Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- శర్వానంద్

Sun 17th Jan 2016 12:22 PM
sharwanand interview,express raja movie,merlapaka gandhi,uv creations  సినీజోష్ ఇంటర్వ్యూ- శర్వానంద్
సినీజోష్ ఇంటర్వ్యూ- శర్వానంద్
Advertisement
Ads by CJ

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మించిన చిత్రం 'ఎక్స్ ప్రెస్ రాజా'. సంక్రాంతి కానుకగా విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

మంచి రెస్పాన్స్ వస్తోంది..

అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రీసెంట్‌గా దేవి థియేటర్‌కు వెళ్ళి ఫ్యాన్స్‌ మధ్య సినిమా చూశాను. ఎక్స్‌ప్రెస్‌రాజా సక్సెస్‌తో బాధ్యత మరింత పెరిగింది. ఈ సక్సెస్‌ నిబెట్టుకోవానుకుంటున్నాను. 

గాంధీ బాగా డిజైన్ చేశాడు...

గాంధీ హీరో క్యారెక్టర్‌తో పాటు ప్రతి క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ బాగా చేశాడు. ఫుల్‌ క్లారిటీతో సినిమా తీశాడు. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా ఈజీ గోయింగ్‌ పాత్ర కాబట్టి పాత్ర పరంగా పెద్ద రీసెర్చ్‌ చేయలేదు. గాంధీ చెప్పింది ఫాలో అయిపోయాను.

నా హోం బ్యానర్ ఇది..

యు.వి.క్రియేషన్స్ నా హోం బ్యానర్‌లాంటిది. రన్‌రాజారన్‌ సినిమాతో కమర్షియల్‌ హిట్‌ను అందించిన బ్యానర్‌. సినిమా చేయడం వరకే నా పని. రిలీజ్‌ గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను నిర్మాతగా ఎలాంటి తప్పు చేశానో కూడా తెసుకున్నాను. 

సినిమా మీద కాన్ఫిడెంట్ తో ఉన్నా..

సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదవుతున్నాయని తెలియగానే టెన్షన్‌ పడ్డాను. కానీ సినిమాపై అందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 

ఎంటర్టైన్మెంట్ ఉండాలి..

రన్‌రాజారన్‌ సినిమా నుండి నా సినిమాల ఎంపికలో ఆలోచన మారింది. ఇప్పుడు సినిమాలు ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నాను. సీరియస్‌ సినిమాలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండానుకుంటున్నాను.   

సెంటిమెంట్‌ పట్టించుకోను..

సాధారణంగా రెండో సినిమా చేసే దర్శకులకు ఆ సినిమా పెద్ద సక్సెస్‌ కాదనే వార్తను నేను పెద్దగా పట్టించుకోలేదు. స్టొరీ స్ట్రాంగ్ గా ఉంటే చాలు. ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందని టాలెంట్‌ను తప్పు పట్టలేం కదా. 

ప్రభాస్‌ సలహా ఇస్తారు...

యు.వి.క్రియేషన్స్‌ను నేను, నాని, గోపీచంద్‌ ఎవరైనా హోం బ్యానర్‌లాగానే ఫీలవుతాం. యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్‌లో సినిమాకు సంబంధించి ప్రభాస్‌గారు చిన్న చిన్న సలహాలిస్తుంటారు. 

చరణ్‌ నేను ఆ విషయాలు మాట్లాడుకోం...

రామ్‌చరణ్‌ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌, సాంగ్స్‌ చూసి చాలా బాగున్నాయి.. బాగా డ్యాన్స్‌ చేసావని కూడా అన్నాడు. చరణ్‌ ఇప్పుడు బెంగళూర్‌లో ఉన్నాడు. సినిమా చూడలేదు. సాధారణంగా నేను, చరణ్‌ కలిసినప్పుడు పెద్దగా సినిమా గురించి మాట్లాడుకోం. ఎప్పుడైనా కథ బావుందనో, డైరెక్టర్‌ బాగా చేశాడనో అని మాట్లాడుకుంటాం. 

పెళ్ళి ఆలోచన లేదు..

ఇప్పట్లో పెళ్ళి చేసుకోనే ఆలోచన లేదు. లవ్ మ్యరేజా? ఆరెంజ్‌డ్‌ మ్యారేజా? చెప్పలేను కానీ దానికి ఇంకా టైం ఉందని అనుకుంటున్నాను. పెళ్ళి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ