Advertisement
Google Ads BL

సినీజోష్‌ రివ్యూ: టెంపర్‌


పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌

Advertisement
CJ Advs

టెంపర్‌

నటీనటులు: ఎన్టీఆర్‌, కాజల్‌, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు,

ఆలీ, పోసాని, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు, జె.పి. తదితరులు

కెమెరా: శ్యామ్‌ కె.నాయుడు

ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: మణిశర్మ

కథ: వక్కంతం వంశీ

సమర్పణ: శివబాబు బండ్ల

నిర్మాత: బండ్ల గణేష్‌

స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

విడుదల తేదీ: 13.2.2015

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో పదేళ్ళ క్రితం వచ్చిన ‘ఆంధ్రావాలా’ ప్రేక్షకుల్ని, ఎన్టీఆర్‌ అభిమానుల్ని నిరాశపరిచిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్‌లో ఓ కొత్త తరహా చిత్రం ‘టెంపర్‌’తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్టీఆర్‌, పూరి. ఈమధ్యకాలంలో సరైన హిట్‌ లేని వీరిద్దరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్‌. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయింది. మరి ఈ చిత్రం ఎలా వుంది? ఎంతవరకు ఆడియన్స్‌కి రీచ్‌ అయింది? ఏమేర అభిమానుల్ని సంతృప్తి పరిచింది? సూపర్‌హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌లకు ‘టెంపర్‌’ ఎలాంటి రిజల్ట్‌ని ఇచ్చిందో తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: దయ(ఎన్టీఆర్‌) ఒక అనాధ. రెబల్‌గా వుండే దయ చిన్నతనంలోనే పోలీసుల పవర్‌ని చూసి ఎట్రాక్ట్‌ అవుతాడు. పోలీస్‌ అయితే పవర్‌తోపాటు డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుందని కష్టపడి టెన్త్‌ వరకు చదివి, ఆ తర్వాత చదివే ఇంట్రెస్ట్‌ లేక డిగ్రీని డబ్బుతో కొనేసి ఎస్‌.ఐ. అయిపోతాడు. అవినీతికి, లంచగొండి తనానికి దయ పెట్టింది పేరు అనిపించుకుంటాడు. కట్‌ చేస్తే వైౖజాగ్‌లో వున్న వాల్తేరు వాసు(ప్రకాష్‌రాజ్‌) అన్ని రకాల దందాలు చేస్తుంటాడు. ఒకటో నెంబర్‌ క్రిమినల్‌గా పేరు తెచ్చుకున్న వాసుకి పోలీసుల తలనొప్పి ఎక్కువవుతుంది. దాంతో మినిస్టర్‌ జె.పి.తో చెప్పి తన కంటే వరస్ట్‌ అయిన దయని వైజాగ్‌కి ట్రాన్సఫర్‌ చేయించుకుంటాడు. ఇక అక్కడి నుంచి వాసు కనుసన్నలలో మసలుతూ అవినీతి, అక్రమాలకు అండగా వుంటాడు దయ. అలా నడిచిపోతున్న అతని లైఫ్‌లోకి శాన్వి(కాజల్‌ అగర్వాల్‌) ప్రవేశిస్తుంది. కొన్ని విచిత్రమైన సంఘటనల తర్వాత వారిద్దరూ లవర్స్‌గా మారతారు. ఓరోజు వాల్తేరు వాసు మనుషులు లక్ష్మీ(మధురిమ)కి బదులుగా శాన్విని చంపాలని ప్రయత్నిస్తారు. దయ వారి నుంచి శాన్విని కాపాడతాడు. ఆరోజు శాన్వి బర్త్‌డే కావడంతో వాసు మనుషులు చంపాలనుకుంటున్న లక్ష్మీని కాపాడమని, అదే తన బర్త్‌డే గిఫ్ట్‌గా భావిస్తానని చెప్తుంది. తన లవర్‌ కోరిక మేరకు లక్ష్మీని కాపాడతాడు. లక్ష్మీ దగ్గర తన తమ్ముళ్ళకు సంబంధించిన ఓ ప్రూఫ్‌ వుందని, అందుకే ఆమెను చంపాలనుకున్నానని వాసు చెప్తాడు. లక్ష్మీని చంపనని మాట ఇస్తే ఆ ప్రూఫ్‌ తెస్తానని వాసుకి చెప్తాడు దయ. సీడీ రూపంలో వున్న ఆ ప్రూఫ్‌ని తీసుకొని లక్ష్మీని, ఆమె తల్లిని అమెరికా పంపించేస్తాడు దయ. అసలు ఆ సీడీలో ఏం వుంది? వాసు మనుషులు లక్ష్మీని ఎందుకు చంపాలనుకున్నారు? నిజంగానే దయ ఆ సీడీని వాసుకి ఇచ్చాడా? వాసు తమ్ముళ్ళకి ఆ సీడీ వల్ల ప్రమాదం ఏమిటి? కరప్టెడ్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న దయ చివరి వరకూ అలాగే కొనసాగాడా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ప్లస్‌ పాయింట్స్‌: సినిమాకి మెయిన్‌ ప్లస్‌ పాయింట్‌గా చెప్పాలి వస్తే కాన్సెప్ట్‌ గురించి చెప్పాలి. ఇప్పటివరకు ఎన్టీఆర్‌ ట్రై చెయ్యని కాన్సెప్ట్‌ ఇది. అవినీతి పోలీస్‌ ఆఫీసర్‌ దయగా తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశాడు. ఇప్పటివరకు వక్కంతం వంశీ రాసిన కథల్లో హీరోకి ఒక డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌ వుండడం, డిఫరెంట్‌గా మాట్లాడడం, డిఫరెంట్‌ మేనరిజమ్స్‌ వుండడం చూస్తున్నాం. ఈ కథలో కూడా అదే జరిగింది. అవినీతికి అతుక్కుపోయేలా వుండే అతని క్యారెక్టర్‌ డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యాడు ఎన్టీఆర్‌. కాజల్‌ క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్‌ లేకపోయినా గ్లామర్‌ పరంగా అందర్నీ ఆకట్టుకుంది. డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌తో అందాలను ఆరబోసింది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పోసాని కృష్ణమురళి చేసిన నారాయణమూర్తి క్యారెక్టర్‌. ఒక సిన్సియర్‌ పోలీస్‌గా అద్భుతమైన నటనని కనబరిచాడు. స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ పోసాని క్యారెక్టర్‌ని సినిమాకే హైలైట్‌గా మలిచాడు పూరి. సినిమాలో మరో ముఖ్యమైన లక్ష్మీ క్యారెక్టర్‌ని మధురిమ చేసింది. కథని మలుపు తిప్పే క్యారెక్టర్‌ ఆమెదే. అవినీతి పోలీస్‌ ఆఫీసర్‌ అయిన దయ నిజాయితీగల పోలీస్‌ ఆఫీసర్‌గా మారడంలో లక్ష్మీ క్యారెక్టర్‌ చాలా కీలకమైంది. ఆ సందర్భంలో మధురిమ చెప్పిన డైలాగ్స్‌, ఆమె పెర్‌ఫార్మెన్స్‌ ఆడియన్స్‌ చేత చప్పట్లు కొట్టిస్తాయి. ఆడియో పరంగా అనూప్‌ రూబెన్స్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చినప్పటికీ విజువల్‌గా ఒకటి రెండు పాటలు తప్ప మిగతా పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు. పాటలు కూడా సరైన ప్లేస్‌మెంట్స్‌లో లేవు. ఎన్టీఆర్‌ వంటి మాస్‌ హీరో చేసిన సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌గా రావడం ఫస్ట్‌ టైమ్‌ అనే చెప్పాలి. ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ పాటలో, టైటిల్‌ సాంగ్‌లో ఎన్టీఆర్‌ స్టెప్పులు సూపర్బ్‌గా వున్నాయి. విజయ్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ కూడా కొత్తగా అనిపిస్తాయి. శ్యామ్‌ కె.నాయుడు ఫోటోగ్రఫీ ఆద్యంతం చూడాలనిపించేలా వుంది. 

మైనస్‌ పాయింట్స్‌: ఈ సినిమాకి కథ, క్యారెక్టరైజేషన్‌ ఎంత ప్లస్‌ అయిందో అంతే మైనస్‌ అయింది కూడా. హీరో ఒక అవినీతి పోలీస్‌ ఆఫీసర్‌. హీరో అన్న తర్వాత అతన్ని నెగెటివ్‌గా చూపిస్తున్నప్పటికీ దాని వెనుక ఏదో ఒక బలమైన కారణం వుంటేనే అలా బిహేవ్‌ చేస్తాడని సినిమా చూస్తున్న ప్రతి ఆడియన్‌ అనుకుంటాడు. కానీ, హీరో క్యారెక్టరైజేషన్‌లో అలా లేదు. అతను నిజంగానే అవినీతి ఆఫీసర్‌. ఓ సందర్భంలో తన లవర్‌ కోసం ఓ అమ్మాయిని కాపాడతాడు. ఆ అమ్మాయి హితబోధ చెయ్యడం వల్ల మంచివాడిగా మారతాడు. ఇది ఆడియన్స్‌కి రుచించని పాయింట్‌. ఈ సినిమాకి పూరి రాసిన డైలాగ్స్‌ కూడా కొత్తగా అనిపించవు. పైగా సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు ఎన్టీఆర్‌, పోసాని, ప్రకాష్‌రాజ్‌ల అరుపులతో థియేటర్‌ దద్దరిల్లుతుంది. ఎందుకంత గట్టిగా అరుస్తూ మాట్లాడతారో మనకి అర్థం కాదు. ఒకప్పుడు పూరి జగన్నాథ్‌ సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్‌కి ఒక క్లారిటీ అనేది వుంటుంది. కానీ, ఈ సినిమాలో ఆ క్లారిటీ మిస్‌ అయింది. కామెడీ విషయంలో పూరి చాలా కేర్‌ తీసుకుంటాడు. ఈ సినిమాలో అది కూడా మిస్‌ అయింది. సినిమా మొత్తంలో భలే కామెడీ సీన్‌ అని చెప్పుకోవడానికి ఒక్క సీన్‌ కూడా లేదు. ఎంత సేపూ ఎన్టీఆర్‌, పోసాని, ప్రకాష్‌రాజ్‌, కాజల్‌ తప్ప ఎవరూ సినిమాలో మరెవ్వరూ కనిపించరు. అనూప్‌ చేసిన పాటల్ని అంతంత మాత్రం వాడుకున్న పూరి. మణిశర్మతో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయడంలో ఎక్స్‌పర్ట్‌ అయిన మణి ఈ సినిమాకి మాత్రం ఫర్వాలేదనిపించుకున్నాడు. 

విశ్లేషణ: ఒక డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌, ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌, ఒక డిఫరెంట్‌ ట్విస్ట్‌, ఒక డిఫరెంట్‌ క్లైమాక్స్‌. ఈ సినిమా గురించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే ఇదీ. పూరి జగన్నాథ్‌ సినిమాల్లోని సీన్స్‌ పరిగెడుతుంటాయి. కానీ, ఈ సినిమాలో ఫస్ట్‌ హాఫ్‌ స్లోగా రన్‌ అయి, సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమా స్పీడ్‌ అవుతుంది. హీరో ప్రాణాలకు సైతం తెగించి న్యాయాన్ని కాపాడాడు అనేది ఆడియన్స్‌కి నచ్చుతుంది. దానికి తగ్గట్టుగానే సెకండాఫ్‌ని పరిగెత్తించాడు పూరి. ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. డైలాగ్‌ మాడ్యులేషన్‌, న్యూ లుక్‌, డాన్స్‌, ఫైట్స్‌ అభిమానుల్ని అలరిస్తాయి. స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ సినిమా అంతా సీరియస్‌గా వుంటూ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది మిస్‌ అయింది. ఈ సినిమాకి అదొక మైనస్‌గా చెప్పొచ్చు. తను చెప్పాలనుకున్నది చెప్తూనే ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇంపార్టెన్స్‌ ఇచ్చే పూరి ఈ సినిమా విషయంలో దాన్ని పట్టించుకోలేదు. ఫస్ట్‌ హాఫ్‌లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు అనేది గుర్తొస్తుంది తప్ప సెకండాఫ్‌లో పూర్తిగా కథమీదే సినిమా వెళ్ళిపోతుంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ తన క్యారెక్టర్‌కి న్యాయం చేయడం కోసం ఎన్టీఆర్‌ చాలా కష్టపడ్డాడు. అన్ని విషయాల్లోనూ కేర్‌ తీసుకొని దయ క్యారెక్టర్‌లోని అన్ని రసాలను పండిరచాడు. ఫైనల్‌గా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ సినిమా అంతగా కనెక్ట్‌ కాకపోయినా, మాస్‌ ఆడియన్స్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, యూత్‌కి బాగా నచ్చుతుంది. కమర్షియల్‌గా కూడా ఈ సినిమా బాగా వర్కవుట్‌ అయ్యే అవకాశాలు వున్నాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: హై ఓల్టేజ్‌ ‘టెంపర్‌’ చూపించిన ఎన్టీఆర్‌

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs