పవన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వివేక్ కైప పట్టాబిరామ్ దర్శకత్వంలో సుబాష్ ఆనంద్ సంగీత దర్శకత్వంలో 'విమెన్ యాంతం'ను ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ పాడారు. పవన్ కుమార్ గౌడ్ నిర్మాత. ఈ పాటను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా..
బిజెపి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ కోటేశ్వరావు మాట్లాడుతూ.. ''ఇలాంటి ఓ మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉన్న పాత్రను ఒక పాట రూపంలో చెప్పడం మంచి విషయం'' అని చెప్పారు.
దర్శకుడు వివేక్ మాట్లాడుతూ.. ''పుట్టుక మొదలయ్యేది అమ్మతో.. ఓంకారం మొదలయ్యేది శక్తితో. ఆ గౌరవాన్ని ఎలా చూపించాలని ఆలోచించి వీడియో రూపంలో ఒక పాటను విడుదల చేశాం. పవర్ ఫుల్ సోర్సెస్ తో ఈ పాటను రూపొందించాం. సుబాష్ ఆనంద్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో శంకర్ మహదేవన్ గారు ఈ పాటను అధ్బుతంగా పాడారు. అయితే ఇదివరకే నేను ఈ బ్యానర్ లో రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో 'కోమలి' అనే సినిమాను చిత్రీకరించాను. త్వరలోనే ఆ సినిమాను తెలుగు, తమిళ బాషలలో విడుదల చేయబోతున్నాం. అది కాకుండా ప్రొడక్షన్ నెం 2 సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమాతో ధీరన్ అనే కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు'' అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మజారెడ్డి, సుచరిత, బిజెపి స్టేట్ వైజ్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి లాంటి ప్రముఖ మహిళలకు మొమెంటోలను అందించారు.