజిక్‌ విషయానికి వస్తే పాటల్లో ఎక్కువగా ఆకట్టుకోకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదనిపించాడు. ముగ్గురు చెల్లెళ్ళలో పెద్ద చెల్లెలుగా నటించిన రమ్యకృష్ణ క్యారెక్టర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే రమ్యకృష్ణ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది.  కామెడీకి సంబంధించి ఎక్కువ భాగం సంతానమే తీసుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్‌ స్టార్టింగ్‌లో, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌లో సంతానం తనదైన కామెడీని పండిరచాడు.  

మైనస్‌ పాయింట్స్‌: ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేసాయి. పాత కథే అయినప్పటికీ దాన్ని ఎంత కొత్తగా చెప్పామనేది ఇంపార్టెంట్‌. అయితే పాత కథని కొత్తగా చెప్పే ప్రయత్నం చెయ్యలేదు సుందర్‌. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండిరగ్‌ వరకు తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆడియన్‌ ఇట్టే పట్టేసేట్టుగా వుంది. సినిమా స్పీడ్‌గానే వెళ్తున్నా హీరో ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్‌గానీ, ఎమోషన్స్‌గానీ, అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్‌గానీ ఎక్కడా వర్కవుట్‌ అవ్వలేదు. రెండున్నర గంటల సినిమాలో ఎక్కువ టైమ్‌ ఫైట్స్‌కే కేటాయించినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఎన్నికల ప్రహసనం కూడా ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తుంది. హిప్‌ హాప్‌ తమిళ మ్యూజిక్‌ చాలా పేలవంగా వుంది. పాటలు ఆకట్టుకునేలా లేకపోయినప్పటికీ వాటిని ఫారిన్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేసి రిచ్‌నెస్‌ తెచ్చే ప్రయత్నం చేశారు. హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా ఈ చిత్రంలో ఐటమ్‌ గర్ల్‌గా దర్శనమిచ్చింది. అయితే ఐటమ్‌ సాంగ్‌ పూనమ్‌కి ఎంత మాత్రం సెట్‌ అవ్వలేదు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌: టెక్నీషియన్స్‌లో మొదట చెప్పుకోవాల్సింది గోపి అమర్నాథ్‌ ఫోటోగ్రఫీ గురించి. ప్రతి సీన్‌ని ఎంతో కలర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫారిన్‌లో తీసిన పాటలు విజువల్‌గా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయి. శ్రీకాంత్‌ ఎడిటింగ్‌ కూడా ఎంతో గ్రిప్పింగ్‌గా వుంది. కథ, కథనాల్లో విషయం లేకపోయినా అతని ఎడిటింగ్‌ వల్ల రెండున్నర గంటలు థియేటర్‌లో కూర్చొనే అవకాశం వుంది. హిప్‌ హాప్‌ తమిళ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే అనిపించాడు. శశాంక్‌ వెన్నెలకంటి గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో అతను రాసిన డైలాగ్స్‌లో కొత్తదనం ఏమీ లేదనిపిస్తుంది. అక్కడక్కడ సంతానం చెప్పే కామెడీ డైలాగ్స్‌ తప్ప చాలా రొటీన్‌ డైలాగ్స్‌తో కథ నడుస్తుంది. 

విశ్లేషణ: విశాల్‌ గతంలో చేసిన సినిమాలని దృష్టిలో పెట్టుకొని వెళ్ళేవారికి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఇందులో హీరో క్యారెక్టర్‌కి అంత గొప్ప ఇంపార్టెన్స్‌ వున్నట్టు అనిపించదు. విశాల్‌ గతంలో చేసిన క్యారెక్టర్సే గుర్తొస్తాయి తప్ప అతని క్యారెక్టరైజేషన్‌లో కొత్తదనం ఏమీ కనిపించదు. బడ్జెట్‌కి ఏమాత్రం వెనకాడకుండా సినిమాని చాలా రిచ్‌గా తీశారు. ప్రతి సీన్‌లో ఖర్చు అనేది కనిసిస్తుంది. పాటల్లో ఆ గ్రాండియర్‌ బాగా తెలుస్తుంది. గత సంవత్సరం దీపావళికి రిలీజ్‌ అయిన పూజ మంచి కమర్షియల్‌ సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ‘మగమహారాజు’ ఆ రేంజ్‌లో లేదు. అయితే బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే కొన్ని అంశాలు ఈ చిత్రంలో వుండడంవల్ల కమర్షియల్‌గా కొంతవరకు వర్కవుట్‌ అయ్యే అవకాశాలు వున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ‘మగమహారాజు’ అందర్నీ ఆకట్టుకునే సినిమా కాదు. 

ఫినిషింగ్‌ టచ్‌: విశాల్‌ చేసిన మరో వృధా ప్రయత్నం

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs