Advertisementt

చిరంజీవిగారు నా లక్కీ చార్మ్‌: అఖిల్!

Thu 28th Dec 2017 07:23 PM
akhil akkineni,hello movie,interview,nagarjuna,chiranjeevi  చిరంజీవిగారు నా లక్కీ చార్మ్‌: అఖిల్!
Akhil Akkineni Hello Movie Interview చిరంజీవిగారు నా లక్కీ చార్మ్‌: అఖిల్!
Advertisement
Ads by CJ

'హలో' సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు థాంక్స్‌ - యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని 

యూత్‌కింగ్‌ అక్కినేని అఖిల్‌ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ , మనం ఎంటర్‌ప్రైజెస్‌ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'హలో'. విక్రమ్‌.కె.కుమార్‌ దర్శకత్వంలోఅక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదలైంది. ఈ సందర్భంగా అక్కినేని అఖిలతో ఇంటర్వ్యూ.... 

అందుకోసం స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నాను.. 

- ఈ సినిమా పార్కోవర్‌ సీక్వెన్స్‌ కోసం దాదాపు 60 రోజులు ముందుగానే ట్రైనింగ్‌ తీసుకున్నాను. యాక్షన్‌ పార్ట్‌ను డిజైన్‌ చేసిన బాబ్‌ బ్రౌన్‌ అండ్‌ టీం ప్లానింగ్‌లో భాగంగా 16 మంది సభ్యులు లాస్‌ ఏంజిల్స్‌ నుండి ముందుగానే ఇక్కడకు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ట్రైనింగ్‌ తీసుకోవడం వల్ల సినిమాలో పర్టికులర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లో నటించడం సులభమైంది. సినిమా స్టార్ట్‌ చేయడానికి ముందుగానే సీజీ వాడకూడదని నిర్ణయించుకునే అందులో భాగంగానే ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఇలాంటి యాక్షన్‌ సీక్వెన్స్‌లను చేయడం అంత సులభం కాదు. యాక్షన్‌ సీక్వెన్స్‌లను చేయడానికి 30 రోజులు పట్టింది. కాస్తా కష్టపడ్డాం కానీ ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగా వచ్చాయి. 

అదే బెస్ట్‌ కాంప్లిమెంట్‌ 

- చాలా కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. ముఖ్యంగా బాగా తెలిసిన అమ్మాయి.. క్లైమాక్స్‌ సీన్‌ను చూసి యు స్టోలెన్‌ మై హార్ట్‌ అని కాంప్లిమెంట్‌ ఇచ్చింది. 

డాన్సులు కూడా కథలో భాగంగానే.. 

- డాన్స్‌ సాంగ్స్‌ వల్ల ఓ నాలుగైదు నిమిషాలు స్టోరీ ఆగిపోతుంది. కాబట్టి అలాంటి డాన్స్‌ నంబర్స్‌ పెట్టడం విక్రమ్‌కు ఇష్టం లేదు. కథలో భాగంగానే డాన్స్‌ నంబర్‌ సినిమాలో ఉంటుంది. ఉన్న డాన్సులు కూడా కథలో భాగంగానే ఉంది. 

ఆ విషయంలో హ్యాపీ... 

- సాధారణంగానే నాకు టెన్షన్‌ ఎక్కువ. సినిమా విడుదలై యు.ఎస్‌.రిపోర్ట్స్‌ వచ్చే వరకు టెన్షన్‌తో నిద్ర పోలేదు. సినిమా రివ్యూస్‌ పాజిటివ్‌గా రావడం సంతోషానిచ్చింది. ఈ సినిమాతో హిట్‌ కొట్టాలని ఆలోచన కాకుండా..ఓ మంచి సినిమాలో భాగం కావడంలో ముఖ్య భూమిక తీసుకోవడం చాలా హ్యాపీ. ఈ సినిమాను సక్సెస్‌ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్‌. 

యు.ఎస్‌లో తెలుగు మార్కెట్‌ పెరిగింది.. 

- యు.ఎస్‌ మార్కెట్‌ తెలుగు సినిమాకు పెరిగింది. అలాగే సినిమా రిలీజ్‌కు ముందుగానే వేసిన ప్లాన్‌ ప్రకారం అక్కడకు వెళ్లి ప్రమోట్‌ చేశాం. సినిమా ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. దాని వల్ల సినిమా యు.ఎస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్‌ కలెక్షన్‌కు దగ్గరగా ఉంది. యు.ఎస్‌. మార్కెట్‌లో కలెక్షన్స్‌ బావుంటుందని అనుకున్నాను కానీ ఇంత బావుంటుందని అనుకోలేదు. 

మళ్లీ ఆయనతో వర్క్‌ చేయాలని ఉంది.. 

- నాన్నగారు స్ట్రాంగ్‌ నిర్మాత. నా సినిమా, నాకు కావాల్సినట్లు చేస్తానని ఎడిటింగ్‌, రీరికార్డింగ్‌ ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి కోణాన్ని పర్యవేక్షించారు. రామ్‌గోపాల్‌వర్మగారి సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేసి మొత్తం టెన్షన్‌ను ఆయనే తీసుకున్నారు. ఆయనతో మళ్లీ వర్క్‌ చేయాలనుకుంటున్నాను. 

చైతన్య ఏమన్నాడంటే.. 

- నేను నా తొలి సినిమా ఎక్కువగా ఫైట్స్‌, డాన్సుల్లో ఎక్కువ ఫోకస్‌ పెట్టేశాను. ఈ సినిమా చూసిన తర్వాత చైతన్య..ఓ 'యాక్టర్‌గా ఓపెన్‌ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ మంచి సినిమాలో పార్ట్‌ అయ్యావని' అప్రిసియేట్‌ చేశారు. 

పాట పాడటం గురించి.. 

- అనూప్‌తో మంచి అనుబంధం ఉంది. గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో రోజు మార్చి రోజు నాతో నాలుగైదు గంటలు కూర్చుని మ్యూజిక్‌ నేర్పించారు. కీ బోర్డ్‌, గిటార్‌ అంతా నా రూమ్‌లోనే వదిలేశాడు. బేస్‌ వాయిస్‌ బావుంది. సాధారణంగా నన్ను ఓసారి హమ్‌ చేయమని చెప్పాడు. అయితే నేను రెగ్యులర్‌ సింగర్‌ని కాను..నాకు ట్రైనింగ్‌ ఇవ్వమని అనూప్‌ను అడిగాను. తను మూడు నెలలు పాటు నాకు మ్యూజిక్‌లో బేసిక్స్‌తో చిన్నపాటి క్రాష్‌ కోర్సు ట్రైనింగ్‌ ఇచ్చాడు. 

చిరంజీవి..నా లక్కీ చార్మ్‌.. 

- సినిమా చూసిన చిరంజీవిగారు.. 'చాలా సెటిల్డ్‌గా చేశావ్‌' అని అన్నారు. చిరంజీవిగారు నా లక్కీ చార్మ్‌. నా తండ్రిలా నన్ను ఎంకరేజ్‌ చేస్తారు. నేనే కాదు, ఇండస్ట్రీలోకి వచ్చే ఏ నటుడినైనా ఆయన బాగా ఎంకరేజ్‌ చేస్తారు. ఆయనకు సినిమాలంటే పిచ్చి. అందుకే నటీనటలనే కాదు.. సినిమాలో ఏ డిపార్ట్‌మెంట్‌ వ్యక్తినైనా ఆయన ఎంకరేజ్‌ చేస్తారు. 

సినిమా మేకింగ్‌ విషయాలను నేర్చుకున్నా... 

- నేను పెద్ద సినిమా కోసం వెయిట్‌ చేశాను. అందులో భాగంగా 'హలో' సినిమా చేశాను. ఈ జర్నీలో సినిమా మేకింగ్‌ గురించి చాలా విషయాలను నేర్చుకున్నాను. విక్రమ్‌కుమార్‌, పి.ఎస్‌.వినోద్‌ వంటి టాప్‌ టెక్నిషియన్స్‌తో ఈ సినిమాలో పనిచేశాను. సినిమాను నాకంటే ఎక్కువగా ప్రేమించే సీనియర్స్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. ఎడిటింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను ఎలా మానిటర్‌ చేయాలి, డైలాగ్స్‌ ఎలా రాస్తారు ఇలా అన్నింటిని అబ్జర్వ్‌ చేశాను. 

ముందుగానే అనుకున్నాం.. 

- 'మనం' సినిమా చేసే సమయంలోనే నాతో, విక్రమ్‌కుమార్‌తో సినిమా చేయాలని నాన్నగారు అనుకున్నారు. కానీ 'మనం' తర్వాత విక్రమ్‌ కుమార్‌ '24' సినిమాతో బిజీగా మారిపోయారు. ఆ సినిమా తర్వాత ఈ హలో సినిమానే స్టార్ట్‌ అయ్యింది. 

- ఫ్యాన్స్ కూడా మంచి సినిమా తీశామని హ్యాపీగా ఉన్నారని నాకు ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. 

ఆ ఆలోచనలేం పెట్టుకోలేదు.. 

- ఇప్పుడు క్లాస్‌ సినిమా చేశాను. తర్వాత మాస్‌ సినిమా చేయాలి..ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోలేదు. ఏ కాలిక్కులేషన్‌ లేవు. కథ బావుంటే ఏ సినిమా అయినా చేసేస్తాను. 

హీరోయిన్‌ గురించి.. 

- కల్యాణి ప్రియదర్శిన్‌ తొలి సినిమానే అయినా చక్కగా చేసింది. హీరోయిన్‌గా కాదు..మంచి నటిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. నా తొలి సినిమాలో నేను కూడా అంత బాగా చేయలేదనే అనుకుంటున్నాను. చాలా హార్డ్‌వర్కర్‌. 

బాలీవుడ్‌లో సినిమా... 

- ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా తెలుగు ఇండస్ట్రీపైనే. ఎందుకంటే నేను తెలుగువాడ్ని. మా అభిమానులు కూడా ఇక్కడి వారే. ఇక్కడొక ఐదారు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో సినిమా గురించి ఆలోచిస్తాను. 

తదుపరి సినిమా... 

- జనవరి 5న ఒక కథ వింటున్నాను. జనవరి 8న మరో కథ వింటాను. ఈ రెండింటిలో ఏ సినిమా చేస్తాననేది జనవరి 10న అనౌన్స్‌ చేస్తాను. అయితే నేను పలానా దర్శకుడితో సినిమా చేస్తానని చాలా వార్తలు వినపడుతున్నాయి. అలాంటిదేమీ లేదు. 

Akhil Akkineni Hello Movie Interview:

Akhil About Hello Movie..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ