తెలుగులో కొత్త ట్రెండ్ మొదలవుతుందా.. అంటే అవును అనే చెప్పాలి. ఆ ట్రెండ్ ను తీసుకు రాబోతుంది ఎవరో కాదు.. వెంకటేష్! అవును వెంకటేషే.. తమిళ్ హీరో అజిత్ ఎప్పటినుండి కోలీవుడ్ లో కొత్త పెప్పర్ అండ్ సాల్ట్ లుక్ తో అదరగొట్టేస్తున్నట్టుగా ఇప్పుడు వెంకీ కూడా కొత్త ట్రెండ్ కి తెర లేపాడు. అజిత్ మెరిసిన గెడ్డం, మెరిసిన హెయిర్ స్టయిల్ తోనే తన సినిమాల్లో రొమాన్స్ చేసినా, యాక్షన్ సీన్స్ చేసినా, బైక్ రేస్ లు చేసినా ఏదైనా ఒకే లుక్ మెయింటింగ్ చేస్తున్నాడు. జుట్టుకు కలర్ వెయ్యడం కానీ, గెడ్డానికి కలర్ వెయ్యడం కానీ చెయ్యడం లేదు. మరి ఇప్పుడు వెంకీ కూడా అసురన్ రీమేక్ నారప్ప తో అజిత్ లా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోకి మారిపోయాడు. మరి ఇప్పటికి సీనియర్ హీరోలైన నాగార్జున, చిరు, బాలయ్యలు యంగ్ హీరోస్ మాదిరి జిమ్ బాడీ తోనూ, అలాగే హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ స్టయిల్ తో ఉంటే.. వెంకీ మాత్రం ఇక నుండి లుక్ మార్చేస్తాడేమో అనిపిస్తుంది.
తాజాగా వెంకటేష్ బర్త్ డే స్పెషల్ అంటూ ఓ ఫోటో షూట్ వదిలింది వెంకీ పిఆర్ టీం. అందులోను వెంకీ న్యూ స్టయిల్ అండ్ న్యూ లుక్ అంటూ మెరిసిన గెడ్డం, మెరిసిన హెయిర్ స్టయిల్ తో తన ఏజ్ కి తగిన కొత్త లుక్ లో వెంకటేష్ కనిపించాడనేసరికి అందరూ ఇక వెంకీ ఇదే లుక్ ని మెయింటింగ్ చేస్తాడేమో అంటున్నారు. మరి వెంకటేష్ నారప్ప సినిమా సెట్స్ మీదుంది కాబట్టి ఆ లుక్ లో కనిపిస్తున్నాడా? లేదంటే ఇక నుండి అజిత్ ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటున్నాడో అనేది వెంకీ తదుపరి సినిమాకి కానీ రివీల్ కాదు. ఇక నారప్ప షూటింగ్ పూర్తి కాగానే వెంకటేష్ కి రెండు మూడు కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ.. ముందుగా అనిల్ రావిపూడి తో ఎఫ్ 3 షూటింగ్ లోనే జాయిన్ కాబోతున్నాడు వెంకీ. వెంకటేష్ ఇలాంటి సక్సెస్ ఫుల్ బర్త్ డేస్ మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.