లిమిటెడ్ బడ్జెట్‌తో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి యువ దర్శకుడు నాగు గవర దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ బ్యానర్‌పై చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో నటించిన హీరో వసంత్ సమీర్ మీడియాతో ముచ్చటించారు.
ముందుగా...
కొత్త హీరోనైనా నన్ను మీడియా చాలా బాగా సపోర్ట్ చేసి అన్ని రివ్యూస్‌లో నా గురించి చాలా బాగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సినిమా గురించి కూడా చాలా ఏరియాల నుంచి ఫోన్స్ వచ్చాయి సినిమా చాలా బావుంది అని. మేము షూటింగ్ మొదలుపెట్టాక ఎక్కడా కూడా బ్రేక్ అనేది లేకుండా చాలా బాగా ఫాస్ట్‌గా జరిగిపోయింది.
అవకాశం ఎలా వచ్చింది...
నాకు ఈ సినిమా అవకాశం ఒక కామన్ ఫ్రెండ్ హర్ష ద్వారా వచ్చింది. ‘కర్త కర్మ క్రియ’ అనే సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి నన్ను అక్కడకి పంపించారు. అప్పటికే నేను రెండేళ్ళ నుంచి వేరే వేరే ఆడిషన్స్ చేసి ఉన్నాను. శ్రీనివాస్‌గారికి నాగుగారు నన్ను చూపించారు. చూసి బానేవున్నావు అన్నారు. ఒక ట్రైయిల్ షూట్ చేసి చూపించారు. దాంతో వెంటనే ఆయన ఓకే అన్నారు.
గతంలో ఏదైనా చిత్రంలో నటించారా..?
లేదండి నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. గోల్కొండ హైస్కూల్ చిత్రంలో చిన్నప్పటి సుమంత్ క్యారెక్టర్‌లో నటించాను. తర్వాత జోష్ చిత్రంలో చిన్నప్పటి నాగచైతన్య క్యారెక్టర్‌లో చేశాను. పెద్దయ్యాక ఇదే నా మొదటి సినిమా.
మీ నేటివ్ ప్లేస్ ...
మాది వైజాగ్ జిల్లాలో అనకాపల్లి దగ్గర చోడవరం. చిన్నప్పుడు సెకండ్ క్లాస్ వరకు అక్కడే చదివాను. థర్డ్ క్లాస్ నుంచి హైదరాబాద్ వచ్చాము. 2016లో నేను నా మెకానికల్ ఇంజినీరింగ్‌ని కంప్లీట్ చేశాను. అది అయిన తర్వాత మూవీస్‌లో ట్రైయిల్స్ చేస్తూ ఉన్నాను.
సినిమాల పైన ఇంట్రెస్ట్ ఎలా కలిగింది...
సినిమాల పైన అంటే చిన్నప్పటి నుంచి సినిమా సర్కిల్‌లో పెరిగాను. మా నాన్నగారు విజయేంద్రప్రసాద్ గారి దగ్గర రైటర్‌గా పనిచేశారు. షూటింగ్స్‌కి వెళ్ళడం అలాగే గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక స్వర్ణ మాస్టర్స్ డాన్స్ క్లాస్ ఉంది. ఆ డాన్స్ క్లాస్ నుంచి చిన్నపిల్లలు సినిమా షూటింగ్స్‌కి కావాలంటే తీసుకువెళ్ళేవారు. మాయాబజార్ అలా రెండు మూడు సినిమాలకు తీసుకువెళ్ళేవారు బ్యాక్ గ్రౌండ్‌లో డ్యాన్స్ చేయించేవారు పిల్లలందరితో. నేను 2 ఇయర్స్ నుంచి ఆడిషన్స్ ఇస్తూ కూడా విజయేంద్రప్రసాద్‌గారి దగ్గర రైటర్‌గా పనిచేశాను. విజయేంద్రప్రసాద్‌గారిది సోనీ టీవీలో క్రాస్ రోడ్స్ అనే ఒక షోకి పనిచేశాను. అది టెలికాస్ట్ అయి రెండు నెలలు అవుతుంది అయిపోయి. దానికి ఒక 39 షార్ట్ స్టోరీస్‌కి పనిచేశాను. హిందీ షో అది. ఆ షో చేస్తున్న టైంలోనే ఈ అవకాశం వచ్చిందని చెపితే విజయేంద్రప్రసాద్‌గారు ఆయన బ్లెస్సింగ్స్‌తో నన్ను పంపించారు.
యాక్టింగ్ సైడ్ ఏమన్నా నేర్చుకున్నారా...
బాంబే అనుపమ్ కేర్ ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. నేను ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే హాలీడేస్‌లో వెళ్ళి నేర్చుకునేవాడ్ని. మైమ్ కూడా చేశాను. మార్షల్ ఆర్ట్స్ చేశాను. హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నాను. బ్యాగ్రౌండ్ లేనప్పుడు అన్నీ నేర్చుకోవాలి. అన్నీ వస్తేనే కదా అవకాశాలు వచ్చేది. ఆడిషన్స్ చేస్తున్నట్లు తెలిస్తే వాళ్ళని అప్రోచ్ అవ్వడం నా ఫొటోస్ పంపడం అలా చేసే వాడ్ని. కొన్ని కొన్ని వస్తాయని, అనుకున్నవి రాకపోవడం అలా జరిగాయి. విజయేంద్రప్రసాద్ గారి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడం నాకు బాగా ప్లస్ అయింది. సినిమాకి దగ్గరగా ఉన్నాను.
ఈ సినిమాలో రైటింగ్ పరంగా ఏదైనా కరెక్షన్...
లేదండి వచ్చిన వెంటనే అన్నిట్లో వేలు పెడతాడు అనుకుంటారని నేనేమీ చెప్పలేదు. కాశీ విశ్వనాధ్‌గారు అందంగా ఉన్నవాళ్ళు సరిగా యాక్ట్ చెయ్యరు మరి మీరెలా చేస్తారో అన్నారు కానీ మళ్ళీ ఆయనే వచ్చి చాలా బాగా చేశావు అని చెప్పారు. నా యాక్టింగ్ విషయం వరకు ఎవరూ ఎటువంటి కంప్లయింట్స్ చెయ్యలేదు. అందరూ ఎంకరేజ్ చేశారు.
మీ నాన్నగారు ఏమైనా సలహాలు ఇచ్చారా...
పర్సనల్ సలహాలు అంటే.. అవకాశం వచ్చింది ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి డబ్బులు పెట్టారు. ఈ సినిమా చూసి నీకు ఇంకా అవకాశాలు రావాలి. ఇది నీకు మంచి ప్లాట్‌ఫార్మ్ అనుకో అని అన్నారు. మీడియా వాళ్ళందరూ నా గురించి చాలా పాజిటివ్‌గా రాశారు ఆ విషయంలో చాలా హ్యాపీ.
సినిమా విడుదలయ్యాక మీకు వచ్చిన రెస్పాన్స్...
ట్రైలర్ వచ్చాక అందరూ నా వాయిస్ చాలా బావుందని అన్నారు. కత్తి మహేష్ కూడా ఫేస్ బుక్‌లో షేర్ చేశారు నా వాయిస్ రానా వాయిస్‌లా ఉందని ఆయనకు నాకు పరిచయం లేదు బట్ ఐ యామ్ సో హ్యాపీ. వాయిస్ డిక్షన్ చాలా బాగుంది అన్ని పదాలు చాలా స్పష్టంగా పలుకుతున్నాను అని అందరూ అన్నారు. సినిమా విడుదలయ్యాక కూడా కొత్త యాక్టర్‌లాగా ఎక్కడా అనిపించలేదు చాలా మెచ్యూర్డ్ యాక్టర్‌లాగా చేశాడు అన్నారు. క్లయిమాక్స్ చాలా బాగా చేశాను అన్నారు.
క్లయిమాక్స్ చెయ్యడానికి భయపడ్డారా...
సినిమా షూటింగ్ టైంలో భయపడలేదు కాని క్లయిమాక్స్ చేసేటప్పుడు కొంచం భయపడ్డాను. ఎందుకంటే ఏమాత్రం సరిగా రాకపోయినా క్యారెక్టర్‌ని చంపేశా అంటారు. అదే బాగా చేస్తే నాకు మంచి పేరు వస్తది అని టెన్షన్ పడ్డాను. కాని సింగిల్ టేక్‌లో చేశాను. రవివర్మగారు చూస్తూ ఉన్నారు నువు ఎలా చేస్తావో చూస్తాను అని సింగిల్ టేక్‌లో చేయడంతో ఆయన లేచి క్లాప్స్ కొట్టారు.
వేరే ఏదైనా ఆఫర్స్ వస్తున్నాయా...
ముగ్గురు అప్రోచ్ అయ్యారు. నేను ఇంకా ఏదీ ఫైనలైజ్ చెయ్యలేదు. మంచి ప్రొడక్షన్, మంచి స్క్రిప్ట్ చూసుకుని వెళదామని చూస్తున్నాను. నా కెరీర్‌కి ప్లస్ అవ్వాలని.
డైరెక్టర్ నాగు గవర గురించి...
ఆయన చాలా కామ్ గోయింగ్. నన్ను హర్ష పరిచయం చేశాడు డైరెక్టర్‌గారికి. ఆయన నన్ను చూసి నువ్వు నా క్యారెక్టర్‌కి ఓకే బట్ నీ హైటే ప్రాబ్లమ్ ఇంత హైట్ ఉన్న అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నారు. నాకు మొదటి నుంచి చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్‌గారి సపోర్ట్‌తో చాలా బాగా చేశాను.
నెగిటివ్ షేడ్ ఉంది కదా మీరు ఫీలయ్యారా...
నెగిటివ్ షేడ్ ఉంది కాబట్టే చేశాను. అందరిలాగా రొటీన్‌గా లవ్ స్టోరీ, పువ్వులు పట్టుకుని వెళ్ళడం కామన్. డిఫరెంట్‌గా చేద్దామని చేశాను. డిఫరెంట్‌గా ఉంటేనే గుర్తింపు వస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా అలానే చేసి వచ్చారు కదా. యాజ్ యాన్ యాక్టర్ డిఫరెంట్‌గా చేస్తేనే పేరు వస్తుంది అని చేశాను.
హీరోయిజాన్ని ఇష్టపడతారా, క్యారెక్టరైజేషన్‌నా...
క్యారెక్టరైజేషన్ నమ్ముతాను. క్యారెక్టరైజేషన్ వల్లే హీరోయిజం వస్తది. కొన్ని కొన్ని క్యారెక్టర్స్‌లో ఫైట్స్ లేకుండా ఒక్క డైలాగ్‌తో ఎలివేట్ అవుతుంది అలా.
మీరు ఫ్యూచర్‌లో చెయ్యాలనుకునే డ్రీమ్ రోల్...
మైథాలజీ, పీరియాడిక్, ఫోక్‌లోర్ ఈ మూడు జోనర్స్ ఎప్పటికైనా చేస్తాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక డైలాగులు ప్రాక్టీస్ చేసే వాడ్ని ఎవరైనా అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. రీసెంట్‌గా దానవీరశూరకర్ణ డైలాగ్‌ను ఓ ఛానెల్ లైవ్‌లో చెప్పాను.
మైథాలజీ అంటే హీరో రోల్స్ ఏమీ ఉండవుగా...
మహాభారతం అంటే అన్నీ ముఖ్యమైన పాత్రలే కదండి. అర్జునుడు నుంచి అభిమన్యుడు వరకు అన్నీ క్యారెక్టర్స్ బాగుంటాయి. ఈ అబ్బాయి డైలాగ్స్ బాగా చెపుతాడు ఇతన్ని తీసుకోవాలి అనే ప్లేస్‌లో ఉండాలని నా కోరిక. నేను రికమండేషన్‌తో ఎక్కడికీ వెళ్ళలేదు. హర్ష కూడా నాకు యాక్టింగ్ క్లాస్‌లో పరిచయం. మా నాన్నగారికి ఏమీ సంబంధం లేదు.
ఇంట్లో వాళ్ళ సపోర్ట్...
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే సపోర్ట్ చేశారు. చిన్నప్పుడే నేను చెప్పాను. ఎప్పుడూ కాదనలేదు. అన్నయ్య ఫారెన్‌లో ఉంటాడు తనకు పెద్దగా దీనిపై ఇంట్రెస్ట్ లేదు. నాకు ఉండడం వల్ల ఇటు వైపు వచ్చాను.
మీ ఫేవరెట్ హీరో...
నటుడిగా నాకు సీనియర్ ఎన్టీఆర్‌గారి పౌరాణికాలు బాగా చూసేవాడ్ని. అవి బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్‌కూడా బాగా ఇష్టం. మంచి పేరొచ్చిన క్యారెక్టర్స్ అంటే ఇష్టం. బిజినెస్‌మ్యాన్‌లో మహేష్‌బాబుగారు అలా ఇన్‌టెన్స్ పెర్ఫార్మెన్స్, సీరియస్ రోల్స్ బాగా ఇష్టం.
మీ ప్లస్‌లు మైనస్‌లు...
నా ప్లస్ డైలాగ్స్. ఎటువంటి డైలాగ్స్ అయినా చాలా బాగా చెప్పగలను. డైలాగ్ డిక్షన్, పెర్ఫార్మెన్స్ పరంగా నేనొకడ్ని ఉన్నానని గుర్తించాలని కోరుకుంటున్నాను. డైలాగ్ నా బలం. మైనస్‌లు రెండు మూడు చోట్ల నా బాడీ ల్యాంగ్‌వేజ్ కరెక్ట్ చేయాలనిపించింది అంతే. సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది. డైరెక్టర్‌గారు చిన్ అప్‌చేస్తున్నావ్ కొంచం డవున్ చెయ్యిమని చిన్న కరెక్షన్ చెప్పేవారు అంతే.
ఇంత కాంపిటేషన్‌లో మీరు వస్తున్నారు...
మన వర్క్ మనల్ని కాపాడుతుంది. కాంపిటేషన్ అంటే ఏ ఫీల్డ్‌లోనైనా ఉంటుంది. అన్ని రకాలుగా చూపిస్తే వసంత్ సమీర్ ఉంటే చాలు అన్నీ చేసేస్తాడు అన్న థాట్ డైరెక్టర్స్‌కి వస్తే చాలండి. హైట్‌తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా ఉందనే ఆప్షన్‌లో వాళ్ళు ఉండాలి..