Advertisementt

ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ: ఆనంద్‌ దేవరకొండ

Fri 20th Nov 2020 02:45 PM
hero anand deverakonda,middle class melodies,special interview  ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ: ఆనంద్‌ దేవరకొండ
Exclusive interview: Middle Class Melodies Hero Anand Deverakonda ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ: ఆనంద్‌ దేవరకొండ
Advertisement
Ads by CJ

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా, బిగిల్ వంటి చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నూతన దర్శకుడు వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్ ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్‌ 20న ఓటీటీలో అగ్రగామిగా దూసుకుపోతోన్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో ఆనంద్‌ దేవరకొండతో సినీజోష్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..

రేపు సినిమా విడుదల కాబోతోంది.. మీ ఫీలింగ్‌ ఎలా ఉంది?

ఆనంద్‌- చాలా ఎగ్జైయింటింగ్‌గా ఉంది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్‌ చేశాం. మాకంటే కూడా మా దర్శకుడు సుమారు 2 సంవత్సరాలు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. ఆయన భవ్య క్రియేషన్స్‌తో కలిసి సినిమా చేసేందుకు రెడీ అవ్వడం, ఆ తర్వాత ఈ సినిమాలో మేము ఒక పార్ట్ అవ్వడం.. చాలా సంతోషంగా ఉంది. మొదట్లో.. అసలు ఈ కరోనా మహమ్మారి కారణంగా మా సినిమా సంగతి ఏమిటి? ఎలా విడుదల అవుతుంది? వంటి టెన్షన్స్ ఉండేవి. మార్చి, ఏప్రిల్‌ నాటికి మా సినిమా మొత్తం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉంది. అప్పుడే కరోనా వచ్చింది. ఇలాంటి టైమ్‌లో మా అదృష్టం ఏమిటంటే.. అమెజాన్‌ ప్రైమ్‌ వారు సినిమా చూసి, వారికి బాగా నచ్చి.. వారి సొంత సినిమాగా అంటే వారి ఒరిజినల్‌ మూవీలాగా ప్రమోషన్ప్‌ చేయడంతో చాలా సంతోషంగా ఉంది. రేపు విడుదల తర్వాత ఈ ఎగ్జయిట్‌మెంట్‌ మొత్తం శాటిస్‌ఫ్యాక్షన్‌గా మారుతుందుని అనుకుంటున్నా.

ట్రైలర్‌ చూస్తుంటే.. ఈ సినిమా ఫుడ్‌ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కినట్లుగా అనిపిస్తుంది. అన్నయ్య విజయ్‌ దేవరకొండ.. పెళ్లి చూపులు చిత్రం కూడా దాదాపు ఇటువంటి కాన్సెప్ట్‌తోనే ఉంటుంది. అంటే అన్నయ్య మార్గంలోనే నడుస్తున్నారా?

ఆనంద్‌- అలా ఏమీ లేదండి. అనుకోని జరిగింది కాదు.. అనుకోకుండా అలా జరిగింది. స్టోరీ నాకు బాగా నచ్చింది. ఈ రెండు సినిమాలు మీరు పోల్చి చూస్తే.. ఒక ఫుడ్‌ అనేదే కామన్‌ పాయింట్‌ అనిపిస్తుంది. మిగతాది అంతా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా మంచి కథ కుదిరింది. పెళ్లి చూపుల్లో చిత్రంలో హీరోహీరోయిన్లకి మిగతా క్యాస్ట్ సపోర్ట్‌గా ఉంటుంది. ఇందులో అలా కాదు. జానర్‌ కూడా వేరు. డ్రామా ప్లస్‌ కామెడీ ఇందులో ఉంటుంది. ఇది మిడిల్‌ క్లాస్‌ జీవితాల గురించి, అందులో ఉండే కష్టాలు.. అలాగే అందులో ఉండే బెస్ట్‌ మూమెంట్స్‌ని తీసుకుని వినోద్‌ కథ రెడీ చేశారు. ఇందులో హీరో, హీరోయినే కాదు.. ఇంకా 10 నుంచి 15 పాత్రలు.. ప్రతి పాత్రకి చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది.

ట్రైలర్‌లో బొంబాయ్‌ చట్నీని బాగా హైలెట్‌ చేశారు.. వాస్తవంగా మీరు బొంబాయ్‌ చట్నీ అంత బాగా చేస్తారా?

ఆనంద్‌- నవ్వుతూ.. అబ్బే అలా ఏం లేదండి.. సినిమా వరకే కుకింగ్‌ టాలెంట్‌ ఉంది. బయట కాదు. వర్క్‌షాప్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం వల్ల వచ్చినదే. సినిమాలో కుకింగ్‌ విజువల్స్‌ ఇంకా బాగుంటాయి.

ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా?

ఆనంద్‌- అప్పుడప్పుడూ ట్రై చేస్తుంటాను కానీ.. ఈ మధ్య కాలంలో మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదు. రియల్‌ లైఫ్‌లో కుకింగ్‌ మీద అంత ఇష్టంకానీ, అలవాటు కానీ అంతగా ఏమీ లేదు.

ఫస్ట్ దొరసాని, ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌ మెలోడీన్‌.. కమర్షియల్‌ ఇండస్ట్రీలో ఉండి ఇలా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే చేయడానికి కారణం ఏమైనా ఉందా?

ఆనంద్‌- ఈ ప్రశ్నలోనే నా సమాధానం ఉంది. మంచి కథ, అందులో ఉండే మూమెంట్స్‌ నాకు నచ్చే.. కాన్సెప్ట్ తరహా సినిమాలను ఎంచుకుంటున్నాను. ఈ రెండు సినిమాలే కాదు.. ముందు ముందు రాబోయే సినిమాలు కూడా దాదాపు అలాగే ఉంటాయి. అన్నీ ఒకే జానర్‌ కాకుండా.. డిఫరెంట్‌ జానర్‌లో చేయాలని అనుకుంటున్నాను. హీరోయిజాన్ని హైలెట్‌ చేసేలా కాకుండా.. మంచి కాన్సెప్ట్‌తో డిఫరెంట్‌ తరహా మూవీలు చేయాలని అనుకుంటున్నాను.

రౌడీ.. అదే విజయ్‌ అనే బ్రాండ్‌ మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందను కుంటున్నారు?

ఆనంద్‌- అన్నయ్య ఎస్టాబ్లిస్ట్ హీరోగా నిరూపించుకున్నాడు కాబట్టే.. ఆయనకి ఒక తమ్ముడు ఉన్నాడనే పేరు వచ్చింది. నాకు స్కూల్‌ టైమ్‌ నుంచే యాక్టింగ్‌ మీద ఇంట్రెస్ట్ ఉండేది. కానీ సక్సెస్‌ రేట్‌ తక్కువ. అందుకే అంత రియలిస్టిక్‌ అనిపించలేదు. చిన్నప్పుడు అమ్మానాన్నల పక్కన కూర్చుని చిరంజీవిసార్‌, మహేష్‌సార్‌ వంటి వారి సినిమాలు చూస్తున్నప్పుడు.. స్క్రీన్‌ మీద వారిని చూసి.. ప్రేక్షకులు చేసే సందడి చూసి.. మనకి కూడా ఆ స్క్రీన్‌పై కనిపించాలని ఏదో ఒక మూల అనిపిస్తుంది. నాకు కూడా అలా అనిపించింది. విజయ్‌ వచ్చిన తర్వాత నాకు కూడా ఆ అవకాశం లభించింది. పర్సనల్‌గా ఇప్పుడు ఆ అవకాశాన్నే సద్వినియోగం చేసుకుంటున్నా. ప్రస్తుతం ఉన్న కంపారిజన్స్‌ని ముందు ముందు సినిమాలు చేస్తూ.. నాకంటూ ఓ పేరు సంపాదించుకుంటాననే కాన్ఫిడెన్స్‌ అయితే నాలో ఉంది.

ఈ సినిమా కోసం గుంటూరు స్లాంగ్‌ నేర్చుకున్నారట కదా? నిజమేనా?

ఆనంద్‌- నేర్చుకున్నాను. ప్రాక్టీస్‌ చేశాను. మా డైరెక్టర్‌ వినోద్‌ అనంతోజు కూడా ఆ ఏరియా వాడే కావడంతో.. అతనితో కూర్చుని మాట్లాడుతూ.. వర్క్‌ షాప్స్‌ చేస్తూ.. స్క్రిప్ట్ రీడింగ్‌, అలాగే కో యాక్టర్స్‌ కూడా ఆ రీజియన్‌ వారే కావడంతో వారితో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. అలవాటు చేసుకున్నాను. పాఠాలుగా కాకుండా.. ఎంజాయ్‌ చేస్తూ నేర్చుకున్నా.

డైరెక్టర్‌ వినోద్‌ అనంతోజు గారు ఫస్ట్ మీకు కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు?

ఆనంద్‌- ఆయన మా ఆఫీస్‌కి వచ్చి చెప్పిన ఫస్ట్ నేరేషన్‌కే నాకు బాగా నచ్చేసింది. కథ ఆయన ప్రతీది వివరిస్తూ.. చాలా చక్కగా చెప్పారు. ఆయన కథ చెబుతున్నప్పుడే.. సినిమా అంతా విజువల్‌గా నాముందు కనిపించింది. మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌లో ఉండే కష్ట, సుఖాలన్నీ తీసుకుని రియాలిటీగా హ్యూమరస్‌ జోడించి.. వినోద్‌ ఓ ఫీల్‌ గుడ్‌ స్టోరీ తయారు చేశాడు. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.

మీరు కూడా మిడిల్‌ క్లాస్‌ నుంచి వచ్చినవారే.. అప్పటి మీ అనుభవం ఏదైనా..?

ఆనంద్‌- అనుభవాలు అంటే చాలా ఉన్నాయి. నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు కూడా మిడిల్‌ క్లాస్‌కి సంబంధించిన ఎన్నో అనుభవాలున్నాయి. అసలు మిడిల్‌ క్లాస్‌ జీవితాలు అంటే.. కష్టలను అనుభవిస్తూనే.. సర్దుకుపోతే బతకడం. బైకు నుంచి కారు కొనుక్కనే స్థాయికి వెళ్లిన ప్రతి క్షణం నాకు గుర్తున్నాయి. అన్న.. ఈ కెరియర్‌ ఎంచుకుని లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌, నువ్విలా వంటి సినిమాలే చేస్తున్నారు. ఇంకా సెట్‌ కాలేదు. అలాంటి టైమ్‌లోనే నేను యుఎస్‌కి వెళ్లి..ఫైనాన్షియల్‌గా సెటప్‌ చేసుకుని మా ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలని అనుకున్నా. నా ఫస్ట్ విమాన జర్నీ కూడా అప్పుడే. నాకు ఎమ్‌.ఎస్‌ చేయడానికి చాలా మనీ కావాల్సి వచ్చింది. అప్పుడు మా ఫ్యామిలీలోని వారంతా కలిసి.. వీడు బాగుండాలని హెల్ప్ చేశారు. ఇలాంటి మెమరీస్‌ చాలా ఉన్నాయి నాకు.

భవ్య క్రియేషన్స్‌ నిర్మాణ విలువల గురించి..?

ఆనంద్‌- భవ్య క్రియేషన్స్‌కి చాలా మంచి పేరుంది. ఎస్టాబ్లిష్డ్‌ ప్రొడక్షన్ హౌస్‌. మా సినిమా స్టోరీ నచ్చి.. థియేటర్‌ ఫీలింగ్‌ కలిగించి.. ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. వినోద్‌ ఏది అడిగితే అది ప్రొవైడ్‌ చేశారు. చాలా బాగా సపోర్ట్ చేశారు.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అంటే ఓటీటీలో సినిమా విడుదల అవుతుంది.. ఎలా ఉంది ఫీలింగ్‌?

ఆనంద్‌- చాలా సంతోషంగా ఉంది. ఓటీటీలో చాలా పెద్ద సంస్థ అమెజాన్‌. అందులో మా సినిమా రిలీజ్‌ అంటే.. ప్రపంచం అంతా చూస్తుంది. చాలా ఎగ్జైట్‌గా ఉంది.

ఫైనల్‌గా.. ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?

ఆనంద్‌- ఇదొక ఫీల్‌ గుడ్‌ హ్యూమార్‌ కామెడీతో ఉన్న స్టోరీ. అందరికీ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. లవ్‌ ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్‌ ఉంటుంది. స్ట్రగుల్స్‌ ఉంటాయ్‌. వాటన్నింటిని సింపుల్‌ హ్యూమర్‌తో చూపించడం జరిగింది. మ్యూజిక్‌, విజువల్స్‌ అన్నీ చాలా బాగుంటాయ్‌. ప్రతి ఒక్కరూ చక్కగా ఎంజాయ్‌ చేస్తారు. అందరూ అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమాని చూడండి. థ్యాంక్యూ.

Click Here: Hero Anand Deverakonda Exclusive interview Photos.

Exclusive interview: Middle Class Melodies Hero Anand Deverakonda:

Hero Anand Deverakonda talks about Middle Class Melodies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ