చెన్నై వరద బాధితుల సహాయార్ధం 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' వారు 5 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి ఆ మొత్తాన్ని చెక్ రూపంలో నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా..
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''కళలకు, కళాకారులకు ప్రాంతీయ, భాషా భేదాలు ఉండవు. ఆరోగ్యకరవంతమైన వాతావరణంలో జరిగిన నడిగర్ ఎన్నికల్లో విశాల్ గెలిచాడు. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుడుతున్నాడు. మాద్రసులో వచ్చిన వరదల కారణంగా ఎందరో కనీస వసతులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ నుండి పవన్ కళ్యాన్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా ఎందరో స్టార్స్ ముందుకొచ్చి తమవంతు సహాయాన్ని అందజేశారు. ఆ సమయంలోనే మా అసోసియేషన్ తరఫున కూడా సహాయం అందించాలని 5 లక్షల విరాళాన్ని ప్రకటించాం. ఆ చెక్ ను నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ చేతికి అందజేయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
విశాల్ మాట్లాడుతూ.. ''మా అసోసియేషన్ కు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా రావడం చాలా సంతోషంగా ఉంది. నాలో పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సీనియర్ ఆర్టిస్ట్స్, డ్రామా ఆర్టిస్టులకు పెన్షన్లు అందజేస్తున్నారు. మా సంఘం కూడా అదే దిశలో పనిచేస్తుంది. వరద బాధితుల కోసం హైదరాబాద్, నెల్లూరు, బెంగుళూరు, కేరళ వంటి ప్రాంతాల నుండి ఎవరికీ తోచినంత వారు సహాయాన్ని అందించారు. చాలా సంతోషంగా అనిపించింది. చెన్నై లోని కడలూరు అనే ప్రాంతంలో కనీసం ఉండడానికి చోటు కూడా లేని పరిస్థితి నెలకొంది. తిరిగి మరలా అక్కడ ఇండ్లను కట్టించాలని ప్రయత్నిస్తున్నాం. మా అసోసియేషన్ వారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఎఫెక్ట్ అయిన ఎన్నో కుటుంబాలకు సహాయం చేయడానికి ఉపయోగపడతాయి'' అని చెప్పారు.