Advertisementt

బర్త్ డే స్పెషల్-బెల్లంకొండ శ్రీనివాస్

Sat 02nd Jan 2016 06:52 PM
bellamkonda sreenivas birthday interview,speedunnodu movie,february 5th release  బర్త్ డే స్పెషల్-బెల్లంకొండ శ్రీనివాస్
బర్త్ డే స్పెషల్-బెల్లంకొండ శ్రీనివాస్
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు శీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 2014లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత సుమారుగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఈ నటుడు కొత్త సంవత్సరంలో(2016) 'స్పీడున్నోడు' చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. జనవరి 3 న పుట్టినరోజు జరుపుకోనున్న ఈ హీరో 'స్పీడున్నోడు' చిత్రం గురించి విలేకర్లతో ముచ్చటించారు.

బర్త్‌డేకి ప్లాన్స్‌ ఏమిటి? 

ఈ పుట్టినరోజుకు పెద్దగా కొత్త ఆలోచనలేమీ లేదు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తాను. బయట ఎక్కడా వెళ్ళడం లేదు. 'స్పీడున్నోడు' సినిమా టీజర్ లాంచ్ ప్లాన్ చేస్తున్నాం. 

రెండు సంవత్సరాల తరువాత మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఇంత లేట్ అవ్వడానికి కారణం..?

నేను చేసే సినిమాలు యూనిక్ గా ఉండాలనుకుంటాను. సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ ఎన్నుకుంటాను. మంచి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకుంటున్నాను. అయినా గ్యాప్ వచ్చిందని ఆడియన్స్ నన్ను మర్చిపోతారనుకోను. 'అల్లుడు శీను' ఫీవర్ ఇంకా ప్రేక్షకుల్లో తగ్గలేదు. అయితే 'అల్లుడు శీను' కంటే 10 రెట్లు ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడ్డాను. నా మూడవ సినిమా రిలీజ్ అయిన తరువాత నుండి ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సినిమాలు చొప్పున చేస్తాను.

తమిళ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అంతగా సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏంటి? 

'సుందర పాండ్యన్‌' సినిమా మెయిన్‌ ప్లాట్‌ బాగా తీసుకున్నామంతే. తమిళ్‌లో నేను సినిమా చూసినప్పుడు క్లయిమాక్స్‌ సీన్‌ నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో ఎమోషన్స్‌ నాకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. దాంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇక మేకింగ్‌ విషయానికి వచ్చే సరికి తెలుగులో ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు మన నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేసుకుంటూ వచ్చాం. 

సినిమా స్టేటస్ ఏంటి..?

సినిమా రెండు సాంగ్స్‌ మినహా మొత్తం పూర్తయింది. చిత్రీకరణకు సమాంతరంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను ఫిబ్రవరి 5న రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా పాటలను జనవరి 16న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

ఈ సినిమా టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి? 

'స్పీడున్నోడు' ఒక ఫ్రెండ్‌ఫిప్‌ గురించి, ప్రేమ గురించి, ఫ్యామిలీ వాల్యూస్‌ గురించి తెలియజేప్పే చిత్రం. తన స్నేహితులతో, కుటుంబంతో, లవర్‌తో హ్యపీగా ఉండే హీరో అనుకోకుండా ఓ సమస్యలో చిక్కుకుంటాడు. తన స్నేహితులే తనను చంపడానికి ప్లాన్ చేస్తారు. ఆ సమస్యను హీరో ఎలా డీల్‌ చేశాడనేదే సినిమా. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే క్లాస్‌, మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండే ఓ కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌. అందుకే 'స్పీడున్నోడు' అనే టైటిల్‌ను పెట్టాం. 

మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో లుక్ విషయంలో మార్పులు చేశారా..?

తొలి చిత్రం 'అల్లుడు శీను' అవుట్ అండ్ అవుట్‌ ఎంటర్‌టైనర్‌. కానీ 'స్పీడున్నోడు' ఎమోషనల్‌ కమర్షియల్‌ఎంటర్‌టైనర్‌. కాబట్టి బాడీ లాంగ్వేజ్‌ నుండి చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాను. లుక్‌ పరంగా, హెయిర్‌ స్టయిల్‌ విషయం, కాస్ట్యూమ్స్‌ విషయంలో కేర్‌ తీసుకుని ఈ సినిమాలో నటించాను. ఇందులో విలేజ్‌ కుర్రాడిగా కనిపిస్తాను. సినిమాకు వచ్చే మాస్‌ ఆడియెన్స్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను అలరించేలా డ్యాన్సులు, ఫైట్స్‌ ఉంటాయి. 

బోయపాటి గారి సినిమా ఎప్పుడు మొదలు పెడుతున్నారు..?

నా సెకండ్‌ ప్రాజెక్ట్‌ బోయపాటిగారితో చేయాల్సింది. కాని కథ అంత తృప్తిగా అనిపించకపోవడంతో అది కాస్త పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక బోయపాటి గారు, బన్నీ ల ప్రాజెక్ట్ అయిన తరువాత సినిమా చేయాలనుకున్నాం. ఏప్రిల్‌ 8 నుండి బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాను. ఇప్పటికే బోయపాటిగారు 70 శాతం కథను పూర్తి చేసేశారు. ఈ కథలో హీరో ఫిజిక్ ఫిట్ గా ఉండాలి. దానికోసం సిక్స్‌ప్యాక్‌ చేస్తున్నాను. 

భీమనేని శ్రీనివాస్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

భీమనేని శ్రీనివాస్ గారు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలే డైరెక్ట్ చేస్తారు. ఆయన సినిమా చూసిన వారు ఆలోచించకుండా ఉండలేరు. 'సుస్వాగతం' , 'సూర్యవంశం' , 'సుడిగాడు' అలాంటి కోవకు చెందినవే. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. వినాయక్‌గారి వంటి కమర్షియల్‌ దర్శకుల వర్క్‌ క్లారిటీగా, స్పీడ్‌గా ఉంటారు. భీమినేని శ్రీనివాస్‌గారి విషయానికి వస్తే క్లారిటీతో పాటు పర్టిక్యులారిటీ ఎక్కువగా ఉంటుంది. సీన్‌ చేసేటప్పుడే పర్‌ఫెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ ఉండేలా చూసుకుంటారు. 

మ్యూజిక్‌ డైరెక్టర్‌, టెక్నికల్‌ టీమ్‌ గురించి చెప్పండి? 

ఈ సిమాకు 'సుడిగాడు' ఫేమ్‌ శ్రీవసంత్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్‌ మెయిన్‌ ఎసెట్‌ అవుతుంది. అలాగే కెమెరామెన్‌ విజయ్‌గారు సినిమాటోగ్రఫీతో ప్రతి సన్నివేశాన్ని చాలా ఫ్రెష్‌గా, రిచ్‌గా చూపించారు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ నా ఫాదర్‌ క్యారెక్టర్‌లో కనపడతారు. రావు రమేష్‌గారి క్యారెక్టర్‌ ఇలా ప్రతి ఒక క్యారెక్టర్‌, టెక్నిషియన్‌ సినిమా ఎసెట్‌గా అయ్యారు. 

మీ హోం బ్యానర్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది..?

ప్రస్తుతానికి ఏమిలేదు. నేను కాకుండా వేరే హీరోలతో సినిమా చేయాలనుకుంటున్నాం.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌? 

ఈ సినిమా రిలీజ్‌ తర్వాత బోయపాటి శ్రీనుగారి దర్శకత్వంలో మాస్‌ ఎంటర్‌టైనర్‌ చేయబోతున్నాను. విజయ్‌కుమార్‌ కొండాగారు కథ చెప్పారు. అది బాగా నచ్చింది. ఆయన దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుంది. అలాగే సీడెడ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌తో ఓ సినిమా చేయాల్సి ఉందంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ