Advertisementt

లవ్ స్టోరి సాయి పల్లవి ఇంటర్వ్యూ

Wed 22nd Sep 2021 04:05 PM
sai pallavi,sai pallavi interview,love story movie,sai pallavi photos,sai pallavi news  లవ్ స్టోరి సాయి పల్లవి ఇంటర్వ్యూ
Sai Pallavi Interview లవ్ స్టోరి సాయి పల్లవి ఇంటర్వ్యూ
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా లవ్ స్టోరి. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. లవ్ స్టోరి ఈ శుక్రవారం థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా నాయిక సాయి పల్లవి సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు. సాయి పల్లవి మాట్లాడుతూ...

- దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో సినిమా కోసం పిలుపు వచ్చినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని అప్పటికే ఫిక్స్ అయ్యాను. లవ్ స్టోరి లో నా క్యారెక్టర్ విన్న తర్వాత ఇంకా గట్టిగా నటించాలనే కోరిక కలిగింది. 

- ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్ కు లవ్ స్టోరి లో మౌనిక క్యారెక్టర్ కు సంబంధం ఉండదు. రెండు వేర్వేరు పాటర్న్స్ ఉన్న క్యారెక్టర్స్. ఫిదా లో భానుమతి పెళ్లైతే తన ప్లేస్, నేటివ్, ఫ్యామిలీ ఎందుకు వదిలి వెళ్లాలి అని ఆలోచించే అమ్మాయి. ఈ చిత్రంలో మౌనిక తన డ్రీమ్స్ ను ఫాలో అవుతుంది. నేను ఎందుకు తక్కువ అనే ఆత్మవిశ్వాసం మౌనిక క్యారెక్టర్ లో కనిపిస్తుంది.

- లవ్ స్టోరి లో చైతూ, నా క్యారెక్టర్స్ ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక మంచి విషయాన్ని చెప్పించారు. అదేంటంటే మనలో ఎవరూ పర్ ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు..కానీ ప్రయత్నించి సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా మా రెండు క్యారెక్టర్స్ తమ డ్రీమ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాయి. నేను సాధించగలను అని బలంగా నమ్ముతాయి.

- మన చుట్టూ ఉన్న సమాజంలో, మన కుటుంబంలో కూడా వివక్షను చూస్తుంటాం. కానీ పోనీలే అని చాలా మంది అమ్మాయిలు, మహిళలు వదిలేస్తుంటారు. ఇంట్లో పని చేసే అమ్మాయి ఉంటే ఆమెకు వేరే ప్లేట్ లో భోజనం పెడుతుంటాం. ఇవన్నీ మన కళ్ల ముందు కనిపించే వివక్షే. వీటి గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల ఆలోచింపజేసేలా సినిమా తెరకెక్కించారు.

- లవ్ స్టోరిలో మంచి సందేశం ఉన్నా, ఎక్కడా బోర్ కొట్టించదు. కథను వినోదాత్మకంగా చూపిస్తూ సినిమాను తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే నిజాయితీ లవ్ స్టోరి లోనూ ఉంటుంది. ఆయన తన జీవితంలో ఏది నమ్ముతారో దాన్నే కథలుగా మార్చి సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ఈ సినిమా కూడా అందులో ఒకటి.

- శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో పనిచేస్తున్నప్పుడు మనకు కూడా అంతే సిన్సియర్ గా వర్క్ చేయాలనే ఆలోచన వస్తుంది. ఆయన చాలా హంబుల్ గా ఉంటారు. సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. లవ్ స్టోరి లో లింగ వివక్ష, కుల వివక్ష లాంటి మన చుట్టూ ఉన్న ఇష్యూస్ ను టచ్ చేస్తూ సినిమా చేశారు. ఈ సినిమా చూశాక ప్రేక్షకుల్లో ఒక ఆలోచన కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

- నాగ చైతన్యతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఆయనతో వర్కింగ్ చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను. రేవంత్ క్యారెక్టర్ ను పర్ పెక్ట్ గా ప్లే చేశారు. పైట్స్ లో నాగ చైతన్య బాగా నటించి, సాయి పల్లవి చేయలేదంటే కరెక్ట్ కాదు కదా అలాగే డాన్స్ లో నేను బాగా చేశాను, ఆయన ఇబ్బంది పడ్డారన్నా సరికాదు. ఒక్కో యాస్పెక్ట్ లో ఒక్కొక్కరు కొద్దిగా బెటర్ గా చేస్తారు అంతే.

- చిరంజీవి గారు నాతో డాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారు. ఆయన నా డాన్స్ గురించి చెబుతుంటే చాలా సంతోషం కలిగింది. అవన్నీ బెస్ట్ కాంప్లిమెంట్స్ గా నాకు గుర్తుండిపోతాయి.

- సొసైటీలో అమ్మాయిల మీద ఏవైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు అవి విని, చదివి నేను బాధపడేదాన్ని. మనమేం చేయలేమా అనుకునేదాన్ని. లవ్ స్టోరి మౌనిక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఈ విషయంలో సంతృప్తి కలిగింది. కనీసం నా సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగాను అని. ప్రతి అమ్మాయి, మహిళ చూడాల్సిన సినిమా లవ్ స్టోరి.

- ప్రస్తుతం నేను తెలుగులో విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తున్నాను. విరాట పర్వం ఇంకొక డే షూటింగ్ ఉంది. శ్యామ్ సింగరాయ్ కూడా పూర్తి దశలో ఉంది. తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి.

sai pallavi,sai pallavi interview,love story movie,sai pallavi photos,sai pallavi newssai pallavi,sai pallavi interview,love story movie,sai pallavi photos,sai pallavi newssai pallavi,sai pallavi interview,love story movie,sai pallavi photos,sai pallavi newssai pallavi,sai pallavi interview,love story movie,sai pallavi photos,sai pallavi newssai pallavi,sai pallavi interview,love story movie,sai pallavi photos,sai pallavi news

Sai Pallavi Interview :

Sai Pallavi Interview about Love Story

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ