Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: పల్లక్ లల్వాని

Sat 02nd Jan 2016 08:05 PM
pallak lalwani interview,abbayitho ammayi movie,nagashourya  సినీజోష్ ఇంటర్వ్యూ: పల్లక్ లల్వాని
సినీజోష్ ఇంటర్వ్యూ: పల్లక్ లల్వాని
Advertisement
Ads by CJ

నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. జనవరి 1న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ పల్లక్ లల్వానితో సినీజోష్ ఇంటర్వ్యూ..                         

సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

ఇది నా మొదటి సినిమా. అయినా, ఈ అమ్మాయి బాగా నటించిందంటూ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే. నా దృష్టిలో ప్రతిభే ముఖ్యమని నమ్ముతాను. ఓ గ్లామర్ డాల్ గా ఉండాలనుకోవట్లేదు.

ఈ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?

గతంలో ఓ సౌత్ మూవీ కోసం ఆడిషన్ చేశాను. దర్శకుడు రమేష్ వర్మ నా ఫోటోలు చూసి ముంబై వచ్చి కలిశారు. నాతో పాటు అమ్మకు స్క్రిప్ట్ వినిపించారు. ప్రార్థన పాత్రలో నటించేలా ఆయనే ఒప్పించారు. 

ఈ సినిమా కథ ఫేస్ బుక్ నేపధ్యంలో నడుస్తుంటుంది. రియల్ లైఫ్ లో మీరు ఎక్కువగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ఉపయోగిస్తారా..?

ప్రస్తుతం నేను ఫేస్ బుక్, ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లేను. నేను 8 లేదా 9వ తరగతిలో ఉండగా ఫేస్ బుక్ వచ్చింది. అప్పట్లో నేను కూడా ఫేస్ బుక్ క్రియేట్ చేసుకొని అందరిలా చాటింగ్ చేసేదాన్ని. ప్రస్తుతం అయితే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కువ యాక్టివ్ గా లేను.

రొమాంటిక్ సీన్స్ లో నటించడం కష్టంగా అనిపించలేదా..?

ఈ చిత్రంలో పల్లక్ శౌర్యను ముద్దు పెట్టుకోవడం లేదు. ప్రార్థన, అభిలు ముద్దు పెట్టుకున్నారు. అక్కడితో ఆ సీన్ అయిపోయింది. అయినా శౌర్యతో అలా నటించడం కష్టం అనిపించలేదు. అప్పటికే మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తను చాలా న్యాచురల్ గా నటిస్తాడు.

తెలుగులో డైలాగులు చెప్పడానికి కష్టంగా అనిపించలేదా?    

నేను ముంబైలో పెరిగాను, అమ్మ పంజాబీ. దక్షిణాది భాషల గురించి అవగాహన లేదు. నార్త్ ఇండియన్స్ అందరూ.. దక్షిణాది భాష ఒక్కటే అనుకుంటారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ.. వేర్వేరు భాషలని ఈ చిత్రంలో నటించిన తర్వాత అర్థమైంది. చిత్రీకరణలో నా డైలాగులను బట్టీపట్టాను. యూనిట్ సభ్యులందరూ ఎంతో సహాయం చేశారు. 

తెలుగులో మీరు చూసిన సినిమాలు?

'బొమ్మరిల్లు' నేను చూసిన మొదటి తెలుగు సినిమా. అందులో జెనీలియా నటన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈ మధ్య 'ఓకే బంగారం' చూశాను. దుల్కర్ సల్మాన్ బాగా నచ్చాడు.   

తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? 

మహేష్ బాబు. మీరు ఎవరితో నటిస్తారు? అని ప్రశ్నిస్తే, ముందు మహేష్ బాబు పేరు చెప్తాను. తర్వాత చాలామంది స్టార్ హీరోలున్నారు.       

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?

ఇంకా ఏది ఫైనల్ చేయలేదు.  ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. డిగ్రీ చదువుతూ.. నటిస్తాను. ఎక్కువ చిత్రాల్లో నటించాలనే కంగారు లేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ