Advertisementt

నందిని కసితో సినిమా చేశారు: నాగశౌర్య

Tue 01st Mar 2016 04:27 PM
naga shourya,kalyana vaibhogame,nandini reddy,malavika  నందిని కసితో సినిమా చేశారు: నాగశౌర్య
నందిని కసితో సినిమా చేశారు: నాగశౌర్య
Advertisement
Ads by CJ

నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం 'కళ్యాణ వైభోగమే'. నందిని రెడ్డి దర్శకురాలు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నాగ శౌర్య మంగళవారం హైదరాబాద్ లోని విలేకర్లతో ముచ్చటించారు.

''నేను ఇదివరకు నటించిన చిత్రాలకు మంచి స్పందన లభించలేదు. చక్కటి ప్రయత్నంతో 'కళ్యాణ వైభోగమే' అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. నందిని రెడ్డి గారు కసితో ఈ సినిమా చేశారు. నా రెండు,మూడు సినిమాలు ఫ్లాప్ అయినా.. కథకు నేను సెట్ అవుతాననే ఉద్దేశ్యంతో నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఈ సినిమాలో పెద్దగా నటించలేదు. నందిని గారు మంచి నటి. కెమెరా ముందు ఆమె ఒకసారి ఎలా నటించాలో చేసి చూపించేవారు. నేను వెళ్లి ఆమెను ఇమిటేట్ చేసేవాడిని. అంతే కాని పెద్దగా నటన విషయంలో కష్టపడలేదు. క్లారిటీ ఉన్న డైరెక్టర్. దామోదర్ గారు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్. చాలా జెన్యూన్ గా ఉంటారు. కథను నమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా.. సినిమా చేయడం మాత్రం పక్కన పెట్టలేదు. నేను 'ఊహలు గుస గుస లాడే' సినిమాకు కళ్యాణ్ కోడూరి గారితో పని చేశాను. ఆ సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా అంతకు మించిన పాటలను అందించారు. ముఖ్యంగా పెళ్లి పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. సినిమాలో నా పాత్ర పేరు శౌర్య. 'పెళ్లి వద్దు అనుకునే కుర్రాడు పెళ్లి చేసుకొని ప్రేమానుబంధాల గురించి తెలుసుకుంటాడు. పెళ్లి ఎందుకు చేసుకోవాలి..? పెళ్ళికి ఉన్న విలువ ఏంటి..? అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది. పెళ్లి అంటే విడిపోవడం కాదు అనే చెప్పేదే మా సినిమా'. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. మన ఫ్యామిలీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడున్న యూత్ కి సినిమా బాగా ఉపయోగపడుతుంది. ఇదొక సెంటిమెంటల్ మూవీ. మార్చి 4న సినిమా విడుదలవుతుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం రామరాజు గారి దర్శకత్వంలో 'ఒక మనసులో' సినిమాలో నటిస్తున్నాను. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలానే అవసరాల శ్రీనివాస్ గారు డైరెక్షన్ లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న 'జో అచ్యుతానంద' సినిమాలో నటిస్తున్నాను'' అని తెలియజేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ