Advertisementt

చిరు గారి కాంప్లిమెంట్ మర్చిపోలేను: రకుల్

Tue 19th Apr 2016 01:41 PM
rakul preeth singh interview,sarainodu movie,boyapati sreenu,allu arjun  చిరు గారి కాంప్లిమెంట్ మర్చిపోలేను: రకుల్
చిరు గారి కాంప్లిమెంట్ మర్చిపోలేను: రకుల్
Advertisement
Ads by CJ

'సరైనోడు' సినిమాలో విలేజ్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. రాజమండ్రికి చెందిన మహాలక్ష్మి అనే రోల్ లో మేకప్ లేకుండా నటించాను. అయితే నా పాత్రకు డబ్బింగ్ మాత్రం చెప్పుకోలేదు. ఎందుకంటే రాజమండ్రి భాషలో కొంచెం యాస ఉంటుంది. నా తెలుగు లాంగ్వేజ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తను నటించిన 'సరైనోడు' సినిమా విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. 

ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్..

నాకు గ్లామర్ డాల్ అని పేరెందుకు వచ్చిందో తెలియట్లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కరెంట్ తీగ, కిక్2, పండగ చేస్కో సినిమాల్లో నేను డీ గ్లామరస్ గానే కనిపించాను. రీసెంట్ గా వచ్చిన 'బ్రూస్ లీ','నాన్నకు ప్రేమతో' సినిమాల్లో మాత్రమే గ్లామరస్ గా కనిపించాను. మేకప్ వేసుకున్నానా.? లేదా..? అని కాదు. నా పాత్రకు ఎంత ఇంపాక్ట్ ఉంది అని మాత్రమే చూస్తాను. ఈ సినిమాలో నా పాత్రకు మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర. 

అదే బెస్ట్ వే..

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నేను ఎలాంటి హోంవర్క్ చేయలేదు. డైరెక్టర్ మాట విని ఆయన చెప్పింది చేశాను. బోయపాటి గారు క్లారిటీ ఉన్న డైరెక్టర్. ప్రతి ఒక్కరి పాత్రను ఆయన పెర్ఫార్మ్ చేసి చూపించేవారు.  మన డైరెక్టర్ మాట వింటే చాలు. ఇంకేం చేయక్కర్లేదు. అదే బెస్ట్ వే.

ఎగ్జైట్ చేయాలి..

ఒకే రకమైన పాత్రల్లో నటించాలంటే నాకు బోర్. ప్రేక్షకులకు కూడా నేను చేసిన పాత్రల్లోనే మళ్ళీ కనిపిస్తూ.. ఉంటే విసుగొస్తుంది. అసలు ఈ సినిమాలో పాత్రకు నిజజీవితంలో రకుల్ పాత్రకు అసలు కనెక్షన్ ఉండదు. ఒక పాత్ర సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ రోల్ మనల్ని ఎగ్జైట్ చేసే విధంగా ఉండాలి.

బోయపాటి గారి హీరోయిన్స్ స్పెషల్..

'సరైనోడు' అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాల్లో హీరోల పాత్రలకే ప్రాముఖ్యత ఉంటుందని అనుకుంటారు. నిజానికి బోయపాటి గారి సినిమాల్లో హీరోయిన్స్ స్పెషల్ గా కనిపిస్తారు. ఈ సినిమాలో నా పాత్ర మాత్రమే కాదు.. కేథరిన్ పాత్రకు కూడా మంచి డెప్త్ ఉంటుంది. సినిమాలో నా పేరు మహాలక్ష్మి అయినా.. హీరో మాత్రం ఒక పెట్ నేమ్ తో పిలుస్తుంటాడు. సినిమాలో అదే నోటీస్ అవుతుంది.

నా డాన్స్ ఇంప్రూవ్ అవుతుంది..

అల్లు అర్జున్ మంచి డాన్సర్. నా లాస్ట్ రెండు మూడు సినిమాల నుండి మంచి డాన్సర్స్ అయిన హీరోలతోనే వర్క్ చేస్తున్నాను. వారి వలన సినిమా సినిమాకు నా డాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. రిహార్సల్ చేసిన తరువాత ఎలాంటి స్టెప్స్ అయినా.. వేయగలను. రిహార్సల్స్ మాత్రం కంపల్సరీ..

వాళ్ళిద్దరికీ బోన్స్ ఉండవనుకుంట..

అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరితో కలిసి వర్క్ చేశాను. ఇద్దరు మంచి డాన్సర్స్. నాకు తెలిసి వాళ్ళిద్దరి శరీరాల్లో బోన్స్ ఉండవనుకుంట. ఎలాంటి స్టెప్ అయినా.. సులువుగా చేసేస్తుంటారు. 

ఎక్స్ పెరిమెంట్ చేయాలనుంది..

నాకు అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ సినిమాల్లో నటించాలనుంది. 'జబ్ వి మెట్','ఆషికి' వంటి సినిమాల్లో నటించడమంటే ఇష్టం. అలానే యాక్షన్ ఫిల్మ్స్, స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల్లో నటించాలనుంది. మంచి విమెన్ సెంట్రిక్ కథలు వస్తే చేయడానికి సిద్ధం. ఎప్పుడు ఎక్స్ పెరిమెంట్ చేయాలని ఉంటుంది.

ప్లాన్ చేసి చేయలేదు..

వరుసగా మెగా హీరోలతో కలిసి పని చేయడం నేను ప్లాన్ చేయలేదు. నాకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాను. 

ఇంట్లో మాత్రం ఒక తండ్రికి కూతురిని..

తెర మీద నేను హీరోయిన్ అయినా.. ఇంట్లో మాత్రం ఒక తండ్రికి కూతురిని. నాకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. మా నాన్న కూడా నేను తప్పు చేస్తే కొడతారు. నా కూతురు హీరోయిన్ అలా ఏం ఆలోచించరు. ఆయనకు నేను ఎప్పుడు చిన్నపిల్లనే. కాని కామన్ పీపుల్ మేము సెలబ్రిటీస్ అనే ఆలోచిస్తారు. మాకు ఉండే బాధలు, సమస్యలు ఎవరికీ తెలియవు. రీసెంట్ గా ప్రెషర్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన పనిని మనం ప్రేమిచాలి. అదే మంచి రిజల్ట్ ఇస్తుంది. చుట్టూ ఉండే వారితో స్నేహంగా ఉండాలి. నాకు హైదరాబాద్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. షూట్ అయిన వెంటనే నేను వారితో బయటికి వెళ్తాను. కామన్ అమ్మాయిలనే ఉంటాను.

ఒక్కో రూపాయి పోగేసి కొన్నాను..

రీసెంట్ గా హైదరాబాద్ లో ఇల్లు కొన్నాను. అయితే ఆ ఇల్లు నాకెవరో కొని ఇచ్చారని రూమర్స్ వచ్చాయి. అసలు ఇలాంటి రూమర్స్ ఎక్కడి నుండి వస్తాయి. నేను ఒక్కో రూపాయి పోగేసి ఇల్లు కొన్నాను. ప్రతి మనిషికి కావాల్సిన మినిమమ్ నీడ్స్ లో ఇల్లు ఒకటి. నేను అలా ప్లాన్ చేసుకొని ఇల్లు, కార్, బిజినెస్ పెట్టుకున్నాను. వీటి కోసం ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నిజంగానే నాకు ఎవరో ఖర్చు పెడితే మహా అయితే షాపింగ్ చేస్తాను కానీ ఇల్లు కొనిపించే ఆలోచన అయితే నాకు రాదు. 

జిమ్ బిజినెస్ బావుంది..

నా జిమ్ బిజినెస్ బాగా నడుస్తుంది. పెట్టిన నెల రోజులకే 100 మంది జాయిన్ అయ్యారు. ఇప్పటివరకు ఎక్కడా.. ఇలా జరగలేదు. మా జిమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకసారి బరువు తగ్గితే ఇంక అసలు పెరగరు.

మొత్తం నాన్నగారే చూసుకుంటారు..

నా రెమ్యునరేషన్, డబ్బులు సంగతి అంతా నాన్నగారే చూసుకుంటారు. నా మ్యానేజర్ కు కాల్ చేసి ఆయనే మాట్లాడుకుంటారు. నా కార్డ్ నా దగ్గర ఉంటుంది. కావలసినప్పుడు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను.

హార్డ్ వర్క్ చేయాలి..

ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా లక్, డెస్టినీ మాత్రమే కాదు. నా హార్డ్ వర్క్ కూడా. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. 'సరైనోడు' ఆడియోలో కూడా చిరంజీవి గారు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా సంతోషపడ్డాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

రామ్ చరణ్ తో తని ఒరువన్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాను. మే నెలలో సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్తున్నాను. అలానే సాయి ధరమ్ తేజ్ తో మరో సినిమా కమిట్ అయ్యాను. అది కూడా మే నెలలో ప్రారంభిస్తున్నారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ