Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-అనుష్క

Tue 06th Oct 2015 03:38 AM
rudhramadevi,rana,gunasekhar,anushka,anushka interview  సినీజోష్ ఇంటర్వ్యూ-అనుష్క
సినీజోష్ ఇంటర్వ్యూ-అనుష్క
Advertisement
Ads by CJ

అనుష్క ప్రధాన పాత్రలో టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం రుద్రమదేవి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనుష్క తో సినీజోష్ ఇంటర్వ్యూ..

ప్రోపర్ హిస్టారికల్ సినిమా ఇది..

నేను నటించిన అరుందతి, బాహుబలి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమాలు కాని చారిత్రక చిత్రాలు కాదు. రుద్రమదేవి ప్రోపర్ హిస్టారికల్ ఫిలిం. రుద్రమదేవి చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఉన్నప్పటి నుండి సినిమాగా తెరకెక్కించాలని గుణశేఖర్ గారు అనుకున్నారు. మొదటిసారిగా భారతదేశంలో తెరకెక్కిస్తున్న  స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రమిది. రుద్రమదేవి చరిత్ర మొత్తం ఈ సినిమాలో చూపించట్లేదు. ఎందుకంటే తక్కువ సమయంలో అంత గొప్ప చరిత్ర అంతా చూపించడం అసాధ్యం. 

చరిత్ర గురించి చాలా రిసెర్చ్ చేసారు..

రుద్రమదేవి చరిత్రలో నిజంగా జరిగిన కథ. కాబట్టి దాని మీద ఎలాంటి మెటీరియల్ మాకు లభించలేదు. చరిత్ర మీద రిసెర్చ్ చేసిన వాళ్ళ దగ్గర, చరిత్రకారుల వద్ద మాత్రమే చరిత్రకు సంబంధించిన కథలు దొరుకుతాయి. 13వ శతాబ్దంలో ఉండే రుద్రమదేవి ఇప్పుడు ఎలా చూపించాలనేదే గుణశేఖర్ గారి విజన్. ఎందరో సలహాలు,సూచనలు తీసుకొని ఆయన ఈ కథ సిద్ధం చేసారు. ప్రత్యేకంగా ఓ రిసెర్చ్ టీం ను కూడా ఏర్పాటు చేసారు. 

నాకు నిజంగా గుర్రాలంటే చాలా భయం..

ఈ సినిమా కోసం గుర్రపు, ఏనుగు స్వారీల శిక్షణ హైదరాబాద్ లోనే తీసుకున్నాను. చాలా ఫోకస్ తో ట్రైనింగ్ ఇప్పించారు. నిజానికి గుర్రాలు నా మాట వినేవి కావు. గుణశేఖర్ గారి కంట్రోల్ లో బాగా ఉండేవి. ఆయన యాక్షన్ అంటే చాలు అవి రెడీ గా ఉండేవి. నిజానికి నాకు గుర్రాలంటే చాలా భయం.

3డి లో సినిమా చేయడం చాలా కష్టం..

3డి ఫార్మాట్ లో సినిమాలు చేయడంలో ఎలైన్మెంట్ ఇష్యూస్, లెన్స్ చేంజ్ చేయడం ఇలా చాలా పనులుంటాయి. ఒకసారి కెమెరా లెన్స్ మార్చడానికి సుమారుగా 45 నిమిషాల సమయం పడుతుంది. అనుకున్న బడ్జెట్ లో కొన్ని పారామీటర్స్ పెట్టుకొని క్వాలిటీ తగ్గకుండా సినిమా చేయడమంటే చాలా కష్టం. నిజానికి సినిమా షూటింగ్ తొందరగానే కంప్లీట్ అయింది. 3 డి పనుల వలన కాస్త లేట్ అయింది. సినిమా రిలీజ్ డేట్ విషయంలో అందుకే మార్పులు చేయాల్సి వచ్చింది. అంతే కాకుండా గుణశేఖర్ గారు తృప్తిగా ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటే అప్పుడే చేయాలని భావించాం. దర్శకునిగా ఆయన ఒపీనియన్ అనేది చాలా ముఖ్యం.

మానిటర్, రషెస్ చూడను..

ఏ సినిమా షూటింగ్ చేసినప్పుడు అయినా.. నేను మానిటర్, రషెస్ చూడను. డబ్బింగ్ కూడా చెప్పను కాబట్టి సినిమా ఎలా ఉంటుందో నేను విజువలైజ్ చేసుకోలేను. ఆడియన్స్ సినిమా ఎప్పుడు చూస్తారో.. నేను కూడా అప్పుడే చూస్తాను. మానిటర్ చూస్తే నా ఆలోచన విధానం మారిపోతుంది. అందుకే డైరెక్టర్ చెప్పేది ఫాలో అవుతూ.. వెళ్ళిపోతా. ఆయన వన్ మోర్ అంటే మాత్రం మానిటర్ చూస్తాను. అది కూడా  నేను చేసిన తప్పు  తెలుసుకోవడానికే..

తెర మీద కొత్తగా ఉంటుంది..

ఈ సినిమాలో నాకు జంటగా రానా నటిస్తున్నాడు. తను నాకు ఎప్పటినుండో బాగా తెలుసు. మా పెయిర్ స్క్రీన్ పై చాలా కొత్తగా, ఫ్రెష్ గా ఉంటుంది. రానాలో సరికొత్త రొమాంటిక్ యాంగిల్ ను ఈ సినిమాలోచూడబోతున్నారు.

వారిద్దరూ టాస్క్ మాస్టర్స్..

ఒకే సమయంలో రెండు సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నప్పుడు మొదట్లో కష్టంగా ఉన్నా.. మనం చేసే పాత్రను అర్ధం చేసుకుంటాం కనుక ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. ఆ విషయంలో రాజమౌళి గారు, గుణశేఖర్ గారు టాస్క్ మాస్టర్స్. వాళ్ళు చాలా క్లారిటీతో ఉంటారు కాబట్టి నాకు ఎలాంటి సమస్య ఉండేది కాదు. నా ఏకాగ్రతను మిస్ చేయనివ్వరు.

క్రెడిట్ అంతా శ్యాంప్రసాద్ రెడ్డి గారిదే..

లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో అనుష్క బాగా సెట్ అవుతుందని ఇప్పడు అందరూ అనుకుంటున్నారంటే దానికి కారణం శ్యాంప్రసాద్ రెడ్డి గారే. నేను గ్లామరస్ రోల్స్ లో నటిస్తున్న రోజుల్లో అరుందతి సినిమాకు నేను సెట్ అవుతానని నమ్మి నాతో ఆ సినిమా చేయించారు. నా జీవితంలో ఓ ప్రత్యకమైన సినిమా అది. ఆ సినిమాతో మరే సినిమాను పోల్చలేను. రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో నేను నటించగలను అనే నమ్మకాన్ని అరుందతి చిత్రం క్రియేట్ చేసింది.

కథే సినిమాకు హైలైట్..

రుద్రమదేవి చరిత్రే సినిమాకు పెద్ద హైలైట్. రుద్రమదేవి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు అందంగా, బాధాకరంగా ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి ఉంటాయి. అవి నన్ను చాలా ఇన్స్పైర్ చేసాయి. ఈ సినిమాలో నేను నటించడానికి కారణమయ్యాయి. 

నాకు బంగారు నగలు ధరిచడం నచ్చదు..

సాధారణంగా అమ్మాయిలకు నగలు వేసుకోవడమంటే చాలా ఇష్టం. కాని నాకు ఎందుకో అసలు నచ్చదు. ఇంట్లో ఏమైనా పెళ్లిళ్లకు వెళ్ళాలంటే అమ్మ బలవంతంగా నగలు వేసేది. వరుసగా రాణి పాత్రల్లో ఇన్ని నగలు వేసుకొని ఉండడం నా కర్మ అనుకున్నాను. కాని ఎన్ ఏ సి సంస్థ వారు రుద్రమదేవి జ్యువలరీ అని ఒరిజినల్ మోడల్స్ తీసుకొని తక్కువ బరువుతో నగలు తయారు చేసి డిస్ప్లే పెట్టారు. అవి చూసినప్పుడు మాత్రం కొనుక్కోవాలనిపించింది. కలెక్షన్ అంత బావుంది.

నిత్యమీనన్ మంచి నటి..

నిత్య చాలా ముద్దుగా ఉంటుంది. స్క్రీన్ పై తను పెర్ఫార్మ్ చేయకపోయినా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత క్యూట్ గా ఉంటుంది. స్పాంటేనియస్ యాక్టర్. మా ఇద్దరి మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి. నిత్యమీనన్ తో కాబట్టి చాలా సులువుగా నటించగలిగాను. 

నాగార్జున గారు అలా అన్నారు..

ఉపిరి సినిమాలో నేను అతిథి పాత్రలో నటిస్తున్నాను. ఆ సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు నాగార్జున గారు రుద్రమదేవి సినిమా గురించి నాకు మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పారు. 

ఆ రెండు సినిమాల్లో నటించలేకపోయా..

శ్రీకాంత్ అడ్డాల గారు మొదట నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కథ చెప్పారు. సీత పాత్రలో నటించమని అడిగారు. కాని నాకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలన చేయలేకపోయాను. ఆ పాత్రలో అంజలి బాగా నటించింది. అలానే విశ్వరూపం 1 సినిమాలో కూడా నటించే ఛాన్స్ వచ్చింది కాని కుదరలేదు.

ఫ్రెంచ్ ఫిలిం చేయాలనుంది..

నేను ఫ్రెంచ్ సినిమాలు బాగా చూస్తాను. వారి కథలు నాకు బాగా నచ్చుతాయి. ఎప్పటికైనా ఓ ఫ్రెంచ్ ఫిలిం లో నటించాలని ఆశగా ఉంది.

10 సంవత్సరాల్లో నేను సాధించుకుందే ఎక్కువ..

నేను ఇండస్ట్రీకి వచ్చిన 10 సంవత్సరాల్లో నేను పోగొట్టుకున్నదాని కంటే గెలుచుకుందే ఎక్కువ. ఇండస్ట్రీలో గౌరవం, నటన విషయంలో మెళకువలు, కొన్ని కుటుంబాలతో మంచి రిలేషన్షిప్స్ ఇలా నాకంటూ కొన్ని గైన్ చేసుకున్నాను. కాని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు సమయం కేటాయించలేకపోతున్నాను. అదొక్కటే మిస్ అవుతున్నాను.

తదుపరి చిత్రాలు..

ప్రస్తుతానికి సింగం 3, బాహుబలి2 చిత్రాలు కంప్లీట్ చేయాలి. బాహుబలి 2 పెద్ద టాస్క్. మరే ప్రాజెక్ట్స్ సైన్ చెయ్యట్లేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ